అభివృద్ది అంటే ఏమిటి?
అభివృద్ది అంటే ఏమిటి??... ఆంధ్రాలో అడుగుపెట్టగానే.. రూరల్ ఏరియా లో హైవే పక్కనే నిర్మాణంలో ఉన్న అంత పెద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్వాగతం పలికింది.. కొంచెం ముందుకు రాగానే పిడుగురాళ్ళ పట్టణంలో గత పదేళ్ల నుండి చిన్న చిన్న మరమ్మతులకు కూడా నోచుకోని గుంటలు పడిన మెయిన్ రోడ్ స్ధానంలో కొత్తగా విస్తరించిన విశాలమైన కొత్త రోడ్డును చూసి ఆశ్చర్యపోయా.. కారణం గత పదేళ్ల నుండి ఈ రోడ్డులో తిరుగుతూ నరకయాతన పడుతున్న నాలాంటి వారికి ఈ కొత్త రోడ్డు చూడగానే మనసులో ఎక్కడలేని ఆనందం! దానికి తోడు గ్రామాల్లో రోడ్లన్నీ బాగా కొత్తగా కనపడుతున్నాయి.. ఇది ఒక్క పల్నాడు బాపట్ల జిల్లాల్లో మాత్రమే కాదు.. ఈరోజున రాష్ట్రమంతటా ఇదే పరిస్తితి.. ఇంకా ముందుకొస్తే గ్రామ గ్రామాన కొత్తగా కట్టిన సచివాలయాలు.. రైతు భరోసా కేంద్రాలు.. విలేజ్ క్లీనిక్ లు.. ఒక్కప్పటి తెలుగుదేశం కంచుకోట రావిపాడు గ్రామంలో ఐతే గ్రామసచివాలయం-1, 2 దగ్గర నుండి అన్నీ ఒకే కాంప్లెక్స్ లో సేవలందిస్తున్నాయి.. ఇలా ప్రతి గ్రామంలో దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా ఏర్పడిన మౌలిక వసతులు అభివృద్ది కార్యక్రమాలు.. ఇక గ్రామ గ్రామాన అన్నీ వసతులతో అందంగా తీర్చిదిద్...