మానవ ధర్మం
బౌద్ధాన్ని నాశనం చేసిన వైదికవాదులను ఈ ముందు అమ్మను, నాన్నను ప్రేమించడం, గౌరవించడం నేర్పిస్తే, ఆవును ప్రేమించడం తేలికవుతుంది. మన వేదాలు చాలా గొప్పవి అన్న విదేశీయుల వద్దకు మన వేదపండితులను పంపిద్దాం. అప్పుడు వీరి గొప్పతనం, వేదాల గొప్పతనం విదేశీయులు స్వయంగా తెలుసుకుని,జంబూ ద్వీప వాసులు వీరిని ఎందుకు వదిలించుకున్నారో అర్ధం చేసుకుంటారు. వేదం, జ్ఞానం, యోగం, ధ్యానం, జ్ఞానం, ఆరోగ్యం, ఆయుర్వేదం, ఆవు, బౌద్ధం యివన్నీ ఎవరినైనా అనుభవించనిచ్చారా? విశ్వామిత్రుడంటి వాడు వచ్చి, ఆవునిమ్మని అడిగితే, వశిష్ఠుడుయివ్వలేదు. ఆవు వైదిక వాదులు స్వంతం చేసుకున్నారు. ఇక మిగతా వర్గాలు వీరి శాపనార్థాలు తట్టుకోలేక బఱ్ఱెలను, గొఱ్ఱెలను మేకలను, కోళ్ళను పెంచుకుని వారి జీవనాన్ని సాగించారు. వాటితో ఎనలేని బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నారు. వాటి ఉత్పత్తులను తినడానికి అలవాటు పడిన మేము గోమూత్ర, గోమలములు స్వీకరించి, మీ అంతగా పవిత్రులం కాలేము. వాటికర్హత గలవారు వేదపండితులే! గోమూత్ర సేవనంతో వేదమంత్రోచ్ఛరణ స్పష్టంగా పలుకగలరు. . గోమల సేవనంతో మీరు దీర్ఘాయుష్మంతులు కాగలరు. మేము బఱ్ఱెలు మ...