ఆరెస్సెస్ - భారత రాజ్యాంగం

 

భారత రాజ్యాంగంలో మనుధర్మ సూత్రాల ప్రస్తావన లేదంటూ, రాజ్యాంగాన్ని తీవ్రంగా వ్యతిరేకించినది ఆరెస్సెస్.,
26 నవంబరు 1949న రాజ్యంగాన్ని స్వీకరించిన తరువాత 30 నవంబరు 1949 ఆర్గనైజరు పత్రికలో ఆరెస్సెస్ రాజ్యాంగం మీద ఈ రకంగా విషం కక్కింది.,

""భారతదేశానికి రాజ్యాంగం ఇప్పుడు కొత్తగా రాయాల్సిన అవసరం లేదు., ప్రాచీన కాలంలో మనువు రాసిన సూత్రాలు ఉన్నప్పటికీ వాటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేకపోవడం సోచనీయం., ప్రపంచానికే ఉత్తేజంతో దారి చూపగల ఆరాధనపూరితమైన మనుధర్మ శాస్త్రం ఈ రాజ్యాంగ పండితులకు మాత్రం గుర్తు కూడా రాలేదు""

26 జనవరి 1950న రాజ్యాంగం ఆమోదించిన సమయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడుతూ " ఈ రాజ్యాంగం భారతదేశంలో సమానత్వ సాధనకు ఉద్దేశించబడినదంటూ ప్రసంగించారు.. దీనిని వ్యతిరేకిన్తూ 6 ఫిబ్రవరి 1950న ఆరెస్సెస్ తన ఆర్గనైజర్ పత్రికలో "హృదయాలను ఏలే మనువు" (Manu rules the hearts) పేరుతో ఒక వ్యాసం ప్రచురించి ఈ విధంగా విమర్శించింది..

""" బొంబాయిలో అంబేద్కరు మాట్లాడుతూ ఇక ఈ దేశంలో మనువుకు రోజులు చెల్లిపోయాయి అన్నట్లు తెలిసింది., కానీ నిజానికి మనువు ప్రతి హిందువు గుండెల్లో ఎప్పటికీ ఉంటాడు.. రోజువారి జీవితంలో మనువు ఏర్పాటు చేసిన సూత్రాలు కొనసాగుతాయి,. సాంప్రదాయ కుటుంబాలలో జన్మించకపోయినప్పటికీ, శూద్రలు కూడా మనువుని గుండెల్లో పెట్టుకుని పూజిస్తారు., ఈ సమానత్వం అనేది అమలు అయితే ఆ వ్యక్తులు బలం లేనివారుగా భావించి మనువు సూత్రాలను ఏదో ఒక సందర్భంలో పాటించి తీరాల్సిందే"""

 ఈ విధంగా ఆరెస్సెస్ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ తాము మనుధర్మాన్నే అనుసరిస్తానని ప్రకటించుకుంది...

ఈ రోజుకి కూడా ఆరెస్సెస్ కోసం బలహీన వర్గాలు ఎంత త్యాగం చేసినా ఆరెస్సెస్ అధినేతలుగా కేవలం బ్రాహ్మణులే కొనసాగడం ఆనవాయితీగా వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.. ఇది మనువాద వ్యవస్థకు చిహ్నమే..

గాంధీ హత్య నేపథ్యంలో 4 ఫిబ్రవరి 1948న ఆరెస్సెస్ మీద రెండవసారి నిషేదం విధించినపుడు గోల్వాల్కర్ సారధ్యంలో 11 ఏప్రిల్ 1949న తాము భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ, నిషేధాన్ని ఎత్తివేయమని అభ్యర్థించడంతో 11 జులై 1949 న భారత ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది.

అయినప్పటికీ మాట తప్పిన ఆరెస్సెస్ ఈ రోజుకు కూడా జాతీయ పతాకాన్ని గౌరవించడాన్ని నిరసిస్తూ వస్తోంది .
 రాజ్యాంగానికి వ్యతిరేకంగా అనేక కార్యకలాపాలకు పాల్పడుతూ వస్తోంది.


Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు