Posts

Showing posts from February, 2021

maths problem.

Given below is a very interesting maths problem. This was set out by a German. It is a little difficult and can help prevent Alzheimer disease. 2  +  2  +  2  =  6 3      3       3  =  6 4      4       4  =  6 5      5       5  =  6 6      6       6  =  6 7      7       7  =  6 8      8       8  =  6 9      9       9  =  6 Use any of mathematical signs wherever you need. Solving 1 line...  You are Kindergarten graduate. Solved 3, high school graduate, Solved 5, University graduate, Solved all, PhD.. Go ahead and get your mind busy .👍👍👍👍 3×3-3=6 6×6÷6=6

మహాసాధ్వి, మహిళా సేనాని కస్తూరిబా

మహాసాధ్వి, మహిళా సేనాని కస్తూరిబా (గాంధీజీ వెన్నంటి సాగిన కస్తూర్బా నేపథ్యం, జీవన గమనం, పట్టుదల, అవగాహన చాలా విలక్షణమైనవి. గాంధీజీ ఇంగ్లండులో బారిష్టరు చదివిన వ్యక్తి, ఉపాధికోసం దక్షిణాఫ్రికా తరలి వెళ్ళిన సాహసి. అయితే కస్తూర్బా ఎటువంటి చదువు, ఎటువంటి అధ్యయనం లేకుండా కేవలం జీవితాలను గమనించి గాంధీజీని ఆయన విధానాలను అర్థం చేసుకుని హేతుబద్ధంగా స్వీకరించి, జీవించిన మహాతల్లి. దేశంకాని దేశాన చాలారకాల సమస్యల మధ్య సాహసంతో జీవితాన్ని సాగించింది. గాంధీజీ, రాజాజీ గార్ల మనవడు రాజమోహన్ గాంధీ, 2006లో మోహన్ దాస్:  ఎ ట్రూస్టోరీ ఆఫ్ ఎ మాన్, హిస్ పీపుల్ అండ్ యాన్ ఎంపైర్  అనే పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం ఆధారంగా కస్తూర్బా గాంధీ అంతిమ రోజుల గురించి ప్రస్తుత వ్యాసం.) రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజులవి. జపాన్‌ విజృంభిస్తూ మలయా, రంగూన్‌, సింగపూర్‌లను వశపరుచుకొన్నది. భారతదేశ తూర్పు తీర పట్టణాలపై బాంబుల దాడి జరగవచ్చని ప్రజలు ఆందోళపడుతున్న రోజులవి. భారత్‌కు రేపు కాదు నేడే స్వాతంత్రం ప్రకటించాలని ఎ.ఐ.సి.సి. సమావేశంలో నెహ్రూ, పటేల్‌ మొదలైనవారు హెచ్చరించారు. 1942 ఆగస్టు 7వ తేదీన 40 కోట్ల భారతీయులకు ...

ఎవరు బండ?

‘‘అదేదో ఊరి నుండి మహాశిల్పి వచ్చాడు మరేదో ఊరి నుండి పెద్ద బండ తెచ్చాడు  ఆరడుగుల కొలత పెట్టి బండను ఖండించాడు  మిగిలిన మూడడుగుల ముక్కను పక్కకు తోసేశాడు  ఆరడుగుల బండేమో విగ్రహమై వెలిసింది  మూడడుగుల ముక్క బండ చాకిరేవు చేరింది  కంపు కంపు మనసులన్నీ దేవుని ఎదుట నిలిచాయి  కంపుకొట్టే బట్టలన్నీ బండ చుట్టూ చేరాయి  గొంతెమ్మ కోర్కెల గొంతులన్నీ తీర్థంతో తడిచాయి  మురికి మరకల బట్టలన్నీ నీటిలో మునిగాయి  అర్థంకాని స్తోత్రాలతో పూజారి భక్తిశ్రద్ధలు  చాకలి నోటివెంట ఇస్సు ఇస్సు శబ్ధాలు  శఠగోపం పవిత్రంగా ప్రతి తలను తాకుతోంది  పవిత్రతకై ప్రతి బట్టా బండను బాదుతోంది  కడకు.. గుడి నుండి మనసులన్నీ కంపుతోనే వెళ్లాయి  రేవు నుండి బట్టలన్నీ ఇంపుగా వెళ్లాయి  గుడిలోని దేవుడా? రేవులోని బండా?  ఎవరు దేవుడు? ఎవరు బండ?’’ - రంగనాధ్.

మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ

మనుస్మృతిని ధిక్కరించిన ఛత్రపతి శివాజీ -------------------------------------------------------------        రాజైన శివాజీకే వివక్ష తప్పలేదు. శివాజీని పట్టాభిషిక్తుణ్ణి చేయడానికి స్థానిక బ్రాహ్మణులెవరూ సహకరించలేదు. అప్పుడు దూరప్రాంతం నుంచి ఒక బ్రాహ్మణ్ణి పిలిపించారు. అతను కార్యక్రమం పూర్తి చేయించాడు కానీ, శివాజీ నుదుట తన కాలి బొటనవేలుతో తిలకం దిద్దాడు. ఎందుకంటే రాజైనవాడు శూద్రుడు గనక! మనుస్మృతి నిబంధనలు కఠినంగా అమలులో ఉన్న ఆ కాలంలో శూద్రుడై ఉండి శివాజీ ఆయుధం చేపట్టాడు, జ్ఞాని అయ్యాడు. సర్వమత సహనంతో ప్రజల్ని సమభావంతో ఆదరించాడు. అంటరాని కులాల వారికి ఆయుధమిచ్చి వారిని సైనికులుగా తీర్చిదిద్దాడు.         *తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక్కోసారి ఒక్కొక్కరిని తమ వారిగా ప్రచారం చేసుకోవడం బిజెపి, ఆరెస్సెస్‌లకు కొత్తేమీ కాదు. వారిలో ఛత్రపతి శివాజీ ఒకరు.* ప్రసిద్ధ మరాఠా నాటకం 'జాణ్తారాజా' (జగమెరిగిన రాజు) కూడా శివాజీని ముస్లిం ద్వేషిగా చిత్రీకరించింది. అయితే  *ముస్లింల పట్ల, వారి మతం పట్ల శివాజీ ఎప్పుడూ ద్వేష భావం చూపలేదని చరిత్రకారుడు సర్దేశాయి 'న్యూ హిస...

ప్రజాశక్తి

ప్రజాశక్తి పత్రికస్థానంలో ఎన్నో త్యాగాలు చేసి సమష్టి కృషితో నిర్మించుకున్న విశాలాంధ్ర పత్రిక సిపిఐ చేతికిపోగా సిపిఎం తరపున డి.వి.సుబ్బారావు తదితరులు జనశక్తి పత్రిక స్థాపించారు. అరెస్టయిన నాయకుల విడుదల కోసం ఎందరో మేధావులు పౌర హక్కుల ఉద్యమం నడిపించారు. కొద్ది రోజుల తర్వాత ఆ మేధావులను కూడా అరెస్టు చేశారు. నాటి పత్రికల్లోహక్కుల కోసం జరిగే పోరాటాలకుఇప్పుడు మీడియాలో వామపక్షాలకు వస్తున్న ప్రచారంలో కొంతకూడా లేదు.జైళ్లలోని డిటెన్యూల భార్యలు పిల్లలూ ప్రత్యేకంగా పోరాడిన తర్వాతనే ప్రభుత్వం కనీస హక్కులు సదుపాయాలు కలిగించింది. కనక సిపిఎం పుట్టుకే పోరాటాలతో జరిగింది.        

వెలుగులు నింపిన చట్టాలు

ప్రపంచంలోని అన్ని మతాల్లో అనేక విశ్వాసాలు, అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఉంటూ వచ్చాయి. వాటన్నిటిని రూపొందించింది ఆయా కాలాల్లోని మతాధిపతులే. కాలం మారుతున్న కొద్దీ, శాస్త్రీయ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆచారాలు, సంప్రదాయాలు అనాగరికమైనవని, అర్థరహితమైనవని జనం గ్రహిస్తూ వచ్చారు. అందుకే కాలానుగుణంగా వాటిని మార్చుకోవడం అవసరమైంది. ఈ మార్చుకోవడమన్నది నిరంతరం జరగవల్సిన ప్రక్రియ. మన దేశంలో బౌద్ధం, జైనం వేల సంవత్సరాల క్రితమే బ్రాహ్మణ మతాన్ని, వర్ణ వ్యవస్థని, మను ధర్మశాస్త్ర నిబంధనల్ని సవాలు చేశాయి. హిందూ ధర్మంలో సైతం వివిధ కాలాల్లో వివిధ ఉద్యమాలు తలెత్తి సంస్కరణలకు దారి తీశాయి. 1216 సి.ఇ శతాబ్దాల మధ్య భక్తి ఉద్యమం బలంగా వ్యాపించింది. అయితే అది కొంత వరకు కుల వ్యవస్థను కూడా ఛాలెంజ్ చేసింది. దురాచారాలను ప్రశ్నించింది. మీరాబాయి, చైతన్యుడు, సూఫీ ఉద్యమం మన తెలుగు నేల మీద వేమన, మొల్ల లాంటి వారు విశ్వాసాల్ని, సంప్రదాయాల్ని ప్రశ్నించిన వారే. ఆ ప్రభావంతో మతాలు ఎప్పటికప్పుడు, ఎంతో కొంత మూఢత్వాన్ని, అనాగరికతను వదులుకుంటూ వచ్చాయి. ఇప్పుడు జరిగే తిరుగుబాట్లకు, నిరంతరం సంఘర్షణలకు అది ఒక ప్రారంభ దశ మాత్రమే! ఆ తర్వాత ...

