Posts

Showing posts from October, 2022

తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి

👉తెలంగాణలో బౌద్ధమతం వ్యాప్తి..!!! ——————————————————— ప్రపంచంలోని మత స్థాపకులు, బోధకులు కనిపించే మనిషికన్నా, కనిపించని దేవునికీ, ఇహలోక సులభజీవనం కన్నా, లేని పరలోక సౌఖ్యాలకు ఎక్కువ ప్రాధానమిచ్చారు. ఒక్క గౌతమ బుద్ధుడు మాత్రమే మనిషిని కేంద్రంగా చేసుకొని తన ధర్మాన్ని బోధించాడు. మానవత్వానికి ప్రధాన పీట వేశాడు.సకల జీవకోటి సుఖంగా జీవించుగాక, సర్వ ప్రాణులూ నిర్భీతితో మనుగడ సాగించుగాక, సమస్త ప్రజలూ అన్ని రకాల కష్టాలు, దుఃఖాల నుంచి విముక్తులై ప్రశాంతంగా, ఆనందంగా జీవించుగాక అని కోరింది బౌద్ధం. సుమారు 2560 ఏండ్ల కిందటి ఈ సామ్యవాద భావజాలం, భారతదేశంలో కన్నా విదేశాల్లో బాగా ఉంది. శాంతి, అహింస, ప్రజ్ఞ, కరుణ, శీల, సమత, మైత్రి, సానుభూతులకు వేదిక బౌద్ధం. క్రీ.పూ. 6వ శతాబ్దంలోనే కుల వ్యవస్థని, అస్పృశ్యతని నిరసించి, సమసమాజ నిర్మాణానికి శాశ్వతమైన పునాదులు వేసిన విప్లవకారుడు బుద్ధుడు. విశ్వంలో ప్రతి ఒక్కరి హృదయంలో ప్రజ్వలించే ధర్మజ్యోతి, ఆసియా జ్యోతి గౌతమ బుద్ధుడు. క్రీ.పూ. 8వ శతాబ్దంలో జన్మించి సుమారు 1000 ఏండ్లపాటు భారతదేశంలో ఒక వెలుగు వెలిగిన బౌద్ధమతం నేటికీ జపాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, మయన్మార్ దేశాల్లో ...

ఇండియాలో మూడు* *సామాజిక విప్లవాలు

*ఇండియాలో మూడు* *సామాజిక విప్లవాలు* .   మార్క్స్ సామాజిక విప్లవాలకు  ఉత్పత్తి శక్తుల అభివృద్ధి, ఉత్పత్తి సంబంధాలమార్పు కొరకు జరిగే వర్గ పోరాటాలు చోదక శక్తులుగా పనిచేస్తాయని అంటాడు. ఈ అంచన ఆధారంగా ఆయన ప్రపంచ చరిత్ర మొత్తం వర్గ పోరాటాల చరిత్రేననే సూత్రీకరణ చేశారు. ఈ సూత్రీకరణలో భాగంగా ప్రపంచంలో మొదట బానిస సమాజం,   తర్వాత భూస్వామ్యం, భూస్వామ్యం నుండి పెట్టుబడిదారీ సమాజంగా పరివర్తన చెందిన క్రమాన్ని చారిత్రక భౌతిక సిద్ధాంతంలో విశ్లేషిస్తాడు. 1853లోనే భారతదేశంలో బ్రిటిష్ పాలనపై పరిశీలన చేస్తున్నప్పుడు భారతదేశ చరిత్రపై కూడా  దృష్టి సారించాడు. ఆయన దృక్పధానికి భిన్నమైన పరిస్థితులు భారతదేశంలో ఉండేసరికి ఇండియాకు చరిత్ర లేదు? అనే  నిర్ణయానికి వస్తాడు ఆయనే కాదు డాక్టర్ అంబేద్కర్ కూడా తన’ కుల నిర్మూలన’(1932) గ్రంథంలో భారతదేశంలో సామాజిక విప్లవాలు ఎందుకు సంభవించలేదు? అనే ప్రశ్న నన్ను వేధిస్తున్నదని అంటాడు. కాబట్టి ఈ ఇరువురు తాత్వికులు లేవనెత్తిన  సందేహాలపై చర్చ  జరగవలసి ఉంది.  భారతీయ చరిత్రలో సింధు నాగరికత విశిష్టత మనకు తెలిసిందే. ఇది ఎలా పతనం చెందింది? అనే ...