ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలి
ప్రతి వంటగత్తె రాజకీయవేత్త కావాలి
స్త్రీలు తన కాలాన్నీ, శక్తినీ కేంద్రీకరించి నిరంతరం
అల్పమైన - విసుగును పుట్టించే ఇంటి పన్నుల్లో సతమతమవుతుంటే, పురుషుడు ప్రశాంతంగా చూస్తూ వుంటాడు. ఆ పనిలో స్త్రీ మనోనేత్రం మూసుకుపోతూ వుంటే,
ఆమె బుద్ధి మందగిస్తుంటే, ఆమె హృదయం నీరసిస్తూంటే, ఆమె మానసిక శక్తి బలహీన పడుతుంటే - చూస్తూ వుంటాడు. ఇది సర్వ సాధారణమైన విషయం. ఇంత కంటే అతని కర్కశత్వానికి నిదర్శనం ఏమి కావాలి? తమ ఇంటి
పనులన్నింటినీ, బిడ్డల పోషణతో సహా, పనికత్తెల కప్పగించి కులాసాగా కాలక్షేపం చేసే బూర్జువా స్త్రీలను గురించి కాదు నేను చెబుతున్నది. చాలామంది స్త్రీల గురించి నేను మాట్లాడుతున్నాను. ముఖ్యంగా కార్మికుల భార్యలను గురించి .
చెబుతున్నాను. రోజల్లా ఫ్యాక్టరీలో పని చేస్తూ స్వయంగా ధనార్జన చేసేవారు కూడా నా దృష్టిలో వున్నారు.
"శ్రామికుల్లో సైతం చాలా కొద్దిమంది భర్తలే, తాము ఈ 'ఆడవాళ్ళ పని'లో కాస్త చేయూత ఇవ్వడం వల్ల తమ భార్యల కష్టాన్ని, వారి చికాకుల్ని ఎంతగానో తగ్గించవచ్చుననీ, సమూలంగా తొలగించవచ్చునని కూడా ఆలోచిస్తున్నారు. కాని
వారలా చేయరు. అది 'భర్త హక్కులకూ, సుఖాలకు భంగకరమని' వారు భావిస్తారు. .తనకు మాత్రం విశ్రాంతి, సౌఖ్యం అతడు కోరుతాడు ; రెండోవైపు స్త్రీ తన గృహ జీవితంలో ఆనంతమైన స్వల్ప విషయాలపై తన వ్యక్తిత్వాన్ని త్యాగం చేస్తుంది. ఆమెకు
ప్రభువుగా, యజమానిగా చెలామణి అయ్యే ఆమె భర్త సాంప్రదాయక హక్కులు నిగూఢ రూపంలోవిజృంభిస్తూ వుంటాయి. ఇందుకు ఆమె - అతని బానిస -నిగూఢంగానే పగ తీర్చుకొంటుంది. ఆమెలో చైతన్యం కొరవడతుంది , తన భర్త
విప్లవ లక్ష్యాన్ని ఆమె అర్థం చేసుకోలేదు. ఇది అతని ఉత్సాహాన్ని, పోరాట దీక్షనూ సడలిస్తుంది. ఇది కంటికి కనబడని సూక్ష్మక్రిమిలాంటిది. నెమ్మదిగానూ,నిశ్చితంగాను ఇది నాశనాన్ని తీసుకొస్తుంది. కార్మికుల జీవితాన్ని గురించి పుస్తకాల
నుండి నేర్చుకొన్నదేకాక యదార్థంగా కూడా నాకు తెలుసు. కమ్యూనిస్టు పార్టీ మహిళా ప్రజానీకంలో చేసే పనిలో, మొత్తం మీద రాజకీయ కార్యక్రమాల్లో, పురుషుల్ని బాగా తర్ఫీదు చేయడం ఒక భాగం. పార్టీలోనూ, ప్రజానీకంలోనూ కూడా మనం పాతబానిస యజమాని దృక్పథాన్ని పెకలించి నిర్మూలించాలి. ఇది మన రాజకీయ కర్తవ్యాలలో ఒకటి. మహిళా ప్రజానీకంలో పార్టీ పనిని కొనసాగించడానికి, వారిని పార్టీ పంథాలో నడపడానికి సిద్ధాంతంలోనూ, ఆచరణలోనూ శిక్షణ పొందిన స్త్రీ,పురుష కామ్రేడ్స్ బృందాన్నొకదానిని తక్షణమే తయారు చేయడం ఎంతో అవసరముంది.
మహిళా కమ్యూనిస్టు ఉద్యమం ప్రజా ఉద్యమంగా వుండాలి; మొత్తం ప్రజా ఉద్యమంలో అదొక భాగంగా వుండాలి. ఒక్క శ్రామికోద్యమంలో భాగంగానే గాక, పీడిత ప్రజలందరి
ఉద్యమంలో, అణచబడిన వారందరి ఉద్యమంలో పెట్టుబడిదారీ విధానానికి బలయ్యే వారందరి ఉద్యమంలో భాగంగా అది వుండాలి. కమ్యూనిస్టు సమాజాన్ని
నిర్మించడం శ్రామికవర్గం యొక్క చరిత్రాత్మక కర్తవ్యం. ఈ వర్గ పోరాటంలో మహిళా ఉద్యమం యొక్క ప్రాముఖ్యత చాలా వుంది. విప్లవ మహిళలలో ఉత్తములంతా నేడు
మన పార్టీలో, అంతర్జాతీయ కమ్యూనిస్టు సంస్థలో (కొమింటర్న్) వున్నారు. ఈ విషయాన్ని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇదింకా నిర్ణయాత్మకమైన విషయం కాలేదు. మన పోరాటంలో ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీ
నిర్మాణంలోకి పట్టణాలలో, పల్లెలలోని శ్రామిక మహిళలను లక్షల సంఖ్యలో సమీకరించాలి. మహిళలు లేకుండా నిజమైన ప్రజా ఉద్యమం ఉండజాలదు."నిర్మాణ రంగంలో మనం చేసే కార్యాలు మన సిద్ధాంత అవగాహన నుండి ఉద్భవించుతాయి. కమ్యూనిస్టు స్త్రీలకు ప్రత్యేక సంస్థలేవీ ఉండవు. స్త్రీలైనా,
పురుషులైనా కమ్యూనిస్టు పార్టీలో సమాన స్థాయి సభ్యులే. వారందరికీ సమానమైన విధులు, హక్కులు వుంటాయి. ఈ విషయంలో అభిప్రాయ భేదాలు లేవు.అయితే వాస్తవ విషయాలను చూడకుండా మనం కళ్ళు మూసుకోరాదు. స్త్రీలలో ప్రత్యేకంగా పని చేసేందుకు పార్టీకి కొన్ని అనుబంధ సంస్థలుండి తీరాలి. కార్యనిర్వహణ గ్రూపులు, ఉప సంఘాలు, కమిటీలు, సెక్షన్లు - ఇలా ఏ పేరుతో నైనా వాటిని పిలవచ్చు. వాటి ప్రత్యేక విధులు మహిళా ప్రజానీకాన్ని చైతన్యవంతులను
చేయడం; పార్టీతో వారికి సాన్నిహిత్యం కలిగించి పార్టీ పలుకుబడి క్రిందికి వారిని తీసుకురావడం; ఇందుకై మహిళా ప్రజానీకంలో క్రమబద్ధంగా పనిచేయాలి. నిస్తబ్దత నుండి బయటపడి కార్యరంగంలో ప్రవేశిస్తున్న మహిళలలో బోధనా కార్యక్రమం తీసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన జరిగే శ్రామికవర్గ పోరాటాల్లో వారిని సమీకరించి విజ్ఞానవంతుల్ని చేయాలి.
____లెనిన్
Kumaraswamy pilla
9490122229
9490122229
Comments
Post a Comment