మారుతున్న ప్రపంచంలో భారతీయ కుటుంబ వ్యవస్థలు


          జీవిత భాగస్వామి ఎంపికలో ఆడపిల్లలే నిర్ణయాలు తీసుకుని.. పెద్దల అంగీకారంతో చేసుకుంటున్న వివాహాల సంఖ్య భారత్ లో
పెరుగుతోంది. పెద్దలుసూచించిన సంబంధాల్లో నుంచి తామే స్వయంగా ఎంపిక చేసుకుని, ఓ నిర్ణయం తీసుకుని వివాహబంధంలోకి అడుగు పెడుతున్న వారి సంఖ్యా పెరుగుతోంది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఈ పరిణామాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిగా పెద్దలే కుదిర్చే పెళ్లిళ్ల స్థానంలో ఆడపిల్లలే  ఆలోచించి నిర్ణయించు కుంటున్న వివాహాలు పెరుగుతున్నాయి.
ఈ మార్పు కాపురాల్లో కలహాలు, హింస తదితర ఆననుకూల పరిణామాలకు అడ్డుకట్ట వేస్తోంది. కుటుంబ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబనియంత్రణ తదితర కీలక నిర్ణయాల్లో మహిళల అభిప్రాయానికి ప్రాధాన్యత లభిస్తోంది.  
         భారతదేశంలో పెళ్లిళ్లను పెద్దలే కుదర్చడం తరతరాలుగా వస్తోంది.ఇలాంటి సందర్భాల్లో కాబోయే భర్త ఎంపికలో తన మనోభీష్టాన్ని వ్యక్త పరచి ఓ నిర్ణయాన్ని వెలిబుచ్చే అవకాశం అమ్మాయిలకు చాలా తక్కువ. కాబోయే భర్తను ఏకంగా పెళ్లిపీటల మీదే తొలిసారి చూసే సందర్భాలు అనేకం.అయితే, ఈ పరిస్థితి కాలక్రమేణా మారుతూ వస్తోంది.  ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ మార్పు విస్పష్టంగా కనిపిస్తోంది. ఇక, సంబంధాల ఎంపికలో మాత్రమే కుటుంబ
సభ్యుల సాయాన్ని తీసుకుని, వారి సూచనలను జాగ్రత్తగా పరిగణించి... యువతులే స్వయంగా అన్ని అంశాలను బేరీజు వేసుకుని చూసి మరీ నిర్ణయాలు తీసుకుంటున్న సందర్భాలూ పెరుగుతున్నాయి.

      సొంత నిర్ణయం, పెద్దల ప్రమేయం కలగలి
సిన పెళ్లి చేసుకున్న సందర్భాల్లో ఆసంసారంలో కీలక నిర్ణయాల్లో మహిళ పాత్ర బలంగా ఉంటోంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న వారి కంటే ఇలాంటి పెళ్లి చేసుకున్న మహిళలకు ఆర్ధిక, కుటుంబ నియంత్రణ, ఎంతమంది సంతానం ఉండాలి తదితర అంశాలపై తమదైన నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ  అధికంగా ఉంది.ఎవరి తోడూ లేకుండా అనుకున్నప్పుడు తన బంధుమిత్రు
లను కలుసుకోవడానికి వెళ్లే అవకాశాలు
రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇక,
సొంత నిర్ణయంతో చేసుకున్న పెళ్లిళ్లలో
మహిళల పై గృహహింస కూడా దాదాపు
తక్కువే.
         
        భారతదేశంలో ఎన్ని చట్టాలు చేసినా.. ఉద్యమాలు నడిచినా కూడా వరకట్న సమస్య కొనసాగుతూనే ఉంది.దక్షిణాసియాలో వర
కట్న ప్రభావం తగ్గలేదు. భారత్ లో ఆర్థిక సరళీకరణలతో ఇప్పటికీ వరకట్న దురాచారం సంపన్న శ్రేణి నుంచి మధ్య తరగతికీ, హిందువుల్లోని వివిధ కులాలకు, క్రైస్తవులు,
ముస్లింలు, గిరిజన కుటుంబాల్లోకి పాకడానికి కారణమైంది.వరకట్నం కొన్ని సందర్భాల్లో మహిళపై హింసకు దారితీస్తోంది. కొన్ని సందర్భాల్లో ఇల్లు,పొలం వంటి సొంత ఆస్తులనేవి 'ఆమె'కు భర్త నుంచి హింస ఎదురుకాకుండా రక్షణ కవచాలు అవు తున్నాయి.

        సాధారణంగా భారత్ లో విడాకుల సంఖ్య  తక్కువే. విడాకులు పొందిన సందర్భాల్లో ఆస్తుల పంపకం విషయంలో చట్టాలు ఉన్నా వాటి అమలు తీరు అంత బలంగా లేదు.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు