స్వంత ముద్ర వేయాలి









ప్రపంచంలో ప్రతి విషయం మనం మొదట అనుకరించడంతో  నేర్చుకుంటాం.
మాటలు నేర్చుకుంటాం.నడక నేర్చుకుంటాం. వయసు పెరిగే కొద్దీ సమాజంలో ఎవరో ఒకరిని అనుకరిస్తాం వారి  ప్రభావం మన మీద పడుతుంది.ఇంట్లో వాళ్ళను అనుకరించడం మానేస్తాం. సినిమా  సెలబ్రిటీల స్టైల్, డ్రస్సు అన్నీ అనుకరించడం మొదలవుతుంది. 
      ఇంకొకడు వచ్చి కొత్తగా ఏదైనా చేస్తే వాడి ఆలోచనల్ని అనుకరిస్తాం.ఈ అనుకరణతో మనది కాని జీవితాన్ని  మనం జీవిస్తాం.
    ప్రారంభంలో అనుకరించినా మెల్లగా దాన్ని వదిలి మన స్వంత మన స్టైల్, మన నడక 
ప్రపంచానికి చాటాలి. నీదంటూ కొత్త బాటను సమాజానికి చూపించాలి.కార్యక్రమాలు చేసినా వినూత్నంగా ఉండాలి.
          మన బాలీవుడ్ మేధావులను చూడండి. ప్రమోషన్లు కూడా తెల్లవాళ్ళనే కాపీ కొట్టేస్తారు. చివరికి మొన్న ఆస్కార్ లాగా ఐఐఎన్ఏ అవార్డ్సు అని ఒక ఫంక్షన్ పెట్టారు. అందులో థీమ్ కాపీ, సూటులూ కాపీ, నవ్వులూ కాపీ, చివరికి అవార్డ్ అనౌన్స్ చేశాక పెట్టుకునే ముద్దులూ కాపీ, స్టేజ్ మీదకు వెళ్ళాక స్పందనలో వచ్చేఎమోషన్స్ కూడా కాపీ. ఇలా కాపీ బతుకులు మనకెందుకు?
           ఇటీవల కవితలను,కథలను కాపీ కొట్టేవారు అధికమయ్యారు.కాపీ కొట్టడం అంటే మొత్తం యధాతథంగా తీసుకొంటున్నారు. స్వంత స్వరం ఉండాలి.స్వంత మార్గాన్ని
కొంత కష్టడితే సాధ్యమవుతుంది.
          అనుకరణ వదలి తనదైన ముద్ర ను
వేయాలి.ప్రపంచానికి నీవేమిటో చూపాలి.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు