భావవాదుల మధ్యేమార్గం






వేదాంతుల దృష్టిలో భ్రమకు అర్థం వేరు. శాస్త్రజ్ఞుల దృష్టిలో భ్రమకు అర్థం వేరు. కాలమనేది వేగంతో ముడిపడి ఉందనీ, ఒకడికి నేడు అయినది మరొకడికి పది సంవత్సరాల క్రితం కావొచ్చని ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతంలో చెప్పాడు. వేగంగా ఒక వస్తువు కదిలినపుడు సమయం నిదానంగా ముందుకు వెళ్తుందని సైన్స్‌ చెబుతుంది. కాంతివేగం కన్నా వేగంగా ప్రయాణం చేసి భూతకాలంలోకి వెళ్లగలమంటూ సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలలో కూడా చూశాం.

చైతన్యం పుట్టుకలేనిదీ, ఎప్పుడూ ఉండేదీ కాబట్టి భూత, భవిష్యత, వర్తమానాలకు అతీతంగా ఉండే తత్వాన్ని దేవుడు అన్నారు. అందువల్ల దేవుళ్ల సహస్రనామాలన్నింటిలోనూ కాలానికి పరిమితంకానివాడు లేదా కానిది అనే పేర్లు ఉంటాయి. సిక్కు మతంలో సత శ్రీ అకాల్‌ అన్నా ఈ అర్థమే. సత్యస్వరూపుడైన దేవుడు కాలానికి అతీతుడు అనే గొప్ప మాటతో ఒకరినొకరు పలకరించుకుంటారు.

ఇతరులకు వచ్చిన కష్టం.. పెద్ద కష్టంగా మనకు అనిపించకపోవచ్చు. అసలవి కష్టాలే కాదని కూడా అనిపించవచ్చు. అయితే ఏ మనిషి కష్టాన్నయినా మనం అనుకునే హెచ్చుతగ్గులను బట్టి అంచనా వెయ్యకూడదు. కష్టం తీవ్రత దేవుడిని తలచుకోవడంలో ఉంటుంది. ఎవరైనా బాధగా ‘దేవుడా’ అనుకున్నారంటే అది కష్టం అవుతుంది తప్ప, చిన్నకష్టమో, పెద్ద కష్టమో కాదు.
 
కష్టాల్లో.. దేవుడు గానీ, దేవుడి లాంటి మనిషిగానీ గుర్తొస్తారని కదా అనుకున్నాం. అంటే ప్రతి మనిషికి ఇద్దరు దేవుళ్లు. ఒకరు దేవుళ్లలో దేవుడు. ఇంకొకరు మనుషుల్లో దేవుడు. మనకిక భయం ఏమిటి? దేవుడు తప్పక మన కష్టం తీరుస్తాడు. లేదా కష్టం తీర్చి రమ్మని తన తరఫున మనిషినైనా పంపిస్తాడు. అలా కూడా జరగలేదంటే.. ఎవరి వల్ల కష్టం వచ్చిపడిందో వారిలో పరివర్తన తెచ్చి, వారినే కష్టం తీర్చే మనిషిగా మన ముందుకు పంపే ఆలోచనలో ఆయన ఉన్నాడని. అప్పటి వరకు కష్టాన్ని ఓర్చుకోవడమో లేదా దేవుని ప్రార్ధించడం కానీ చేయక తప్పదు.

డాక్టర్‌ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు