మహిళా ఉద్యమం-సవాళ్ళు





               
పురుషులు స్త్రీలపై  చేస్తున్న పెత్తనాన్ని అధికారాన్ని సమూలంగా తుడిచి పెట్టే లక్ష్యంగా స్త్రీవాద ఉద్యమం వచ్చింది .ఇది సంపన్న మహిళల  ఉద్యమం .వీరి
డిమాండ్లు ప్రధానంగా  వివాహం చేసుకోవడంలో  , ని శ్చయించడం లో ,ఆ సంబంధాన్ని తెంచుకోవడం లో సమాన హక్కులు ఉండాలని, ,పిల్లలపై స్త్రీ పురుషులకు సమాన హక్కులు, ఉమ్మడి లైంగిక నియమావళి,  తన ఆదాయాన్ని సంపాదనను వినియోగించుకునే హక్కు ,వృత్తిపరమైన శిక్షణ సామాజిక జీవితంలోని అన్ని రంగాలలో కార్యకలాపాల్లో స్త్రీ పురుషులు ఇద్దరికీ సమాన హక్కు, ప్రభుత్వ యంత్రాంగంలో  దాని అంగాల్లో సంపూర్ణమైన రాజకీయ సమానత్వం మొదలైనవి.
ఈ ఉద్యమం ఆర్థిక స్వాతంత్య్రం కలిగిన స్త్రీలకు మాత్రమే ఉపయోగపడినా
మధ్యతరగతి ప్రజల్లో కొంత అవగాహన కలిగించింది.మెల్లగా అది అందరి మహిళల గురించి
ఆలోచించే విధంగా అందరిలోకి వెళ్లింది. అయితే అత్యధిక స్త్రీలు ఎదుర్కొంటున్న దోపిడీ, అసమానత, వేతన అసమానత్వం, కుల వివక్ష మొదలైన సమస్యలకు  ఈ ఉద్యమం పరిష్కారం వీటిని విప్లవం సాధించడం ద్వారా సాధ్యమవుతుందనే విషయాన్ని స్త్రీవాద ఉద్యమం గుర్తించలేకపోయింది .పైగా విప్లవం, స్త్రీలతో పాటు దోపిడీకి గురయ్యే పురుషుల్ని కూడా విముక్తం చేస్తుంది .కానీ స్త్రీవాద ఉద్యమం విప్లవానికి వ్యతిరేక శక్తి గా ఉండిపోయింది. ఆ రకంగా అది కొద్దిమందికే పరిమితం అయిపోయింది సామాన్య ప్రజానీకంలో ఉన్న మహిళల విముక్తికి అది దోహదపడలేదు.
         పిల్లల పట్ల మహిళల పట్ల దళితుల పట్ల ఉండాల్సిన మానవీయ ఆధునిక భావనలు మన భారతీయ సమాజంలో లో ఇంకనూరానందువలన స్త్రీ వాద ఉద్యమం ఒక ధోరణిగా నిలబడిపోయింది.
                 వీరు స్త్రీల ఇంటిచాకిరీ ని వెలకట్టాలని కోరారు. పితృస్వామ్యం తమను అణచివేస్తోందని
గుర్తించారు. 

   19వ శతాబ్దంలో కందుకూరి, గురజాడ మొదలగువారు జన్మించి స్ర్తీ విద్యను ప్రోత్సహించారు. ‘ముదితల్‌ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్‌’ అన్నారు.  "స్త్రీకి కూడా శరీరం ఉంది .దానికి వ్యాయామం ఇవ్వాలి .ఆమెకు మెదడు ఉంది దానికి జ్ఞానం  ఇవ్వాలి .ఆమెకు హృదయం ఉంది. దానికి అనుభవం ఇవ్వాలి " అంటూ చలం సంప్రదాయాల చేతిలో కీలుబొమ్మల్లా బతుకుతున్న స్ర్తీలలో చైతన్యం కలిగించేలా రచనలు చేసి
స్త్రీ వాదాన్ని 1960 లలోనే ప్రవేశపెట్టాడు ఆంధ్రదేశంలో.  

              ఆంధ్ర రాష్ట్రంలో  కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీ రామారావు ఆస్తి హక్కులు మహిళలకు సమాన వాటా అందిస్తారని అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది .ఆ తర్వా త దాన్ని చట్టం చేశారు.ఇది మహిళల హక్కుల కు సంబంధించి ఒక ముందడుగు.

     ఎక్కడో అక్కడ కనిపించే మొల్ల, వెంగమాంబ, ముద్దుపళని, రంగాజమ్మ మొదలైన నలుగురైదుగురు స్ర్తీల పేర్లు తప్ప ఆదికవి నన్నయ దగ్గరనుంచి ఆధునిక యుగం వరకు కవిత్వ ప్రపంచ సర్వస్వం పురుషాధీనమే. వేదయుగంలో మంత్ర ద్రష్టలుగా, స్రష్టలుగా గార్గి, మైత్రేయి వంటి మహిళల పేర్లు వినిపించినా మధ్య యుగంలో మాత్రం సమాజంలో గాని, సాహిత్యంలో గాని పడతుల ప్రాతినిధ్యం, ప్రభావం శూన్యం. 
తాళ్ళపాక తిమ్మక్క, ముద్దుపళని, రంగాజమ్మ, వెంగమాంబ మొదలైనవాళ్ళు కవయిత్రులుగా ప్రసిద్ధి కెక్కినా ఆ తర్వాత ఆడవాళ్ళకు మళ్ళీ అంధకార యుగమే. ఆడవాళ్ళకు చదువు ఎందుకు అన్నారు. ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని తర్కించారు. కొన్ని శతాబ్దాలపాటు వెనక్కి నెట్టేశారు. చీకట్లో వేగు చుక్కల్లా స్రీల జీవితాల్లో సంఘ సంస్కర్తలు బయలుదేరి ఆశల నక్షత్రాలు వెలిగించారు. చదువుల చందమామ ఉదయింపచేశారు.గతానికి ఇప్పటికీ పోలిస్తే మహిళల్లో
చదువుకునే వారి సంఖ్య బాగా పెరిగింది.
         వాస్తవానికి స్త్రీ ని పురుషుడు దోపిడీ చేయడం లేదు. పైగా స్త్రీ పురుషులిద్దరూ ఈ కార్పొరేట్ వ్యవస్థలో దోపిడీ చేయబడుతున్నారు. ఇద్దరూ కలిసి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. స్త్రీ సమస్యల పోరాటంలో పురుషునికి సహకారం అవసరం ఎంతో ఉంది. పురుషులతో స్త్రీలు శత్రు వైరుధ్యం పెంచుకో రాదు.


___ పిళ్లా విజయ్
                9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు