Posts

Showing posts from September, 2023

ప్రజాస్వామ్యం - మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ?

ఇస్లామిక్ షరియా మానవ హక్కులను కాలరాస్తుంది.  —————————————————————————— ప్రజాస్వామ్యం - మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ? ఇస్లాం ఏనాడూ ప్రజాస్వామిక ధోరణులను ఆమోదించలేదు. (హర్ గ్రోంజె, సెలెక్టెడ్ వర్క్స్, పుటః 277) ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానం మా ప్రాంత ప్రజలకు పనికిరాదు. అలాగే స్వేచ్ఛాపూరిత ఎన్నికలు కూడా మా దేశానికి సరిపడవు. (సౌదీ అరేబియా రాజు ఫాద్ (Fahd) ఫోరిన్ ఎఫైర్స్, 1993) ఇస్లాంకు ప్రజాస్వామ్యానికీ పడదని కింగ్ ఫాద్ చిత్తశుద్ధితో చెప్పాడు. కాని పాశ్చాత్య ఇస్లాం సానుభూతిపరులు, ముస్లింలలో ఆధునీకరణ కావాలనేవారు ఇస్లాంలో, ఇస్లాం చరిత్రలో, ప్రజాస్వామ్య సూత్రాలను వెతుకుతున్నారు. మానవ హక్కులు, ఇస్లాం ​1948లో ప్రపంచ మానవహక్కులు ప్రకటన జరిగింది. ఇస్లాం చట్టాన్నీ, సిద్ధాంతాన్నీ దానితోపోల్చి చూడండి. ​(ఎ.ఐ. మెల్డెన్, హ్యూమన్ రైట్స్, బెల్ మౌంట్, 1970 అనుబంధం) ​ఆర్టికల్ 1. మానవులంతా పుట్టుకతో సమానం. హక్కులలో, గౌరవంలో సమానం. వారికి వివేచన, మనస్సాక్షి ఉన్నాయి. సౌభ్రాతృత్వ భావనతో ప్రవర్తించాలి. ​ఆర్టికల్ 2. అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ అనుభవించటానికి అందరూ అర్హులు. ఇందులో జాతి, రంగు, లింగ, భాష...