ఏ కాలంలో ఏది?

● క్రీ.పూ 2613 లో ఈజిప్టులోని ఖియోప్స్ పిరమిడ్ నిర్మాణం జరిగింది. ● మొహెంజోదారో, హరప్పా నాగరికత క్రీ.పూ 2300 నుంచి బలపడి, క్రీ.పూ 1500 నాటికల్లా క్షీణ దశకు చేరుకుంది. ● క్రీ.పూ 1300 - 1200 లలో ఆర్యులు భారత దేశానికి ఆగమనం మొదలైంది. ● క్రీ.పూ 1200 ఋగ్వేదపు తొలి సూక్తులు ఆవిర్భవించాయి. ● క్రీ.పూ 1209 - 900 మధ్యలో యజుర్వేదం , సామవేదం, అదర్వణవేదం కూర్పు జరిగింది. ● క్రీ.పూ 1193 లో గ్రీకులు ట్రోయ్ నగరాన్ని ముట్టడించారు. ● క్రీ.పూ 1000 లో భారత దేశంలో ఇనుము వాడకం మొదలైంది. ● క్రీ.పూ 900 - 600 మధ్యలో బ్రహ్మణాల కూర్పు జరిగింది. ఇవన్నీ వేద సాంప్రదాయాలు తంతుల వివరణల వంటివి. ● క్రీ.పూ 600 - 100 మధ్యలో వర్ణాశ్రమ సూత్రాల నిర్వచనాలు, చివరి ఉపనిషత్తులు రూపొందాయి. ● క్రీ.పూ 599 - 527 మధ్య కాలంలో మహావీరుడు జీవించాడు. ● క్రీ.పూ 563 - 483 మధ్య కాలంలో గౌతమ బుద్దుడు జీవించాడు. ● క్రీ.పూ 550 లో జైన,బౌద్ధ మతాలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి వేరు పడ్డాయి. ● క్రీ.పూ 500 లో వేదాలు,అరణ్యకాలు,ఉపనిషత్తులు లిఖితం చేయబడ్డాయి. ● క్రీ.పూ 325 లో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అలెగ్జాండర్ భారత దేశంపై దండ యాత్ర సాగించాడు. ● క...

స్త్రీ-పురుష సంబంధాలు

ప్రేమ   ఒక శరద్రాత్రి, ఏటవాలు క్షణాల మీద నిటారుగా నిలబడి వెన్నెల తీవెల్ని మీటగల అనుభవాన్ని ఇచ్చేదే ప్రేమ. కనురెప్పల మైదానాల మీద కలల విత్తనాలు జల్లి అనుభూతుల పంట పండించేదే ప్రేమ. నీ అద్భుతంలో, నీ అనంతంలో, నీ అద్వితీయంలో నా సర్వస్వం విలీనమవ్వడం ప్రేమ [3] . [4] ప్రేమ ఇంద్రధనుస్సు అయితే ఆ ఏడు రంగులూ- ఆకర్షణ, అవగాహన, తాదాత్మ్యత, స్పర్శ, కామం, ఓదార్పు. [5] ప్రేమించడానికి ముఖ్యమైన అర్హత వ్యక్తిత్వం. ప్రేమించబడడానికి ముఖ్యమైన అనర్హత ఆధారపడడం. [6] విషాదం  అవతలి మనిషి విసుగును సహనంతో, కోపాన్ని క్షమతో, బలహీనతని ప్రేమతో, తప్పుని నవ్వుతో ఎదుర్కొనే మనిషికి జీవితంలో విషాదం ఉండదు. [7] ఏడ్పులేకపోవడం పరిపూర్ణమైన విషాదానికి ఉచ్ఛ స్థితి. [5] నవ్వుని ఆహ్వానించినట్టే కన్నీటిని కూడా ఒక్కోసారి ఆహ్వానించాలి. లేకపోతే వేదనమీద కృత్రిమమైన జీవన విధానం కరడుకట్టి, స్వభావ సిద్ధమైన వ్యక్తిత్వాన్ని, స్వచ్ఛమైన చిరునవ్వునీ నొక్కిపారేస్తుంది. [2] జీవితం  జీవితం పట్ల అవగాహన ఉన్నవాడు నిస్సారంగా కాలం గడపడం కన్నా ఘోరం ఇంకోటి ఉండదు. [8] జీవితం ఒక లెక్కలాంటిది. చేసిన ప్రతి స్టెప్పూ మళ్ళీ ఒకసారి పరిశీలించి చూసు...