మార్క్ ట్వైన్
'మార్క్ ట్వైన్' అన్న కలం పేరు కలిగిన రచయిత అసలు
పేరు శామ్యూల్ లాంగ్ హారన్స్ క్లెమెన్స్, 'ట్వైన్' అన్న పదానికి
పాత ఇంగ్లీషులో అర్థం 'రెండు'; 'మార్క్' అంటే 'లోతు'.
నావికులకు ఒక లోతు అంటే ఆరడగులు; రెండు
లోతులయితే పడవ క్షేమంగా తిరిగి వెళ్లగలిగే లోతు.
తనకున్న నదీ ప్రయాణాల అనుభవంనుండి క్లెమెన్స్ ఈ
కలం పేరును స్వీకరించాడు. అమెరికాలో గొప్ప హాస్య
రచయితగా పేరు తెచ్చుకున్నాడు. అతడి రెండు ప్రముఖ నవలలు: The Adventures of Tom Sawyer (1876). The
Adventures of Huckleberry Finn (1885). ఈ హకల్ బెరీ
ఫిన్ నవలను గొప్ప అమెరికా నవలగా పేర్కొన్నారు. అతడు
మిస్సోరీలోని హాన్నిబాల్లో పెరిగాడు. ఈ నవలల్లో ఆ
ప్రాంతాల దృశ్యాలనే అతడు చిత్రీకరించాడు. అతడు రాసిన
మరొక నవల The Prince and the Pauper కూడ
సుప్రసిద్ధమే. తెలుగులో దీన్ని రాజు-పేద అన్న పేరుతో
సినిమాగా కూడ తీశారు. పైన పేర్కొన్న మూడు నవలలను
నండూరి రామమోహన రావు తెలుగులోకి అనువదించాడు.
వర్జీనియా సిటీ న్యూస్ పేపరు ది టెరిటోరియల్ ఎంటర్ ప్రైజ్ లో పనిచేస్తూ మొదటగా తన కలం పేరును
ఉపయోగించుకున్నాడతను.
మిస్సోరీ బానిస విధానం పాటించే రాష్ట్రం, అలా ట్వైన్ కు చాల చిన్నప్పుడే బానిస విధానంతో పరిచయం ఏర్పడింది.
తండ్రి చనిపోయాక 12 యేండ్ల వయసులోనే ముద్రాపకుడి వద్ద అప్రెంటిస్ గా చేరాడు. అప్పుడే అతడు రాయటం మొదలెట్టాడు. స్టీమ్ బోటుకు పైలట్‌గా కూడ పనిచేశాడు. ఆ తర్వాత మైనర్‌గా కూడ పని చేశాడు. ఎన్నో దేశాలకు
వెళ్లాడు. జర్నలిస్టుగా స్థిరపడ్డాడు. తనకు వయసు వస్తున్న కొద్దీ ట్వైన్ రాడికల్ గా మారాడు. సామ్రాజ్యవాద వ్యతిరేకీ
అయ్యాడు. అతడు స్వేచ్ఛ, బానిస విముక్తి కోసం కృషి చేశాడు. స్త్రీల హక్కులకోసం కూడ అతడు పాటుపడ్డాడు.
అతని ప్రయత్నాలవల్ల లాభపడిన వారిలో ఒకరు హెలెన్ కెల్లర్; తాను అంధురాలైనా, కాలేజీ చదువు
కొనసాగించగలిగింది, ఎదగ గలిగింది.
1907లో ఆ ఫర్ యూనివర్సిటీ అతడికి ఆనరరీ డాక్టరేటు (డిలిటి) ను ప్రదానం చేసింది.
(ప్రపంచ కథా సాహిత్యం నుండి)
Comments
Post a Comment