పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?
*పార్టీ పాత్ర: మార్గదర్శకత్వమా, బదులుగా తనే పనిచేయడమా?* పార్టీ ఏదో మంచితనం కోసం ప్రజా సంఘాల్లో పనిచేయడం లేదు. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వైపు వర్గాలనూ, ప్రజలనూ సమీకరించేందుకు తను చేస్తున్న కృషిలో ప్రజా సంఘాలు ఒక ముఖ్యమైన లింకు అని పార్టీ భావిస్తోంది. అందువల్ల మనం ప్రజా సంఘాల స్వతంత్ర పనివిధానం అంటున్నామంటే దానర్ధం, పార్టీ ఏ విధంగానైనా ప్రజా సంఘాల జీవితంలో జోక్యం చేసుకోవచ్చని కాదు. దానర్థం ఏమంటే పార్టీ మార్గదర్శక పాత్ర వహిస్తుంది మినహా, ప్రజా సంఘం స్థానాన్ని ఆక్రమిస్తుందని కాదు. ఒక ప్రజా సంఘంలో పార్టీ పనిచేసే విధానం ఎలా ఉండాలంటే, ఆ ప్రజా సంఘపు సాధారణ లక్షణానికి భంగం కలిగించకుండా దాని వెనుకనున్న మెజారిటీ ప్రజానీకంపై క్రమంగా తన ప్రభావంతో పట్టు సాధించగలగాలి. పార్టీ మార్గదర్శక పాత్రను ఆదేశాలతోనో, అధిపత్యంతోనో, లేక దాని కమిటీలను పార్టీ సభ్యులతో నింపేయడంతోనో జరగకూడదు. అలా కాకుండా వాటిలో పనిచేస్తున్న పార్టీ సభ్యులను, మనతో విభేధించే పార్టీయేతరులను కూడా ఒప్పించి వారిని మన అవగాహనలోకి తీసుకురావాలి. పార్టీ మార్గదర్శక పాత్ర అంటే, అది వెనుకబడిన సెక్షన్ ప్రజలు ని...