సత్యాన్వేషణ


   
సత్యాన్ని స్వీకరించి అసత్యాన్ని తిరస్కరించడమే శీల సంపదకు చిహ్నం .ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడమే ఎలా ?
సత్యాన్ని తెలుసుకోవాలంటే క్రింది పద్ధతులు పాటించాలి.
 1 . శాస్త్రీయత 2. పద్ధతి 
3 ఆచరణాత్మక దృక్పథం4. ఆలోచన 5. విజ్ఞత
సమగ్రంగా తెలుసుకోవడం, ఊహల పైనా పోలికలు పైన ఆధార పడకుండా నిర్ధారణకు రావడం శాస్త్రీయత
  కొన్ని వస్తువుల రూపాలు మారవు మారని వాటిని సృష్టించనూ లేము .విధ్వంసమూ చేయలేము. ఈ రెండింటిని విభజించి ఏది ఏ కోవకు చెందుతుందో  తెలుసుకోవాలి. ఇలా తెలుసుకోవటానికి ఆలోచన అవసరం .ఈ ఆలోచనలను అమలు లో పెట్టడానికి ఓ పద్ధతి అవసరం. అదిమానవుడి నైపుణ్యాన్ని బట్టి రాణిస్తుంది. మానవ ప్రపంచంలో లో నిర్వహించడానికి తోటి మానవులతో సమాజంతోనూ సంబంధాలను సరిగా  ఉంచుకోవడం లోనూ ఆచరణాత్మక దృక్పథం అవసరం. పైన పేర్కొన్న వాటినన్నిటిని సమన్వయపరచి వాటినుండి  కొన్ని మూల సూత్రాలు కనిపెట్టడం విజ్ఞత వల్ల సాధ్యమవుతుంది. విజ్ఞత అన్నిటికంటే ముఖ్యమైనది విలువైనది.

___అరిస్టాటిల్ (ఎథిక్స్)
( క్రీ . పూ. 384_447)

(సేకరణ: పిళ్లా విజయ్)
**************************

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు