అభివృద్ది అంటే ఏమిటి?
అభివృద్ది అంటే ఏమిటి??...
ఆంధ్రాలో అడుగుపెట్టగానే.. రూరల్ ఏరియా లో హైవే పక్కనే నిర్మాణంలో ఉన్న అంత పెద్ద ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్వాగతం పలికింది.. కొంచెం ముందుకు రాగానే పిడుగురాళ్ళ పట్టణంలో గత పదేళ్ల నుండి చిన్న చిన్న మరమ్మతులకు కూడా నోచుకోని గుంటలు పడిన మెయిన్ రోడ్ స్ధానంలో కొత్తగా విస్తరించిన విశాలమైన కొత్త రోడ్డును చూసి ఆశ్చర్యపోయా.. కారణం గత పదేళ్ల నుండి ఈ రోడ్డులో తిరుగుతూ నరకయాతన పడుతున్న నాలాంటి వారికి ఈ కొత్త రోడ్డు చూడగానే మనసులో ఎక్కడలేని ఆనందం! దానికి తోడు గ్రామాల్లో రోడ్లన్నీ బాగా కొత్తగా కనపడుతున్నాయి.. ఇది ఒక్క పల్నాడు బాపట్ల జిల్లాల్లో మాత్రమే కాదు.. ఈరోజున రాష్ట్రమంతటా ఇదే పరిస్తితి..
ఇంకా ముందుకొస్తే గ్రామ గ్రామాన కొత్తగా కట్టిన సచివాలయాలు.. రైతు భరోసా కేంద్రాలు.. విలేజ్ క్లీనిక్ లు.. ఒక్కప్పటి తెలుగుదేశం కంచుకోట రావిపాడు గ్రామంలో ఐతే గ్రామసచివాలయం-1, 2 దగ్గర నుండి అన్నీ ఒకే కాంప్లెక్స్ లో సేవలందిస్తున్నాయి.. ఇలా ప్రతి గ్రామంలో దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా ఏర్పడిన మౌలిక వసతులు అభివృద్ది కార్యక్రమాలు..
ఇక గ్రామ గ్రామాన అన్నీ వసతులతో అందంగా తీర్చిదిద్దిన గవర్నమెంట్ స్కూళ్ళు.. నిర్మాణంలో ఉన్న కొత్త హౌసింగ్ కాలనీలు.. ఆంధ్రాగ్రామాల్లో ఈ రెండేళ్లలో ఎంత మార్పు??.. దానికి తోడు సమ్మర్ లో కూడా ఆంధ్రాలో కరెంట్ కోతలు లేవు..
పైగా మార్చి చివరి వారంలో రెండో పంటకు కూడా పుష్కలంగా నీరు.. ఎటుచూసినా పచ్చదనం.. గ్రామాల్లో రైతు రైతుకూలీలందరకి సరిపడా పని.. మిరప పత్తి బాగున్నాయి.. గత రెండు మూడేళ్ళ నుండి దాన్యం మిరప పత్తికి మంచి గిట్టుబాటు ధరలతో రైతుకు మిగులు ఏర్పడింది.. రైతు రైతు కూలీల కొనుగోలు శక్తి పెరిగింది.. ఆ డబ్బు మార్కెట్ లో చలామణి పెరిగింది.. వ్యాపారస్తులు ఆనందంగా ఉన్నారు.. వాస్తవానికి ఈ రెండేళ్లలో .. కరువు మండలాల ప్రకటన కరువు సాయం ఊసే జనం మర్చిపోయారు!
మరోవైపు పక్కనున్న సంపన్నరాష్ట్రం తెలంగాణలో కూడా లేని అమ్మవడి విద్యార్థి దీవెన వసతి దీవెన చేయూత ఆసరా వంటి సంక్షేమ పధకాలు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికి భోజనం మంచి మెనూ.. మరోపక్క నిర్మాణంలో ఉన్న పోర్టులు అక్కడక్కడా కొత్త ఫ్యాక్టరీల శంకుస్థాపనలు.. పెరిగిన తలసరి ఆదాయం.. పెరిగిన ప్రభుత్వ రాబడి.. ఇలా ఎటు చూసినా రాష్ట్రంలో పరిస్తితులు ఇంత సానుకూలంగా ఉంటే..
ఇంక ఇంతకంటే మంచి పరిపాలన ఏముంది??..
అభివృద్ది అంటే అంటే అదేమైనా ఎవరికి కనపడని బ్రహ్మపదార్దమా??..
లేక అదేమైనా రాకెట్ సైన్సా??..
ఈరోజు నీకు చేయడానికి సరిపడా పని దొరుకుతూ..
నీ పంటకు కావల్సిన గిట్టుబాటుధర దొరుకుతూ..
నీకు కాస్త మిగులు ఏర్పడి.. నీ గ్రామంలో మౌలిక సాధుపాయాలు రోడ్లు ఏర్పడి.. ఎన్నడు లేనివిధంగా ప్రభుత్వ పరిపాలన నీ ఇంటి ముందుకు రావడమే కాక.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల రూపంలో నీ పిల్లలకి నీఇంట్లో ఆడమనిషికి కాస్త సహయం దొరకుతుంటే..
ఇక ఇంతకంటే సమగ్ర అభివృద్ది ఏముంది??..
ఇంక ఇంతకంటే సమర్ధవంతమైన పరిపాలన ఏముంటుంది??...
(From Sridhar reddy challa fb )
Comments
Post a Comment