ప్రజాస్వామ్యం - మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ?


ఇస్లామిక్ షరియా మానవ హక్కులను కాలరాస్తుంది. 
——————————————————————————

ప్రజాస్వామ్యం - మానవ హక్కులు ఇస్లాంలో ఇముడుతాయా ?
ఇస్లాం ఏనాడూ ప్రజాస్వామిక ధోరణులను ఆమోదించలేదు. (హర్ గ్రోంజె, సెలెక్టెడ్ వర్క్స్, పుటః 277)
ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య విధానం మా ప్రాంత ప్రజలకు పనికిరాదు. అలాగే స్వేచ్ఛాపూరిత ఎన్నికలు కూడా మా దేశానికి సరిపడవు.
(సౌదీ అరేబియా రాజు ఫాద్ (Fahd) ఫోరిన్ ఎఫైర్స్, 1993)

ఇస్లాంకు ప్రజాస్వామ్యానికీ పడదని కింగ్ ఫాద్ చిత్తశుద్ధితో చెప్పాడు. కాని పాశ్చాత్య ఇస్లాం సానుభూతిపరులు, ముస్లింలలో ఆధునీకరణ కావాలనేవారు ఇస్లాంలో, ఇస్లాం చరిత్రలో, ప్రజాస్వామ్య సూత్రాలను వెతుకుతున్నారు.
మానవ హక్కులు, ఇస్లాం

​1948లో ప్రపంచ మానవహక్కులు ప్రకటన జరిగింది. ఇస్లాం చట్టాన్నీ, సిద్ధాంతాన్నీ దానితోపోల్చి చూడండి.
​(ఎ.ఐ. మెల్డెన్, హ్యూమన్ రైట్స్, బెల్ మౌంట్, 1970 అనుబంధం)

​ఆర్టికల్ 1. మానవులంతా పుట్టుకతో సమానం. హక్కులలో, గౌరవంలో సమానం. వారికి వివేచన, మనస్సాక్షి ఉన్నాయి. సౌభ్రాతృత్వ భావనతో ప్రవర్తించాలి.

​ఆర్టికల్ 2. అన్ని హక్కులూ, స్వేచ్ఛలూ అనుభవించటానికి అందరూ అర్హులు. ఇందులో జాతి, రంగు, లింగ, భాష, మత, రాజకీయ, జాతీయ విచక్షణలకు తావులేదు. ఆస్తులూ, పుట్టుక, అంతస్తులూ, సాంఘిక స్థితిని గమనించరు.

​ఆర్టికల్ 3. ప్రతివారికీ జీవించే హక్కు, స్వేచ్ఛ, వ్యక్తి భద్రత హక్కులున్నవి.

​ఆర్టికల్ 4. ఎవరినీ బానిసత్వంలో, సేవలో బంధించరాదు. బానిసత్వం, బానిస వ్యాపారం అన్ని రూపాలలో నిషిద్ధం.

​వ్యాఖ్యానాలు 
ఆర్టికల్1. ఇస్లాం చట్టంలో స్త్రీలు తక్కువ స్థాయివారు. న్యాయస్థానంలో వారి సాక్ష్యం పురుషులలో సగం మాత్రమే. వారి స్వేచ్ఛకు పరిమితులు విధించరాదు. ముస్లిమేతరులను పెండ్లాడరాదు.

​ఆర్టికల్ 2. ముస్లిం దేశాలలో నివశిస్తున్న ముస్లిమేతరులకు ఇస్లాం చట్టం ప్రకారం తక్కువ స్థాయి ఉన్నది. ముస్లింకు వ్యతిరేకంగా వారి సాక్ష్యం చెప్పరాదు. మహమ్మద్ సంప్రదాయం ప్రకారం అరేబియాలో రెండు మతాలు ఉండటానికి వీలు లేదు. సౌదీ అరేబియాలో ముస్లిమేతరులను, వారి మతాచారాలనూ, దేవాలయ నిర్మాణంలోగానీ, బైబుల్ వంటివి అట్టిపెట్టుకోవటం వంటివి అనుమతించరు.

​ఆర్టికల్ 3. దైవనమ్మకం లేనివారు - నాస్తికులు (చరిత్రలో వీరు అశ్రద్ధకు గురైన అల్ప సంఖ్యాకులు. ముస్లిం దేశాలలో వీరికి జీవించే హక్కు లేదు. వారిని చంపేయాలి. పెద్ద పాపాలు, చిన్న పాపాలనేవి రెండు రకాలు. 17 పెద్ద పాపాలలో దైవనమ్మకం లేకపోవటం ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది హత్య, దొంగతనం, వ్యభిచారానికి మించిపోయింది.

​ఆర్టికల్ 4. ఖురాన్ లో బానిసత్వాన్ని గుర్తించారు. సుర 4.3 ప్రకారం ముస్లింలు వారి స్త్రీ బానిసలతో సంభోగించవచ్చు. బానిసలైతే వారిని వివాహితులుగా స్వీకరించవచ్చు. (సుర 4.28) బానిసలు నిస్సహాయ స్థితి చూస్తుంటే సృష్టికర్త  సమక్షంలో అరేబియా తప్పుడు దేవుళ్ళ విషయం తెలుస్తున్నది. (సుర 16.77).

​ఆర్టికల్ 5. ఎవరినీ అమానుషంగా, క్రూరంగా శిక్షించరాదు. చిత్రహింస పెట్టరాదు.

​వ్యాఖ్యః పవిత్రచట్టాన్ని పాటించనివారిని చేతులు, కాళ్ళూ నరకడం, శిలువ వేయటం, రాళ్ళు కొట్టి చంపడం, కొరడా దెబ్బలు కొట్టటం వంటి శిక్షలు గమనించాం. ముస్లిం దేశంలో ఈ శిక్షలన్నీ మామూలుగా లేవని ఎవరైనా ముస్లిం వాదించవచ్చు. కానీ, వాటిలోని అమానుషత్వం మాటేమిటి ? ఈ శిక్షలు దైవికంగా వచ్చాయి. గనుక మానవుడి ప్రమాణాలతో కొలవరాదని ముస్లిం వాదించవచ్చు. కాని, మానవుల ప్రమాణాల ననుసరించి అది అమానుషమైనది.

​ఆర్టికల్ 6ః చట్టం ముందు ప్రతివారూ గుర్తింపు పొందాలి.
    ఇస్లాంలో వ్యక్తి స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవడానికి, నైతికంగా బాధ్యత వహించటానికి అవకాశం లేదు.

​ఆర్టికల్స్ 7, 8, 9, 10, 11 నిందితుడికి న్యాయమైన విచారణ జరగవలసిన హక్కు ఉన్నది.

​వ్యాఖ్య 1. షాట్ చూపినట్లు షరియాలో న్యాయం, సత్యం, ధర్మం, విశ్వాసం అనేవాటికి తక్కువ స్థానం ఉన్నది. నేరస్తుడుగా నిందితుడు అనే భావనలేదు.

​2. చంపినందుకు పగ తీర్చుకోటం అధికారికంగా అనుమతించారు. నష్టపరిహారం డబ్బు రూపేణ చెల్లించవచ్చన్నారు.

​3. ఇస్లాంలో చట్టరీతులు నిస్పాక్షికం అయినవి. సక్రమమైనవీ అనటానికి వీలులేకుండ సాక్షుల విషయంలో అన్యాయాలు పాటిస్తున్నారు. ముస్లింకు వ్యతిరేకంగా ముస్లిమేతరుడు సాక్ష్యం చెప్పరాదన్నారు. ఉదాహరణకుః ముస్లిమేతరుడి ఇంటిని ఒక ముస్లిం దోచినప్పుడూ అక్కడ ముస్లిమేతరుడు తప్ప మరెవరూ సాక్ష్యం లేకుంటే చేయగలిగిందేమీ లేదు. ముస్లిం స్త్రీల సాక్ష్యాన్ని అరుదుగా స్వీకరిస్తారు. పురుషులకంటే రెట్టింపు సంఖ్యలో సాక్ష్యం ఇవ్వాలి.

అర్టికల్ 16. స్త్రీ పురుషుల వైవాహిక హక్కులు చర్చించబడ్డాయి.

​వ్యాఖ్యః ఇస్లాం చట్టంలో స్త్రీలకు సమానహక్కులు లేవు. వారి ఇష్ట ప్రకారం పెళ్ళి చేసుకోవటానికి వీలులేదు. విడాకుల హక్కులు కూడా సమానం కాదు.

​ఆర్టికల్ 18. ప్రతివారికీ స్వేచ్ఛ, మత స్వాతంత్రం ఉండాలి. మతాన్ని నమ్మకాన్ని మార్చుకునే స్వేచ్ఛకూడా ఉన్నది. వ్యక్తిగతంగానూ, బహిరంగంగానూ ఇతరులతో కలసి ఈ మార్పులు చేసుకోవచ్చు. మతాన్నీ, నమ్మకాన్నీ బోధించటం, ఆచరించటం, పాటించటం, ప్రార్థించటం యథేచ్ఛగా చేసుకోవచ్చు.

​వ్యాఖ్యః 1, ఇస్లాం చట్టంలో ముస్లిం కుటుంబంలో పుట్టినవారు మతం మార్చుకోటానికి వీలలేదు. ఇందుక భిన్నంగా ఇతర మతస్తులను ముస్లింలలో చేర్చుకోవచ్చు. ముస్లిం మారితే అతనికి మరణమే శిక్ష. బేదవి భాష్యం చెపుతూ బహిరంగంగా కానీ, రహస్యంగాగానీ ఎవరు మతం మార్చుకున్నా వారిని చంపేయవచ్చు. వారికి దూరంగా ఉండాలి. (1291)

​2. ఇస్లాం నుండి క్రైస్తవానికి మారిన లెక్కలు స్పష్టంగా లేవు. ఇని నేరంగా పరిగణించటం ఒక కారణం. ముస్లింలు మారరని ఒక భ్రమ ఉన్నది. మధ్యకాలాల నుండి, నేటి వరకూ ఇస్లాంను వదిలి. క్రైస్తవంలోకి మారిన వేలాది ఉదాహరణలున్నాయి. మారాకో, టునీషియా యువరాజులు 17వ శతాబ్దంలోనూ, ఆఫ్రికాలో కాన్ స్టాంటిన్ మతగురువు ఇందుకు సోదాహరణలు. 1614-1798 మధ్య ఒక్కరోమ్ లోనే 1087 మంది మతం మారారు. ఎ.టి.విల్లీస్ ప్రకారం 1965లో కమ్యూనిస్టులను ఊచకోత కోసినప్పుడు 30 లక్షల వరకూ ముస్లింలు మతంమారి క్రైస్తవులయ్యారు. ప్రతి సంవత్సరం ఫ్రాన్స్ లో 300 వరకూ ఇస్లాం నుండి క్రైస్తవానికి మారుతున్నారు. ఈజిప్టులో జరుగుతున్న మతమార్పిడి ముస్లిం ముల్లాలకు ఆగ్రహాన్ని కలిగించగా ఇలాంటప్పుడు మరణశిక్ష విధించాలని చట్టం చేయమంటున్నారు. (ఆన్.ఇ.మేయర్, ఇస్లాం అండ్ హ్యూమన్ రైట్స్, బౌల్డర్, 1991, పుటః 177) ఇస్లాం నుండి చాలామంది స్త్రీలు మతం మార్చుకొని తమ స్థితిగతులు మెరుగుపరుచుకుందామని చాలామంది లోగడ భావించారని మేయర్ పేర్కొన్నది.

​3. క్రైస్తవంలోకి మారిన తరువాత ఒక ముస్లిం దేశంలో ఉండటమంటే ప్రమాదకరమే. మారినా వారికి హక్కులుండవు. తగిన పత్రాలను ఇవ్వరు గనుక దేశం వదలటం కష్టం. అతని పెళ్ళి చెల్లదని ప్రకటిస్తారు. అతని పిల్లలను వేరుచేసి ముస్లింలుగా పెంచుతారు. అతడు ఆస్తిహక్కు కోల్పోతాడు. కుటుంబంలోని వారే అతన్ని చంపేస్తారు. ఐనా వారికి శిక్ష ఏమీ ఉండదు. (Gzndeul, Jean-Marie, Appelesparle Christ llsviennent Del’ Islam, Paris, 1991)

​ఆర్టికల్ 19. అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కు ఉండాలి. ఇందులో సరిహద్దుల ప్రతిబంధకాలు అడ్డు రాకూడదు. భావాలు, సమాచారం స్వీకరించడానికీ, అందించడానికీ, ప్రసార సాధనాలు వినియోగించుకోటానికీ హక్కు ఉండాలి.

​వ్యాఖ్య 1. ఇరాన్ పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ఈ హక్కులు ఉల్లంఘిస్తున్నారు. బహాయ్, అహమ్మదీయ, షియా అల్ప సంఖ్యాకుల హక్కుల్ని తృణీకరించారు. ఇందుకు కూడా షరియాను చూపి సమర్థించుకుంటున్నారు. ఈ దేశాలలో క్రైస్తవుల హక్కుల నిరాకరించి తరచు నేరారోపణలు చేసి బంధిస్తున్నారు.
​సౌదీ అరేబియాలో ఉన్నస్థితిని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇలా రాసింది.

​“వందలాది క్రైస్తవులు కేవలం తన మత నమ్మకాలను వ్యక్తం చేసినందుకు స్త్రీలు, పిల్లలతో సహా ఎలాంటి విచారణ లేకుండా నిర్భంధానికి గురయ్యారు. కొందరిని కొరడాలతో కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. బైబుల్, పూసలదండలు, శిలువ, జీసస్ క్రైస్ట్ బొమ్మలు, ఇస్లామేతర వస్తువులూ నిషేధించారు. వాటిని స్వాధీనపరుచుకునేవారు.” (జూలై-ఆగస్టు, 1993, ఎ.ఐ.ఎన్.ఓ. 62)

​షియా ముస్లింలను బాధించి, బంధించి, నిర్భంధించి కొన్ని సందర్భాలలో తలతీసేసారు. 1992 సెప్టెంబరు 3న సాధిక్ అబ్దుల్ కరీం ముల్లాలను అల్ ఖతీఫ్ లో బహిరంగంగా ఉరితీశారు. 1988లో షియా ముస్లిం సాదిక్ ను అరెస్టు చేసి పోలీసు స్టేషన్ పై రాళ్ళు విసిరాడని నేరం మోపి రహస్యంగా దేశంలోకి బైబుల్ని తెచ్చాడన్నారు. ఒంటరిగా నిర్భంధంలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు. పాకిస్తాన్ లో అహమ్మదీయుల పరిస్థితి ఆలాగే ఉంది. మీర్జాగులామ్ అహమ్మద్ (1908లో మరణం) అహమ్మదీయ ఉద్యమాన్ని స్థాపించాడు. అతడిని ప్రవక్తగా అనుచరులు భావిస్తారు. వారిస్థితిని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇలా వర్ణించింది.

​“తమను ముస్లింలుగా అహమ్మదీయులు భావించినా, సనాతన ముస్లింలు వారిని పరాయివారిగానే చూస్తున్నారు. మహమ్మద్ తుది ప్రవక్త కాదనీ తమ ఉద్యమ నిర్మాత ప్రవక్త అనీ, వీరు భావించటం నేరమయింది. అహమ్మదీయుల ప్రకారం మహమ్మద్ ను  ప్రవక్తగా తాము నిరాకరించలేదనీ, మీర్జా గులామ్ అహమ్మద్ కొత్తగా దైవాంశ ఏదీ వెల్లడించలేదనీ పేర్కొన్నారు. కాని ప్రవక్త మహమ్మద్ తిరిగి తలెత్తిన రూపంలో ఇతడు ఉన్నాడనీ, కనుక ఇస్లాంను తిరగదోడాలనీ చెప్పారు. దీని ఫలితంగా అహమ్మదీయులను విచక్షణతో చూస్తూ ఇస్లాం దేశాలల చిత్రహింసలు పెడుతున్నారు. సౌదీ అరేబియా ఒక ప్రపంచ ముస్లింలీగ్ సంస్థను ఏర్పరచి అహమ్మదీయులకు వ్యతిరేకంగా 1970 నుండి ఉపక్రమించింది. సౌదీ అరేబియాలో వీరు నిషిద్దులు.

​పాకిస్తాన్ చరిత్రలో అహమ్మదీయులను హింసించడం, తరచూ రక్తపాతం జరగటం గమనార్హం. 1977లో సైనిక కుట్ర అనంతరం జియావుల్ హక్ అధ్యక్షుడుకాగా అతడు ఇస్లామీకరణ విధానంలో అహమ్మదీయులపై తీవ్ర ఆంక్షలు విధించాడు. వీరి నుద్దేశించి 1984లో చట్టాలు తెచ్చాడు. ఆహమ్మదీయులు అప్పటినుండి ముస్లింలుగా పిలుచుకోవటానికి వీలులేదన్నారు. పాకిస్తాన్ శిక్షాస్మృతి ప్రకారం చాలామంది అహమ్మదీయులను శిక్షించారు. వారి మత స్వేచ్ఛ వెల్లడించినందుకే మరణశిక్ష కూడా విధించవచ్చన్నారు. మహమ్మద్ చివరి ప్రవక్త అనీ, ఇస్లాం వెలుపల ముక్తికి మార్గం లేదనీ ఇస్లాం సంపూర్ణ, తుదిరూపంగా దైవం ప్రదర్శించిందనీ, సనాతనులు భావిస్తున్నందువలననే ఇవన్నీ వచ్చాయి.

​2. దేవుడికీ, ప్రవక్తకూ వ్యతిరేకత చూపితే ఇస్లాం చట్టంలో మరణశిక్ష విధించవచ్చు. వ్యతిరేకతను అణచి వేయటానికి కొన్ని సందర్భాలలో వ్యక్తిగత దోషాలు తీర్చుకోవటానికి ముస్లిం ప్రభుత్వాలు ఇలాంటి శిక్షలు వేస్తున్నాయి పాకిస్తాన్ లో జరుగుతున్న రీతుల్ని ఎకానమిస్ట్ పత్రిక ఇలా రాసింది.
​లాహోరు హైకోర్టు తీర్పు పాకిస్తాన్ క్రైస్తవులను ఆందోళన పెడుతున్నది. పాకిస్తాన్ లో చట్టాలు, ఇస్లాం ప్రవక్తలందరికీ అన్వయిస్తాయన్నారు. ఇస్లాంలో జీసస్ కూడా ఒక ప్రవక్తే దేవుడి కుమారుడిగా జీసస్ ను పూజించటం క్రైస్తవుల నేరంగా పాకిస్తాన్ భావిస్తున్నది. 12 లక్షల క్రైస్తవులు పాకిస్తాన్లో ఉన్నారు. నమ్మకాల వలన వారు బాధలకు గురి అవుతున్నారు. విమానదళంలో మెకానిక్ గా ఉన్న తాహిర్ ఇక్బాల్ క్రైస్తవంలోకి మారినందుకు నిర్భంధంలో అంతు తెలియని రీతిలో చనిపోయాడు. మంజూర్ మాషీని బెయిలుపై విడుదల చేసి వీధుల్లో కాల్చిచంపారు. ఆస్తులూ, ఉద్యోగాల స్పర్థలు, రాజకీయ కక్షలు తరచు ఇలాంటివాటికి దారితీస్తున్నాని మానవ హక్కుల పర్యవేక్షకులు చెప్పారు. (1994, మే 7).

​ఆర్టికల్ 23. ప్రతివారికీ పని చేసేహక్కు, స్వేచ్ఛగా ఉద్యోగం ఎంపిక చేసుకునే హక్కు, పనిలో న్యాయమైన అనుకూల స్థితిగతులూ, నిరుద్యోగానికి వ్యతిరేకంగా సంరక్షణ, హక్కూ ఉండాలి.

​వ్యాఖ్య 1. ఇస్లాం చట్టంలో స్త్రీలకు స్వేచ్ఛగా పనిచూసుకునే హక్కు లేదు. కొన్ని ఉద్యోగాలు వారికి నిషిద్ధం. ముస్లిం దేశాలలో ఉదార పరిస్థితులున్నచోట కూడా ఈ నిషేధాలున్నాయి. ఇల్లుదాటి స్త్రీలు పనిచేయటాన్ని సనాతన ఇస్లాం నిషేధించింది.
​2. ముస్లిం దేశాలలో ముస్లిమేతరులు యథేచ్ఛగా పని చేయటానికి వీలులేదు. సౌదీ అరేబియా ఇందుకు ఉదాహరణ. ముస్లింల యాజమాన్యంలో ఉన్న ఒక కంపెనీ క్రైస్తవుల్ని కొత్త యజమానిగా నియమిస్తే ముస్లింలు అభ్యంతరపెట్టారు. ఇస్లాం చట్టంలో ముస్లింలపై ముస్లిమేతరులు పెత్తనం చేయటానికి వీలు లేదని రియాద్ లోని ఇస్లాం లా కళాశాలకు చెందిన షేక్ మన్నా            
 కె. అల్.కుబ్ తాన్ ప్రకటించాడు. అందుకు ఖురాన్ లో రెండు చరణాలు చూపాడు. నమ్మకస్తులపై విజయం సాధించే అవకాశం అల్లా నమ్మకంలేని వారికి ఇవ్వడు. (సుర. 4.141)

అధికారం, ఒత్తిడి అనేవి దేవుడికీ, ప్రవక్తకూ, నమ్మకస్తులకు మాత్రమే చెందుతాయి.              (సుర 73.😎

​ఆర్టికల్ 26, విద్యహక్కు.
​వ్యాఖ్య, స్త్రీలకు కొన్ని రంగాలలో విద్య నిరాకరించారు. మానవహక్కులూ, ఇస్లాం పొసగని ఇస్లాం తీవ్రవాదులకు తెలుసు. 1981లో తీవ్రవాదులు పారిస్ లో సమావేశం అయి ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్న వాటిని ఖండిస్తూ ఇస్లాం మానవహక్కులు అని ప్రకటించారు. 1981 నవంబరులో ముస్లిం దేశాల వత్తిడి మూలంగా ఐక్యరాజ్యసమితి మత విచక్షణ తొలగించిన అంశాన్ని తిరగదోడింది.  అలాగే దత్తత స్వీకార హక్కులను గూడా తిరగదోడింది. మతాన్ని అట్టిపెట్టుకునే హక్కు కొనసాగిస్తూ మతాన్ని మార్చుకునే హక్కుని సమితి ఉపసంహరించింది. 
(ఫ్రీ ఎన్ క్వైరీ, స్ట్రింగా 1984).

Uyyala Surendar

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు