Posts

Showing posts from July, 2021

భూముల గురించి కొంత

గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుsకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. *అసైన్డ్‌భూమి : భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు, ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి. దీనిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, బదలాయించడం కుదరదు. *ఆయకట్టు : ఒక నీటి వనరు కింద సాగయ్యే భూమి మొత్తం విస్తీర్ణాన్ని ఆయకట్టు అంటారు. *బంజరు భూమి (బంచరామి) : గ్రామం, మండల పరిధిలో ఖాళీగా ఉండి ప్రజావసరాల కోసం ప్రభుత్వం నిర్దేశించిన భూమి. దీనిని రెవెన్యూ రికార్డుల్లో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు. *అగ్రహారం : పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా ఇచ్చిన గ్రామం లేదా అందులోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. *దేవళ్‌ ఇనాం : దేవాలయ ఇనాం భూమి. దేవాలయాల నిర్వహణ కోసం పూజారుల పేరునగానీ, దేవాలయం పేరున కేటాయించిన భూమి. *అడంగల్‌ (పహాణీ) : గ్రామంలోని సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిస్టర్‌ను అడంగల్‌ (పహాణీ) అంటారు. ఆంధ్ర ప్రాం తం...
ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు..!!* పోలీస్ స్టేషన్.. పోలీసులు అంటేనే.. ఒక రకమైన భయం.. చదువుకున్న వారు సైతం పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తులు ఇవ్వడానికి తటపటాయిస్తారు. నలుగురు పెద్ద మనుషుల సాయం లేనిదే పోలీస్ స్టేషన్ మెట్లెక్కడానికి వెనుక ముందు అవుతారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన మూలంగా తాము గాని, తమ చుట్టూరా ఉన్నవారు గాని ఎవరైనా నష్టానికి, హానికి గురైనపుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడం కనీస బాధ్యత..!! అయితే అత్యవసరమైన ఈ విషయంపై చదువురాని వారికే కాదు.. విద్యావంతులకు సైతం సరైన అవగాహన ఉండదు. పోలీసులు, పోలీస్ స్టేషన్ అంటేనే మనసులో అంతర్లీనంగా ఉన్న భయం వల్ల కూడా చాలామంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సందేహిస్తుంటారు. ఎఫ్‌ఐఆర్ గురించి విపులంగా తెలిసి ఉంటే అవసరమైన సందర్భాల్లో అనవసరమైన భయాలు, అనుమానాలు లేకుండా మనకున్న రక్షణ హక్కులను వినియోగించుకోవచ్చు. ఎఫ్‌ఐఆర్‌పై ప్రత్యేక కథనం.                    *ఎఫ్‌ఐఆర్ అంటే..?* ప్రాథమిక సమాచార పత్రం (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్టు-ఎఫ్‌ఐఆర్) కాగ్నిజబుల్ అఫెన్స్ (ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా అదుపులోకి ...
స. హ. చట్టం ప్రకారం సమాచారం అడిగితే  ఇవ్వము అనడం కూడా నేరమే. _సమాచార హక్కు చట్టం [2005] అమలులోకి వచ్చిన తరువాత కూడా ప్రజలకు, సంభందిత ప్రభుత్వ అధికారులకు కనీస అవగాహన లేకపోవడంతో, పౌరులకు కావలసిన సమాచారం అందించకపోవడం, లేదా  సమాచారం ఇవ్వడంలో ఆలస్యం జరుగుతుంది._  _సమాచారం అడిగితే మావద్ధ లేదు. మేముఇవ్వము. మావద్ద అందుబాటులో లేదు. అంటున్న అధికారుల గురించి, మీరు తెలుసుకోవాలిసిన అంశాలు._   _సమాచారం ఇవ్వకపోతే  ఆ ప్రజా సమాచార అధికారి గారు_ *_IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నేరపరిధిలోకి వస్తారు_*  _అందువలన స.హ చట్టం కింద దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించినందుకు చట్టాన్ని దుర్వినియోగం పరచినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కమీషనర్లు కూడా  సమాచారం ఇవ్వని అధికారిని జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది._ _ఒకవేళ మీకు పూర్తిగా అవగాహన లేకపోతే ఈ క్రింది వివరాలు చూడండి._ *_“సమాచార హక్కు చట్టం" ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల నుండి తమకు కావలసిన సమాచారం ద...
*సమాచారం అడిగితే  ఇవ్వము  అనడం నేరమే* సమచారం అడిగితే లేదు ,ఇవ్వము ,అందుబాటులోలేదు  అంటున్న అధికారులకు,మీరు తెలుసుకోవాలిసిన అంశాలు  సమాచారం ఇవ్వకపోతే  ఆ ప్రజా సమాచార అధికారి గారు *IPC సెక్షన్స్ 166,167, 217, 218, 219, 220, 420, 406, 407, మరియు 408 నెరపరిదిలోకి వస్తారు* అందువలన స.హ చట్టం కింద దరఖాస్తు దారులు  కోరిన సమాచారాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి. లేని పక్షములో సమాచార నిబంధనలు ఉల్లంఘించి నందుకు చట్టాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను పై సెక్షన్ల ప్రకారం కేంద్ర, రాష్ట్ర కమీసనర్లు కూడా  సమాచారం ఇవ్వని వారిని  జైలుకు పంపవచ్చు అని చట్టంలో పేర్కొనబడింది. ఒకవేళ పూర్తి అవగాహనా లేకపోతె క్రింది వివరాలు చూడండి. “సమాచార హక్కు ప్రతి దరకాస్తుదారుడు వినియోగదారే” 30రోజుల్లో సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల ఫోరమ్ కు వెళ్ళవచ్చు. సమాచారాన్ని కోరటనికి దరఖాస్తు ఫారం లేదు, కావలసిన సమాచారం  తెల్లకాగితం పై రాసి IPO (ప్రజా సమాచార అధికారికి) అడగవచ్చు. అధికారికి డైరెక్టు గా గాని రిజిస్టర్ పోస్టు ద్వారా అయిన పంపి అడగవచ్చు. “దరఖాస్తు దారునికి వయసు స్థానికత అవసరం లేదు”. స...
*దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు. ఆ దేశానికి పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు.* *నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా ( Nelson Rolihlahla Mandela,)*  *18 జూలై, 1918*       *జయంతి*  సేకరణ:          *పి.సనావుల్లా* *మండేలా కుటుంబం "తెంబు" వంశానికి చెందినది. వీరు దక్షిణ ఆఫ్రికాలో "కేప్ ప్రాంతం"లో "ట్రాన్సకెయన్" బాగాలకు సాంప్రదాయికంగా పాలకులు. ఇతడు ఉమాటా జిల్లాలో మవెజో అనే రిలో 18 జూలై 1918న జన్మించారు. ఇతని తాతలకాలంలో వారు పాలించే తెంబూ తెగల ప్రాంతం బ్రిటిష్ వలస పాలకుల పరమయ్యింది. మండేలా తండ్రి "గాడ్లా" హక్కుల ప్రకారం పాలకుడు కాకపోయినా కొన్ని స్థానిక తెగలకు నాయకుడిగా గుర్తింపు కలిగి ఉండేవాడు. స్థానిక కౌన్సిల్‌లో సభ్యుడు. గాడ్లాకు  పదముగ్గురు పిల్లలు.* *వారిలో గాడ్లా  భార్య "నోసెకెని ఫాన్నీ"కి జన్మించిన మగబిడ్డకు "రోలిహ్లాహ్లా" (అంటే కొమ్మలు లాగేవాడు -"దుడుకు స్వభావం కలవాడు" ) అని పేరు పెట్టారు. మండేలా బాల్యం తల్లి కుటుంబానికి చెందిన గూడెం ("ఉమ్జీ")లో అధికంగా గడచింది.* *చదువు* *ఏడవయేట రోలిహ్లాహ్లా ...
సామాన్యుని ఆయుధం సమాచార హక్కు చట్టం 2005 1. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాన్నైనా అడుగవచ్చు. 2. ఉదాహరణకు మోడీ డ్రస్సులకు ఎంత ఖర్చు పెట్టాడో, సర్పంచ్ కి MPP కి, ZP కి, MLA కి, MP కి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ఎలా ఖర్చు చేశారో, మన మండలంలో ఎంత మందికి పట్టాలు ఇచ్చారో, మండలంలో ఇంకుడు గుంతల బిల్లులు ఎంత వచ్చిందో అది ఎవరెవరికి వచ్చిందో, ఎంత మందికి పక్కా ఇల్లు మంజూరు అయ్యాయో, పంచాయతీ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయి వరకు ఏదైనా, విషయాన్నైనా, ఏ విధంగానైనా, ఎన్నిరకాలుగానైనా, ఏ ఏ అధికారినుండైనా, ఏ కార్యాలయంనుండైనా తెలుసుకోవచ్చు.  3. ప్రజా సమాచార అధికారి దరకాస్తుదారుడు అడిగిన సమాచారం 30 రోజుల్లోగా సమాచారాన్ని అందించాలి. సమాచారం అడిగిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా ప్రజా సమాచార అధికారి యొక్క బాధ్యత.  4. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఓ వ్యక్తి ప్రాణానికి లేక స్వేచ్ఛకు సంబంధించినది అయితే 48 గంటల్లోపు ఆ సమాచారం అందించాలి  5. 30 రోజులలోపు సమాచారం అందించకపోతే అధికారికి రోజుకు 250 చొప్పున గరిష్టంగా 25000 వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది...

సంస్కరణలు ప్రజల కోసం... కార్పొరేట్ల కోసం కాదు

*సంస్కరణలు ప్రజల కోసం... కార్పొరేట్ల కోసం కాదు* *✍️సీతారాం ఏచూరీ* ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 'మీరు సంస్కరణలకు అనుకూలమా, లేదా ప్రతికూలమా?' అని నిరంతరం అడుగుతుంటారు. ఏ సంస్కరణ కూడా సంపూర్ణం కాదు. ప్రతీ సంస్కరణకూ కొంత విషయం వుంటుంది, ఒక ప్రయోజనం వుంటుంది. వామపక్షాలు ఏ నిర్దిష్ట సంస్కరణకైనా మద్దతివ్వాలా లేక వ్యతిరేకించాలా అనేది ఇవి నిర్ణయిస్తాయి.  ఈ సంస్కరణలనేవి మన ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయా, వారి జీవనోపాధులు, దేశ ఆర్థిక సార్వభౌమాధికారం బలోపేతం అవుతుందా అన్నదే ఇక్కడ కీలకమైన అంశంగా వుంటుంది. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన ఇన్ని దశాబ్దాల కాలంలో మా వైఖరి ఇలానే వుంటూ వచ్చింది. ఇకపై కూడా ఇలాగే కొనసాగుతుంది. మూడు దశాబ్దాలుగా భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ కల్పించాలంటూ మన రైతాంగం కనివినీ ఎరుగని రీతిలో పోరాటం కొనసాగిస్తూనే వుంది. శతాబ్దం క్రితం బలవంతంగా నీలిమందు మొక్కలను పెంచడానికి నిరసనగా జరిగిన చంపారన్‌ సత్యాగ్రహం స్మృతులు గుర్తుకు వస్తున్నాయి. కార్పొరేట్‌ వ్యవసాయం, చిన్న...

మగధ మహాజనపదం

 మగధ   గంగానదికి రెండువైపులా విస్తరించి ఉండేది.  నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగుచేసుకొనేవారు. నదులమీద సరుకు రవాణా చేసేవారు, సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుంచి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవులనుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలను, రథాలను నిర్మించటానికి ఉపయోగించేవారు. మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు మొదలైనవి తయారుచేసేవారు. వీటన్నింటి కారణంగా మగధరాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. మొదటి రాజులైన బింబిసారుడు, అజాతశత్రుపు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజ్యాలను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొంత మంది రాజులు గోండు పెద్దల మాదిరిగా సాధారణ ప్రజలమీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమంకోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండగలు నిర్వహించేవా...

2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు

Image
నేటి నుండి 2700 సంవత్సరాల క్రితం గంగానది లోయలో అభివృద్ధి చెందిన జనపదాలు, మహా జనపదాలు  ఉత్తర భారతదేశ విశాల మైదానాన్ని గంగా, సింధూ మైదానం అని పిలుస్తారు. హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మధ్య గంగా యమునలు ప్రవహిస్తాయి. గంగాలోయ మైదానం అధిక వర్షపాతం, హిమాలయాలనుంచి ప్రవహించే అతిపెద్ద నదులు తెచ్చే ఒండ్రుతో సారవంతంగా ఉంటుంది. ఆ నదులలో నీళ్లు సంవత్సరం పొడవునా ప్రవహిస్తాయి. 1500 నుండి క్రీ.పూ 500 మధ్య జనపదాలు వృద్ధి చెందాయని సాహిత్య ఆధారాలు సూచిస్తున్నాయి. "జనపద" అనే పదం మొట్టమొదటి ప్రస్తావన ఐతరేయ (8.14.4), శతపథ (13.4.2.17) బ్రాహ్మణ గ్రంథాలలో కనిపిస్తుంది. వేద సంహితాలలో జన అనే పదం ఒక తెగను సూచిస్తుంది. దీని సభ్యులు పూర్వీకుల వారసులు అని విశ్వసించారు.ఒక రాజు ప్రజలకు నాయకత్వం వహించాడు. సమితి అనేది జన సభ్యుల ఉమ్మడి సభ రాజును ఎన్నుకునే అధికారం, బహిష్కరించే అధికారం కలిగి ఉంది. సభ రాజుకు సలహా ఇచ్చే తెలివైన పెద్దల చిన్న సమావేశంగా ఉంటుంది.  మొదట్లో వివిధ తెగలు ఈ మైదానంలోని అనుకూల ప్రాంతాలలో వ్యవసాయంచేస్తూ స్థిరపడ్డాయి. వీరిని సంస్కృతంలో 'జన’ అనీ, వారు స్థిరపడిన ప్రాంతాన్ని '...

గోండు తెగ

గోండు పంచ్ (పంచాయితి), పట్ల పాట్లల్ (గ్రామపెద్ద గ్రామపెద్ద తన అధికారాన్ని పంచ్ (పంచాయతీ) లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాలమీద గాని, గ్రామ పెద్దను నిర్ణయించడంలోగాని గ్రామసభ (మండలి) నిర్ణయమే కీలకం. ఈ గ్రామపంచాయితి పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. పంచాయితి క్రమ బద్ధంగా సమావేశాలు జరగవు. కాని ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. ఏవైనా, ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు, అందరు మగవారూ హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు గాని వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. ప్రధాన పండగల తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ, విధి విధానాలను నిర్ణయించడానికి సంబంధించిన అంశాలను పంచాయితి నిర్వహిస్తుంది. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచ్లు (పంచాయితీలు) సంయుక్త సమావేశం. నిర్వహిస్తాయి. రెండువర్గాలు తమ తమ...

గిరిజన తెగల లక్షణాలు

ప్రజలందరూ సమానంగా ఉన్న గిరిజన సమాజాలు వివిధ రకాల సమాజాలను తెగలుగా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో చెంచులు, కొండరెడ్లు, గోండ్లు, కోయలు, యానాదులు, సవరలు మొదలయిన గిరిజన సమాజాలున్నాయి. మన దేశంలోని చాలా రాష్ట్రాలలో ఉండే తెగలు ప్రధానంగా అడవులలో జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ విభిన్న జీవన విధానాలు, భాషలు, సంస్కృతులు ఉన్నాయి. వాళ్ళ మధ్య కొన్ని తేడాలున్నప్పటికీ వాళ్ళందరిని గిరిజనులు అని ఎందుకంటున్నారు? వాళ్ళ మధ్య కొన్ని ఒకేరకమైన లక్షణాలు ఉండడం దానికి కారణం. అ ఏమంటే 1. ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూలపురుషునినుండి వచ్చిన వాళ్ళమని భావిస్తారు. అందువల్ల తెగలోని సభ్యులందరు ఒకరినొకరు బంధువుగా తలుస్తారు. 2. సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పశు సంపద వంటివాటిని ఆ తెగకు ఉమ్మడి ఆస్తిగా భావిస్తారు. అంతేగాని ఒక వ్యక్తికో, కుటుంబానికో చెందినవిగా తలచరు. ఈ వనరులన్నింటినీ తెగ నిర్ణయాలకనుగుణంగా వాడుకోవచ్చు. 3.ధనిక, పేద తారతమ్యాలు వీళ్ళలో కనపడవు. ప్రతి ఒక్కరికి తెగ సమిష్టి ఆదాయంలో వాటా ఉంటుంది. ఉదాహరణకు తెగ భూమి మొత్తాన్ని అన్ని కుటుంబాలకు కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి పంచుతారు. కొన్ని సందర్భాల్లో, కొన్ని సం...

హైమన్ డార్ఫ్

Image
ఆంత్రోపాలజిస్టులు (మానవ విజ్ఞాన శాస్త్రవేత్తలు) గిరిజన ప్రజలను గురించి అధ్యయనం చేశారు. వారు గిరిజనులతో పాటు నివసిస్తూ వాళ్ళ సంస్కృతి, జీవన విధానం, విశ్వాసాలు, నిర్ణయాలు మొదలైన వాటిని నమోదు చేస్తారు. అటువంటివారిలో ప్రముఖమైన పరిశోధకుడు ఫ్యూరర్ హైమన్ డార్ఫ్. ఇతను 1940లో ఆంధ్రప్రదేశ్కు వచ్చి చెంచులు, కొండరెడ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసి వాళ్ళను గురించి పుస్తకాలు రాశాడు. ఇంకా అతడు భారతదేశంలోని వివిధ గిరిజన తెగలను, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజనులను గురించి అధ్యయనం చేశాడు. 1909 జూన్ 22న ఐరోపా ఖండంలోని ఇంగ్లండ్ రాజధాని లండన్ లో  జన్మించిన డార్ఫ్..ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి గిరిజనులకు ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. మట్టి మనుషులకు బాహ్యప్రపంచాన్ని..సంక్షేమాన్ని పరిచయం చేశాడు. గిరిజన అధ్యయనవేత్తగా ఎన్నో ప్రాంతాలు తిరిగారు.. ఎన్నో జాతుల్ని కలిశారు.  1940వ దశకంలో ఆస్ట్రియా దేశపు ఆంత్రోపాలజిస్టు ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలపై అధ్యయనం చేసి వారి స్థితిగతులను ప్రపంచానికి తెలియజేశారు. మార్లవాయిలో నివసించిన ఆయన చివరి నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీ ...