RBI


RBI  (1.4.1935)ఏర్పడి 85 సంవత్సరాలు అయిన సందర్బంగా 85వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ... 
రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో  అంబేడ్కర్ గారి పాత్ర*అనే విషయాన్ని పరిశీలిద్దాం....  

మొదట రూపాయి అనే పేరు పెట్టింది షేర్ష (1540-45) అనే ముస్లీం చక్రవర్తి....

 డాక్టర్ అంబేద్కర్ 1915 లో "Ancient Indian Commerce" అనే సిద్దాంత గ్రంధాన్ని రాశారు.


1920 లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ద్వారా D.Sc., పొందారు...

దక్షిణ ఆసియాలోనే మొట్ట మొదట అర్ధ శాస్త్రంలో Ph.D. చేసిన మేధావి బాబా సాహెబ్ Dr బి.ఆర్.అంబేడ్కర్

1923 లో "The problem of Rupee; its origin"  పుస్తకం రాసారు.
  
డాక్టర్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనల వల్లే  Reserve Bank of India 1935 లో ఏర్పడింది. అందుకు ఖచ్చితంగా కరెన్సీ మీద  అంబేద్కర్ చిత్రపటాన్ని వెయ్యడానికి అర్హత ఆయనకు వుంది. 

 "The problem of rupee - 
 origin and  solutions"* అనే గ్రంథం  అధారంగా..... ఆర్. బి.ఐ. ని స్థాపించడానికి బ్రిటీషు  ప్రభుత్వం ఏర్పాటు చేసిన హిల్పన్యగ్ కమీషన్  మందు ఆర్.బి.ఐ. విధి, విధానాలు, పనితీరు, అడ్మినిస్ర్టేషన్ అన్నీ రూపొందించి అంబేడ్కర్ ప్రవేశపెడితే కమీషన్లోని సభ్యులందరు దాన్ని  ఏకాభిప్రాయంతో ఆమెదించారు....

 ఇది *"Royal Commission on Indian currency & Finance*  గా ఆమెదించబడి బయటకు వచ్చింది. 1934 ఆర్.బి.ఐ బిల్లును శాసనసభ లో ప్రవేశపెట్టే సమయంలో కమిషన్ లోని సభ్యుల ప్రతి ఒక్కరి చేతిలో అంబేడ్కర్ రాసిన *"The problem  of rupee -Its origin and  solution"*  గ్రంథం  దర్శనిమిచ్చిందంటే దీని రూపకల్పన లో అంబేడ్కర్  పాత్ర ఎంతుందో అర్దం  చేసుకోవచ్చు.

*"The problem of rupee"* అనే అంబేడ్కర్  థీసిస్ ఆధారంగా  *బ్రిటిష్ ప్రభుత్వం 1935 Reserve bank of india* ని రిజర్వు బ్యాంకు అఫ్ యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా మోడల్ లో పెట్టాలని ఆలోచన చేసింది..

భారత దేశంలో *Reserve bank of India* స్థాపనకి కారణమైన వ్యక్తీ, ఉన్నత విద్యావంతుడు,దార్శనికుడు,మేధావి ,ఆధునిక భారత పితామహుడు..
బాబా సాహెబ్ Dr.బి.ఆర్.అంబేడ్కర్

ది ప్రాబ్లేమ్ ఆఫ్ రూపీ ఇట్స్ ఆరిజన్ అండ్ సోల్యూషన్ పై,1926లో,ఫాధర్ ఆఫ్, మోడ్రన్ ఎకనామిక్స్, J.M.keynes- 'Tha Journel of the Royal Economics society'  లో volume- XXXIV లో 5 పేజీల review వచ్చింది.

ఒక గొప్ప వ్యక్తిని విస్మరించటం మన వ్యవస్థ లోపం .

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు