గోండు తెగ



గోండు పంచ్ (పంచాయితి), పట్ల పాట్లల్ (గ్రామపెద్ద

గ్రామపెద్ద తన అధికారాన్ని పంచ్ (పంచాయతీ) లేదా పురుషుడు యజమానిగా ఉండేవారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాలమీద గాని, గ్రామ పెద్దను నిర్ణయించడంలోగాని గ్రామసభ (మండలి) నిర్ణయమే కీలకం. ఈ గ్రామపంచాయితి పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది.

పంచాయితి క్రమ బద్ధంగా సమావేశాలు జరగవు. కాని ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. ఏవైనా, ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు, అందరు మగవారూ హాజరవుతారు. యువకులు, మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు గాని వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది.

ప్రధాన పండగల తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారాలు, కర్మకాండ, విధి విధానాలను నిర్ణయించడానికి సంబంధించిన అంశాలను పంచాయితి నిర్వహిస్తుంది. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది.

గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచ్లు (పంచాయితీలు) సంయుక్త సమావేశం. నిర్వహిస్తాయి.

రెండువర్గాలు తమ తమ అభిప్రాయాలనూ, వాదనలనూ తెలియజేయవచ్చు. తరువాత గ్రామ పెద్దలు వాళ్ళను ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. సాక్షులను కూడా విచారిస్తారు. సాక్ష్యాలను పరిశీలిస్తారు. ఇవన్నీ పూర్తి అయిన తరువాత చర్చలు జరిపి గతంలో ఇటువంటి సందర్భంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించి పంచాయితీ (పంచ్) తీర్పు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి. తీర్పుమీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు. చివరిగా ఒక పరిష్కారానికి వస్తారు. వివాదానికి సంబంధించి పూర్వాపరాలను పరిశీలించిన తరువాత పంచాయితీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. అయితే ఇది తుది నిర్ణయం కాదు. తరువాత బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. ఆ తరువాతే చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు.

గోండ్ల తీర్పు ఏవిధంగా ఇస్తారో తెలుసుకోటానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణను చూడండి.

“ఒకరోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తిమీద పంచ్ ముందు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఆమెను అల్లరి పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. అతడు ఆమెను నెట్టేశాడు. ఆమె పడిపోయింది కాని అక్కడి నుంచి తప్పించుకుంది. పంచాయితీ ముందు ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. దోషికి ఏ శిక్ష విధించాలని ఆమెను పంచ్ (పంచాయితి) అడిగింది. సమాధానంగా ఆమె అత్యంత అవమానకరమైన శిక్షను అతనికి విధించమని కోరింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తనకు కలిగించనని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్లమీద నిలబడి ఆమెను క్షమాపణలు కోరమని పంచాయితి ఆదేశించింది.

పట్లా పాట్లల్ (గ్రామపెద్ద)

ప్రతి గ్రామానికీ పెద్దగా ‘పట్లా' (గ్రామపెద్ద) వ్యవహరిస్తారు. ఈ పదవి వారసత్వంగా వస్తుంది. (తల్లిదండ్రులనుంచి లభించే ఆస్తులు, ఇంటిపేరును పొందే కుమారులను, కుమార్తెలను వారసులు అంటారు). ఇతడు పంచాయితీకి జవాబుదారే కాకుండా చాలా విషయాలలో ప్రభావవంతుడైన నాయకుడుగా వ్యవహరిస్తాడు.

పంచాయితి ఎప్పుడో ఒకసారి సమావేశమైతే, గ్రామ పెద్ద ప్రతిరోజూ విధులు నిర్వహించవలసి వస్తుంది. గ్రామపెద్ద సాధారణంగా గ్రామం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబపు వ్యక్తి ఉంటాడు. గ్రామాన్ని సమైక్యంగా ఉంచడానికి బయట వ్యక్తులతోను, ప్రభుత్వ సంస్థలతోను సంధానకర్తగా ఉంటాడు. పండుగలలో, గ్రామానికి సంబంధించిన సామాజిక కార్యక్రమాలలో సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. గ్రామానికి వచ్చిన అతిథులకు ఆతిథ్యమిస్తాడు. ప్రతిఫలంగా గ్రామస్తులందరూ ఇతని పొలంలో సంవత్సరంలో ఒకరోజు పనిచేస్తారు. దీనివల్ల అతని కుటుంబం సాగు చేయగలిగిన భూమికంటే ఎక్కువ సాగుచేసి, అతిథులకు మర్యాదలు చేయగలుగుతుంది. అయి

తెగవాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా గ్రామపెద్ద గర్వంతో ప్రవర్తిస్తే అతన్ని తొలగించి అతని స్థానంలో మరొకరిని నియమిస్తారు లేదా గ్రామంలోని కుటుంబాలు ఈ గ్రామాన్ని వదిలి కొత్త ప్రాంతంలో ఆవాసాలు ఏర్పాటుచేసుకోడానికి వీలు ఉంది.

తెలుగువారు, మరాఠావారు ఆ ప్రాంతాలకు వలస, రావడం, పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రారంభం కావడంతో 1940, 1950ల నుంచి గోండులు ఆచారాలలో, వ్యవస్థలలో మార్పులు చోటుచేసు కుంటున్నాయని హైమన్ డార్ఫ్ వివరించారు. చాలామంది ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి పోలీసు స్టేషన్లకు, కోర్టులకు వెళుతున్నారు. అంతేగాక స్థానిక ఎన్నికలలో సర్పంచి ఎన్నుకొంటున్నందున గ్రామపెద్ద తన స్థానాన్ని కోల్పోయాడు.

గిరిజన సంప్రదాయాలను ఆయా సమాజాలలోని వయోజనులందరూ తెలుసుకొంటారు. గిరిజన సమాజ వ్యవహారాలలో ప్రతి కుటుంబమూ సమర్ధంగా పాలుపంచుకుంటుంది. కొన్ని సందర్భాలలో గ్రామ పెద్దకంటె ఎక్కువ ప్రాముఖ్యం సమాజానికి ఉంది. గ్రామపెద్ద ఎవరికి అనుకూలంగాను, వ్యతిరేకంగాను ఉండకుండా అందరి అభిమానాన్ని పొందవలసి ఉంటుంది. వాళ్ళ అభిప్రాయాలకు విరుద్ధంగా పట్లా ప్రవర్తించకూడదు. అలాగే అతడు తెగకు చేస్తున్న సేవలకు ప్రతిఫలంగా అతనికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అతని పొలంలో ఉచితంగా తెగవారు పనిచేస్తారు. తెగలోని అందరికంటే ధనవంతుడిగా ఉండి తెగ సంక్షేమం కోసం ఆ సంపదను ఖర్చు చేస్తాడు. దాదాపు చాలా గిరిజన తెగలలో ఇటువంటి ఏర్పాట్లు ఉంటాయి.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు