Posts

Showing posts from October, 2020

మాల కులం - సాంప్రదాయాలు

  🔹 మాల కులం పేరు - దాని అర్ధం🔹       జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert గారి అధ్యాయనం ప్రకారం,, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు..        పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని  రాశారు..       ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్(పరయా-పరయా అంటే సందేశాన్ని చేరవేసేవాడు) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని,, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని,, మేరు పర్వతం పేరుతో పడమరలో, మార్లు అని, మహార్లు అని,, భార్ లు అని పిలిచినట్టు,, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు..        తమిళ సంగం సాహిత్యంలో కూ...

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు

1) ఒక ఎకరాకు =  40 గుంటలు  2) ఒక ఎకరాకు =  4840 Syd 3) ఒక ఎకరాకు =  43,560 Sft 4) ఒక గుంటకు =  121  Syd 5) ఒక గుంటకు =  1089 Sft 6) ఒక స్క్వయర్ యార్డ్ కు 3 x 3 = 09     చదరపు ఫీట్లు  7) 121 x 09  =  1089  Sft 8) 4840 Syd x 09 = 43,560 Sft 9) ఒక  సెంట్ కు   =  48.4  Syd  10) ఒక సెంట్ కు  =  435.6  Sft ఎకరానికి 1⁄100 (40.5 మీ 2; 435.6 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఒక శాతం నిర్వచించబడింది. ఇది ఇప్పటికీ చాలా వార్తా నివేదికలు మరియు రియల్ ఎస్టేట్ ఒప్పందాలలో ఉపయోగించబడుతుంది. *(ఒక ఎకరానికి 4046.8564224 చదరపు మీటర్లు (4046.82 చ.మీ కొందరు) ఒక ఎకరానిక్ 43, 560 చదరపు అడుగులు ఒక ఎకరానికి 0.405 హెక్టార్లు.ఒక ఎకరానికి 4840 చదరపు గజాలు (4800 చ.గ. కొందరు)ఒక ఎకరానికి 605 అంకణములు.ఒక ఎకరానికి 100 సెంట్లు. సెంటుకి 48.4 గజములు. అంటే 4840 గజములు ఒక ఎకరం. 40 గుంటలు ఒక ఎకరం (4840 గజములు) . 121 గజములు ఒక గుంట. 66 చదరపు అడుగులు × 660 చదరపు అడుగులు = ఒక ఎకరం సుమారుగా 208.71 చదరపు అడుగులు × 208.71 చదరపు అడు...

ఒక చరిత్ర వ్యాసకర్త గా స్థిరపడాలనుకుంటే కొన్ని సూచనలు:

  1. మీరు సంస్కృతంలోని Quotations ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఉదాహరణకు... పురాణనిర్వచనం.  2. ఏ విషయాన్ని మీరు ప్రస్తావించినా మీ అభిప్రాయం ఏమిటి? ఎవరి ఎవరి అభిప్రాయాలను మీరు పరిగణనలోకి తీసుకున్నారు? అన్ని విషయాలను ఆయాగ్రంథముల పుటసంఖ్యలతో స్పష్టంగా ఇవ్వాలి. అప్పుడు మీరు పరిచయం చేసే విషయానికి గౌరవం పెరుగుతుంది. 3. మనుస్మృతి లోని బ్రహ్మావర్తమే బ్రహ్మలోకమనే ఆధునిక చరిత్ర కారుల ఊహలను ఆ మన్వాది గ్రంథకర్త లకు ఆపాదించేటప్పుడు ఆ యా గ్రంథకర్త లు తమ గ్రంథములలో ఏంచెప్పారో ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. 4. అలాగే సంస్కృత సాహిత్య పు ఐతిహాసిక నిర్ధారణ చేసే సమయంలో ఆ యా గ్రంథాలను చూడటం వాటి గురించి తత్తత్పూర్వాపరగ్రంథాలలో ఏముందో చూడటం అవసరం. దీన్నే మనం Internal Evidence అంటాం.  ఉదాహరణకు: పురాణాల ప్రస్తావన -  1.  వేదములలో కాని,   2. ఐతరేయాది బ్రాహ్మణగ్రంథములలో కాని 3. ఉపనిషత్తులలో, 4. మునిత్రయ వ్యాకరణం లో (పాణినీయంలో) 5. గుణాఢ్యబృహత్కథలో 6. క్రీస్తు పూర్వం రచింపబడిన గ్రంథములు గా పాశ్చాత్యులైన భారతీయ చరిత్ర లేఖకులు అంగీకరించిన గ్రంథాలలో పురాణాల ప్రస్తావన ఎంతవరకు...

సెక్షన్144అంటే ఏమిటి?

అల్ల‌ర్లు జ‌రిగితే 144 సెక్ష‌న్.. గొడ‌వ‌లు జ‌రిగితే 144 సెక్ష‌న్ ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్..  ఓటింగ్ కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్.. అసెంబ్లీ/పార్లమెంట్ సమావేశాలు144 సెక్షన్ ప్రజా ఆరోగ్య దృష్ట్యా 144 సెక్ష‌న్.. ఇలా ఎక్క‌డ చూసిన 144 సెక్ష‌న్ అనే మాట వింటాం.  శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు ముందు ఉప‌యోగించే అస్ర్తామే 144 సెక్ష‌న్.  అసలు 144 సెక్ష‌న్ అంటే ఏమిటి..?  ఎప్పుడు విధిస్తారు..?  ఎందుకు విధిస్తారు..?  ఎలాంటి ప‌రిస్థితుల్లో అమ‌లు చేస్తారు..?  వంటి అంశాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం మన దేశంలో ఏ మాత్రం అల్లర్లు చెలరేగిన ప్రభుత్వం ముందు చేసే పని 144 సెక్షన్ ప్రకటించడం. సెక్షన్ 144 ఉంది అని అందరికి తెలుసు కాని అసలు అది అంటే ఏమిటీ?  ఆ సమయం లో మనం ఏమి చేయవచ్చు ?  ఏమి చేయకూడదు ?  అనేది మాత్రం తెలియ‌దు .  భారత శిక్షాస్మృతి 144 ప్రకారము, ఏ ఒక్కరు, ప్రాణానికి హాని క‌లిగించే మారణాయుధాలు కలిగి ఉండటం నేరం. ముగ్గురు లేదా అంతకన్న ఎక్కువమంది గుమికూడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేయడం ...

ప్రపంచ వాణిజ్య సంస్థ

Image
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్  (  డబ్ల్యూటీఓ  ) అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రించే ఒక అంతర్-ప్రభుత్వ సంస్థ. 1948 లో ప్రారంభమైన సుంకాలు మరియు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం (GATT) స్థానంలో 15 ఏప్రిల్ 1994 న 124 దేశాలు సంతకం చేసిన మరాకేష్ ఒప్పందం ప్రకారం WTO అధికారికంగా 1 జనవరి 1995 న ప్రారంభమైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ఆర్థిక సంస్థ. వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడానికి ఒక ఫ్రేమ్‌వర్క్ మరియు WTO ఒప్పందాలకు పాల్గొనేవారు కట్టుబడి ఉండటాన్ని లక్ష్యంగా చేసుకుని వివాద పరిష్కార ప్రక్రియను అందించడం ద్వారా పాల్గొనే దేశాల మధ్య వస్తువులు, సేవలు మరియు మేధో సంపత్తిపై వాణిజ్య నియంత్రణపై WTO వ్యవహరిస్తుంది, వీటిని సభ్య ప్రభుత్వాల ప్రతినిధులు సంతకం చేసి ఆమోదించారు వారి పార్లమెంటుల ద్వారా. వాణిజ్య భాగస్వాముల మధ్య వివక్షను WTO నిషేధిస్తుంది, కానీ పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన లక్ష్యాలకు మినహాయింపులను అందిస్తుంది. వాణిజ్య  సంబంధిత  వివాదాలను WTO వద్ద స్వతంత్ర న్యాయమూర్తులు వివాద పరిష్కార ప్రక్రియ ద్వారా పరిష్కరిస్తారు. WTO యొక్క ప్రస్తుత డైరెక్టర్ జనరల...