Posts

Showing posts from March, 2025

కృషి పట్టుదలకు ప్రతీక అయిన అనువాద రచయిత వైసీపి వెంకట రెడ్డి

కృషి పట్టుదలకు ప్రతీక అయిన అనువాద రచయిత వైసీపి వెంకట రెడ్డి           రాయలసీమలో కథకులు కొందరైనా అప్పుడప్పుడు కనిపిస్తారు. అనువాదకులు అరుదుగా అగుపిస్తారు. అందునా సత్తా ఉన్న అనువాద కులను వ్రేళ్ళమీద లెక్కించవచ్చు. అందుకు కారణం అనువాదం కష్టమైన ప్రక్రియ కావచ్చు.. అది అందరికీ యిష్టమైన క్రియ కాకపోవచ్చు. రా.రా. అన్నట్లు అనువాదంలో సమస్యలూ ఉండవచ్చు. అనువాదం కష్టమైన ప్రక్రియ అని తెలిసినా తనకిష్టమైన ప్రక్రియగా మార్చుకొని వందలాది ఇతర భాషా కథల ను తెలుగులోకీ, తెలుగు కథలను హిందీ లోకి అనువదించడంతో బాటు 30 కి పైగా మౌలిక కథలు, బాలసాహిత్యం, నవలలు సృష్టించి శ్రమకు తగిన గుర్తింపుకు నోచుకోని కథాను వాదకులు (కథకుడు ప్లస్ అనువా దకుడు అను కోవాలి.) వై.సి.పి. వెంకటరెడ్డి.          కరుడు గట్టిన కరువు జిల్లా అయిన  ఉమ్మడి అనంతపురం జిల్లాలో నల్లమాడ మండలంలోని ఎర్రవంకవల్లిలో గంగిరెడ్డి, గంగులమ్మకు వై.సి.పి. వెంకటరెడ్డి  1930లో జన్మించారు. బాల్యంలోనే తల్లి దండ్రులు మరణించడం వల్ల ఐదో తరగతికన్నా ఎక్కువ చదవలేక పోయారు. తల్లిదండ్ర...

తెలంగాణా పోరాటానికి నాంది పలికినదొడ్డి కొమరయ్య అమరత్వం

తెలంగాణా పోరాటానికి   నాంది పలికిన దొడ్డి కొమరయ్య అమరత్వం                     ____ పుచ్చలపల్లి సుందరయ్య                 ఇది 1946లో, జూలై 4న జరిగిన సంఘటన. వివిధ సంఘటనలతో విసునూరు దేశ్ ముఖ్ బాగా రెచ్చిపోయాడు. తన జీవితంలోనే ఎన్నడూ ఎరుగనంతటి ఘోరమైన ఓటమిగా దాన్ని పరిగణించాడు.. పోలీసుల సహాయంతో కడవెండి గ్రామానికి చెందిన నాయకులను హత్యచేయాలని పథకం వేశాడు. ఈ పథకంలో భాగంగా అనేకమంది ప్రజలపై కేసులు పెట్టాడు. వారిలో 15 మందిని అరెస్టు చేయించాడు. వారు తర్వాత బెయిలుమీద విడుదల చేయబడ్డారు. ఆ రోజుల్లో ఎంత తక్కువ సమయంలోనైనా సరే, ప్రజలు సంఘం కార్యాలయం చేరేవారు. తమ కార్యక్రమాన్ని గూర్చి చర్చించుకొనేవారు. ఆవిధంగా కేసులు పెట్టి భయ పెట్టినట్లయితే తన హత్యా పథకాలు, అమలు జరపవచ్చునని అతడు తలంచాడు. పోలీసు అధికారులు, జమీందారును, అతని గూండాలతోనూ కలిసి మొత్తం పధకమంతా తయారుచేశారు. జమీందారు యధేచ్చగా వ్యవహరించడం కోసం వాళ్ళక్కడనుండి వెళ్ళిపోయారు. అది ...