పూజలెందుకు జుగుప్సాకర బూతుల మయ మయ్యాయి?.
లంజలు రాకుండిన #గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లద్దు....అంట?
పూజ అంటే ఏంటి?
పూజకు పనికిరాని పువ్వు అంటే ఏమిటి?
భోగం బజార్ అంటే ఏమిటి?
రాచకార్యాలు వెళ్లగా పెట్టడం అంటే ఏమిటి?
శృంగారంలో పూజలో పువ్వులు కామన్ గా ఎందుకు వాడతారు?
గుడిలో పూజారి కులగోత్రాలు ఎందుకు అడుగుతాడు?
చదవండి....
బ్రాహ్మణీయ పూజలు జుగుప్సాకర బూతుల మయం.
భారతదేశములో పూజ అంటే జనాలకు చాలా పవిత్ర భావం. ఒక ప్రశాంతమైన ఆధ్యాత్మికత. కానీ లోతుల్లోకి వెళ్తే పూజ అంటే బూతు లేదా శృంగారం. ఈ విషయం కొన్ని దేవాలయాల చరిత్రను చూస్తే అర్థం అవుతుంది.
తాపీధర్మారావు గారి “దేవాలయాలపై బూతుబొమ్మలు” అనే పరిశోధనా గ్రంధం ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. అలాగే మనదేశములో అనేక దేవాలయాలపై అత్యంత జుగుప్సాకరమైన బూతుబొమ్మలు దర్శనం యిస్తుంటై. మరి దేవాలయాలపై ఈ బూతుబొమ్మలేంటి అనే అనుమానం రాకపోదు. అంటే ఒకనాడు దేవాలయాలు శృంగార, కామకేంద్రాలు అని గుడుల చరిత్ర చూస్తే తెలుస్తుంది.
కృష్ణదేవరాయల కాలంలో ఖజానాకు ఎక్కువ ఆదాయం గుడుల్లో జరిగే సంభోగాల వల్లనే అని చరిత్ర చెబుతోంది; ఇప్పటికీ “వీడేదో రాచకర్యం వెలగబెడుతున్నాడురా” అనే నానుడి తిరుగుబోతుల గురించి వింటుంటాం. అంటే శృంగారం అనేది ఒకప్పుడు రాజుల చేత మనబడింది. చాలామంది రాజుల రాజ్యంలో “భోగం బజారులు” కూడా చాలా సామాన్యం. అందుకే “పూజ” అనే పదం ఈ శృంగారం నుండి పుట్టిందే. రతి కార్యక్రమానికి ముందే రెచ్చగొట్టే చర్యలే ఈ పూజలు. పార్వతి పెళ్లికి ముందే శివున్ని పూజించడానికి వెళ్ళడం, కృష్ణున్ని పూజించడానికి రుక్మిణీ వెళ్ళడం, అర్జునున్ని పూజించడం కోసం సుభద్ర వెళ్ళడం తరువాత వీళ్ళు ఆయా స్త్రిలనే పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తే పూజల్లోని మర్మం తెలుస్తుంది. ఇప్పటికీ సంసారానికి పనికిరాని స్త్రీలను “పూజకు పనికిరాని పువ్వులు” అంటూండడం మనం వింటుంటాము. అలాగే పూజల్లో పువ్వులు వాడడం కూడా మనకు పూజ అనే పదం శృంగారపదమేనని రూఢి పరుస్తోంది.
“శ్రీకాకుళ ఆంధ్ర మహాచరిత్ర” నోములు, తిరునాళ్ళు జాతరలు, కొలుపులు లాంటివి విచ్చలవిడి శృంగరాలకు నిలయాలని చెప్తోంది. కవి చౌడప్ప “లంజలు రాకుండిన గుడి రంజిల్లదు, ప్రజల మనసు రాజిల్లద్దు” అని ఎద్దేవా చేయడం గుడులు కామకళాకేంద్రాలనే విషయాన్ని రూఢిపరుస్తోంది. అంతే కాదు, గుడులు, పూజలు అమానవీయాలు కొందరిని కీర్తిస్తూ, కొందరిని కించపరిచే కేంద్రాలు. గుడిలో పూజకు వెళ్తే కులగోత్రాలు అడగడం సర్వసామాన్యం. చాలా గుడుల్లోకి ఈ నాటికీ దళితులకు ప్రవేశం లేదు. సాక్షాత్తు భారత రాష్ట్రపతి రామనాధ్ కోవిద్ నే గుడిలోనికి రానివ్వకుండా గుడిమెట్లపై కూర్చోపెట్టి పూజలు చేసి పంపిన తీరు భారతీయ సమాజనికి సిగ్గుచేటు.
అలాంటి పూజల్లోని కొన్ని శ్లోకాలను వాటి అర్థాలను చూచి పూజలు అంటే పవిత్రమైనవో లేక బూతులో మీరే తేల్చుకోండి.
#సంధ్యావందనం:
సనాతన ధర్మ పారాయనుడైన ప్రతి వ్యక్తీ విధిగా సంధ్యావందనం చెయ్యాలి.
యద్రాత్రాణి పాపకార్యం
మనసా, వాచా, హస్తాభ్యాం
పద్ఖ్యామ్, ఉదరేణ. శిస్నా,
రాత్రిస్థ, పవలుం పతు
యత్కించ దురితం మయి.
#అర్థం: గడచిన రాత్రి మనస్సు, మాటలు, చేతులు, కాళ్లు, కడుపు, శిస్నాలతో ఏ పాపాలు చేశానో ఆ పాపాలను పగలు నశింపజేయుగాక.
#దేవీస్తోత్రం:
నాభౌశుద్ధ సరోజ వక్త్ర విల సద్భందూక పుష్యారుణం
భాస్వధ్భాస్కర మండలం తదుదరే తద్ధ్యోని చక్రం మహత్
తన్మధ్యే విపరీతమైధునరతి ప్రద్యుమ్నసత్కామిని
పృష్ఠం స్యాత్తరుణార్క కోటివిలసత్తేజ స్వరూపాం భజే.
#అర్థం: నాభి మధ్య యెర్రని మంకెన పువ్వు దానిపైన యెర్రని సూర్యమండలం మాదిరి ప్రకాశించే తెల్లని తామరపద్మం. అపద్మం మధ్యలో పెద్ద చక్రంవలే వికసించిన వెడేల్పైన యోని, ఆయోని నుంచే మధ్ద్యన పురుషాయితం క్రియలో సంభోగం చేస్తున్న మంచి బలంగల కామిని వెనుకభాగం కోటి భాస్కరుల కాంతిని ఆకారముగా ధరించినది. అటువంటి పృష్ఠభాగం గల యోగినికి నమస్కరిస్తున్నాను.
జయదేవుడు వ్రాసిన గీత గోవిందంలోని అష్టపదులను చిన్న చిన్న పిల్లల చేత నాట్యం చేయిస్తూ పాడుతూ పాడిస్తుంటారు. ఆయా పిల్లల తలిదండ్రులు అవి ఎంత బూతులో తప్పకుండా తెలుసుకోవాలి.
#అష్టపది :
దోర్ఘ్యాం సంయమితః పయోధర భరేణా పీడితః పానిజై
రావిద్ధో దశనై క్షతాధరపుటః శ్రోనితటే నాహతః
హస్తేనా నమితః కచేధర సుధాస్వందేనసమ్మోహితః
కాంతాః కామపి తృప్తి, మా పదమహాకామస్య వామాగతి:
#అర్దం: ఆ సమయమందు శ్రీకృష్ణుడు రాధా బాహువులతో కట్టివేయబడ్డాడు. స్థనభారంపైన వేసి పీడింప బడ్డాడు. పండ్లతో కింది పెదవినంతా కొరకబడ్డాడు. పిరుదులను దరికి నెట్టి కొట్టబడ్డాడు. జుట్టు పట్టుకుని వంగ దీయబడ్డాడు. అధరామృతమనే కల్లుపోసి మోహింపబడ్డాడు. ఈ రకంగా చేయబడినప్పటికి అతడు చెప్పనలవి కాని ఆనందాన్ని పొందాడు. ఔరా! ఏమిది? మన్మధుని నడకంతా వక్రమమే గదా!
#అష్టపది:
పద్మా పయోధర తటీపరి రంభ లగ్న
కాశ్మీర, ముద్రితమురో మధుసూదనస్య
వ్యక్తానురాగ మివ ఖేల దనజ్ఞ ఖేద
స్వేదామ్బుపూర మనుపూరయతు ప్రియంవః
#ఆర్థం: లక్ష్మీదేవి స్థనాలనే కొండల్ని శ్రీకృష్ణుడు కౌగిలించుకోవడం వల్ల అంటుకున్న కుంకుమ పూరంగు హృదయంలో దాగిన అనురాగం బయటకు కనిపిస్తుందేమో అన్నట్లు భావం కలుగుతుండగా మన్మధ క్రీడ వల్ల కలిగిన అలసట చేత చెమట బిందువులు నాట్యం చేస్తుండగా ప్రకాశించే శ్రీకృష్ణుడి వక్షస్థలం మీ కోరికలు, మా కోరికలు తీర్చుగాక!
#వెంకటేశ్వర సుప్రభాతం 1వ శ్లోకం.
కమలాకుచ చూచుక కుంకుమతో
నియతారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకటశైలపతే
#అర్ధం: లక్ష్మీదేవి స్తన మొనలకున్న కుంకుమపూరంగు వల్ల శరీరం అంతా ఎర్రగా చేయబడ్డ సాటిలేని నల్లని శరీరం కలవాడా తామరరేకుల వంటి విశాలమైన కన్నులు కలవాడా లోకానికి అధిపతీ ఓ వెంకటాచలపతీ నీకు విజయం కలుగు గాక!
#వేంకటేశ్వర సుప్రభాతమ్: (23వ శ్లోకం):-
కందర్ప దర్పహర సుందర దివ్యమూర్తే
కాంతకుచాంబురుహ కుట్మల లోలదృష్టే
కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ II
#అర్థం: ప్రియురాలి తామర మొగ్గలవంటి స్తనముల యందు ఆసక్తితో కూడిన చూపులు గలవాడా, శుభాన్ని కలిగించే మంచి గుణాలకు నిలయమైనవాడా, గొప్ప కీర్తిగలవాడా వేంకటాచలపతీ నీకు సుప్రభాతమగు గాక!
#శ్రీ_రామ కర్ణామృతం ( ప్రధమాశ్వాసం 26వ శ్లోకం):
వైదేహీం ముదితోభిజాతపులకాం గాఢం సమాలింగయన్
వామేన స్తనచూచుకం పులకితం వామం కరేణ స్పృశన్
తత్వం దక్షిణ పాణినా కలితయా చిన్ముద్రయా బోధయన్
రామోమారుతి సేవిత స్మరతుమామ్ సామ్రాజ్య సింహసనే.
#అర్థం: సామ్రాజ్య సింహాసనమందు కూర్చుని ఉన్న సీతను సంతోషంతో చూస్తూ ఎడమ బాహువుతో గట్టిగా కౌగిలించుకుంటూ ఎడమచేతితో పులకరించిన ఆసీత ఎడమ స్తనం మొనను స్పృజిస్తూ కుడిచేతితో కూర్చబడ్డ జ్ఞానముద్రచేత తత్వాన్ని బోధిస్తూ ఆంజనేయునితో పూజింపబడుతున్న రాముడు నన్ను స్మరిస్తూ ఉండుగాక. ఇక్కడ భక్తులు రామున్ని స్మరించడము లేదు. రాముడు నన్ను స్మరించు గాక అంటే అర్థమేమిటీ??
#వెంకటేశ్వరుణ్ణి కీర్తిస్తూ అన్నమయ్య వ్రాసిన బూతుగీతం.
ఏమొకో చిగురుటదరమున ఎడనెడ గస్తూరి నిండేనో
భామిని విభునికి వ్రాసిన పత్రిక కాదుగదా? !!ఏమొకో!!
పడతికి చనుగవ మెరుగులు పైపై బయ్యెద వెలుపల
కడుమించిన విధమేమో కనుగొనరే చెలులు
ఉడగని వేడుకలో బృయుడోత్తిన నఖశశిరేఖలు
వెడలగ వేసవికాలపు వెన్నెల కాదుగదా! ఏమొకో!!
ముద్దియచెక్కుల కేలకుల ముత్యపుజల్లుల చేర్పుల
వొద్దిక లాగులివేమో ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు జెమటల అందము కాదుగదా !!ఏమొకో!!
#అర్థం: కస్తూరి తిలకం ధరించి ఉన్న ప్రియుడి ముఖాన్ని ఆ నాయిక తనివితీరా అనేకసార్లు ముద్దు పెట్టుకోవడం వల్ల ఎర్రటి పెదవిమీద నల్లగుర్తులు యేర్పడ్డాయట. ఆమచ్చలు ఎర్రటి కాగితం మీద నల్ల సిరాతో వ్రాసిన అక్షరాలు మాదిరిగా ఉన్నాయట. వేసవి కాలపు చంద్రుడు ఉదయించినపుడు వెన్నెల వెడలినట్లుగా గోళ్ల కాట్లు గల చన్నులు పైట వెలుపలకు వచ్చినవి ఎందుకో.. చెప్పుకోండి.
2. చెప్పరాని ఇంతి సిరులు దీని
వొప్పులన్నియు జూడ వొరపులో కానీ !!చే!!
ముదిత జఘనము మీది మొలనూలి గంటలివి
కదలు రవమెట్లుండే గంటరే చెలులు
మదనుడుండేడి హేమమందిరం దిరిగిరా
గదిసి మ్రోపెడి పారిఘంటలో కానీ
నెలత కంఠమందు నీలమణిహారములు
అలరు టేట్లుండు కొనియాడరే చెలులు
లలితాంగి ప్రాణవల్లభుడు వేంకట విభుడు
నెలకొన్న కౌగిటనే నిలిచేనో కానీ !!చే!!
#అర్ధం: ఈ సుందరి మొలచుట్టూ గల మొలత్రాడులో ఉన్న గంటలు ఒకదానినొకటి కొట్టుకొని మ్రోగుతున్నై. ఎందుకో చెప్పగలరా చెలులూ..? వెంకటేశ్వరుడు మదన మందిరము జేరీ సంభోగిస్తున్న సమయంలో ఆ సుందరి మొలచుట్టూ ఉన్న గంటలు మ్రోగుతున్నై. నెలత కంఠము నందు నల్లపూసల హారాలు ఎలా ఉన్నాయో చెప్పగలరా చెలులు..? ఆ లలితాంగి తన ప్రాణ వల్లభుడైన వెంకటేశ్వరుణ్ణి కౌగిలించుకోగా అతడే ఆమే కంఠములో నున్న నల్లపూసల హారంలా ఉన్నాడు అని అర్ధం.
ఇక పూజా కార్యక్రమం అయిన తరువాత మంగళం పాడడం సహజం.
శ్రీ వైకుంఠ విరక్తాయా
స్వామి పుష్కరిణీ తటే
రమయా రమమానాయ
వెంకటేశాయ మంగళం!!
#అర్ధం:- భోగభాగ్యలకు నిలయమైన వైకుంఠపురంపై విరక్తి కలిగి స్వామి పుష్కరిణి అనే పేరు గల చెరువు గట్టు మీద లక్ష్మీదేవితో శృంగార చేష్టలలో క్రీడించే శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళమగును గాక.
ఈలాంటి బూతులను పూజామంత్రాలుగా వ్రాసిన వారిని ఏమనాలి? పోనీ వాడెవరో పనికిమాలిన వాడు వ్రాశాడనుకో ప్రజలెందుకు అంత గుడ్డిగా దాన్ననుసరించాలి?
అందుకే బుద్ధుడు "ఎవరో ఏదో చెప్పారని, ఏదో పుస్తకాల్లో ఉందని గాని, గురువులు చెప్పారని, చివరకు నేను చెప్పినా గుడ్డిగా నమ్మకండి. మీ అంతట మీరే పరిశోధించి నిజం తెలుసుకోమంటాడు".
కాబట్టి విజ్ఞత కలిగిన వ్యక్తులను నిజానిజాలను ఎంచి మంచి మార్గాన్ని అనుసరించవలసినదిగా కోరుతున్నాను.
జైభీమ్ .
ప్రసాద్ నూకతోటి Prasad Nukathoti
కందుకూరు
Comments
Post a Comment