Posts

Showing posts from August, 2020

సమ్మక్క-సారలమ్మ

మేడారం జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తి గడించింది. ఇక్కడి వన దేవతలను దర్శించుకొనేందుకు భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో మేడారం జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. అయితే, మేడారానికి ఇంతటి ప్రాశస్త్యం ఎందుకు దక్కింది? ఇక్కడ వన దేవతలుగా కొలిచే సమ్మక్క సారలమ్మ ఎవరు? జంపన్న వాగు ప్రాముఖ్యం ఏమిటి? అసలు ఈ జాతరను ఇంత వైభవంగా ఎందుకు నిర్వహిస్తున్నారు? ఇలాంటి సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. వాటికి సమాధానాలు చూడండి. పులుల మధ్య సమ్మక్క మేడారం, సమ్మక్క సారలమ్మలకు వనదేవతలుగా కొలిచేందుకు కారణాలను విశ్లేషిస్తే.. ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం కోయదొరలు వేటకోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గుడారానికి తీసుకెళ్లి దాచారు. పాప గూడేనికి వచ్చినప్పటి నుంచి అన్నీ శుభాలే జరగడంతో కొండ దేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంతపు కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు.  కాకతీయుల కాలం(క్రీ.శ. 1260 నుంచి 1320) ల...

ప్రేమంటే ఇదేరా!

ప్రేమంటే ఇదేరా! -సంపాదకీయం -ప్రజాశక్తి 🔅 ''పండగ సందర్భంగా భర్తకు ఓ బహుమతి కొనాలనుకుంటుంది ఆమె. తన దగ్గర డబ్బు లేదు. ఏం చేయాలాని ఆలోచిస్తున్న సమయంలో- రాగి రంగులో పైనుంచి దూకే జలపాతపు అలల లాగా మోకాళ్ల వరకూ నిగనిగలాడుతున్న ఆమె జుట్టు కనిపిస్తుంది. ఆమె నేత్రాలు కాంతితో ప్రకాశిస్తాయి. విగ్గుల తయారీ దుకాణానికి వెళ్లి తన అందమైన జుట్టును అమ్మేస్తుంది. తాత తండ్రుల నుంచి భర్తకు సంక్రమించిన బంగారపు గడియారానికి వున్న తోలు గొలుసుకు బదులుగా ప్లాటినం గొలుసును కొంటుంది. అదే రోజున తన భార్యకు మంచి బహుమతి కొనాలనుకుంటాడు భర్త. జలపాతపు అలలను తలపించే జుట్టుకు పెట్టుకోడానికి అందమైన, ఖరీదైన హెయిర్‌ క్లిప్పును బహుమతిగా తెస్తాడతను. అందుకోసం తన చేతికున్న బంగారపు గడియారాన్ని అమ్మేస్తాడు. కానీ... హెయిర్‌ క్లిప్‌ పెట్టుకోడానికి ఆమెకు జుట్టు లేదు, ఆమె తెచ్చిన ప్లాటినం గొలుసు పెట్టుకోడానికి అతని వద్ద గడియారమూ లేదు.'' ఇది ప్రముఖ అమెరికన్‌ రచయిత ఓ.హెన్రీ రాసిన 'ది గిఫ్ట్‌ ఆఫ్‌ ది మ్యాగి' కథ. ఈ కథ చదివితే- అయ్యో! అనిపిస్తుంది మనకు. ✔ అదే సమయంలో వారిదెంత అపురూపమైన ప్రేమో అని, ఒకరికోసం ఇంకొకరు ...

అమ్మానాన్నలందరూ పిల్లలు జాగ్రత్త.

ఎండాకాలం వచ్చేస్తోంది అమ్మానాన్నలం పిల్లలు జాగ్రత్త. ఎండదెబ్బ తగులుద్దని జాగ్రత్త చెప్పట్లే. భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్ళే వాళ్ళు మీ పిల్లలు జాగ్రత్త. రెండు నెలల్లో 42అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్నీ మైనర్ పిల్లల పైనే. రెండున్నరేళ్ళ మనవరాలి పై తాత. తొమ్మిదేళ్ళ , నాలుగేళ్ళ బిడ్డల పై తండ్రులు, ఇట్లా ..... నిన్న ఆరేళ్ళ పిల్లపై గొంతులో ఇనుప చువ్వ కుచ్చి మరీ అత్యాచారం. అమ్మానాన్నలు జాగ్రత్త అడవి కంటే భయంకరమైన సమాజంలో ఉన్నాం మన పిల్లలకు మనమే ప్రథమ రక్ష. ఘోరాలు జరిగినంక ఎంత రోదించినా , నేరస్తులకు ఏ శిక్షలు వేసినా మన పిల్లలు మనకు బాధాతప్త స్మృతులే , గుండెలు పగిలే జ్ఞాపకాలే. ఇప్పుడు నేను రాసే సుద్దులేవీ స్లమ్ వీథుల్లో పొట్టపట్టుకుని కూలీచేసే వాళ్ళు చదవరు. పసిపిల్లల పై అత్యాచారాలు జరిగేది ఇటువంటి ప్రాంతాల పిల్లల పైనే. సింగిల్ పేరెంట్స్ పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేసే పిల్లలే కామాంథులకు టార్గెట్లు. మరి బుద్దిజీవులు మానవతా మూర్తులు ఏమి చేయాలి మిద్దెతోట అవగాహనా సదస్సులు చేసినట్టే తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలి. పిల్లలకు ఈ విషయాలు 1) కొత్తవాళ్ళు ఎవరు ఏదిచ్చినా తీసుకో...

ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా... విజ్ఞాన సుగంధం

📚📙📘📗📒📕📔📓📗📕📖            ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.            - మహాత్మగాంధీ  ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.              - నెహ్రు  మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ  పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.          - బెడ్రంట్ రసెల్  మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.           - ఆల్బర్ట్ ఐన్ స్టిన్ ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు         -నెల్సన్ మండేలా  🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం📘 పుస్తకం అన్నారు .పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి ...

గ్రంథాలయాల గురించి లెనిన్ ఏం రాశాడు, ఏం చెప్పాడు

లెనిన్ చాలా కాలాన్ని గ్రంథాలయాల్లో గడిపాడు. సమారలో ఉంటున్నప్పుడు స్థానిక గ్రంథాలయం నుండి అనేక పుస్తకాలు ఎరువు తెచ్చుకుంటూండేవాడు. తర్వాత సెయింట్ పీటర్స్ బర్గ్ లోని పబ్లిక్ గ్రంథాలయంలో రోజుల కొద్దీ గడిపేవాడు. ఫ్రీ ఎకనామిక్ సొసైటీ వారి గ్రంథాలయం నుండీ యింకా అనేక ఇతర సంస్థల నుండీ పుస్తకాలను ఎరవు తెచ్చుకొనేవాడు. జైల్లో వున్నప్పుడు కూడా అతని సోదరి అతనికి గ్రంథాలయాల నుండి పుస్తకాలు తీసుకువెళ్లి ఇస్తుండేది. ఈ పుస్తకాల నుండి అతను విస్తారంగా నోట్సు రాసుకునేవాడు. లెనిన్ "రచనలు" (రెండవ కూర్పు) మూడో సంపుటిలో ఒక నోటు వుంది. “రష్యాలో పెట్టుడిదారీ విధానం అభివృద్ధి" రచనలో అతడు ఎంతలేదన్నా 583 పుస్తకాలని సంప్రతించినట్టు ఆ నోటులో వుంది. ఈ పుస్తకాల పేర్లు కూడా "రష్యాలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి"లో పేర్కొన్నాడు. ఈ పుస్తకాలన్నిటినీ లెనిన్ ఎన్నడైనా కొనగలిగి వుండేవాడా? వాట్లలో చాలా పుస్తకాలు అమ్మకానికి దొరకనివి కూడా. ఉదాహరణకు అతనికి ముఖ్యంగా విలువైనట్టి జేమ్ స్త్వా గణాంకశాస్త్ర లెక్కల సంగ్రహాలు.  పైగా ఆ రోజుల్లో అతడు ఒక విద్యార్థివలె మిద్దె మీది డాబా గదిలో నివసిస్తూ ప్రతి దమ్మిడీ...

అంతర్జాతీయ పుస్తక దినం

*చనిపోయిన వాళ్ళకి పదో రోజున దినం చేస్తారు.సంవత్సరానికోసారి తద్దినం పెడతారు.అది ఒకప్పుడు.ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్న విదేశీయులం.అందుచేత వాళ్ళ మదర్స్ డే , ఫాదర్స్ డే లాంటి అన్ని దినాల్ని దిగుమతి చేసుకున్నాం.వాటిలో ఒకటి ఈ .* అంతర్జాతీయ పుస్తక దినం         *అయితే ఈ దినం మాత్రం కచ్చితంగా జరుపుకోవాలి.* ఎందుకంటే ఇపుడసలు పుస్తకం చచ్చిపోయింది.సాహిత్యం సంతకెళ్లింది.జీవితం వేగం పెరిగింది.మనకసలు దేనికీ టైమ్ దొరకడం లేదు. *ఉన్న టైమంతా డబ్బుకోసం వెంపర్లాడటానికే సరిపోతోంది.*       *పుస్తకం హస్తభూషణం అన్నారొకప్పుడు.ఏం ఉంది పుస్తకాల్లో అంటున్నారిప్పుడు.పెద్ద పెద్ద మేధావుల జీవితాలు ,మహాత్ముల చరిత్రలు చదివితే వాళ్ళని పుస్తకాలు ఎంత ప్రభావితం చేశాయో తెలుస్తుంది.గాంధీ గారిని టాల్ స్టాయ్ పుస్తకాలు ఎంతో ప్రభావితం చేశాయట.మనిషిని ఆలోచింపజేసేది పుస్తకం మాత్రమే.మనుషుల్నే కాదు దేశ  చరిత్రల్నేమార్చేసే శక్తి పుస్తకాలకుంది.ఫ్రెంచి విప్లవం ,రష్యన్ విప్లవం వంటి విప్లవాలకి అప్పటి రచనలు ఎంతో సాయపడ్డాయి.*         *బ్రిటన్లో ఎన్నో చట్టాలు రావడానికి కారణం డికెన్స్...

ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలి

Image
    ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలి           ‌         ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలి              స్త్రీలు తన కాలాన్నీ, శక్తినీ కేంద్రీకరించి నిరంతరం అల్పమైన - విసుగును పుట్టించే ఇంటి పన్నుల్లో సతమతమవుతుంటే, పురుషుడు ప్రశాంతంగా చూస్తూ వుంటాడు. ఆ పనిలో స్త్రీ మనోనేత్రం మూసుకుపోతూ వుంటే, ఆమె బుద్ధి మందగిస్తుంటే, ఆమె హృదయం నీరసిస్తూంటే, ఆమె మానసిక శక్తి బలహీన పడుతుంటే - చూస్తూ వుంటాడు. ఇది సర్వ సాధారణమైన విషయం. ఇంత కంటే అతని కర్కశత్వానికి నిదర్శనం ఏమి కావాలి? తమ ఇంటి పనులన్నింటినీ, బిడ్డల పోషణతో సహా, పనికత్తెల కప్పగించి కులాసాగా కాలక్షేపం చేసే బూర్జువా స్త్రీలను గురించి కాదు నేను చెబుతున్నది. చాలామంది స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కార్మికుల భార్యలను గురించి .  చెబుతున్నాను. రోజల్లా ఫ్యాక్టరీలో పని చేస్తూ స్వయంగా ధనార్జన చేసేవారు కూడా నా దృష్టిలో వున్నారు. "శ్రామికుల్లో సైతం చాలా కొద్దిమంది భర్తలే, తాము ఈ 'ఆడవాళ్ళ పని'లో కాస్త చేయూత ఇవ్వడం వల్ల తమ భార్యల క...

సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన అభిప్రాయం

Image
అసమ సమాజంలో సమానత్వం సాధించే అంతిమలక్ష్యంతో తీసుకొచ్చిన రిజర్వేషన్లను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా అమలుచేసే విషయంలో రాష్ర్టాలకు హక్కులుంటాయని, ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన కచ్చితమైన అభిప్రాయం ఆహ్వానించదగిన పరిణామం. రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ర్టాలకు అధికారాలు అప్పగించడమే సరైన రాజ్యాంగ స్ఫూర్తి అని తెలంగాణతోపాటు, దేశంలోని చాలా రాష్ర్టాలు చేస్తున్న వాదనలకు గురువారం నాటి ధర్మాసనం ఆమోదముద్ర వేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెలిబుచ్చిన అభిప్రాయం అంతిమం కాకపోయినా, అది రిజర్వేషన్లు పొందుతున్న సామాజిక వర్గాల్లోనే అంతర్గతంగా ఉన్న అసమానతల తొలగింపునకు జరిగే ప్రయత్నంలో ఒక గొప్ప ముందడుగు. సామాజికవర్గాల వర్గీకరణ విషయంలో వెల్లడైన ఈ ధర్మాసనం అభిప్రాయం, తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో డిసెంబర్‌ 9 నాటి ప్రకటన లాంటిదే. ఇక ఇక్కడి నుంచి ముందుకు పోవడానికి ఒక దారి దొరికింది. భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానత్వం (ఆర్టికల్‌ 14), వివక్షకు తావులేని పరిస్థితులు (ఆర్టికల్‌ 15), సమాన అవకాశాలు (ఆర్టికల్‌ 16) అందించే ప్రాథమిక హక్కులు కల్పించింది. అయితే ఈ ‘స...

ఆంధ్రప్రదేశ్_రాష్ట్ర_మంత్రుల ఫోన్ నెంబర్స్ దూరవాణి_చరవాణి_నంబర్లు

1. వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి              ముఖ్యమంత్రి     మొదటి అంతస్తు, మొదటి భవనం      చరవాణి - 98499-04123      దూరవాణి- 0863- 2441521 ----------------------------------------------------------- 2.  పిల్లి సుభాష్ చంద్రబోస్      ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ)      గది నంబర్ - 215      మొదటి అంతస్తు, రెండవ భవనం      చరవాణి - 94405- 22229      దూరవాణి- 0863-  2442600 ------------------------------------------------------------ 3. కె.నారాయణ స్వామి     ఉప ముఖ్యమంత్రి   (అబ్కారీ,వాణిజ్యపన్నులు)   గది నంబర్ -127  క్రింద అంతస్తు   నాలుగవ భవనం   చరవాణి - 98490- 34091   దూరవాణి-0863-2444993 ------------------------------------------------------------ 4. ఆళ్ళ కాళీ కృష్ణ శ్రీనివాస్      ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యం)     గది నంబర్ -191 క్రింద అంతస్తు     అయిదవ భవనం ...

🇮🇳జాతీయ జెండా నియమాలు

Image
🚩2002 లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ లోని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నవి. 🚩జెండా ఎగురవేయడంలో నియమాలు తెలిసో తెలియకో కొన్ని లోటుపాట్లు జరుగుతున్నవి.కాగా రాజ్యాంగా స్పూర్తికి విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేయటం కూడా జరుగుచున్నది. 🚩Flag code of India సెక్షన్ V రూల్ ప్రకారం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే సంధర్భంగా జెండాలో పూలుఫెట్టి ఎగుర వేయవచ్చు ఝండా ఎవరు ఎగుర వేయాలనేది ఒక సమస్య.  1.👉విధాన నిర్ణాయక సంస్థలు,(బాధ్యులు ప్రధాని,ముఖ్యమంత్రి, ZP చైర్మెన్,గ్రామ సర్పంచు మొదలగు వారు).  2.👉కార్యనినిర్వహణ సంస్థలు.(రాష్ట్రపతి, గవర్నర్ కలెక్టర్ MDO, MEO.MRO  హెడ్ మాష్టర్  ప్రిన్సిపాల్) అనేవి ఈ విధంగా  రెండు రకాలు. మనం  కార్యనిర్వహణ సంస్థల క్రిందకు వస్తాము. కార్యనిర్వహుకులం.  👉💥పాఠశాలలు, కాలేజీలు కార్యనిర్వహణ సంస్థలు. కావున పాఠశాల్లో 15 ఆగష్టు,  26 జనవరిలనందు ప్రధానోపాధ్యాయులే  💥జాతీయ జెండాను ఎగుర వేయాలి.   🇮🇳🇮🇳సాధారణ నియమాలు 1.👉జాతీయ జెండా చేనేత ఖాది,కాటన్ గుడ్డతో తయారైనది ఉండాలి. 2.జెండా పొడవు 3:2 నిష్పత్తిలో ఉండాలి. ...

ప్రీమియం ధరల తగ్గింపు యుద్ధం

                   ఆమధ్య కొన్ని ప్రైవేటు బీమా కంపెనీలు Term Insurance పాలసీలలో ప్రీమియంను బాగా తగ్గించాయి. ప్రభుత్వరంగ LIC, Term Insurance పాలసీలలో ఎక్కువ ప్రీమియం charge చేస్తోందని, తాము కారు చౌకగా ప్రీమియం తీసుకుంటున్నామని పెద్దఎత్తున corporate అనుకూల మీడియాలో ప్రచారం సాగించాయి.ఒకసారి, బీమా రంగం తలుపులు తెరిచాక, ప్రీమియం ధరలను తగ్గించి ప్రైవేటు కంపెనీలు Price war లకు (కుయుక్తులకు) పాల్పడతాయని, దీనిని undercutting of premium rates గా ప్రచారం చేసుకుంటారని  కామ్రేడ్ సరోజ్ చౌదరి ఆనాడే 1995 లొనే ఇన్సూరెన్స్ వర్కర్లో రాసారు. అది ఇప్పుడు నిజం అయ్యింది.        LIC మాత్రం mortality tables(మరణాల నిష్పత్తి), experience రేటింగ్ (గత అనుభవాల గణాంకాలను బట్టి), ప్రీమియం రేట్లను నిర్ణయిస్తుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీల లాగా అడ్డగోలు పద్ధతుల్లో కావాలని ప్రీమియం రేట్లు తగ్గించదు. అందువల్ల ప్రైవేట్ వారితో పోలిస్తే, తాత్కాలికంగా LICలో Term పాలసీలలో ఎక్కువ ప్రీమియం తీసుకుంటున్నట్లు కనపడుతుంది          అయితే, ...

GENERAL KNOWLEDGE

1. పైకా స్మారక విద్రోహ్‌ చిహ్నానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎక్కడ పునాది రాయి వేశారు?  1) హసన్, కర్ణాటక  2) గాంధీ నగర్, గుజరాత్‌  3) ఖుర్దా, ఒడిశా  4) న్యూఢిల్లీ, ఢిల్లీ View Answer సమాధానం: 3 2. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో యునెస్కో–ఎంజీఐఈపీ సంయుక్తంగా నిర్వహించిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ (టెక్‌)– 2019 ఎక్కడ జరిగింది?  1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌  2) చెన్నై, తమిళనాడు  3) కొచ్చి, కేరళ  4) పనాజీ, గోవా  View Answer సమాధానం: 1 3. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తొలి వర్చువల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?  1) ఏయూ, విశాఖపట్నం  2) ఏఎన్‌యూ, గుంటూరు  3) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం  4) జేఎన్‌టీయూ, కాకినాడ View Answer సమాధానం: 1 4. ‘నమస్తే ఓర్చా’ పండుగ–2020ను  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?  1) కే రళ  2) అసోం  3) పశ్చిమ బంగా  4) మధ్యప్రదేశ్‌ View Answer సమాధానం: 4 5. కొత్...