ప్రీమియం ధరల తగ్గింపు యుద్ధం
ఆమధ్య కొన్ని ప్రైవేటు బీమా కంపెనీలు Term Insurance పాలసీలలో ప్రీమియంను బాగా తగ్గించాయి. ప్రభుత్వరంగ LIC, Term Insurance
పాలసీలలో ఎక్కువ ప్రీమియం charge చేస్తోందని, తాము కారు చౌకగా ప్రీమియం తీసుకుంటున్నామని పెద్దఎత్తున corporate అనుకూల మీడియాలో
ప్రచారం సాగించాయి.ఒకసారి, బీమా రంగం తలుపులు తెరిచాక, ప్రీమియం ధరలను తగ్గించి ప్రైవేటు కంపెనీలు Price war లకు (కుయుక్తులకు) పాల్పడతాయని, దీనిని undercutting of premium rates గా ప్రచారం చేసుకుంటారని కామ్రేడ్ సరోజ్ చౌదరి ఆనాడే 1995 లొనే ఇన్సూరెన్స్ వర్కర్లో రాసారు. అది ఇప్పుడు నిజం అయ్యింది.
LIC మాత్రం mortality tables(మరణాల నిష్పత్తి), experience రేటింగ్ (గత అనుభవాల గణాంకాలను బట్టి), ప్రీమియం రేట్లను నిర్ణయిస్తుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీల లాగా అడ్డగోలు పద్ధతుల్లో కావాలని ప్రీమియం రేట్లు తగ్గించదు. అందువల్ల ప్రైవేట్ వారితో పోలిస్తే, తాత్కాలికంగా LICలో Term పాలసీలలో ఎక్కువ ప్రీమియం తీసుకుంటున్నట్లు కనపడుతుంది
అయితే, క్లైయిములు చెల్లించే సరికి ప్రైవేట్ కంపెనీలు బోర్లా పడ్డాయి. ప్రీమియంలను హేతుబద్ధంగా నిర్ణయించక పోవడంతో ఆ కంపెనీలిప్పుడు లబోదిబోమంటున్నాయి. విధిలేక, అవి టర్మ్ పాలసీల ప్రీమియంలను పెంచాల్సి
వచ్చింది.
ఇక ఇది ఇలా ఉంటే, Better Experience రేటింగ్ వల్ల LIC Term policy ప్రీమియం లను తగ్గించే స్థితి కి చేరుకుంది. ప్రైవేట్ బీమా కంపెనీల విష ప్రచారం పటాపంచలయ్యింది. LIC మార్కెట్
వాటా ఇంకా పెరిగింది.
మనం అర్థంచేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత విషప్రచారం, గందరగోళం చేసినా వాస్తవాలు మరుగున పెట్టలేరు. చాలా ఏళ్లుగా మనం ప్రజల్లో
పొందిన విశ్వాసం , బ్రహ్మాండమైన LIC పని తీరు వృధాపోలేదు.
ఎంత విషప్రచారం చేసినా ప్రజల విశ్వాసం, నమ్మకం ప్రభుత్వరంగ సంస్థ LIC పైన చెక్కు చెదరలేదు. అందువలన, LIC పరిపుష్టి పనితీరు మాత్రమే, మనకు పోరాట శక్తినిస్తుందని మరోసారి రుజువయ్యింది.
LIC ను బలోపేతం చేయలని పోరాడుదాం!!
LIC లో IPO ప్రయత్నాలను స్ఫూర్తివంతంగా
ఎదుర్కొందాం !!
Join the hands to Strengthen LIC .
Comments
Post a Comment