పంచాయతీ ఎన్నికలు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేయడానికి గ్రామాల్లో చాలా మంది ఉత్సాహం చూపిస్తున్నారు. పోటీ చేయాలనుకుంటున్న వారికి ఏయే అర్హతలు ఉండాలి? ఎవరు అనర్హులవుతారు? తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఓ కరదీపిక ప్రచురించింది. అందులోని ప్రధానాంశాలు.. అర్హతలు 🔹 అభ్యర్థులు ఏ పంచాయతీ పరిధిలో పోటీ చేయదలిచారో.. అక్కడి ఓటర్ల జాబితాలో వారి పేరు నమోదై ఉండాలి. 🔹 పోటీ చేయదలిచిన అభ్యర్థుల వయసు నామినేషన్ల పరిశీలన తేదీ నాటికి 21 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. 🔹 ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వారికి రిజర్వు చేసిన స్థానాల్లోనే కాకుండా అన్‌రిజర్వుడు స్థానాల నుంచి పోటీ చేయొచ్చు. 🔹మహిళా అభ్యర్థులు అదే కేటగిరిలో జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు. వీరు అనర్హులు. 🔹గ్రామసేవకుడు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, చట్టాల ద్వారా ఏర్పడిన ఏదైనా సంస్థకు చెందిన పాలక మండలి సభ్యులు అనర్హులు. 🔹నీతిబాహ్యమైన నేరానికి పాల్పడ్డారని రుజువై, శిక్ష పడినవారు.. ఆ శిక్షా కాలం ముగిసిన తేదీ నుంచి ఐదేళ్లపాటు పోటీకి అనర్హులు. 🔹పౌర హక్కుల ప...