రాజకీయ వ్యవస్థలు



      రాజకీయ వ్యవస్థలు                

      రాజ్యపాలన కోసం పౌరులు ఏర్పాటు చేసుకున్నదే రాజ్యాంగం .రాజకీయ వ్యవస్థలు మూడు తరగతులు. ఒకటి రాచరికం .రెండు అరిస్టోక్రసీ  (కొద్దిమంది అర్హుల  పాలన) 3 రాజ్యాంగబద్ధ పాలన (ఎక్కువమంది పాలించేది)
 ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తే ఏదైనా మంచిదే. కానీ ప్రజల శ్రేయస్సు కన్నా అధికార వాంఛ ప్రబలంగా ఉంటే ఆ వ్యవస్థలు పతన దశకు చేరుకుంటాయి. అది రాచరిక వ్యవస్థ అయితే  నియంతృత్వం అవుతుంది. అది  అరిస్టోక్రసీ అయితే ధనమదాంధులపాలన   అవుతుంది. అది రాజ్యాంగబద్ధ పరిపాలన  అయితే ప్రజాస్వామ్యం అవుతుంది.
ఏ ప్రజాస్వామ్యం ఆయినా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. మంచిచెడులను కొద్ది మంది కన్నా ఎక్కువ శాతం ప్రజలు నిర్ణయిస్తే  పొరపాటు తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది .అయితే మంచి చెడ్డల గురించి చూడగలిగే విచక్షణా జ్ఞానం అందరికీ ఉండదు. ఈ అర్హత ఉన్న వారికే నిర్ణయాధికారం ఉండాలి. శాసనకర్తలు న్యాయపాలన చేసేవాళ్లను ఎన్నికల ద్వారా ఎంపిక చేసుకోవడం మంచిదే. అయితే ఓటు హక్కు అర్హులకు మాత్రమే ఉండాలి. అంటే ప్రజాస్వామ్యంలోని ఉత్తమ లక్షణాలు సమన్వయం చేసి రాజ్యాంగబద్ధ పాలన ఏర్పరచాలన్నమాట. అదే ఉత్తమ వ్యవస్థ. అలా కానప్పుడు పైకి చాలా ఆకర్షణీయంగా కనిపించే ప్రజాస్వామ్యం ఆచరణలో మూకస్వామ్యం  అవుతుంది.

___అరిస్టాటిల్ (పోలిటిక్స్) (క్రీపూ384 _447)

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు