మానవ ధర్మం







బౌద్ధాన్ని నాశనం చేసిన వైదికవాదులను ఈ 
ముందు అమ్మను, నాన్నను ప్రేమించడం, గౌరవించడం నేర్పిస్తే, ఆవును ప్రేమించడం తేలికవుతుంది.

మన వేదాలు చాలా గొప్పవి అన్న విదేశీయుల వద్దకు మన వేదపండితులను పంపిద్దాం. అప్పుడు వీరి గొప్పతనం, వేదాల గొప్పతనం విదేశీయులు  స్వయంగా తెలుసుకుని,జంబూ ద్వీప వాసులు వీరిని ఎందుకు వదిలించుకున్నారో అర్ధం చేసుకుంటారు.

వేదం, జ్ఞానం, యోగం, ధ్యానం, జ్ఞానం, ఆరోగ్యం, ఆయుర్వేదం, ఆవు, బౌద్ధం యివన్నీ ఎవరినైనా అనుభవించనిచ్చారా? 

విశ్వామిత్రుడంటి వాడు వచ్చి, ఆవునిమ్మని అడిగితే, వశిష్ఠుడుయివ్వలేదు.
ఆవు వైదిక వాదులు స్వంతం చేసుకున్నారు. 
ఇక మిగతా వర్గాలు వీరి శాపనార్థాలు తట్టుకోలేక బఱ్ఱెలను, గొఱ్ఱెలను మేకలను, కోళ్ళను పెంచుకుని వారి జీవనాన్ని సాగించారు. వాటితో ఎనలేని బాంధవ్యాన్ని కొనసాగిస్తున్నారు.  వాటి ఉత్పత్తులను తినడానికి అలవాటు పడిన మేము గోమూత్ర, గోమలములు  స్వీకరించి, మీ అంతగా   పవిత్రులం కాలేము. వాటికర్హత గలవారు వేదపండితులే! గోమూత్ర సేవనంతో వేదమంత్రోచ్ఛరణ స్పష్టంగా పలుకగలరు. .
గోమల సేవనంతో మీరు దీర్ఘాయుష్మంతులు కాగలరు. 
మేము బఱ్ఱెలు మేకలకు, కోళ్ళకు అలవాటు పడ్డాం. మమ్మల్ని అలాగే వుండనివ్వండి.

యోగ, ధ్యానం, వేదం  ఆయుర్వేదం, బౌద్ధం స్వీకరించిన ఏ శూద్రమానపుడ్ని మీరు బ్రతకనిచ్చారు. మీరు చెప్పినవన్నీ శూద్ర శంబుకుడు  ఆచరిస్తున్నాడనే కదా! 
కళ్ళు మూసుకుని ధ్యానంలోవున్న అతగాడిని మీ అవతార పురుషుడు రామునితో శిరస్సు  నరికించారు.  
ఇప్పుడు రోడ్డెక్కి సత్యం లేదు, ధర్మం లేదు యోగం లేదు గాడిద గుడ్డులేదు. అని చొల్లుకారుస్తున్నారు. 

మీ పొట్టలునింపే శూద్రమానవులు మీ ధర్మం తప్పని,  అది  కొంత మంది స్వార్ధపరుల వ్యాపార ధర్మమని పూజ్యులు అంబేద్కర్ తన పరిశోధనల్తో శూద్రమానవులకు తెలీజేయడం వల్ల, ఇకముందు క్షుద్రమానవులుగా జీవించకూడదని, బుద్ధుడు, అంబేద్కర్ సూచించిన  మానవధర్మం అవలంభిస్తున్నారు.
 
మానవధర్మంలో ధర్మదేవత పాదాలమీద నడవదు. యుగం మారింది.  ఈ యుగంలో మానవధర్మమే  ఆచరించవలసిన ధర్మం.
వేదాలు,భగవద్గీతలకాలం పోయింది. 
ఇప్పుడు నడుస్తున్నది వైవశ్య మనువు కాలం కాదు. 
ఇది అంబేద్కర యుగం.  
పెరియారు మార్గం.   
బుద్ధుడు సూచించిన మానవ ధర్మం. 
మార్క్సు బోధించిన అర్ధశాస్త్రం కలయికే  మానవ ధర్మం. 
అదే అంబేద్కరు యుగపు రాజనీతి.   
అంబేద్కరు యుగంలో ధర్మదేవత పాదాల మీద నడవడానికి అంబేద్కరు ఆత్మ అంగీకరించదు. 
ధర్మదేవతను రాకెట్టు ఎక్కించి, వేద మంత్రాల కందని  వేగంతో   ఆమెను  ప్రయాణింప జేస్తాం. 
మీ సొల్లు వాగుడు గోవు గోమూత్రం, గోమలం అనకుండా మానవ సమాజం  ఒక్కటే అన్న  భావనలోకి రాకపోతే, మీ బ్రతుకులు గోదారే!   
మీరు ఏర్పాటు చేసినవి నాలుగు యుగాలే! 
గౌతమ బుద్ధుడు  మాకు ఐదవ యుగం  "మానవయుగం" అనే దాన్నిసృష్టించాడు. 
దానికి మార్గదర్శకుడుగా, మానవ యుగానికి మనువుగ అంబేద్కరును నియమించాడు.  
అంబేద్కరు బౌద్ధం స్వీకరించిన రోజే,  వైదికమతం  వైవస్వత మనువు కాలం పూర్తి అయింది.  
బ్రహ్మకాలం  ప్రకారం 8వమనువు దక్షసావర్ణిమనువు రావాలి.
విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గం సృష్టించినట్లు అట్టడుగు వర్గాల కోసం బుద్ధుడు దక్షసావర్ణి మనువు స్థానంలో  అంబేద్కర మనువును నియమించి, వైదిక ధర్మకర్తల మను సృష్టికి  ప్రత్యామ్నాయంగా అంబేద్కర మనువును సృష్టించాడు. 
ఇది  అంబేద్కర మనువుయుగం.
ఈ యుగ ధర్మం  మానవ ధర్మం.  
కులము  మనుష్య కులం. 
జాతి  మానవ జాతి.  
మనుష్యులంతా ఒక్కటే కులం. 
ఒక్కటే జాతి. 
అదే అంబేద్కర మనుధర్మం.
అట్టడుగు వర్గాల వారు, దళిత, బహుజన వర్గాల వారు తలెత్తుకుని గర్వంగ ఈ యుగంలో సంచరించండి. 
మాది అంబేద్కరుని మను యుగమని  గర్వంగా చెప్పండి. 
ఈయుగంలో అన్ని జంతువుల్ని ప్రేమిస్తున్నట్లే ఆవునూ ప్రేమిస్తాం.  
కాని  ఆవు మూత్రం,  ఆవు మలం సేవించే వారిని కఠినాతికఠినంగా శిక్షించడం జరుగుతుంది.
ఈయుగంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మన  వేదాలు.  
మార్క్సు ఆర్థిక  సూత్రాలే మన భగవద్గీత. 
అంబేద్కర మనువు యుగంలో  మన రాజ్యాంగం,  మార్క్సు  కేపిటల్ గ్రంధాలే మనకుప్రామాణికము. 
ఎప్పుడైనా చినజియ్యర్ ఎదురై ఏమిటి మీమానవధర్మం ప్రామాణికమని ప్రశ్నిస్తే,  "ఓరి బడుద్దాయీ! మనం అంబేద్కర మను యుగంలో వున్నాం. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనవేదం. 
మార్క్సు రచించిన కేపిటలే మన భగవద్గీత. 
దీనికి భిన్నంగా యీ మానవధర్మంలో ప్రవర్తిస్తే యమ లోకం యిక్కడే చూస్తారని హెచ్చరించండి.
వైదిక  ధర్మ కర్తలకు హెచ్చరిక.
వేల సంవత్సరాలుగా మీరు చెప్పిన అబద్ధాలు, పుక్కిటి పురాణాలు ఎంతో భక్తిశ్రద్ధల్తో మీ సొల్లంతా మామీద కార్చుకున్నాం.
బుద్ధుడు మనకు మానవ ధర్మం  బోధించాడు. 
మనకు అంబేద్కర మనువును నెలకొల్పాడు.
అందరం మానవ ధర్మాన్ని  పాటించాల్సిందే!  
అంబేద్కర  మనుధర్మాన్నా చరించాల్సిందే! 


 -గండికోట కమలాకరరావు.
Gandikota Kamalakar Rao

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు