రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు
రూపం మార్చుకుంటున్న ఫాసిజం_ ప్రజాస్వామిక వాదుల కర్తవ్యాలు "ఫాసిజం ముఖ్యమైన లక్షణం సత్యాన్ని విమర్శించడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకపోవడం." ___ జార్జ్ ఆర్వెల్ ఫాసిజం 20వ శతాబ్దపు ప్రారంభంలో యూరప్‌లో మొదలైన ఒక రాజకీయ భావజాలం. ఇది ప్రధానంగా మన జాతి ఉన్నతమైనదని ప్రచారం చేసే జాతీయవాదం తో మొదలవుతుంది. మాధ్యమాలను నియంత్రిస్తుంది. మతాన్ని రాజకీయాలతో కలిపి యూదులు, కమ్యూనిస్టులను సామాజిక శత్రువులుగా ప్రచారం చేస్తుంది. ఫాసిజం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేసే ఒక రాజకీయ ధోరణి. ఇది అతిజాతీయ వాదాన్ని, మతాధిక్యతను, స్థానికతను ఉపయోగించుకుంటూ విదేశీయులకు వ్యతిరేకంగా హింసను సాధనంగా చేసుకుంటుంది. ఇటలీలో ముస్సోలిని, జర్మనీలో హిట్లర్, స్పెయిన్‌లో ఫ్రాంకో వంటి నియంతలు దీన్ని గణనీయంగా అనుసరించారు. భారతదేశంలో ఈ ధోరణులను మెజారిటీ మతవాద సంస్థ దీన్ని అమలు చేయడం గమనించవచ్చు. ఇటలీలో బెనిటో ముస్సోలిని (1922-1943) ఫాసిజాన్ని కార్పొరేటివిజంగా అమలు చేశాడు, జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ (1933-19...