2025 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్యాంశాలు:



2024 వక్ఫ్ (సవరణ) బిల్లు – ముఖ్యాంశాలు:

1. సర్వే అధికార మార్పు: వక్ఫ్ భూముల సర్వే అధికారాన్ని వక్ఫ్ కమిషనర్ నుండి కలెక్టర్‌కు బదిలీ చేయడం ద్వారా ముస్లింల అధికారాన్ని తగ్గించారు.


2. బోర్డు సభ్యుల మార్పు: వక్ఫ్ బోర్డులో ముస్లింల సంఖ్య తగ్గించి, ముస్లిం కాని సభ్యులను మెజారిటీగా నియమించే అవకాశం కల్పించారు. ఇది ముస్లింల అభిప్రాయాలను బేఖాతరు చేయడానికే.


3. ముస్లిం మహిళల ప్రాతినిధ్యం:
ఇద్దరు ముస్లిం మహిళల నిబంధన ఉన్నా, మిగతా సభ్యులలో ముస్లిం కానివారు ఉంటే వహీ ముస్లిం మహిళల అభిప్రాయాలు బలహీనమవుతాయని విమర్శ.


4. సీఈఓ నియామకం: మతపరమైన అవగాహన లేకపోయినవారు ఈ పదవిలోకి వస్తే,  సమస్యలకు దారితీసే అవకాశం ఉంది.


5. ట్రిబ్యూనల్ మార్పులు: ముస్లిం చట్ట నిపుణుని తప్పించడం ద్వారా, న్యాయ నిర్ణయాల్లో మత పరమైన అవగాహన లేకుండా పోతుంది.


6. వక్ఫ్ దానం నిబంధన: ఐదు సంవత్సరాలుగా ముస్లిం మతాన్ని అనుసరించినవారే వక్ఫ్‌కు ఆస్తి దానం చేయగలరన్న నిబంధన, ఇది కొత్తగా మతం మార్చినవారికి అడ్డంకిగా మారుతుంది.


7. సామూహిక న్యాయం గురించి ప్రశ్న: హిందూ దేవాలయాల పాలనలో మతేతరులకు చట్టం అవకాశం కల్పించకపోవడం, కానీ వక్ఫ్ బోర్డులో మాత్రం ముస్లిం కానివారికి అధికారం ఇచ్చారు.

8.వక్ఫ్ బోర్డుల్లో హిందూ సభ్యులకి అవకాశం:
వక్ఫ్ బోర్డులో సభ్యునిగా ఉండాలంటే ముస్లిం మతానికి చెందినవాడై ఉండాలి అన్న షరతులను సవరిస్తూ మతపరమైన నిబంధనలను తగ్గించారు.
ఇప్పటివరకు వక్ఫ్ బోర్డుల్లో సభ్యులు తప్పనిసరిగా ముస్లింలే అయివుండాల్సి ఉండేది. ఈ సవరణ తరువాత, ఇతర మతాలకు చెందిన సభ్యులను కూడా ప్రభుత్వం నామినేట్ చేయవచ్చు.ఇదే నిబంధన ఎండోమెంట్ లో లేదు.

9. ప్రభుత్వానికి అధిక నియంత్రణ:
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు వక్ఫ్ స్థలాలు, ఆస్తులపై ఎక్కువ నియంత్రణ ఉండేలా ఈ సవరణలు చేశారు.

10. వివాదాల పరిష్కారంలో మార్పులు:
వక్ఫ్ అంశాలపై వివాదాల పరిష్కారానికి న్యాయ ట్రైబ్యునల్ లేదా కోర్టుల ద్వారా నేరుగా అప్పీల్ చేసే అవకాశం కల్పించారు. ఇది మునుపటి కన్నా వేగవంతమైన న్యాయపరిష్కారానికి దారి తీస్తుంది.


11. ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్:
అన్ని వక్ఫ్ ఆస్తుల సమాచారం డిజిటల్ రూపంలో ఉంచి ప్రజలకు అందుబాటులో ఉంచే విధానం తీసుకువచ్చారు. దీని ద్వారా అక్రమ ఆక్రమణలను నియంత్రించవచ్చు.

12. ఆక్రమణలపై కఠిన చర్యలు:
వక్ఫ్ స్థలాలను ఆక్రమించినవారిపై త్వరితంగా ఖాళీ చేయించేందుకు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

13. అవినీతిపై కఠిన శిక్షలు:
వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగం చేసిన వారికి శిక్షలు, జరిమానాలు విధించే విధంగా సవరణలు చేశారు.


14.కేంద్ర వక్ఫ్ మండలికి విస్తృత అధికారం:
కేంద్ర వక్ఫ్ మండలి ఇప్పుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డులను పర్యవేక్షించగలదు, విధానాలు సూచించగలదు.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు