పరాజితుల విముక్తి ఎప్పుడు? ఎలా?
తరాలుగా బానిసత్వంలో మగ్గిన జాతుల్లో పరివర్తన అంత సులభం కాదు. వారు వారి మెదళ్లకు పని చెప్పే పని ఏనాడో మానుకున్నారు. అందుకే తమ పూర్వీకుల్లాగే జీవించడానికి సిద్దపడ్డారు. దానికి రకరకాల తాత్విక నిర్వచనాలు కూడా ఇచ్చుకొని ఉన్నారు. "ఉన్నంతలో జీవించాలి. అధికమైన ఆశలు అంత మంచివి కావు డబ్బు మనుషులను స్వార్థపరులుగా మారుస్తుంది. మన కులవృత్తిలోనే మనం జీవించాలి"వంటి ఎన్నో అడ్డుగోడలు సమాజం నిర్మించింది. వాటిని పరాజితులు శిరసా వహిస్తూ తరతరాలుగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఆకలి, పేదరికం, దారిద్ర్యం వంటి అవస్థలతో కలిసి జీవించడానికి సిద్ధపడ్డారు. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి యేండ్లు దాటినా ఇంకా వెలివాడల్లో పొద్దుపొడవలేదు. అందుకు అనేక కారణాలు, వాటిలో తమ స్వయంకృత అపరాధం కూడా లేకపోలేదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా రూపాయి పుట్టుక దాని మూలం గురించి క్షుణ్ణంగా శోధించాడు. ఆ పరిశోధన నుండే ఆర్బీఐ పంటి సంస్థలు పుట్టకొచ్చాయి. ఆయన పరిశోధనను, ఆలోచనలను పరాజిత జాతులు అందిపుచ్చుకోలేక పోయాయి. దీంతో ఆలోచించాల్సింది వ్యాపారం ఏ కొందరికో కాపీరైట్ ఈ జాతుల్లో మార్పు ఏ మాత్రం సాధ్యప...