అయోధ్య (సాకేత్)


కాలం : క్రీస్తుపూర్వం 50

సాకేత్ (ఆయోధ్య) ఎప్పుడూ ఏ రాజుగారికీ ముఖ్య రాజధానిగా లేదు. బుద్ధుడి సమకాలికుడు కోసలరాజు ప్రసేన్ జిత్తుకి ఇక్కడో రాజభవనం ఉండడం ఐతే ఉండేది. కాని అతని రాజధాని మాత్రం అక్కణ్ణించి ఆరు యోజనాల దూరంలో ఉన్న శ్రావస్తే (సహేట్ మహేట్). ప్రసేనజిత్తు అల్లుడు అజాత శత్రువు కోసల రాజ్య స్వాతంత్ర్యాన్ని హరించాడు. అప్పటినుంచీ శ్రావస్తి వైభవమూ హరించుకు పోయింది. తూర్పు నుంచి ఉత్తరాపథం వరకూ (పంజాబు వరకూ) బీహారుల
రాకపోకలకు మార్గం వుండడం నుంచి సరయూ నదీతీరాన్ని ఉన్న సాకేత్ ఒక్క
నౌకావ్యాపారానికే కాక స్థల వ్యాపారానికి కూడా మొదటినుంచి పేరుపొందింది.
చాలా రోజుల వరకూ ఆ పేరు నిలిచింది. విష్ణుగుప్త చాణక్యుడి శిష్యుడు చంద్ర
గుప్త మౌర్యుడు మగధరాజ్యాన్ని మొదట తక్షశిల వరకూ, ఆ తర్వాత గ్రీకురాజు
శైలాక్షుణ్ణి (సెల్యూకస్) ఓడించి హిందూకుష్ పర్వత పంక్తుల దగ్గర్నుంచి (ఆఫ్ఘని
స్థాను) బాగా పడమరకి ఉన్న హిరాత్, అమూ నది వరకూ విస్తరింప చేశాడు.
చంద్రగుప్తుని కాలంలోనూ, తర్వాత మౌర్య వంశం పరిపాలించిన కాలంలో కూడా
సాకేత్ వ్యాపార కేంద్రంగానే ఉంది కాని అంతకుమించి ఏ ప్రాముఖ్యాన్ని పొందలేక
పోయింది. మౌర్యవంశాన్ని నాశనం చేసిన సేనానాయకుడు పుష్యమిత్రుడు సాకేత్ ని
మొదటిసారిగా రాజధానిగా చేశాడు. ఐతే పాటలీపుత్రానికున్న ప్రాముఖ్యాన్ని
మాత్రం తగ్గించలేదు. వాల్మీకి తన రామాయణాన్ని పుష్యమిత్రుడి శాసనకాలం
లోనో, లేదా అతని శుంగవంశపు శాసనకాలంలోనో రచించినప్పుడు అయోధ్య
అన్న పేరుని ప్రచారంలోకి తెచ్చాడు. అశ్వమోషుడు వాల్మీకి రాసిన మధురమైన
కావ్యాన్ని చదివి రసాస్వాన చేశాడు. అందులో సందేహం లేదు. కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుణ్ణి ఆశ్రయించిన కవి ఐనట్టుగానే వాల్మీకి శుంగవంశాన్ని ఆశ్రయించిన కవి అయి ఉండవచ్చు. కాళిదాసు చంద్రగుప్త విక్రమాదిత్యుణ్ణి తన రఘువంశంలో రఘువుగానూ, చంద్రగుప్తుని పుత్రుడు కుమారగుప్తుణ్ణి తన కుమారసంభవంలో కుమారుడిగానూ కీర్తించినట్లు,వాల్మీకి శుంగవంశపు రాజధాని ప్రాముఖ్యాన్ని పెంచి చెప్పడానికి జాతక కథల్లోని దశరథుని రాజధాని వారణాసిని సాకేత్ లేదాఅయోధ్యగా మార్చి రాముడి పేరుతో శుంగవంశపు చక్రవర్తి పుష్యమిత్రుణ్ణి లేదా అగ్ని మిత్రుణ్ణి కీర్తించాడు. ఇందులో వింతపడాల్సిందేంలేదు.
(రాహుల్ జి రాసిన 'ఓల్గా నుంచి గంగకు' పుస్తకంలోంచి)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు