Posts

Showing posts from April, 2021

జాతులు

జిప్సీలు : ఆడుతూ పాడుతూ బండ్లపై దేశదిమ్మరిగా తి రిగే వారు.జన్మస్ధానం భారతదేశమని ప్రచారం. యూరప్ లో జీవించే 50 లక్షల జిప్సీశాఖలలో 72 శాతం సోషలిస్టు దేశాలయిన హంగేరీ, రు మేనియా,బల్గేరియా,ఆల్బీనియా,జకోస్లోవేకియా,యుగోస్లోవేకియాలో జీవిస్తున్నారు. దేశ దిమ్మర జాతి: ఆరేబియా ఎడారి ప్రాంతంలో బుయిడోనిన్సు ఆనే పెద్దజాతి లోని వారు. 75 వేల ఓంటెలను ప్రయాణాలకు వినియెూగిస్తారు.3 వేల గుడా రాలలో జీవిస్తారు. ద్రేసియన్లు: మూడు వేల సంవత్సయాలకు  పూర్వమే దక్షి ణ బల్గేరియాలో వైభవోపేతంగా నాగరికతను, సంస్కృతిని,విజ్ణానాన్నిపెంచారు.వ్యవసాయం లో సిధ్ధహస్తులు.ఇనుము నుండి బంగారం వ రకన్నీ లోహాలను ఉపయెూగించి వస్తువులు తయారుచేశారు. కోప్సు.: 2 వేల సం.రాల నాడు ఈజిప్టు ప్రాంతంలో జీ వించెడి వారు.వీరు క్రిస్టియన్లు.క్రమంగా ఇస్లాం మతం వైపు మెుగ్గారు.వీరిభాష కోస్టిక్ .ఆరబిక్ భాష వ్యాప్తితో కోస్టిక్ బాష ఆదృశ్యం. శాగ్జన్స్: జర్మనీ జాతికి చెందన ఒక పెద్ద తెగ. జర్మన్ జా తిలో ఆంతర్భాగంగా కలిసి పోయింది. హున్స్:  మధ్య ఆసియాకు చెందినవారు.యుద్ధ వీరు లు.క్రీ.పూ.3 నుండి 6 వ శతాభ్ధం యధ్య కా లంలో తూర్పున చైనానుంచి పశ్చిమాన ప్రా న్సు వ...

కాలచక్రం

తృటి =సెకండ్ లో 1000 వంతు 100 తృటులు =1 వేద 3 వేదలు=1 లవం 3 లవాలు=1 నిమేశం.రెప్ప పాటుకాలం 3 నిమేశాలు=1 క్షణం, 5 క్షణాలు=1 కష్ట 15 కష్టాలు=1 లఘువు 15 లఘువులు=1 దండం 2దండాలు=1 ముహూర్తం 2 ముహూర్తాలు=1 నాలిక 7 నాలికలు=1 యామము,ప్రహారం 4 ప్రహరాలు=ఒక పూట 2 పూటలు=1 రోజు 15 రోజులు=ఒక పక్షం 2 పక్షాలు=ఒక నెల. 2 నెలలు=ఒక ఋతువు 6 ఋతువులు=ఒక సంవత్సరం. 10 సంవత్సరలు=ఒక దశాబ్దం 10 దశాబ్దాలు=ఒక శతాబ్దం. 10 శతాబ్దాల=ఒక సహస్రాబ్ది 100 సహస్రాబ్ది=ఒక ఖర్వ..లక్ష సంవత్సరాలు 4లక్షల 32 వెల సంవత్సరాలు= కలియుగం 8లక్షల 64 వేల సంవత్సరాలు=త్రేతాయుగం 12లక్షల 96 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం 17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం. (చతుర్ యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం 14 మన్వంతరాలు=ఒక కల్పం 200 కల్పాలు ఐతే=బ్రహ్మరోజు 365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సర 100 బ్రహ్మ సంవత్సరాలు=బ్రహ్మసమాప్తి

అలనాటి_అగ్గిరవ్వలు

   ✍️''మానవ సమాజ చరిత్రలో సామాజిక మార్పు కోసం జరిగిన ఏ విప్లవమూ స్త్రీల కీలక పాత్ర లేకుండా జయప్రదం కాలేదు'' అని కారల్‌మార్క్స్‌ 1968లో తన మిత్రుడు కుగెల్‌ మాన్‌కు రాసిన లేఖలో ప్రస్తావించాడు.   ✍️గుండెనిచ్చిన గున్నమ్మ, బావిరెడ్డి వియ్యమ్మ, వీరనారి అయిలమ్మ వంటి ఎందరో సామాన్య స్త్రీలు చరిత్రను మలుపు తిప్పిన పోరాటాలకు ఆద్యులయ్యారు. ఆనాటి జమిందార్ల, జాగీర్‌దార్ల దోపిడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రగులుతున్న ప్రజా చైతన్యానికి పదునుపెట్టారు. మార్క్స్‌ భాష్యాన్ని రుజువు చేశారు.   ✍️గత నాలుగు మాసాలకు పైగా రాజాధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళనను మన కాలంలో చూస్తున్నాం. మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం సాగిస్తున్న ఉద్యమాన్ని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. మన కాలంలో... అందునా మీడియా, రవాణా సాధనాలు, వగైరా బాగా అభివృద్ధి చెందిన కాలంలో జరుగుతున్న పోరాటాలివి. ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూద్దాం.    ✍️బెంగాల్‌లో తెభాగ', త్రిపురలో గిరిజన పోరాటాలు, కేరళలో పున్నప్ర వాయలార్‌, మహారాష్ట్రలో వర్లీ ఆదివాసీ పోరాటం, అన్నిటికీ ఉత్ప్రేరకంగా ఉన్న తెలంగాణ సాయుధ రైతాంగ ప...

అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం

📖"వికసిత బాల్యానికి జిజ్ఞాస" నేడు అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం......📖 మంచి పుస్తకం ఓ మంచి ప్రాణ స్నేహితుడితో సమానం, వజ్రాల కన్నా పుస్తకాల విలువే ఎక్కువని బాపూజీ అంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగలిగిన అమూల్యమైన ఆస్తి మంచి పుస్తకాలే. చదువు మెదడుకు పదును పెడుతుంది. పుస్తక పఠనానికి కొంత సమయం కేటాయించడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది, కథల పుస్తకాలు పిల్లల్లో ఏకాగ్రత, సృజనాత్మకతను పెంపొందిస్తాయి. చూడటం కన్న చదవడం వల్ల మంచి రసానుభూతిని పొందుతారు. పెద్దలు నిత్యం కొంత సమయం పుస్తక పఠనానికి కేటాయిస్తూ పిల్లలకు అలవాటుగా మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. మహానుభావుల విజయగాథలు, ఆత్మకథలు, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతాయి. పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించి ఎందరో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. పిల్లల్లో పఠనాసక్తిని కలిగించడం, పిల్లలతోపాటు పెద్దల్ని కూడా బాలసాహిత్యం వైపు ఆకర్షించడం అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవ ముఖ్య ఉద్దేశం. 1967 నుంచి ఏటా ఏప్రిల్‌ 2న అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవాన్ని జరుపుతున్నారు.  ఎలెక్ట్రానిక్ మీడియా, వీడియో గేంస్ ఎంతో ప్రబావం చూపుతున్న ఈ కాలం లో క...

మార్టిన్ లూధర్ కింగ్

మార్టిన్ లూధర్ కింగ్ నల్లజాతి ప్రజలైన నీగ్రోలపై తెల్లజాతి ప్రజల వర్ణ వివక్షకు వ్యతిరేకంగా మానవ హక్కులు కోసం పోరాటం చేసిన అమెరికా నల్లజాతి నీగ్రో ప్రజల నాయకుడు.మార్టిన్ లూధర్ కింగ్ అట్లాంటా లోని జార్జియా లో జనవరి 15 వ తేదీన 1929 సంవత్సరం లో జన్మించారు. మార్టిన్ లూధర్ కింగ్ తల్లిదండ్రులు రెవరెండ్.మార్టిన్ లూధర్ కింగ్ సీనియర్ -ఆల్బర్టా విలియమ్స్ కింగ్ లు.    మార్టిన్ లూధర్ కింగ్ కు తన తండ్రి తొలుత పెట్టిన పేరు మైకేల్ లూధర్ కింగ్.ప్రొటెస్టంట్ మత విప్లవ నాయకుడు మార్టిన్ లూధర్ కింగ్ ను ఆదర్శంగా తీసుకున్న మైకేల్ లూధర్ తండ్రి తన తనయుడికి అతని పేరునే పెట్టడం జరిగింది.అలా మైకేల్ పేరు ను తన ఆరవ ఏటనే మార్టిన్ లూధర్ కింగ్ గా మార్చడం జరిగింది. మార్టిన్ లూధర్ కింగ్ ను తోరో వ్రాసిన "సివిల్ డిసో బిడియన్స్" పుస్తకం బాగా ప్రభావితం చేసింది.ఇక అప్పటి నుండి కింగ్ చర్చ్ కేంద్రం గా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.మార్టిన్ లూధర్ కింగ్ చదువులో చురుకుగా ఉండేవారు.1948 లో సామాజిక శాస్త్రం లో డిగ్రీ చదివారు.బోస్టన్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేశారు.కోరెట్టాస్కాట్ ను పరిణయం చేసుకున్న మార్టిన్ లూధర్ కింగ్ సమా...

copyright

Copyright gurinchi https://youtu.be/m_R1xu9sCBQ

జెండర్ గాప్

ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) విడుదల చేసిన నివేదిక ప్రకారం స్త్రీ పురుష సమానత్వం లో అంటే జెండర్ గాప్ లో మన దేశం చాలా వెనుకబడి ఉంది. అంటే స్త్రీ ని చాలా తక్కువ చేస్తున్నారు అని అర్ధం. ఈ సంస్థ 156 దేశాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం మన దేశం 140 వ స్థానం లో నిలిచింది. అంటే  ఆడవాళ్ళని బాగా చూసుకుని, సమానావకాశాలు కల్పించిన దేశం కు మొదటి స్థానం ఇస్తారు. అలా మనం 156 దేశాలలో 140 వ ర్యాంకు వచ్చినది. కాకపోతే బాలిక విద్య లొ కొద్దిగా పురోగతి ఉన్నదట. అలాగని చెప్పుకోతగ్గ స్థాయిలో పెరగలేదుట. అలాగే మన దేశంలో ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు తమకు బాగా తెలిసిన వారి చేత వేధింపులు కు గురి అవుతున్నారట. అలాగే మానవ హక్కుల విషయంలో, ఆకలి సూచి విషయంలో కూడా చాలా వెనుకబడి ఉన్నాము. ఇలాగే దీర్ఘకాలం కొనసాగితే దేశం, రాష్ట్రం పురోగమించడం సాధ్యపడదు. చదువులో, ఉపాధి కల్పనలో , వైద్య ఆరోగ్య సేవల విషయంలో ఇలా అన్నింటా మహిళకు ప్రాధాన్యత ఇవ్వాలి.సామజిక, ఆర్ధిక, రాజకీయాలు లో మహిళల పాత్ర పెరగాలి. చట్ట సభలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలి. కానీ మన దేశంలో ఆచార, సంప్రదాయాలు మహిళలను సాధ్యమైనంత వరకు మగ వారి వెనకే ఉండమని చెబుతాయి. ...