బైండ్ ఓవర్ అంటే ఏమి ...?


బైండ్ ఓవర్ అంటే ఏమి ...? ఆ అధికారం ఎవరికి కలదు.. ? ఎలాంటి వారి నమోదు చేస్తారు తప్పుడు బైడ్ ఓవర్ కేసు పెడితే ఏమి చేయాలి..?

ఒక  వ్యక్తి  గురించి లేక వ్యక్తులు గురించి పోలీస్ వారు మండల్ ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి సమాచారం అందిస్తారు సంబంధిత  వ్యక్తులకు మండల్ ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ నోటీసులు జారీ  చేసి నీ/మీ మీద పలానా ఆరోపణలు ఉన్నాయి  ఎన్నికలలో   ఎలాంటి అవంచానియా సంఘాటనాలకు పాల్పడరాదు  మీరు/నీవ్వు సంజాయిషీ ఇచ్చుకోవాలి  అని నోటీసులు జారిచేస్తారు. ఎన్నికల సందర్భంలో మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ సీఆర్పీసిలోని 107, 108, 109, 110  మరి పెద్ద కేసులు అయితే 151 ప్రకారం బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు.

చాలా మంది ప్రజలు  బైండ్ ఓవర్ కేసులు పేరిట మాతో పోలీసులు వేధిస్తున్నారని మా  మీద పోలీసులు  తప్పుడు కేసులు పెడుతున్నారని వాపోతున్నారు. అయితే చాలా మంది ప్రజలకు తెలియక  పోలీసులు పిలిచిన వెంటనే పోలీసు స్టేషన్కు పోతుంటారు.  వాస్తవంగా  బైండ్ ఓవర్ కేసులు నమోదు  చేయడానికి పోలీసులకు ఎటువంటి హక్కులు గాని ఎలాంటి ఆడిజారాలు గాని లేవు. మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్  మాత్రమే  మాత్రమే సీఆర్పీసి 107 కింద బైడ్ ఓవర్ కేసులు నమోదు చేసే అధికారం ఉంది.

 *బైండ్ ఓవర్  కేసులు ఎలా  నమోదు చేస్తారు...?*

 గతంలో  కేసుల్లో ఉన్నవారిని, ఎన్నికల్లో గొడవలు చేస్తారని ఎన్నికల్లో  మద్యం పంపిణీ చేసేవారిని, , సమాజంలో శాంతికి భంగం కలిగించే వ్యక్తులను, ఎన్నికల్లో నోట్లు పంచేవారిని, తహశీల్దార్లు  ముందర బైండ్ ఓవర్  చేస్తారు.  సంబంధిత వ్యక్తులు/వ్యక్తి  ఆ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వాలి.మండల మేజిస్ట్రేటుకి సంబంధిత వ్యక్తి ఇచ్చిన సమాధానం  వలన  సంతృప్తి చెందితే  ఎలాంటి బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయరాదు. ఒకవేళ  ఆ వ్యక్తి ఇచ్చిన సమాధానం సంతృప్తి  కాకపోతే బైండ్ ఓవర్ కేసులు పెడతారు అలాంటి వారిని సెల్ఫ్ బాండ్ మీద గాని లేదా అతనికి తెలిసిన  వ్యక్తుల నుంచి  పూచీకత్తు తీసుకొని వదిలివేయడం జరుగుతుంది. 

 *హోదాలో ఉన్నవారే బైండ్ ఓవర్ కేసులో నమోదు చేయాలి ...?*
మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా ఉన్నవారే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయాలి.  ఎవరి మీద అంటే వారి మీద  బైండ్ ఓవర్ కేసులు పెట్టడానికి వీలులేదు  సీఆర్పీసి 108 కింద నోటీసులు ఇచ్చిన తరువాత    సంబంధిత వ్యక్తి  సమాధాననం ఇచ్చుకున్న తరువాత మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్
 సంతృప్తి చెందకపోతేనే  బైండ్ ఓవర్ కేసులు పెట్టాలి.  మంచి వ్యక్తుల మీద, పెద్దమనుషుల మీద  వ్యక్తుల మీద ఎలాంటి నిందరోపణ లేని వ్యక్తుల మీద బైండ్ ఓవర్ కేసులు పెడితే హైకోర్టు రిట్ పిటిషన్ , క్రింద కోర్టులో  వ్రేవేటు కేసు. పబ్లిక్  సర్వెంట్ కక్ష్య పూరితంగా పోలీసు లేక మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ మీద  కేసులు వేయవచ్చు.  

*తప్పుడు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తేఏమి చేయాలి...?*
మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ మీద కేసు ఫైల్ చేయాలంటే సంబంధిత  మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ పై అధికారులైన రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్, కలెక్టర్, మరోయి చీఫ్ సెక్రటరికి పిర్యాదు చేయాలి. తరువాత న్యాయవాది ద్వారా నోటీసు పంపి  ఎంక్వయిరి అడగాలి. తరువాత కోర్టులో కేసులు సంబంధిత మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ మీద కేసువేయవచ్చు.  అయితే మండల ఎక్యూటివ్ మేజిస్ట్రేట్ ఉన్న అధికారాలను లాక్కొని సబ్-ఇన్స్పెక్టర్, సర్కెల్ ఇన్స్పెక్టరు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఇలాంటి వారిపై డిప్యూటీ సూపరిండెంట్ మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీసు పిర్యాదు చేయాలి తరువాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పిర్యాదు చేసి న్యాయవాది ద్వారా  నోటీసు పంపిన తరువాత కోర్టులో కేసులు వేయాలి.  కోర్టుకి సంబంధిత ఎమ్మార్వో/సబ్ ఇన్స్పెక్టరు/ సర్కెల్ ఇన్స్పెక్టరు సంజాయిషి చెప్పుకోవాలి.  అప్పుడు ప్రభుత్వ అధికారి అయి ఉండి చట్టం  ధిక్కరించడం జరిగిందని నిరూపితం అయితే ఐపీసీ166ఏ ప్రకారం 6 నెలల నుంచి 3 సంవత్సరాలు వరకు జైలు శిక్ష  లేకా జరిమానా  లేక రెండు విధించవచ్చు  సంబంధిత అధికారి  సీఆర్పీసి154  ప్రకారం  కింద కాగ్నాజాబుల్  కింద ఐపీసీ 326A, 326B,354, 354B, 370, 370A, 376,  376A, 376AB,  376B,  376C, 376D, 376DA,  376DB,  376E  మరియు 509 కింద శిక్ష అర్హులు అవుతారని న్యాయవాది ఎస్.ఆర్.ఆంజనేయులు పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు