సంక్రాంతి కాదు ఇది పొంగల్ ఉత్సవం





భారత దేశ ప్రజలు ముఖ్యoగా శ్రమ జీవులయినటువంటి సాధారణజనుల పండగలు పూర్తిగాబ్రహ్మణీకరించబడ్డాయి.హరప్ప నాగరికత తో విలసిల్లిన భారత ఉపఖండాన్ని ప్రాచీన బ్రాహ్మణీయ వ్యవస్థ వేదకాలం నుండి పూర్తిగా వారి ఆధీనoలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించారు. వేదకాలం తరువాత బుద్ధుని కాలం లో బ్రాహ్మనీయ విధానాం పూర్తిగా తప్పుడు సిద్ధాంతం అని తథాగతుని బోధనల వలన ఈ దేశ ఉపఖండ ప్రజలు తెలుసుకున్నారు.బుద్ధుని బోధనలు  క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి  మొదలయ్యాయి. ,దీనిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయింది సామ్రాట్ అశోకుడు .సుమారు 5 శతాబ్దం నుండి క్రీస్తు శకం 15 శతాబ్దం వరకు బౌద్ధం ఈ దేశం లో విలసిల్లింది.

భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబెడ్కర్ విశదీకరించారు.సుమారు రెండువేల ఏళ్ల బౌద్ధకాలం లో అనునిత్యం బౌద్ధం బ్రాహ్మనిజంతో సంఘరిస్తూనే ఉంది.భారత దేశం లో అనాదిగా కష్టజీవులు ,ఇష్టం గా శ్రమ జేసే శ్రామికులు.శ్రమ చేస్తున్న శ్రామిక ప్రజానీకం ఉత్సాహాలను వేడుకలను  బ్రాహ్మణీకరించింది బ్రాహ్మణ పూజారి వర్గం. శ్రామికుల శ్రమను ధనం రూపం లో కొల్లగొట్టడానికి ఈ ఉత్సవాలను ఇలా మార్చేశారు.ఈ కోవలోనిది దక్షిణ భారతదేశ ప్రజలు చేసుకునే "పొంగల్ "పండగ.

తమిళ నాడు ,తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతిగా  పిలువ
బడుతున్న పండగ తమిళ నాడులో పొంగల్ గా పిలువబడుతుంది.ఇది ద్రావిడ సంస్కృతి .కష్టజీవుల సంస్కృతి.పొంగల్ అంటే పొంగడం ,నిండిపోవడం అని అర్థం .భారత దేశ మెజారిటీ శ్రామికులు వ్యవసాయ దారులు ,వ్యవసాయం లో వరి , గోధుమ ఎక్కువగా పండిస్తారు. మన దేశం లో వ్యవసాయం జీవన విధాన మైన వృత్తి.అందులో వరి పంటలో మన దేశం ప్రపంచంలో రెండవ స్థానం లో ఉంది . ఖరీఫ్ కాలమైన జనవరి నెలలో వ్యవసాయ పనులు పూర్తైపోయి  పంట చేతికి వస్తుంది.ప్రతి ఇల్లు వరి పంటతో నిండిపోతుంది.

దేవుడు అంటే ప్రకృతిలో కనబడేవే అని నమ్మే ఈ దేశ సాధారణ ప్రజానీకం ,సూర్యుణ్ణి  మొక్కే వారు.ఇలా పంటను చేయికివచ్చిన సందర్భముగా పొంగల్ చేసుకోవడం ఆనవాయితీ.ఈ దేశ ప్రజలు గట్టు మీద ఒక రాయి పెట్టి గట్టమ్మ గా ,పొలిమేర రాయి పెట్టి పోలేరమ్మ గా,పోషణ కు గుర్తుగా ఊరిలో ఒక రాయి పెట్టి పోషమ్మగా ,దారిలో ఒక రాయి పెట్టి మైసమ్మ గా మాతృస్వామ్య పూజలు చేసుకునేవారు.ఈ పూజలు చాలా సాధారణంగా ఉండేవి పూజ సామాగ్రికి అంత ఖర్చుకూడా అయ్యేది కాదు .కానీ  ఎప్పుడైతే విశ్రాంత వర్గం ఈ పండుగలో తలదూర్చిందో అప్పటి నుండి దేవుడు పేరుతో ప్రజలు దోపిడీకి గురి కావడం మొదలైంది.

జంతుబలులు ,మూఢత్వం కి వ్యతిరేకంగా బౌద్ధం మొదలైంది. అహింస వలన పశుసంపద మిగిలి ప్రజల సంపద పెరిగింది.దాంతో బౌద్ద సంస్కృతి శ్రామికులైన బహుజనులలోకి  శరవేగంగా వెళ్లడాన్ని జీర్ణించుకోలేక కట్టుకథలు అల్లడం మొదలు పెట్టారు ఆనాటి విశ్రాంత వర్గం.సూర్యుణ్ణి రెండు చేతులతో మొక్కే  వ్యక్తి సూర్యున్ని దేవుని గా కొలిచి విజ్ఞానం వికసించని దశలో ఏర్పడిన నవగ్రహాలలో ఒక గ్రహం గా భావిస్తాడు.కర్ణునికి తండ్రి అని కూడా నమ్ముతాడు.అదే వ్యక్తి బౌద్ధం లోకి వెళ్తే తార్కిక ఆలోచనలో పడతాడు.ఈ విధంగా అనాదిగా బహుజనులలో ఉన్న తార్కిక వాదాన్ని తమ మనుగడ కోసం  బ్రాహ్మణమతం అనేక నమ్మకాలను ప్రచారం చేసి తార్కిక ఆలోచనలకు బదులు కర్మ,తలరాత, పునర్జన్మ,మన చేతుల్లో ఏమీ లేదని మొదలైన భావాలను వివిధ రూపాల్లో ప్రవేశ పెట్టారు.

ప్రకృతిని ఆరాధించిన ఈ దేశ మూలవాసులు  మెల్లగా అజ్ఞానం  లోకి నెట్టబడ్డారు. ,
ప్రకృతిలో  జరిగే సృష్టి రహస్యాలను తెలుసుకోకుండా వాటికి కట్టు కథలు అల్లారు. ప్రకృతి ఆరాధన నుండి ,గతి తార్కిక సిద్ధాంతం వైపు విగ్రహారాధన నుండి సైన్స్ వైపు మళ్ళాల్సిన ఈ దేశ ప్రజలను మూఢత్వం వైపు ప్రయనించేలా కుట్రలు చేసారు. 
        ప్రజలు సంతోషాలతో జరుపుకునే ఉత్సవాలలో
,ప్రజలు భయంతో చల్లంగా తమను కాపాడాలని మొక్కే మొక్కల వరకు తిరిగి విశ్రాంత వర్గం అక్రమించుకుంది.రాళ్ళ ను మొక్కే స్థితి నుండి రాళ్ళ మీద పరిశోధన చేసే స్థితికి రావాల్సిన ప్రజలను రాళ్లను రోగాల మాన్పి ,సుఖ సంతోషాలు ,స్వర్గ నరకాలకు చేర్చే వాటిగా తీర్చిదిద్దుకుని పూజలు చేసే స్థితికి బ్రహ్మనిజం నెట్టివేసింది.

పండగలు బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్యుల ధనార్జన కోసం బహుజనుల పై చేసిన కుట్రలు.భారత దేశం లో బౌద్ధం ను ద్వంసం చేయడం వెనుక బహుజనులను దోపిడీ చేయాలనే కుట్ర దాగి ఉన్నది.చాలా తక్కువ ధనం తో అయిపోయే బహుజనుల పూజలను ,అప్పులు చేసుకుంటే కానీ పూజలు కానీ స్థితికి బ్రహ్మనిజం కుట్ర చేసింది.బౌద్ద జైన ఆలయాలను ఆక్రమించుకొని వాటిని హిందూ దేవాలయాలు గా మార్చుకుంది.బుద్ధుని రూపాన్ని 
బ్రహ్మణిజ దేవుళ్ళ ప్రతిరూపాలను చేసింది.బుద్ధుని  భంగిమలు ఈ దేశ దేవుళ్ళ భంగిమలు చేసింది.అసలు దేవుడు అంటే ప్రకృతి అని ఆరాధించే ఈ దేశ ప్రజలకు దేవుని రూపం బుద్ధుడే అయ్యారూ.బుద్ధుని ముందు హిందు మతానికి దేవుడు అనే రూపం లేక పోవడం సత్యం అన్నది చరిత్ర సాక్ష్యంగా కనబడుతుంది.

వ్యవసాయం తో దేదీప్యమానంగావెలుగుతున్న ఈ దేశం లో కుల వ్యవస్థ ను రూపొందించి ,వ్యవసాయాన్ని కొందరికే పరిమితం చేసింది,భూమిని కొందరి చేతుల్లో ఉండేలా కుట్రలు చేసింది.బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు భూమి ఉండేలా చేసింది,శూద్ర కులాలను వ్యవసాయానికి దూరం చేసి వారిని సేవకులుగా చేసింది.శూద్ర కులాలలో తిరుగుబాటును  గమనించిన తెలివైన వర్గం శూద్రులలో హెచ్చుతగ్గులు పుట్టించి నయా క్షత్రియ వర్గాన్ని పుట్టించింది.శూద్రులలో నయా క్షత్రియ వర్గమైన  ఓసి కులాలకే అసంఖ్యాక భూములు ఉండటానికి కారణం వర్ణవ్యవస్థే.
 ,వృత్తి కులాలకు ,అంటరాని కులాలకు వ్యవసాయ భూములు లేకపోవడం ,శ్రామికులుగా ,కూలీలుగా బ్రతకడానికి కారణం కూడా మనువాద సంస్కృతే. 

ఇదంతా ఒక కుట్రతో మనువాదం
 చేసింది ఈ దేశ మెజారిటీ బహుజనులను మైనారిటీలు చేయడం దీని వెనుక రహస్యం ,విభజించు పాలించు బ్రహ్మనుల సొత్తు.కులం పేరుతో రెండు వర్గాలను సృష్టించి ధనిక వర్గం దగ్గర డబ్బును పేద వర్గాల దగ్గర భక్తిని పొందాలన్నది మనువాదుల పన్నాగం.
పేదవారు అయిన ప్రజలను గుళ్ళు గోపురాలు తిప్పుకోవడం లో నూరు శాతం సఫలీకృతం అయ్యారు.ధనికుల డబ్బులతో గుడులు కట్టించుకొని పూజారులుగా  విశ్రాంత వర్గం ఈ సమాజం లో గౌరవ మర్యాదలు పొందుతున్నారు .అదే ఆరుగాలం కష్టం చేసిన శ్రామికులు అప్పులపాలు అయ్యారు.

సరిగ్గా పండగలు ముఖ్యoగా ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు చేసుకుంటారు ఆ కోవలోని సంక్రాంతి పండుగకు ,సూర్యుని సంక్రమణం జరుగుతుంది ,మకర రాశిలోకి సూర్యుడు వెళ్లిన రోజున సూర్యుని ఉత్తరాయణం ప్రయాణం మొదలవుతుంది ,ఇప్పుడు గుడిలో దేవుళ్లను దర్శించుకోవాలి ,బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలని కట్టు కథలు చెప్పారు.ఈ కట్టు కథలు నమ్మిన మెజారిటీ పేద వారు అయిన బహుజనులు ప్రతీ ఏడాది జనవరి నెలలో తమ దగ్గర ఉన్న ధనాన్ని గుడులు గోపురాలు తిరగడానికి ఖర్చుబెడుతున్నారు.ఇదంతాతార్కికంగా ఆలోచించని భారతీయ వ్యవస్థ ఉండడం వల్లనే ఇది సాధ్యపడింది.

సీజన్ లో వచ్చే వ్యాధులకు మూఢనమ్మకాలను సృష్టించి దోచుకుంటున్న మనువాదం మన సంతోషాలను కూడా కబళించి దోచుకుంటుంది.
దేవుడు లేడని,ఏది మూఢంగా నమ్మద్దు అని చెప్పిన బౌద్ధం ను కూడా తమదే అంటూ బౌద్ధ ధమ్మాన్ని తమ తమ ధర్మ మే అంటూ ప్రచారం చేస్తున్న మనువాద కుట్ర బౌద్ధాన్ని ఆచరించినవారి మీద కక్ష సాధించడమే....
తమసోమ జ్యోతిర్మయా  అంటూ వెలుగులోకి ప్రయాణం కావాల్సిన ఈ దేశ ప్రజలను చీకట్లోకి త్రోసింది ఈ మనుధర్మం.సూర్యుణ్ణి మొక్కిన ఈ దేశ ప్రజలను  ఖగోళ శాస్త్రoలో పరిశోధనలు చేయాల్సిన  సమయం లో కూడా రాశులను నమ్ముతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని నమ్మేలా చేసి మూఢత్వం లోకి ,తద్వారా చీకటిలోకి ప్రవేశించేలా చేసింది....

 తార్కికంగా ఆలోచించండి
ఆధునిక విజ్ఞాన ఫలాలను నిత్య జీవితంలో ఉపయోగించండి.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు