ఓ హెన్రీ




‌‌                    ఓ హెన్రీ 1862 సెప్టెంబర్ 11న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో జన్మించాడు. అతడి అసలు పేరు విలియం సిడ్నీ పోర్టర్. అతడికి చదువు చెప్పిన టీచర్- ఇవలినా మారినా పోర్టర్- అతడిలో సాహిత్యస్పూర్తిని రగిలించింది. పదిహేనేళ్ల వయసులో హెన్రీ తన అంకుల్ డ్రగ్ స్టోలో గుమాస్తాగా పనిచేశాడు. ఆ తరువాత టెక్సాస్లోని లా శాల్ కౌంటీలోని ఓ రాంచ్ (పశుసంరక్షణకు ఏర్పడ్డ వేల ఎకరాల ఫారాలు) లో పనిచేశాడు. అప్పటి అనుభవాలే తను రాసిన టెక్సాస్ కథల్లో ప్రతిబింబించాయి. 1887లో అతడి వివాహం ఎథోల్ తో జరిగింది. ఆస్టిన్లోని ఫస్ట్ నేషనల్ బాంక్ లో టెల్లర్ గా పని చేశాడు. ది రోలింగ్ స్టోన్ అనే
పత్రికనుకూడ నడిపాడు.1890కల్లా కథారచనలో కీర్తిశిఖరాలు అందుకున్నాడు..
                         1895లో పాత్రికేయుడుగా డెయిలీ
పోస్ట్లో పనిచేశాడు. 1896లో, బాంకులో పనిచేస్తున్న
కాలంలో డబ్బు స్వాహా చేశాడన్న ఆరోపణపై అతడిమీద కేసు
నడిచింది. ప్రవృత్తిరీత్యా అతడు వ్యాపారి కాదు. పైగా
ఉదారస్వభావి. ఇతరులు అపహరించిన డబ్బుకు అతను
బలయ్యాడు. జైలు శిక్షకు భయపడి హోండ్యూరాస్ కూ, లాటిన్
అమెరికాకు పారిపోయాడు. భార్య ప్రాణాపాయ స్థితిలో
వుందని తెల్సి స్టేట్స్ కు రాగా, చట్టం చేతికి దొరికి, ఓహియో
పెనిటెన్షియరీలో ఐదేళ్ల శిక్ష పడింది. మంచి ప్రవర్తన కారణంగా మూడేళ్ల మూడునెలలకు, 1901లో విడుదలయ్యాడు.
తరువాతి జీవనమంతా న్యూయార్క్ లోని మామగారి హోటల్ లో గడిపాడు.
                డబ్బు బాగా గడించినా, విపరీతమైన తాగుడు, దాతృత్వంతో చేతిలో పైస ఆడేది కాదు. చట్టంనుండి పారిపోతున్న జనంతోనూ, జైల్లో నికృష్టులతోనూ, న్యూయార్క్ లోని కఫేలు, రెస్టారెంట్లు, కాబరేలలోను, అతి సామాన్యజనం- షాప్ గర్స్ తోనూ, వారిపట్ల ప్రగాఢ సానుభూతితోనూ గడిపాడు. 'ది ఫోర్ మిలియన్స్' అని ప్రేమగా వారిని పిల్చేవాడు.
                
                  కథాంతంలో ఊహించని మలుపు తిప్పటంలో సిద్ధహసుడు ఓ హెన్రీ. అది కథ ప్లాటులో కలసిపోయి నట్లుంటుంది. సునిశిత హాస్యంతో, కరుణాప్లావితమై అతని కథలుంటాయి.


(ప్రపంచ కథా సాహిత్యం నుండి)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు