అక్షర అగ్నికణం షోయబుల్లాఖాన్
"మరణం అనివార్యం, చావునుండి ఎవరు తప్పించుకోలేరు. ఆ మరణం ఒక మంచి లక్ష్యం కోసమైతే గర్వించాలి. నేను దేశం కోసం మరణిస్తున్నందుకు నాతో పాటు మీరు సంతోషించాలి'' అని మరణశయ్య మీదినుండి తల్లి, దండ్రులకు, భార్యకు హితబోధ చేయడం అనేది వీరులకే సాధ్యం. ఆ వీరుడు ఎవరంటే? అక్షరాన్ని అగ్నికణంలా మార్చి హైదరాబాద్ సంస్థానంలోని దొరల, దేశ్ ముఖ్ ల, రజాకార్ల ఆగాడాలను, నిజాం నిరంకుశ పాలనను సవాల్ చేస్తూ నిప్పుకణికల్లాంటి అక్షరాలతో నిజాం వెన్నులో వణకుపుట్టించిన ధీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్. హైదరాబాద్ విముక్తి కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన తెలంగాణ నిప్పు రవ్వ షోయబుల్లాఖాన్ ను నిజాం ప్రభుత్వం దారుణంగా హతమార్చింది. నేడు షోయబుల్లాఖాన్ 73వ వర్ధంతి. ఈ సంధర్భంగా మతమౌడ్యంపై, లౌకిక, ప్రజాస్వామిక విలువల కోసం ఆయన సాగించిన వీరోచిత పోరాటాన్ని స్మరించి స్ఫూర్తి పొందుదాం. నిరంకుశత్వం ప్రజలపై కత్తులు దూస్తే అక్షరం ఆయుధమవుతుంది. కత్తుల కోలాటంపై కలం కన్నెర్రచేస్తుంది. ఆ కలానికి సైద్ధాంతిక పటుత్వం తోడయితే పెత్తనాన్ని ధిక్కరించే స్వేఛ్చాగీత మవుతుంది. పీడనను...