పరాజితుల విముక్తి ఎప్పుడు? ఎలా?







తరాలుగా బానిసత్వంలో మగ్గిన జాతుల్లో పరివర్తన అంత సులభం కాదు. వారు వారి మెదళ్లకు పని చెప్పే పని ఏనాడో మానుకున్నారు. అందుకే తమ పూర్వీకుల్లాగే జీవించడానికి సిద్దపడ్డారు. దానికి రకరకాల తాత్విక నిర్వచనాలు కూడా ఇచ్చుకొని ఉన్నారు. "ఉన్నంతలో జీవించాలి. అధికమైన ఆశలు అంత మంచివి కావు డబ్బు మనుషులను స్వార్థపరులుగా మారుస్తుంది. మన కులవృత్తిలోనే మనం జీవించాలి"వంటి ఎన్నో అడ్డుగోడలు సమాజం నిర్మించింది. వాటిని పరాజితులు శిరసా వహిస్తూ తరతరాలుగా ఎలాంటి ఆస్తిపాస్తులు లేకుండా ఆకలి, పేదరికం, దారిద్ర్యం వంటి అవస్థలతో కలిసి జీవించడానికి సిద్ధపడ్డారు. అందుకే దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయి యేండ్లు దాటినా ఇంకా వెలివాడల్లో పొద్దుపొడవలేదు. అందుకు అనేక కారణాలు, వాటిలో తమ స్వయంకృత అపరాధం కూడా లేకపోలేదు. బాబా సాహెబ్ అంబేడ్కర్ తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా రూపాయి పుట్టుక దాని మూలం గురించి క్షుణ్ణంగా శోధించాడు. ఆ పరిశోధన నుండే ఆర్బీఐ పంటి సంస్థలు పుట్టకొచ్చాయి. ఆయన పరిశోధనను, ఆలోచనలను పరాజిత జాతులు అందిపుచ్చుకోలేక పోయాయి. దీంతో ఆలోచించాల్సింది వ్యాపారం ఏ కొందరికో కాపీరైట్ ఈ జాతుల్లో మార్పు ఏ మాత్రం సాధ్యపడలేదంటే అతిశయోక్తి కాదు.

డబ్బు సంపాదించడం మన పని కాదనే ఆలోచన నేటికి బహుజనుల్లో బలంగా ఉంది. సామాజికంగా పై స్థాయిలో ఉన్న వర్గాలు మాత్రం తాము పుట్టింది వ్యాపార, రాజకీయ రంగాలను తమ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి అని భావిస్తాయి. అందుకే వారు పెద్దగా చదువుకోక పోయినా కోటీశ్వరులుగా, ఐశ్వర్య వంతులుగా సుఖశాంతులతో జీవిస్తుంటారు. కారణం వారు బిజినెస్ ను నమ్ముకోవడం, పాలిటిక్స్లో చక్రం తిప్పడం. ఈ రెండు పనులు మన వాళ్లకు అంతుపట్టనివిగా మారాయి. దీంతో తాము నిత్య దారిద్ర్యంలో బతుకుతూ తనువు చాలిస్తున్నారు, ఆర్థికంగా సాధికారత సాధించడానికి ప్రధానంగా కావాల్సింది ఫైనాన్షియల్ లిటరసీ.తమఆదాయం ఎంత? తమ అవసరాలు ఎన్ని? తమ ఆర్థికాభివృద్ధికి తాము చేస్తున్న ప్రయత్నం సరైనదేనా ఎక్కడ లోపం జరుగుతున్నది అనేది చాలా మంది ఆలోచించరు. ఆర్థిక విషయాలను చక్కదిద్దుకునే ప్రయత్నం చేయరు. కేవలం బ్రతకడం కోసమే నానా తంటాలు పడడానికి పరాజిత జాతులు క్రమంగా అలవాటు పడ్డాయి. ముఖ్యంగా ఈ జాతుల్లో లేని అతి పెద్ద లోపం "పొదుపు" రేపటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నాలుగు పైసలు వెనకేసుకునే వెనులుబాటుగానీ, అసలు ఆలోచనగానీ వీరికి లేవు. అందువల్లనే ఈ జాతులు బాగుపడడం లేదు. ఇది ఎంత వరకు వెళ్లిందంటే ప్రభుత్వం కేటాయించే ఎస్సీఎస్టీ నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేని దశకు చేరింది. దీంతో ఆ నిధులను ప్రభుత్వమే వేరే పనులకు, శాఖలకు మళ్లించక తప్పని పరిస్థితి. కళ్లముందే కోటీశ్వరులు కోట్లకు పడగలెత్తుతుంటే పేదలు మాత్రం జ్వరమొస్తే ప్యారా సెటమోల్ ట్యాబ్లెటుకు కూడా డబ్బులు లేక అకాల మరణాల బారిన పడుతున్నారు. అందుకే ఇప్పుడు పరాజితులు కాదని, వ్యాపారం ఎవరైనా చేయొచ్చు అని గుర్తించగలగాలి. అప్పుడే అన్ని రంగాల్లోకి వీరు విస్తరించగలుగుతారు. అందుకు తమిళనాడులోని నాడార్లే మనకు ఆదర్శం. వందేండ్ల కిందట గుడిలోకి బడిలోకి రానివ్వలేదు వారిని.కానీ, ఇవాళ వారు దేశ రాజకీయాల్లో వ్యాపారాల్లో పట్టు సాధించి, రాణిస్తున్నారు. కేవలం ఇదంతా ఒక వందేండ్లలో వారు సాధించిన ప్రగతి. మనం కూడా సామూహికంగా పూనుకొని ఈ జాతులను ఆ మార్గంలో నడపడానికి స్వేరోయిజం నమ్ముతున్న మౌలిక సూత్రాలు అక్షరం, ఆరోగ్యం, ఆర్థికాంశాల్లో విముక్తి దిశగా విజేతలు అవుతారు
అడుగులు వేయాలి. అప్పుడే పరాజితులు విజేతలవుతారు.



డా|| పసునూరి రవీందర్, చీఫ్ ఎడిటర్, స్వేరోటైమ్స్



Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు