ఒక చరిత్ర వ్యాసకర్త గా స్థిరపడాలనుకుంటే కొన్ని సూచనలు:
1. మీరు సంస్కృతంలోని Quotations ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించాలి.
ఉదాహరణకు... పురాణనిర్వచనం.
2. ఏ విషయాన్ని మీరు ప్రస్తావించినా మీ అభిప్రాయం ఏమిటి? ఎవరి ఎవరి అభిప్రాయాలను మీరు పరిగణనలోకి తీసుకున్నారు? అన్ని విషయాలను ఆయాగ్రంథముల పుటసంఖ్యలతో స్పష్టంగా ఇవ్వాలి. అప్పుడు మీరు పరిచయం చేసే విషయానికి గౌరవం పెరుగుతుంది.
3. మనుస్మృతి లోని బ్రహ్మావర్తమే బ్రహ్మలోకమనే ఆధునిక చరిత్ర కారుల ఊహలను ఆ మన్వాది గ్రంథకర్త లకు ఆపాదించేటప్పుడు ఆ యా గ్రంథకర్త లు తమ గ్రంథములలో ఏంచెప్పారో ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి.
4. అలాగే సంస్కృత సాహిత్య పు ఐతిహాసిక నిర్ధారణ చేసే సమయంలో ఆ యా గ్రంథాలను చూడటం వాటి గురించి తత్తత్పూర్వాపరగ్రంథాలలో ఏముందో చూడటం అవసరం. దీన్నే మనం Internal Evidence అంటాం.
ఉదాహరణకు:
పురాణాల ప్రస్తావన -
1. వేదములలో కాని,
2. ఐతరేయాది బ్రాహ్మణగ్రంథములలో కాని
3. ఉపనిషత్తులలో,
4. మునిత్రయ వ్యాకరణం లో (పాణినీయంలో)
5. గుణాఢ్యబృహత్కథలో
6. క్రీస్తు పూర్వం రచింపబడిన గ్రంథములు గా పాశ్చాత్యులైన భారతీయ చరిత్ర లేఖకులు అంగీకరించిన గ్రంథాలలో పురాణాల ప్రస్తావన ఎంతవరకు ఉన్నదో మీరు స్వయంగా చూసి, అధ్యయనం చేసి వ్రాస్తే మీ ప్రామాణికత పెరుగుతుంది.
7. ఏ విషయాన్ని గురించి వ్రాసినా a) Primary Sources, b) Secondary Sources, c) Tertiary Sources and d) Adding Flesh and Blood to Baseless Hypothesis అని నాలుగు రకాల ఆధారాలు, ధోరణులు, ఉపాయాలు ఉన్నాయి.
మూలాలను చదివి వ్రాస్తే ఆ లేఖకుడు ఎందరికో ప్రమాణం అవుతాడు. అక్కడా తన బలాబలాలను బేరీజు వేసుకుంటూ ఉండాలి.
సెకండరీ సోర్సెస్ మన రచనలకు దిక్సూచిగా ఉండాలే తప్ప మన రచనలు వాటికి దర్పణాలు కాకూడదు. అది చాలా మంది లో ఉండే బలహీనత.
టెర్షియరీ సోర్సెస్ ... రోగికి బెడ్ సోర్స్ లాంటివి. వాటినే ఆధారంగా చేసుకుని మనం రచనలను చేస్తే పునాది లేకుండా భవనాలను నిర్మించడమే అవుతుంది.
ఇక నాల్గవది మరీ దారుణమైన విషయం. బాధ్యతా రహితంగా వ్రాయటమే.
*మనం ఏం వ్రాసినా ఇందులో నా సొంతం ఎంత? ఇతరుల నుంచి తీసుకున్నది ఎంత? అన్న విషయం లో మీకు ఎంత ఎక్కువ స్పష్టత ఉంటే అంత ఎక్కువ ఆత్మవిశ్వాసం కలిగిన ప్రామాణిక వ్యాసకర్త కాగలుగుతారు.*
Comments
Post a Comment