సోమర్సెట్ మామ్
విలియం సోమర్సెట్ మామ్ 1874 జనవరి 26
పారిస్ లో జన్మించి, 1965 డిసెంబరు 16న ఫ్రాన్స్ లోని నీస్ లో మరణించిన ప్రముఖ ఆంగ్ల నాటకకర్త,నవలా కారుడు, కథారచయిత. తల్లి, తండ్రి అతని బాల్యంలోనే చనిపోయారు. మత గురువుగా ఉంటున్న పెదతండ్రి హెన్రీ మామ్ సంరక్షణలో పెరిగాడు. చిన్న వయసులో మామ్ కున్న నత్తి కారణంగా తాను చదువు
కున్న కాంటరీ స్కూలు పిల్లల హేళనకు గురయ్యాడు. మత గురువులో వుండాల్సిన ప్రేమ, ఔదార్యం,ఆధ్యాత్మిక చింతన తన పెత్తండ్రిలో లేకపోవటం
చూసిన మామ్ కు మత గురువుల్లో నమ్మకం పోయింది.
ప్రార్థనతో కొండలుకూడ కదులు తాయని పెద తండ్రి చెప్పడం ఎన్నో సార్లు విన్నాడు .తనకు నత్తి పోవాలని ఎంతో విశ్వాసంతో ప్రార్థించినా నత్తిపోలేదు.అది అతడు నాస్తికుడవటానికి ఒక కారణం. తండ్రి లాగా తనూ డాక్టర వుదామని, లండనులోని సెయింట్ థామస్ మెడికల్ స్కూల్లో చదివి, 1897లో డాక్టరు పట్టా పుచ్చుకున్నాడు కానీ, ప్రాక్టీసు చెయ్యలేదు, రచనా వృత్తిని చేపట్టాడు. డాక్టరు చదువు చివరియేడులో పురుళ్లు పోసేప్పుడు మురికి వాడలను నిశితంగా పరిశీలించిన ఫలితమే అతడి మొదటి రచన Lizaof Lambeth (1897), అతడి ఉత్తమ రచన Of Human Bondage (1915) నవల.
దా న్లో తన బాల్యా న్నంతా
యథాతథంగా చిత్రించాడు మామ్. 'నన్ను బాధించే కొన్ని సంఘటనలు, క్రుంగదీసే అంతరంగం - వీటి నుండి
విముక్తుణ్ణవటానికే ఈ నవల రాశా'నని చెప్పుకున్నాడు మామ్. మామ్ భౌతికవాది, నాస్తికుడు, ఆదర్శవాదమంటే
పడదు అతనికి. మనిషి కార్యాచరణకు ముఖ్యకారణం స్వార్థం. దాన్ని దుర్మార్గంగా చిత్రించే ఆదర్శవాదం (మతం)
మనిషిని కపటిని చేస్తుంది. బాధలు మనిషిని ఉన్నతుణ్ణి చేస్తాయనటం అబద్ధం; అవి మనిషిలో చిరచిరలాడే స్వభావాన్ని కలిగిస్తాయి. 'డబ్బంటే లెక్కలేనట్టు మాట్లాడే మనుషులంటే నాకు అసహ్యం; అలాంటి వాళ్లు కపటులో, మూర్ఖులో అయిఉండాలి. డబ్బన్నది ఆరో ఇంద్రియం. అది లేకపోతే మిగతా ఇంద్రియాలు పనిచెయ్యవు' అని డబ్బుపట్ల
తనకున్న ఆరోగ్యకరమైన భావనను ఒక పాత్ర ద్వారా చెప్పిస్తాడు. మామ్ దృక్పథంలో ఏ మనిషి ఎప్పుడు ఎట్లా
ప్రవర్తిస్తాడో చెప్పటం కష్టం.
తెలుగులో ప్రముఖరచయిత అయిన బుచ్చిబాబు మామ్ వల్ల ఎంతో ప్రభావితు డయ్యాడు. అతడి చివరకు మిగిలేది ఆ ప్రభావంతో రాసినదే.
( ప్రపంచ కథా సాహిత్యం నుండి)
Comments
Post a Comment