సెక్షన్144అంటే ఏమిటి?





అల్ల‌ర్లు జ‌రిగితే 144 సెక్ష‌న్..
గొడ‌వ‌లు జ‌రిగితే 144 సెక్ష‌న్
ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్.. 
ఓటింగ్ కేంద్రాల వ‌ద్ద 144 సెక్ష‌న్..
అసెంబ్లీ/పార్లమెంట్ సమావేశాలు144 సెక్షన్
ప్రజా ఆరోగ్య దృష్ట్యా 144 సెక్ష‌న్..
ఇలా ఎక్క‌డ చూసిన 144 సెక్ష‌న్ అనే మాట వింటాం. 

శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో పోలీసులు ముందు ఉప‌యోగించే అస్ర్తామే 144 సెక్ష‌న్. 

అసలు 144 సెక్ష‌న్ అంటే ఏమిటి..? 
ఎప్పుడు విధిస్తారు..? 
ఎందుకు విధిస్తారు..? 
ఎలాంటి ప‌రిస్థితుల్లో అమ‌లు చేస్తారు..? 
వంటి అంశాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం

మన దేశంలో ఏ మాత్రం అల్లర్లు చెలరేగిన ప్రభుత్వం ముందు చేసే పని 144 సెక్షన్ ప్రకటించడం. సెక్షన్ 144 ఉంది అని అందరికి తెలుసు కాని అసలు అది అంటే ఏమిటీ?  ఆ సమయం లో మనం ఏమి చేయవచ్చు ?  ఏమి చేయకూడదు ?  అనేది మాత్రం తెలియ‌దు . 

భారత శిక్షాస్మృతి 144 ప్రకారము, ఏ ఒక్కరు, ప్రాణానికి హాని క‌లిగించే మారణాయుధాలు కలిగి ఉండటం నేరం. ముగ్గురు లేదా అంతకన్న ఎక్కువమంది గుమికూడి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయడం కాని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వంటివి చేయడం నేరం. ఈ నేరాలు గనుక రుజువు అయితే అట్టి వారికి గరిష్టముగా 2 సంవ‌త్స‌రాలు కారగారము, జరిమానా విధిస్తారు. కొన్ని సంధర్భాలలో రెండు విధించవచ్చు

144 సెక్షన్ అంటే ఏమిటి ?

తమ న్యాయమైన కోర్కెలు  సాధన కోసం కార్మికులు సమ్మె చేస్తునప్పుడో,ప్రజలు శాంతియుతంగా ఆందోళన జరుపుతున్నపుడో అకస్మాత్తుగా 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా ప్రకటన వస్తుంది.

*144 వ సెక్షన్ ఎప్పుడు ఉపయోగిస్తుంటారు?*

దేనినైనా వెంటనే ఆపాలని అనుకున్నప్పుడు, దేనికైనా సత్వర పరిష్కారం కలుగచేసే విధానం ఉన్నప్పుడు సెక్షన్144 విధిస్తారు. అంటే వెంటనే ఏ విషయంలో అయినా ఉత్తర్వులు జారీ చేయాలి అనుకుంటే ఈ సెక్షన్ విధిస్తారు.ఈ ఉత్తర్వు వ్రాత పూర్వకంగా ఉండాలి.  ఇందులో ప్రధానమైన విషయాలన్నీ వ్రాసి ఉండాలి. 

*ఈ 144 సెక్షన్ ఉత్తర్వును ఎవరు జారీ చేయవచ్చు?  జారీ చేస్తారు?*

డిస్ట్రిక్ మేజిస్ట్రేట్ { కలెక్టరు} గాని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ { సబ్ కలెక్టర్ } (ఆర్. డి. ఓ.) గాని లేదా  ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఇచ్చిన ఏ ఇతర ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ { అంటే మండల రెవిన్యూ అధికారి ఉత్తర్వులు జారిచేయవచ్చు. 

తక్షణం ఎదో చర్య తీసుకోవాలని ఆయన అభిప్రాయపడాలి. ఫలానా పని నీవు చేయకూడదు అనిగాని  నీ స్వాధీనములో ఉన్న లేదా నీ అజమాయి షీలో ఉన్న ఆస్తి విషయంలో ఫలానా ఉత్తర్వు తీసుకో అని ఎవరినైనా వారు అదేశిచవచ్చు. చట్ట సమ్మతంగా పనిచేస్తున్న ఎవరికైనా హాని కలుగకుండా కోపం రాకుండా ఆటంకం కలిగించాకుండా నిరోధించ వచ్చు. అని సదరు అధికారి అనుకున్నపుడు లేదా ప్రాణాపాయం ఆరోగ్యానికి గాని భద్రతకు గాని ప్రమాదం జరగకుండా అపవచ్చు అని అనుకున్నపుడు లేదా శాంతిభద్రతల కు భంగం కలుగకుండా అపవచ్చు.   ఏ దైనా దొమ్మి కొట్లాటను అపవచ్చు అని అనుకున్న పుడు అటువంటి ఉత్తర్వు జారీ చేయవచ్చు.అంటే ప్రజలంతా ఒక చోట గుమిగూడి ఎవరిమీదికైనా దాడి చేయడానికి వెల్తుంటే దానిని తక్షణం ఆపు చేయడానికి ఈ ఉత్తర్వు జారీ చేస్తారు. అత్యవసర పరిస్థితి అనుకున్నపుడు పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమించేలా ఉన్నాయని అనుకున్నపుడై ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే ఈ ఉత్తర్వు జారీ చేయవచ్చు.  అయితే ఈ ఉత్తర్వు 2 నెలల కంటే మించి అమాలలో ఉండకూడదు.  కాని రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొన్ని రోజులు ఈ ఉత్తర్వు అమలులో ఉండాలి. అని అభిప్రాయపడితే ఆరు నెలల వరకుదీనినిపొదగించవచ్చు.  అని చట్టం చెబుతుంది.  ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మనదేశంలో కరోనా వ్యాధి వ్యాపించకుండా సెక్షన్ 144 ఎక్కువ రోజులు విధించారు.

సెక్షన్144 క్రింద రెవిన్యూ శాఖకు సంబంధించిన అధికారి మాత్రమే ఉత్తర్వు జారీ చేయాలి అని చట్టం చెబుతోంది. రెవిన్యూ శాఖకు సంబంధించిన అధికారి ఆ స్ధలానికి వచ్చి,నిజంగానే ప్రమాదకరమైన పరిస్థితి ఉన్నదా లేదా అని పరిశీలించి, ప్రజలను చెదరగొట్టడం లేదా వారు ఊరేగింపు తియ్యకుండా ఆపడం అవసరమా కాదా అని ఆలోచించి, ఈ ప్రదేశం నుండి ప్రజలను పంపి వేయడం అవసరమా కాదా అని చూసి అటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆయన సంతృప్తి చెందితేనే 144వ సెక్షన్ కింద ఉత్తర్వు జారీ చేయాలని చట్టం చెబుతోంది.

మైక్ ఉపయోగించాలి అనుకుంటే మాత్రం తప్పని సరిగా పోలీస్ పర్మిషన్ కావాలి. అదికూడా పట్టణాలలో మాత్రమే. పల్లెటూళ్లలో,గ్రామాలలో అదికూడా అవసరం లేదు. 

“ సభ పెట్టుకోవాలి అనుకున్నచోట లేదా ఊరేగింపు తీయలనుకున్న ప్రాంతంలో అదివరకే 144వ సెక్షన్ అమలులో ఉంటే తప్పని సరిగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. “ ఎందుకంటే 144 సెక్షన్ అమలులో ఉంటే ముగ్గురి కంటే ఎక్కువ గుమి కూడరాదు. సభను చెడగొట్టాలని గాని, ఉరేగింపుని ఆపాలని గాని అనుకుంటే మాత్రం144 సెక్షన్ విధించడానికి వీల్లేదు. పైన చెప్పిన మేజిస్ట్రేట్ వచ్చి పరిస్థితి అంచనా వేసి శాంతి భద్రతలకు భంగకరం అని అభిప్రాయపడినపుడు మాత్రమే సెక్షన్144 ని విధించాలి.అంతేగాని తమ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం లేని వారి మీద ఉపయోగించ డానికి వీల్లేదు. ఆదేవిధంగా శాసన సభ సమావేశాలు అవుతుంటే దాని చుట్టూ144వ సెక్షన్ విధిస్తారు. అక్కడ ప్రజలు సమావేశం కాకూడదు, ఊరేగింపు తీయకూడదు. పోలీస్ పర్మిషన్ ఇచ్చే సమస్యే లేదు.

ఎస్.ఆర్.ఆంజనేయులు
న్యాయవాది 9848018828

.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు