అంతర్జాతీయ పుస్తక దినం







*చనిపోయిన వాళ్ళకి పదో రోజున దినం చేస్తారు.సంవత్సరానికోసారి తద్దినం పెడతారు.అది ఒకప్పుడు.ఇప్పుడు మనం భారతదేశంలో ఉంటున్న విదేశీయులం.అందుచేత వాళ్ళ మదర్స్ డే , ఫాదర్స్ డే లాంటి అన్ని దినాల్ని దిగుమతి చేసుకున్నాం.వాటిలో ఒకటి ఈ .*
అంతర్జాతీయ పుస్తక దినం
        *అయితే ఈ దినం మాత్రం కచ్చితంగా జరుపుకోవాలి.* ఎందుకంటే ఇపుడసలు పుస్తకం చచ్చిపోయింది.సాహిత్యం సంతకెళ్లింది.జీవితం వేగం పెరిగింది.మనకసలు దేనికీ టైమ్ దొరకడం లేదు. *ఉన్న టైమంతా డబ్బుకోసం వెంపర్లాడటానికే సరిపోతోంది.*

      *పుస్తకం హస్తభూషణం అన్నారొకప్పుడు.ఏం ఉంది పుస్తకాల్లో అంటున్నారిప్పుడు.పెద్ద పెద్ద మేధావుల జీవితాలు ,మహాత్ముల చరిత్రలు చదివితే వాళ్ళని పుస్తకాలు ఎంత ప్రభావితం చేశాయో తెలుస్తుంది.గాంధీ గారిని టాల్ స్టాయ్ పుస్తకాలు ఎంతో ప్రభావితం చేశాయట.మనిషిని ఆలోచింపజేసేది పుస్తకం మాత్రమే.మనుషుల్నే కాదు దేశ  చరిత్రల్నేమార్చేసే శక్తి పుస్తకాలకుంది.ఫ్రెంచి విప్లవం ,రష్యన్ విప్లవం వంటి విప్లవాలకి అప్పటి రచనలు ఎంతో సాయపడ్డాయి.*

        *బ్రిటన్లో ఎన్నో చట్టాలు రావడానికి కారణం డికెన్స్ రచనలు అని ఎంతమందికి తెలుసు?*  *" పుస్తకాలను ప్రేమించండి.జీవితాన్ని సుఖమయం చేస్తాయి "* అంటాడు గోర్కీ .టీ వీ లు వచ్చాక ప్రజలకు బద్ధకం ఎక్కువయ్యింది.పుస్తకం చదివే టైమూ ఓపికా పోయాయి .సాహిత్యం మాట దేవుడెరుగు.పిల్లలు క్లాస్ పుస్తకాలు కూడా చదవటం లేదు.గైడ్లూ ,మోడల్ పేపర్లూ చదివి పాసైపోతున్నారు. తల్లిదండ్రులకూ శ్రద్ధ లేదు.ఎవరైనా ఏదైనా పుస్తకం చదువుతుంటే - ఎందుకా పుస్తకాలు.కూడు పెడతాయా ? గుడ్డ పెడతాయా ? పాఠాలు చదువు.మరో నాలుగు మార్కులు వస్తాయి.అంటున్నారు.

          మా చిన్నతనం లో స్కూలు యానివర్సరీకి పుస్తకాలే ప్రైజులుగా ఇచ్చేవారు.ఇప్పుడు ఏ ప్రైజ్ అయినా ప్లాస్టిక్ చిప్పలే.టీవీల్లో చచ్చు సీరియల్స్ కి బదులు మంచి పుస్తకాలగురించీ మంచి రచయితల గురించీ చెప్పవచ్చు.కానీ అక్కడా డబ్బే ప్రధానం." ఎవరు చూస్తారండీ మీ వెర్రి గానీ " అని నవ్వుతారు.

          *మంచిపుస్తకం చదివితే కలిగే ఆనందం దేనికీ సాటిరాదు.గొప్ప పుస్తకం మనచేత ఆలోచింపజేస్తుంది.మనసునీ మనిషినీ పదునెక్కిస్తుంది.*

          *అసలు నిజానికి ఏ వయసులో ఆ వయసుకి తగిన పుస్తకాలు చదివించడం ఇప్పటికైనా అలవాటు చేయించండి.చిన్నపిల్లలకి పరమానందయ్య శిష్యుల కథలూ తెనాలి రామకృష్ణుని కథలూ పంచతంత్రం లాంటివి ఎంతో ఉపయోగపడతాయి.వాటిలో వినోదంతో బాటు నీతికూడా ఉంటుంది.*

          *కొన ఊపిరితో ఉన్న పుస్తకాన్ని తిరిగి బతికించండి.అదేమంత కష్టం కాదు.* మనక్కావల్సింది కొంచెం శ్రద్ధ.మరికొంచెం దీక్ష.ఇవి మనకి లేవని నేననుకోవడం లేదు.ఎటొచ్చి ఆలోచించడం లేదు.కొంచెం ఆలోచించండి.చాలు.

*( బీనాదేవి గారికి కృతజ్ఞతలతో )* 
                                   *.       *.                                                                (ఈవేళ ప్రపంచ పుస్తక దినోత్సవం)*                                                                     *" ఒకసారి మంచి పుస్తకం చదివితే ఒక కొత్త స్నేహితుణ్ని సంపాదించుకున్నట్టవుతుంది.రెండవసారి చదివితే పాత స్నేహితుణ్ని కలిసిన ఆనందం వస్తుంది "* -గ్లాడ్ స్టన్.

---ప్రకాష్

vijay pilla
9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు