కమ్యూనిస్టు మేనిఫెస్టో సందేశం
కమ్యూనిస్టు మేనిఫెస్టో యొక్క 177 వ వార్షికోత్సవ సందర్భంగా మేనిఫెస్టో మనకు ఇస్తున్న సందేశం ! ------------------------------------------------------ కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రచురించిన అన్ని పత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన పత్రం కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో . ఇది 177 సంవత్సరాల క్రితం ప్రచురించబడింది. దీని రచయితలు కార్ల్ మార్క్స్ - ఫ్రెడరిక్ ఎంగెల్స్ లు. యూరోప్ లో ప్రజాతంత్ర విప్లవ పోరాటాలు ప్రజ్వరిల్లుతున్న సందర్భంలో ఈ మ్యానిఫెస్టో కమ్యూనిస్టు లీగ్ అధ్వర్యంలో 1848 ఫిబ్రవరి 21 న ప్రచురింపబడింది. సోషలిజం లేదా కమ్యూనిజం గురించిన ఆలోచనలు మార్క్స్ - ఎంగెల్స్ లతోనే ప్రారంభం కాలేదు. వారికి ముందు, సమిష్టి ఆస్తిపై ఆధారపడిన వర్గరహిత సమాజం గురించి ఆలోచనలు చేసిన సమర్ధించిన గొప్ప ఆలోచనాపరులు కూడా ఉన్నారు: తొలి క్రైస్తవులు ప్రైవేట్ ఆస్తి లేని సమాజాల గురించి కలలు కన్నారు. 16వ శతాబ్దంలో థామస్ మోర్, 18వ శతాబ్దంలో బెబూఫ్,, మొరెల్లి, మాబ్లిలు 19వ శతాబ్ది ప్రారంభంలో రాబర్ట్ ఓవెన్, ఫోరియర్, సెయింట్ సైమన్ లాంటి గొప్ప ఆలోచనాపరులు దోపిడి-పీడన, అసమానతలు లేని సమ సమాజానికి చెందిన ఊహాజనిత సిద్ధ...