విద్యా వ్యవస్థ




  

వ్యక్తులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది.
విద్యా సంస్థలు పూర్తిగా రాజ్య వ్యవస్థ చేతిలో ఉండాలి. విద్యా బోధన మూడు భాగాలుగా ఉంటుంది. 1. చదవడం రాయడం 2. క్రీడలు 3. సంగీతం.
చదవటం రాయటం పాలనా వ్యవహారాల గురించి తెలుసుకోవాలనుకునే వారికి విధిగా తెలిసి ఉండాలి.అర్హతను బట్టి వివిధ శాస్త్రాల్లో పాండిత్యం సంపాదించినవాడు పాలనావ్యవహారాల్లో భాగం పంచుకోవాలి. క్రీడలు శారీరక ఆరోగ్యానికి అవసరం .అవి సాహస ప్రవృత్తిని  పెంచుతాయి.   సంగీతంలో ఉండే లయ, మాధుర్యం, భావాలలో క్రమబద్ధత, సున్నితత్వం ఉండేందుకు తోడ్పడతాయి. ఆగ్రహం, సహనం, దైర్యం ,విచక్షణ వీటన్నిటికీ సరైన సరిహద్దులు ఏర్పరుస్తాయి. అందువల్ల దేన్ని ప్రేమించాలో దేన్ని ద్వేషించాలో మానవుడు తెలుసుకొని సరైన నిర్ణయం తీసుకోగలుగుతాడు. ఈ విధంగా సంగీతం మన స్వభావాన్ని తీర్చిదిద్దుతుంది. శారీరక మానసిక శక్తిని సమన్వయించి అభివృద్ధి పరచగలిగేదే ఉత్తమ విద్యా విధానం.



_అరిస్టాటిల్( పోలిటిక్స్) (క్రీ.పూ 384_ 447)
(సేకరణ: పిళ్లా విజయ్)
**************************

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు