సామాన్యుని ఆయుధం సమాచార హక్కు చట్టం 2005

1. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వానికి
సంబంధించిన ఏ విషయాన్నైనా అడుగవచ్చు. 2. ఉదాహరణకు మోడీ డ్రస్సులకు ఎంత ఖర్చు పెట్టాడో, సర్పంచ్ కి MPP కి, ZP కి, MLA కి, MP కి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ఎలా ఖర్చు చేశారో, మన మండలంలో ఎంత మందికి పట్టాలు ఇచ్చారో, మండలంలో ఇంకుడు గుంతల బిల్లులు ఎంత వచ్చిందో అది ఎవరెవరికి వచ్చిందో, ఎంత మందికి పక్కా ఇల్లు మంజూరు అయ్యాయో, పంచాయతీ స్థాయి నుండి ప్రధాన మంత్రి స్థాయి వరకు ఏదైనా, విషయాన్నైనా, ఏ విధంగానైనా, ఎన్నిరకాలుగానైనా, ఏ ఏ అధికారినుండైనా, ఏ కార్యాలయంనుండైనా తెలుసుకోవచ్చు. 
3. ప్రజా సమాచార అధికారి దరకాస్తుదారుడు అడిగిన సమాచారం 30 రోజుల్లోగా సమాచారాన్ని అందించాలి. సమాచారం అడిగిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఉంచడం కూడా ప్రజా సమాచార అధికారి యొక్క బాధ్యత. 
4. దరఖాస్తుదారు కోరిన సమాచారం ఓ వ్యక్తి ప్రాణానికి లేక స్వేచ్ఛకు సంబంధించినది అయితే 48 గంటల్లోపు ఆ సమాచారం అందించాలి 
5. 30 రోజులలోపు సమాచారం అందించకపోతే అధికారికి రోజుకు 250 చొప్పున గరిష్టంగా 25000 వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. 
6. సమాచారం కోరుతున్న దరఖాస్తుదారుడు ఎవరైనా అందుకు గల కారణం ఏమిటో వివరించాల్సిన అవసరం లేదు. తనకు కబురు చేసేందుకు అవసరమైన వివరాలు మినహా ఎలాంటి వ్యక్తిగత వివరాలు కూడా సమర్పించాల్సిన పనిలేదు. 
7. ఇంతకీ దరఖాస్తుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?
₹10 మాత్రమే. తెల్ల రేషన్ కార్డు ఉంటే అది కూడా ఉచితమే.


సమాచారహక్కు దరఖాస్తుదారుల రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే


సమాచార హక్కుచట్టం దరఖాస్తుదారులు ఈ చట్టం అనులు కోసం కృషి చేస్తున్న కార్యకర్తలపై బెదిరింపులు, భౌతిక దాడులు, వేధింపులకు పాల్పడే అవినీతి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, పోలీసు సూపరింటెండెంట్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు (మె.మో "నెంబర్ 33086/ఎగజిపిఎం & ఎఆర్/2010, తేది  (30-9-2010) గతంలో జారీ చేసింది. జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు ఇలాంటి సంఘటనలు జరిగేవాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి బాధితులను ఆదుకోవాలి. నేరస్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినంగా శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సమాచార హక్కు దరఖాస్తుల వలన, ఉద్యమకారుల వలన తమ అవినీతి బండారం బయటపడుతుందని కొందరు ఉద్యోగులు, అధికారులు వేధింపులకు, దౌర్జన్యాలకు దిగుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ఇలాంటి అకృత్యాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ పోలీసు సూపరింటెం డెంట్లు ప్రతినెలా పరిస్థితిని సమీక్షించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ విషయానికి విస్తృత ప్రచారం కల్పించి వేధింపులకు చెక్ పెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అవినీతి, అక్రమ వ్యవహారాలు నడిపే ప్రభుత్వ ఉద్యోగులు తమపై దాడి చేసే అవకాశం ఉన్నపుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి తమ రక్షణ కోసం తగిన ఏర్పాట్లు చేయమని కోరవచ్చని ప్రజలకు అధికారవర్గాలకు తెలియజేయాలి. అవసరమైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ / ఇండియన్ పీనల్ కోడ్ల కు లోబడి తగిన చర్యలు తీసుకోమని సమాచార హక్కుచట్టం దరఖాస్తు దారులు చట్టం అమలు కోసం పనిచేస్తున్న కార్యకర్తలు కోరుకోవచ్చు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు / పోలీసు సూపరింటెండెంట్లు ఈ నేపథ్యంలో నమోదైన కేసులను ప్రతినెలా తప్పక పరిశీలించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 21 కింద లేదా ఈ చట్టం కింద రూపొందించిన రూల్స్ ప్రకారం సమాచార హక్యూపెట్టాన్ని మంచి కోసం వినియోగం లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్న కార్యకర్తలపై ఎలాంటి బావాలు వేయడం, ప్రాసిక్యూట్ చేయడం.. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కుదరదు.

దరఖాస్తుదారునిపై తీసుకునే అధికారం సమాచార కమిషన్కు లేదని న్యూఢిల్లీ హైకోర్టు కేసు (డబ్ల్యూ పి.(సి) 5688/2010 ఏం.నెం. 11163/2010) తేది 12-1-2011లో తీర్పు ఇచ్చింది.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు