GENERAL KNOWLEDGE


1. పైకా స్మారక విద్రోహ్‌ చిహ్నానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎక్కడ పునాది రాయి వేశారు?
 1) హసన్, కర్ణాటక
 2) గాంధీ నగర్, గుజరాత్‌
 3) ఖుర్దా, ఒడిశా
 4) న్యూఢిల్లీ, ఢిల్లీ
View Answer
సమాధానం: 3
2. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో యునెస్కో–ఎంజీఐఈపీ సంయుక్తంగా నిర్వహించిన ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఎడ్యుకేషన్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ హ్యుమానిటీ (టెక్‌)– 2019 ఎక్కడ జరిగింది?
 1) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌
 2) చెన్నై, తమిళనాడు
 3) కొచ్చి, కేరళ
 4) పనాజీ, గోవా 
View Answer
సమాధానం: 1
3. ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో తొలి వర్చువల్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఎక్కడ ప్రారంభించారు?
 1) ఏయూ, విశాఖపట్నం
 2) ఏఎన్‌యూ, గుంటూరు
 3) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
 4) జేఎన్‌టీయూ, కాకినాడ

View Answer
సమాధానం: 1
4. ‘నమస్తే ఓర్చా’ పండుగ–2020ను  ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది?
 1) కే రళ
 2) అసోం
 3) పశ్చిమ బంగా
 4) మధ్యప్రదేశ్‌
View Answer
సమాధానం: 4
5. కొత్త పౌరసత్వ సవరణ చట్ట బిల్లు 2019 ప్రకారం 2014 డిసెంబర్‌ 31ముందు భారత్‌కు వలస వచ్చిన ఏ దేశ ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది?
 1) బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్‌
 2) బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌
 3) బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్‌
 4) బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌

View Answer
సమాధానం: 2
6. పౌరసత్వ సవరణ చట్టం 2019 ప్రకారం మూడు పొరుగు దేశాల నుంచి వచ్చిన పౌరులు.. భారత్‌లో  ఉద్యోగాలు సాధించడం, భూమి కొనుగోళ్లు చేయటం, లేదా  స్థిరపడటానికి అవకాశం ఉన్న సామాజిక వర్గాలు ఏవి?
 1) హిందూ, బౌద్ధులు, జోరాస్టియన్, పార్శి, జైన్, సిక్కు
 2) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, పార్శి, జైన్, సిక్కు
 3) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, జైన్‌
 4) హిందూ, బౌద్ధులు, క్రిస్టియన్, ఇస్లాం, జైన్, సిక్కు

View Answer
సమాధానం: 2
7. జాతీయ గంగా కౌన్సిల్‌ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
 1) న్యూఢిల్లీ, ఢిల్లీ
 2) కాన్పూర్, ఉత్తరప్రదేశ్‌
 3) ఛండీగఢ్, హరియాణ
 4) జైపూర్, రాజస్థాన్‌

View Answer
సమాధానం: 2
8. నమామి గంగే ప్రాజెక్టు 2015–20 గాను ఐదు రాష్ట్రాల్లో (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, పశ్చిమబంగా) ఎంత మూలధనాన్ని కేటాయించారు?
 1) రూ. 20 వేల కోట్లు
 2) రూ. 15 వేల కోట్లు
 3) రూ. 10 వేల కోట్లు
 4) రూ. 5 వేల కోట్లు

View Answer
సమాధానం: 1
9. ఫోరెన్సిక్‌ నివేదికల్లో సేకరించిన నమూనాలకు ఫూల్‌ప్రూఫ్‌ భద్రతను కల్పించడానికి సాయపడే యునిక్‌∙బార్‌కోడింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ‘ట్రాకియా’ను ప్రవేశపెట్టిన మొదటి  రాష్ట్రం ఏది?
 1) హరియాణ
 2) కేరళ
 3) మహారాష్ట్ర
 4) మధ్యప్రదేశ్‌
View Answer
సమాధానం: 1
10. మిషన్‌ అంత్యోదయ పథకం 2019 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన గ్రామ పంచాయతీ ఏది?
 1) అతిరంపుజ–కేరళ
 2) జంగ్నపార–మేఘాలయ
 3) బంభానీ–గుజరాత్‌
 4) మొలుగంబూండి–తమిళనాడు

View Answer
సమాధానం: 4
11. "ISPATI IRADA'కు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎవరు?
 1) పి.వి. సింధు
 2) గీతా ఫోగట్‌
 3) ద్యుతిచంద్‌
 4) విరాట్‌ కోహ్లి
View Answer
సమాధానం: 1
12. 2019 డిసెంబర్‌ 16న రాష్ట్రస్థాయి ఆరెంజ్‌ ఫెస్టివల్‌ 16వ ఎడిషన్‌ను ఏ రాష్ట్రం నిర్వహించింది?
 1) అసోం
 2) మణిపూర్‌
 3) మేఘాలయా
 4) మిజోరం
View Answer
సమాధానం: 2
13. మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో జరిగిన 95వ ‘తాన్‌సేన్‌ సమరో’ ఏ కళారూపానికి సంబంధించింది?
 1) సింగింగ్‌
 2) పెయింటింగ్‌
 3) శాస్త్రీయ సంగీతం
 4) డ్యాన్స్‌
View Answer
సమాధానం: 3
14. ‘జాతీయ తాన్‌సేన్‌ సమ్మాన్‌ అవార్డు 2019’   తో ఎవరిని సత్కరించారు?
 1) పండిట్‌ విద్యాధర్‌ వ్యాస్‌
 2) శౌనక్‌ అభిషేకి
 3) రాజేశ్వర్‌ ఆచార్య
 4) జితేంద్ర అభిషేక్‌

View Answer
సమాధానం: 1
15. ప్రెసిడెంట్స్‌ కలర్స్‌ అవార్డుతో సత్కారం పొందిన 7వ పోలీసు అధికారి ఏ రాష్ట్రానికి చెందినవారు?
 1) గుజరాత్‌
 2) పశ్చిమ బంగా
 3) తమిళనాడు
 4) ఉత్తరప్రదేశ్‌
View Answer
సమాధానం: 1
16. ఏ సంవత్సరం  నాటికి దేశంలోని గ్రామాలన్నింటికీ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది?
  1) 2022
 2) 2023
 3) 2025
 4) 2030
View Answer
సమాధానం: 1
17. ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ కింద భారత్‌ ఏ దేశంలో 11 వారసత్వ కట్టడాలను పునర్నిర్మించనుంది?
 1) బంగ్లాదేశ్‌
 2) శ్రీలంక
 3) నేపాల్‌
 4) మయన్మార్‌
View Answer
సమాధానం: 3
18. ‘జియోసైన్స్‌: ది బేసిక్‌ సైన్స్‌ ఫర్‌ సస్టేనబుల్‌ డెవలప్‌మెంట్‌’ నేపథ్యంతో 36వ అంతర్జాతీయ జియోలాజికల్‌ సమావేశం(ఐజీసీ) ఎక్కడ జరగనుంది?
 1) టోక్యో, జపాన్‌
 2) బీజింగ్, చైనా
 3) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
 4) న్యూఢిల్లీ, భారత్‌
View Answer
సమాధానం: 4
19. క్లైమెట్‌ స్మార్ట్‌ ఫార్మింగ్‌ సిస్టమ్స్‌పై బిమ్స్‌టెక్‌ దేశాల అంతర్జాతీయ సెమినార్‌ ఎక్కడ జరిగింది?
 1) ఢాకా
 2) న్యూఢిల్లీ
 3) ఖాట్మాండు      
 4) బ్యాంకాక్‌
View Answer
సమాధానం: 2
20. 2005–06లో శిశు జననాల నమోదు 41 శాతం కాగా, 2015–16 సంవత్సరం తర్వాత  నమోదైన శిశు జననాల శాతం?
 1) 71% 
2) 75%
 3) 80%
 4) 95%
View Answer
సమాధానం: 3
21.కర్బన ఉద్గారాలను తటస్థం చేయడానికి యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?
 1) 2050
 2) 2040
 3) 2030
 4) 2025
View Answer
సమాధానం: 1
22. యూరోపియన్‌ యూనియన్‌  వాతావరణ తటస్థ ఒప్పందం–2050 నుంచి వైదొలిగిన   దేశం ఏది?
 1) ఇటలీ
 2) ఫ్రాన్స్‌
 3) పోలాండ్‌
 4) జర్మనీ
View Answer
సమాధానం: 3
23. ప్రపంచ వాణిజ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ‘జెండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌–2019’లో భారత ర్యాంకు ఎంత?
 1) 114
  2) 113
 3) 112
  4) 111
View Answer
సమాధానం: 3
24. మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ రిపోర్టు:‘గ్లోబల్‌ మ్యాక్రో అవుట్‌లుక్‌ 2020–21 ప్రకారం 2019 సంవత్సరానికిగాను భారత జి.డి.పి. ఎంత ?
 1) 5.1%
 2) 5.2%
 3) 5.5%
 4) 5.6%
View Answer
సమాధానం: 4
25. ఇటీవల కువైట్‌ను అధిగమించి భారత దేశానికి 6వ అతిపెద్ద చమురు సరఫరాదారుగా నిలిచిన దేశం ఏది?
 1) యూఎస్‌ఏ
 2) నైజీరియా
 3) వెనిజులా
 4) యూఏఈ
View Answer
సమాధానం: 1
26.ఎడెల్వేస్‌ అసెట్‌ మేనెజ్‌మెంట్‌ కంపెనీ ప్రారంభించిన భారతదేశపు తొలి కార్పోరేట్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ఏది?
 1) భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
 2) ఎడెల్విస్‌ బాండ్‌ ఈటీఎఫ్‌
 3) ఇండియా బాండ్‌ ఈటీఎఫ్‌
 4) దేశీ బాండ్‌ ఈటీఎఫ్‌

View Answer
సమాధానం: 1
27. భారత్‌ తన స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన నావిగేషన్‌ సిస్టమ్‌ ‘నావిక్‌ (నావిగేషన్‌ విత్‌ ఇండియన్‌ కాన్‌స్టే్టలేషన్‌)’ను అనుబంధ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థగా నియమించిన  దేశం ఏది?
 1) రష్యా
 2) యూఎస్‌ఏ
 3) ఇజ్రాయెల్‌ 
4) ఫ్రాన్స్‌
View Answer
సమాధానం: 2
28. కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ ది పార్టీస్‌ (కాప్‌–25) 25వ సెషన్‌కు ఆతిథ్యం ఇచ్చిన∙నగరం ఏది?
 1) టోక్యో, జ పాన్‌
 2) బీజింగ్, చైనా
 3) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
 4) మాడ్రిడ్, స్పెయిన్‌

View Answer
సమాధానం: 4
29. కాలుష్య ఉద్గారాల తీవ్రతను తగ్గించడానికి భారత్‌ తన జి.డి.పి.లో ఎంత శాతం కేటాయించింది?
 1) 33%
 2) 30%
 3) 15%
 4) 21%
View Answer
సమాధానం: 4
30. క్లైమేట్‌ న్యూట్రల్‌ నౌ విభాగంలో ఐక్యరాజ్య సమితి నుంచి అవార్డు పొందిన తొలి భారత కార్పోరేట్‌ సంస్థ ఏది?
 1) రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
 2) టెక్‌ మహీంద్రా
 3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌
 4) ఇన్ఫోసిస్‌

View Answer
సమాధానం: 4
31. యునెస్కో ప్రతిష్టాత్మకంగా చేపట్టే  వారసత్వ జాబితాలో ఏ మసాజ్‌ చోటు దక్కించుకుంది?
 1) నువాద్‌ థాయ్‌ (థాయ్‌లాండ్‌)
 2) బాలినీస్‌ మసాజ్‌ (బాలి)
 3) భారత ఆయుర్వేదిక్‌ మసాజ్‌
 4) హాట్‌ స్టోన్‌ మసాజ్‌ (వియత్నాం)

View Answer
సమాధానం: 1
32. సముద్ర మార్గంలో –253 డిగ్రీల ద్రవ హైడ్రోజన్‌ను తీసుకెళ్లగల క్యారియర్‌ షిప్‌ ‘సూసో ఫ్రాంటియర్‌’ను ప్రారంభించిన ప్రపంచంలోనే తొలి దేశం ఏది?
 1) యూఎస్‌ఏ
 2) జపాన్‌
 3) చైనా
 4) రష్యా
View Answer
సమాధానం: 2
33. ప్రపంచంలోనే లోతైన లోయను ఎక్కడ కనుగొన్నారు?
 1) తూర్పు ఆస్ట్రేలియా
 2) తూర్పు ఆఫ్రికా
 3) తూర్పు ఆసియా
 4) తూర్పు అంటార్కిటికా
View Answer
సమాధానం: 4
34. ఇటీవల తన రెండో విమాన వాహకనౌక ‘షాన్‌డాంగ్‌’ను ప్రారంభించిన దేశం ఏది?
 1) యూఎస్‌ఏ
 2) చైనా
 3) ఫ్రాన్స్‌
 4) రష్యా
View Answer
సమాధానం: 2
35. రిసైకిల్‌ చేసిన, పునర్వినియోగించే వ్యర్థాలను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు లేదా కొనుగోలు చేయడానికి తొలిసారి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను  ఏర్పాటు చేసిన సంస్థ?
 1) హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌
 2) గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌
 3) ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌
 4) బెంగళూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌

View Answer
సమాధానం: 2
36. అంతర్జాతీయ ఆస్ట్రోనామికల్‌ యూనియన్‌   హెచ్‌.డి.86081 అనే నక్షత్రానికి ‘బీభా’ అని ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టారు?
 1) బీభా చౌదరీ
 2) బీభా అగర్వాల్‌
 3) బీభా ఆచార్య
 4) బీభా లఘారీ
View Answer
సమాధానం: 1
37. ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు ఎవరిని చైర్మన్‌గా  నియమించారు?
 1) శ్రీకాంత్‌ మాధవ్‌ వైద్య
 2) ఎస్‌.ఎస్‌. సందీప్‌ రంజన్‌
 3) జి.కె. హరీశ్‌
 4) సంతోష్‌ సింగ్‌

View Answer
సమాధానం: 1
38. ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌  మంత్రుల బృందానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్థానంలో ఎవరు నాయకత్వం వహించనున్నారు?
 1) తేజస్వీ యాదవ్‌
 2) నితీష్‌ కుమార్‌
 3) లాలు ప్రసాద్‌ యాదవ్‌
 4) సుశీల్‌ కుమార్‌ మోదీ

View Answer
సమాధానం: 4
39. 2019 డిసెంబర్‌ 13న యూనైటెడ్‌ కింగ్‌డమ్‌కు ప్రధాన మంత్రిగా ఎన్నికైంది ఎవరు?
 1) గోర్డాన్‌ బ్రౌన్‌
 2) డేవిడ్‌ కామెరాన్‌
 3) థెరిసామే
 4) అలెగ్జాండర్‌ బోరిస్‌ డి ప్ఫెఫెల్‌ జాన్సన్‌

View Answer
సమాధానం: 4
40. 2019 డిసెంబర్‌ 16న 28వ ఆర్మీ చీఫ్‌గా ఎవరు నియమితులైయ్యారు?
 1) సతీందర్‌ కుమార్‌ సైని
 2) మనోజ్‌ ముకుంద్‌ నారావణే
 3) దేవరాజ్‌ అన్బు
 4) రణబీర్‌ సింగ్‌

View Answer
సమాధానం: 2
41. బీబీసీ స్పోర్ట్స్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ద ఇయర్‌– 2019గా ఎవరు ఎంపికయ్యారు?
 1) బెంజమిన్‌ ఆండ్రూ స్టోక్స్‌
 2) జానీ బెయిర్‌స్టో
 3) జో రూట్‌
 4) స్టీవ్‌ స్మిత్‌

View Answer
సమాధానం: 1
42. యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌లో ‘జూనియర్‌ ఫ్రీస్టైల్‌ రెజ్లర్‌ ఆఫ్‌ ద ఇయర్‌–2019’ టైటిల్‌ను 18 ఏళ్లకే గెలుచుకున్న తొలి భారత రెజ్లర్‌ ఎవరు?
 1) సుశీల్‌ కుమార్‌
 2) రాహుల్‌ అవారే
 3) మౌసం ఖత్రీ
 4) దీపక్‌ పూనియా
View Answer
సమాధానం: 4
43. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన తొలి టెస్ట్, వన్డే ఫార్మాట్‌లలో సెంచరీలు సాధించిన మొదటి బ్యాట్స్‌మన్‌ అబిద్‌ అలీ ఏ దేశానికి చెందినవాడు?
 1) బంగ్లాదేశ్‌
 2) పాకిస్తాన్‌
 3) భారత్‌
 4) ఇంగ్లండ్‌
View Answer
సమాధానం: 2
44. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది ఫోర్బ్స్‌ జాబితా–2019లో 34వ స్థానం పొందిన భారతీయ మహిళ ఎవరు?
 1) నిర్మలా సీతారామన్‌
 2) సావిత్రి కోవింద్‌
 3) స్మృతీ జుబిన్‌ ఇరానీ
 4) సోనియా గాంధీ

View Answer
సమాధానం: 1
45.జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
 1) డిసెంబర్‌ 14
 2) డిసెంబర్‌ 13
 3) డిసెంబర్‌ 12
 4) డిసెంబర్‌ 11
View Answer
సమాధానం: 1
46. భారతదేశ సిఫార్సు మేరకు ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ టీ డేని ఎప్పుడు∙నిర్వహిస్తారు?
 1) మే 21
 2) మే 30
 3) మే 25
 4) మే 15 
View Answer
సమాధానం: 1
47. 1971 భారత్, పాకిస్తాన్‌ దేశాల మధ్య జరిగిన  యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ‘విజయ్‌ దివస్‌ను’ ఏ రోజున నిర్వహిస్తారు?
 1) డిసెంబర్‌ 16
 2) డిసెంబర్‌ 15
 3) డిసెంబర్‌ 14
 4) డిసెంబర్‌ 13
View Answer
సమాధానం: 1
48. భారత దేశంలో 2013 నుంచి ఏ రోజున మైనారిటీ హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు?
 1) డిసెంబర్‌ 15
 2) డిసెంబర్‌ 16
 3) డిసెంబర్‌ 17
 4) డిసెంబర్‌ 18
View Answer
సమాధానం: 4
49. లండన్‌లో జరిగిన 69వ మిస్‌ వరల్డ్‌ పోటీలు–2019లో కిరీటం దక్కించుకుంది ఎవరు?
 1) స్టెఫానీ డెల్‌ వాల్లే
 2) మనూషి చిల్లార్‌
 3) వెనెస్సా పోన్స్‌
 4) టోని ఆన్‌ సింగ్‌
View Answer
సమాధానం: 4
[13/03, 11:04 AM] S Vizag Express: 1. మహిళ రక్షణ కోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు స్టేషన్లలో  మహిళా హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేయడానికి నిర్భయ నిధి కింద హోం మంత్రిత్వ శాఖ ఎంత మొత్తాన్ని విడుదల చేసింది?
 1) రూ. 500 కోట్లు 
 2) రూ. 400 కోట్లు
 3) రూ. 200 కోట్లు
 4) రూ. 100 కోట్లు
View Answer
సమాధానం: 4
2. హీట్‌ వేవ్‌ 2020, నాల్గో వర్క్‌షాప్‌ను ఎక్కడ నిర్వహించారు?
 1) జైపూర్, రాజస్థాన్‌
 2) బెంగళూరు, కర్ణాటక
 3) ముంబై, మహారాష్ట్ర
 4) కోల్‌కతా, పశ్చిమ బంగా

View Answer
సమాధానం: 2
3. మధ్యభారతదేశంలోనే తొలి ‘అవంతి మెగా ఫుడ్‌ పార్క్‌’ను హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ ఎక్కడ ప్రారంభించారు?
 1) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్‌
 2) ఛండీగఢ్, హరియాణ
 3) దెవాస్, మధ్యప్రదేశ్‌
 4) జైపూర్, రాజస్థాన్‌

View Answer
సమాధానం: 3
4. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లలో 2019 సంవత్సరానికి గాను ఉత్తమ పోలీసు స్టేషన్‌గా ఎంపికైన స్టేషన్‌ ఏది? 
 1) అనిని పోలీస్‌ స్టేషన్, అరుణాచల్‌ ప్రదేశ్‌
 2) ఏజీకే బుర్హాన్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్, మధ్యప్రదేశ్‌
 3) అబెర్డీన్‌ పోలీస్‌ స్టేషన్, అండమాన్, నికోబార్‌ దీవులు
 4) బాలసినోర్‌ పోలీస్‌ స్టేషన్, గుజరాత్‌

View Answer
సమాధానం: 3
5. 4వ ఇండియా వాటర్‌ ఇంపాక్ట్‌ సదస్సు– 2019 నేపథ్యం ఏమిటి?
 1) ‘వాల్యుయింగ్‌ వాటర్‌–ట్రాన్స్‌ఫార్మింగ్‌ గంగా’
 2) ‘స్టేక్‌హోల్డర్స్‌ ఫర్‌ ఎ కొహెసీవ్‌ అండ్‌ సస్టైనబుల్‌ వరల్డ్‌’
 3) ‘ఆపర్చునిటీస్‌ ఇన్‌ మాడ్రన్‌ ఫర్‌ యంగ్‌ మైండ్స్‌ అండ్‌ బిజినెసెస్‌
 4) ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ లాజిస్టిక్స్‌ ల్యాండ్‌స్కేప్‌’

View Answer
సమాధానం: 1
6. స్టార్టప్‌ ఇండియా గ్లోబల్‌ వెంచర్‌ క్యాపిటల్‌ రెండో ఎడిషన్‌∙సమావేశం ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతంలో జరగనుంది?
 1) గోవా
 2) ఒడిశా
 3) కర్ణాటక
 4) మహారాష్ట్ర
View Answer
సమాధానం: 1
7. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏ సంవత్సరం నాటికి 400 కొత్త ‘ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల’లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు?
 1) 2021
 2) 2022
 3) 2023
 4) 2024
View Answer
సమాధానం: 2
8. జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం 2019లో ఎక్కడ జరిగింది?
 1) హైదరాబాద్, తెలంగాణ
 2) కోల్‌కతా, పశ్చిమ బంగా
 3) ముంబై, మహారాష్ట్ర
 4) న్యూఢిల్లీ, ఢిల్లీ

View Answer
సమాధానం: 1
9. జియోస్మార్ట్‌ ఇండియా 20వ సమావేశం  నేపథ్యం ఏమిటి?
 1) ‘విజన్‌ న్యూ ఇండియా’
 2) ‘ఇగ్నైట్‌–ఇన్నోవేట్‌–ఇంటిగ్రేట్‌
 3) ‘ఉమెన్‌ ఫస్ట్‌– ప్రస్పెరిటీ ఫర్‌ ఆల్‌’
 4) ‘కమర్షియలైజేషన్‌ అండ్‌ కమోడిటైజేషన్‌’

View Answer
సమాధానం: 2
10. జియోస్మార్ట్‌ ఇండియా సమావేశం –2019 సందర్భంగా ‘మిషన్‌ ఇన్‌ రెజువనేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ ఫ్రెష్‌ వాటర్‌ సిస్టమ్స్‌’ అవార్డు ను ఏ మిషన్‌కు ప్రదానం చేశారు?
 1) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కృష్ణ
 2) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గోదావరి
 3) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ కావేరి
 4) నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా

View Answer
సమాధానం: 4
11. యమునా నది నీటిని విక్రయించేందుకు ఇటీవల ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంత కేబినెట్‌ ఆమోదం తెలిపింది?
 1) హిమాచల్‌ ప్రదేశ్‌
 2) ఉత్తరప్రదేశ్‌
 3) ఉత్తరాఖండ్
 4) ఢిల్లీ
View Answer
సమాధానం: 1
12. భారత నైపుణ్య నివేదిక–2020 ప్రకారం 2019–20కి గాను ఉపాది కల్పించడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? 
 1) తెలంగాణ
 2) ఉత్తర ప్రదేశ్‌
 3) మహారాష్ట్ర
 4) తమిళనాడు
View Answer
సమాధానం: 3
13. భారత సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ ‘తప్పక చూడవలసిన స్మారక చిహ్నాలను’  ఎన్నింటిని గుర్తించింది?
 1) 178
  2) 168
 3) 150
  4) 138
View Answer
సమాధానం: 4
14. ‘టుడే ఫర్‌ టుమారో’ అనే నేపథ్యంతో నిర్వహించనున్న 17వ బయో ఏషియా –2020కి ఆతిథ్యమివ్వనున్న నగరం ఏది?
 1) ముంబై
 2) గువహటీ
 3) చెన్నై
 4) హైదరాబాద్‌
View Answer
సమాధానం: 4
15. ‘ఇంద్ర 2019’ పదకొండో ఎడిషన్‌ భారత్, రష్యాల త్రివిధ దళాలు ఉమ్మడి వ్యాయామానికి ఏ రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం ఆతిథ్యం ఇవ్వనుంది?
 1) ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బంగా
 2) ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గోవా
 3) మహారాష్ట్ర, పంజాబ్, అసోం
 4) కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌

View Answer
సమాధానం: 2
16.భారత్‌ ఏ దేశానికి ఒక లైన్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌ (ఎల్‌ఓసీ), రెండు సౌర ప్రాజెక్టుల సేవలను విస్తరించింది?
 1) నైజీరియా 
2) గినియా
 3) లైబీరియా
 4) సియోర్రా లియోన్‌
View Answer
సమాధానం: 2
17. 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన –2019 ఎక్కడ జరిగింది?
 1) అసున్సియోన్, పరాగ్వే
 2) శాన్‌జోస్, కోస్టారికా
 3) హవానా, క్యూబా
 4) గ్వాడాలజారా, మెక్సికో

View Answer
సమాధానం: 4
18. మెక్సికోలోని గ్వాడాలజారాలో జరిగిన 33వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన– 2019కి ‘గౌరవ అతిథి’గా నిలిచిన మొదటి ఆసియా దేశం ఏది?
 1) భారత్‌
 2) చైనా
 3) ఇండోనేషియా
 4) థాయిలాండ్‌
View Answer
సమాధానం: 1
19. పుస్తకాల స్థానాన్ని మనుషులతో భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే తొలి ‘మానవ గ్రంథాలయం అధ్యాయం– 2’ ఎక్కడ ఉంది?
 1) గువాహటీ, అసోం
 2) కోల్‌కతా, పశ్చిమ బంగా
 3) మైసూరు, కర్ణాటక
 4) హైదరాబాద్, తెలంగాణ

View Answer
సమాధానం: 3
20. పసిఫిక్‌ వాయు దళా ఉన్నతాధికారుల సమావేశం (పీఏసీఎస్‌–2019) నేపథ్యం ఏమిటి?
 1) ‘ఫ్యూచర్‌ ఛాలెంజెస్‌ ఇన్‌ మిలటరీ హెల్త్‌’
 2) ‘చాలెంజెస్‌ టు రిజినల్‌ సెక్యూరిటీ’
 3) ‘యూనిటీ ఆఫ్‌ ఎఫర్ట్‌: బిల్డింగ్‌ మిలటరీ పార్టనర్‌షిప్స్‌ ఇన్‌ ఏయిర్‌ ఫోర్స్‌’
 4) ‘ఏ కొలాబోరేటివ్‌ అప్రోచ్‌ టువార్డ్స్‌ రిజినల్‌ సెక్యూరిటీ’

View Answer
సమాధానం: 4
21. భారత ఎగ్జిమ్‌ బ్యాంక్‌ ఏ దేశానికి ‘రక్షణ సంబంధిత సేకరణకు 500 మిలియన్ల  డాలర్ల లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను అందించింది?
 1) భుటాన్‌
 2) శ్రీలంక
 3) నేపాల్‌
 4) బంగ్లాదేశ్‌
View Answer
సమాధానం: 4
22. 21వ శతాబ్దం మానవాభివృద్ధిలో అసమానతలు’ అనే అంశంపై యు.ఎన్‌.డి.పి. విడుదల చేసిన ‘మానవాభివృద్ధి నివేదిక –2019 లో భారత ర్యాంకు ఎంత?
 1) 129
 2) 132
 3) 125 
 4) 145
View Answer
సమాధానం: 1
23. మానవాభివృద్ధి నివేదిక–2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది?
 1) స్కాట్‌లాండ్‌
 2) ఐర్లాండ్‌ 
 3) నార్వే
 4) స్విట్జర్లాండ్‌
View Answer
సమాధానం: 3
24. 26వ వరల్డ్‌ ట్రావెల్‌ అవార్డ్స్‌ –2019 ఏ నగరాన్ని క్రీడారంగానికి ప్రపంచంలోనే గొప్ప పర్యాటక గమ్యస్థానంగా ఎంపిక చేసింది?
 1) జెరూసలేం, ఇజ్రాయెల్‌
 2) మాస్కో, రష్యా
 3) అబుదాబి, యు.ఎ.ఈ
 4) జకార్తా, ఇండోనేషియా

View Answer
సమాధానం: 3
25. కింది వాటిలో 17వ బయో ఏషియా 2020 భాగస్వామ్య దేశం ఏది?
 1) బెల్జియం
 2) స్విట్జర్లాండ్‌
 3) స్వీడన్‌
 4) నార్వే
View Answer
సమాధానం: 2
26. ప్రపంచ వాణిజ్య సంస్థ అప్పీలు  కోర్టును మూసివేయాలని ఏ దేశం నిర్ణయించింది?
 1) చైనా
 2) యు.కె.
 3) యు.ఎస్‌.ఎ.
 4) రష్యా
View Answer
సమాధానం: 3
27. యూరోమోనిటర్‌ ఇంటర్నేషనల్‌ –2019 ‘టాప్‌ 100 గమ్యస్థానాల సిటీ’ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది?
 1) హాంకాంగ్‌
 2) బ్యాంకాక్‌
 3) లండన్‌ 
4) సింగపూర్‌
View Answer
సమాధానం: 1
28. స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకుల (ఎస్‌.ఎఫ్‌.బి.) కనీస పెయిడ్‌–అప్‌ ఓటింగ్‌ ఈక్విటీ క్యాపిటల్‌ ఎంత?
 1) రూ. 500 కోట్లు
 2) రూ. 400 కోట్లు
 3) రూ. 200 కోట్లు
 4) రూ. 300 కోట్లు
View Answer
సమాధానం: 3
29. నియంత్రణ అవసరాల కోసం ఎన్ని సంవత్సరాలు పూర్తయిన తరువాత పేమెంట్స్‌ బ్యాంకులు స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులుగా  అర్హత సాధిస్తాయి?
 1) 8 ఏళ్లు
 2) 7 ఏళ్లు
 3) 6 ఏళ్లు
 4) 5 ఏళ్లు
View Answer
సమాధానం: 4
30. తొలిసారి భారత విదేశీ మారక ద్రవ్యం  నిల్వలు ఎన్ని బిలియన్‌ డాలర్లను  దాటింది?
 1) రూ. 550 బిలియన్‌ డాలర్లు
 2) రూ. 450 బిలియన్‌ డాలర్లు
 3) రూ. 350 బిలియన్‌ డాలర్లు
 4) రూ. 250 బిలియన్‌ డాలర్లు

View Answer
సమాధానం: 2
31. భారతదేశ ఇంధన, గ్యాస్‌ రంగంలో  ఎంఎస్‌ఎంఈలను అభివృదిపరిచేందుకు,  సౌదీ అరామ్‌కోతో ఏ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
 1) భారత్‌ పెట్రోలియం
 2) నేషనల్‌ స్మాల్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌
 3) నేషనల్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌
 4) ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌

View Answer
సమాధానం: 2
32. 2019 నవంబర్‌ 1కి ప్రధాన్‌ మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) పథకం కింద భారత ప్రభుత్వం ఎంత రుణాన్ని పంపిణీ చేసింది?
 1) రూ.10.24 లక్షల కోట్లు
 2) రూ. 11.54 లక్షల కోట్లు
 3) రూ. 12.64 లక్షల కోట్లు
 4) రూ. 13.74 లక్షల కోట్లు

View Answer
సమాధానం: 1
33. ఆసియా అభివృద్ధి బ్యాంకు  అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం–2020 భారత జి.డి.పి పెరుగుదల రేటు ఎంత?
 1) 5.7%
 2) 5.6%
 3) 5.1%
 4) 5.0%
View Answer
సమాధానం: 3
34. భూకంప ఇంజినీరింగ్, డాక్టోరల్‌ కార్యక్రమాలపై పరిశోధనలకోసం  నాలుగు జపాన్‌ సంస్థలకు ఏ సంస్థ సహకరించింది?
 1) ఐఐటీ– బాంబే
 2) ఐఐటీ– ఢిల్లీ
 3) ఐఐటీ–హైదరాబాద్‌
 4) ఐఐటీ–కాన్పూర్‌
View Answer
సమాధానం: 3
35. ఆర్థిక సంవత్సరం 2020–21 నివేదికను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించిన 15వ ఆర్థిక కమిషన్‌ చైర్మన్‌ ఎవరు?
 1) అరవింద్‌ సుబ్రమణియన్‌
 2) శక్తికాంత దాస్‌
 3) ఉర్జిత్‌ పటేల్‌
 4) నంద్‌ కిషోర్‌ సింగ్‌
View Answer
సమాధానం: 4
36. 2019 డిసెంబర్‌ 6న నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
 1) గిరీష్‌ చంద్ర చతుర్వేది
 2) సందీప్‌ లిమాయే
 3) హరీష్‌ కనబార్‌
 4) సంతోష్‌ సూరి
View Answer
సమాధానం: 1
37. 34 ఏళ్లకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టి  ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలిగా నిలిచిన ఫిన్లాండ్‌ 46వ ప్రధాని ఎవరు?
 1) లి అండర్సన్‌
 2) సన్నా మిరెల్లా మారిన్‌
 3) క్రిస్టా కిరు
 4) కత్రి కుల్ముని
View Answer
సమాధానం: 2
38. ప్రపంచ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ ఎక్సిక్యూటివ్‌ కమిటీ ఏ దేశాన్ని నాలుగేళ్ల పాటు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి నిషేధించింది?
 1) రష్యా
 2) థాయ్‌లాండ్‌
 3) చైనా
 4) ఫ్రాన్స్‌
View Answer
సమాధానం: 1
39. సునీల్‌ శెట్టిని తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్న సంస్థ ఏది?
 1) ఇండియన్‌ పారాలింపిక్‌ అసోసియేషన్‌
 2) ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌
 3) వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ
 4) నేషనల్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ

View Answer
సమాధానం: 4
40.యు.ఎ.ఇ.లో జరిగిన ప్రపంచ కప్‌ లీగ్‌ 2, మూడో సిరీస్‌ ఓపెనింగ్‌ మ్యాచ్‌ పురుషుల వన్డేలో పాల్గొన్న మొదటి మహిళా రిఫరీ ఎవరు?
 1) ఉవేనా ఫెర్నాండెజ్‌
 2) రుబాదేవి గురుసామి
 3) గండికోట సర్వలక్ష్మి
 4) రంజితా∙దేవి

View Answer
సమాధానం: 3
41. XIII సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌ ఎక్కడ జరిగాయి?
 1) ఖాట్మాండు, పోఖారా–నేపాల్‌
 2) ఢిల్లీ, ఒడిశా–భారత్‌
 3) ఢాకా, చిట్టగాంగ్‌–బంగ్లాదేశ్‌
 4) కాబుల్, కందహార్‌–ఆప్గనిస్థాన్‌

View Answer
సమాధానం: 1
42.13వ దక్షిణాసియా క్రీడల మొత్తం పతకాల పట్టిక జాబితాలో అగ్రస్థానం పొందిన దేశం ఏది?
 1) పాకిస్తాన్‌
 2) నేపాల్‌
 3) బంగ్లాదేశ్‌
 4) భారత్‌
View Answer
సమాధానం: 4
43. 2019 డిసెంబర్‌ 7న జరిగిన అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం (ఐసీఏడీ) నేపథ్యం ఏమిటి?
 1) ‘75 ఇయర్స్‌ ఆఫ్‌ కనెక్టింగ్‌ ద వరల్డ్‌’
 2) ‘వర్కింగ్‌ టుగెదర్‌ టు ఎన్షూర్‌ నో కంట్రీ ఈజ్‌ లెఫ్ట్‌ బిహైండ్‌’
 3) ‘ఇన్వెస్ట్‌మెంట్‌ ఇన్‌ ఏవియేషన్‌ అండ్‌ సైన్స్‌ ఫర్‌ గ్రీన్‌ గ్రోత్‌’
 4) ‘ఎడ్యుకేషన్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌’

View Answer
సమాధానం: 1
44. భారత సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని  రక్షణ మంత్రిత్వ శాఖ ఎప్పుడు పాటిస్తుంది?
 1) డిసెంబర్‌ 4
 2) డిసెంబర్‌ 7
 3) డిసెంబర్‌ 6
 4) డిసెంబర్‌ 5
View Answer
సమాధానం: 2
45. ఏటా డిసెంబర్‌ 9న పాటించే అంతర్జాతీయ అవినీతి నిర్మూలన దినోత్సవం–2019 నేపథ్యం ఏమిటి?
 1) ‘యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌
 2) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌
 3) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ ఏ పీస్‌
 4) యునైటెడ్‌ ఎగ్నెస్ట్‌ కరప్షన్‌ ఫర్‌ సెక్యూరిటీ

View Answer
సమాధానం: 2
46. 2019 డిసెంబర్‌ 10న జరిగిన మానవ హక్కుల దినోత్సవ నేపథ్యం ఏమిటి?
 1) ‘యూత్‌ స్టాండింగ్‌ అప్‌ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌’
 2) ‘లెట్స్‌ స్టాండ్‌ అప్‌ ఫర్‌ ఈక్వాలిటీ, జస్టీస్‌ అండ్‌ హ్యూమన్‌ డిగ్నిటీ’
 3) ‘స్టాండ్‌ అప్‌ ఫర్‌ ఏ సమ్‌వన్స్‌ రైట్స్‌ టుడే’
 4) ‘అవర్‌ రైట్స్‌ అవర్‌ ఫ్రీడమ్స్‌’

View Answer
సమాధానం: 1
47. యూనిసెఫ్‌ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకొంటారు?
 1) డిసెంబర్‌ 8
 2) డిసెంబర్‌ 9
 3) డిసెంబర్‌ 10
 4) డిసెంబర్‌ 11
View Answer
సమాధానం: 4
48. జార్జియాలోని అట్లాంటాలో జరిగిన 68వ మిస్‌ యూనివర్స్‌ పోటిల్లో మిస్‌ యూనివర్స్‌ –2019 కిరీటం ఎవరికి దక్కింది?
 1) బోనాంగ్‌ మతేబా
 2) టామరిన్‌ గ్రీన్‌
 3) జోజిబిని తుంజీ
 4) డెమి–లీ నెల్‌–పీటర్స్‌
View Answer
సమాధానం: 3
49. కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ చరిత్ర వివరాలను తెలియజేసే ‘కాళేశ్వరం ప్రాజెక్టు: తెలంగాణ ప్రగతి రథం’ పుస్తక రచయిత ఎవరు?
 1) సి.లక్ష్మీ రాజ్యం
 2) కె.ఎస్‌. అశ్వథ్‌
 3) శ్రీధర్‌ రావు
 4) లీలావతి
View Answer
సమాధానం: 3
50. ఫెస్టివల్‌ ఇంటర్నేషనల్‌ డు ఫిల్మ్‌ ది మారకేశ్‌ (ఎఫ్‌ఐఎం)–2019లో ఏ బాలీవుడ్‌ నటిని సత్కరించారు?
 1) కత్రీనా కైఫ్‌
 2) ఐశ్వర్యరాయ్‌
 3) దీపికా పదుకోనే
 4) ప్రియాంక చోప్రా జోనస్‌

View Answer
సమాధానం: 4
[13/03, 11:04 AM] S Vizag Express: 1. ఐఐటీ హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, గేట్స్‌ ఫౌండేషన్‌ సహాకారంతో ప్రారంభించిన భారత తొలి ‘వ్యాక్సినేషన్‌ ఆన్‌ వీల్స్‌’ క్లినిక్‌ ఎక్కడ ఉంది?
 1) గువాహటి, అసోం
 2) పుణే, మహారాష్ట్ర  
  3) న్యూఢిల్లీ, ఢిల్లీ
 4) కోల్‌కత, పశ్చిమబంగా
View Answer
సమాధానం: 2
2. ఇటీవల భారత నావికాదళం ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్, కొచ్చిన్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ సహాకారంతో కొచ్చి తీరంలో నిర్వహించిన అతి పెద్ద∙యాంటీ హైజాకింగ్‌ వ్యాయామం ఏది?
 1) తల్వార్‌ 
 2) ట్రోపెక్స్‌
 3) స్లినెక్స్‌
 4) అపహరన్‌
View Answer
సమాధానం: 4
3. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ ప్రాంతీయ కాలుష్య ప్రతిస్పందన వ్యాయామం ‘స్వచ్ఛ సముంద్ర ఎన్‌ డబ్య్లు–2019’ ఎక్కడ జరిగింది?
 1) గల్ఫ్‌ ఆఫ్‌ కచ్, గుజరాత్‌
 2) మలబార్‌ కోస్ట్, కేరళ
 3) గల్ఫ్‌ ఆఫ్‌ కంభట్, గుజరాత్‌
 4) గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్, తమిళనాడు

View Answer
సమాధానం: 1
4. తరువాతి తరానికి మెరుగైన రవాణా వ్యవస్థను అందించేందుకు మొదటి ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు జాతీయ రైల్‌ రవాణా సంస్థ ఏ వర్సిటితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?
 1) యూనివర్సిటీ ఆఫ్‌ వర్సెస్టర్, ఇంగ్లండ్‌
 2) బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్‌
 3) న్యూమాన్‌ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్‌
 4) బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్‌

View Answer
సమాధానం: 4
5.ఇటీవల భారత ఫార్మాకోపియా గుర్తింపు పొందిన తొలి దేశం ఏది?
 1) ఆఫ్ఘనిస్తాన్‌
 2) ఇజ్రాయేల్‌
 3) ఇరాక్‌
 4) సిరియా
View Answer
సమాధానం: 1
6. ప్రపంచంలో మొదటిసారి శరణార్థుల సమావేశం ఎక్కడ జరిగింది?
 1) పారిస్, ఫ్రాన్స్‌
 2) మాడ్రిడ్, స్పెయిన్‌
 3) జెనీవా, స్విట్జర్లాండ్‌
 4) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌ఏ
View Answer
సమాధానం: 3
7. సెబీ ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్‌ ప్రొటెక్ష అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌ (ఐపీఈఎఫ్‌) సలహా కమిటీ చైర్మన్‌ ఎవరు?
 1) అబ్రహాం కోషీ
 2) ఎన్‌.ఎస్‌. విశ్వనాథన్‌
 3) అటాను చక్రవర్తి
 4) వి. రవి అన్షుమన్‌
View Answer
సమాధానం: 1
8. ఫోర్బ్స్‌ ఇండియా–2019 సెలబ్రిటీ 100 మంది జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు?
 1) సల్మాన్‌ ఖాన్‌
 2) మహేంద్ర సింగ్‌ ధోనీ
 3) అక్షయ్‌ కుమార్‌
 4) విరాట్‌ కోహ్లి
View Answer
సమాధానం: 4
9.ఇటీవల పరీక్షించిన క్విక్‌ రియాక్షన్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ క్షిపణి సామర్థ్యం ఎంత?
 1) 70–80 కిలోమీటర్లు
 2) 50–60 కిలోమీటర్లు
 3) 35–40 కిలోమీటర్లు
 4) 25–30 కిలోమీటర్లు

View Answer
సమాధానం: 4
10. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రా లన్నింటిని అప్రమత్తం చేస్తూ హెచ్చరికలు జారీచేసిన మాల్వేర్‌ అప్లికేషన్‌ ఏమిటి?
 1) గూలిగన్‌
 2) హమ్మింగ్‌బ్యాడ్‌
 3) స్ట్రాండ్‌హగ్‌
 4) కాపీక్యాట్‌ 
View Answer
సమాధానం: 3
11. ప్రభుత్వ సేవలు, బీమా, సరఫరాల నిర్వహణ కోసం 3 బ్లాక్‌ చెయిన్‌ పవర్‌ అప్లికేషన్స్‌ను ఏ సంస్థ ప్రారంభించింది?
 1) కాగ్నిజెంట్‌
 2) ఇన్ఫోసిస్‌
 3) విప్రో
 4) టీసీఎస్‌
View Answer
సమాధానం: 2
12. ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ (ఫీఫా) ర్యాంకింగ్స్‌–2019లో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది?
 1) బెల్జియం
 2) నెదర్లాండ్‌
 3) నార్వే
 4) ఐస్‌లాండ్‌
View Answer
సమాధానం: 1
13. 2019 డిసెంబర్‌ 20న తెలంగాణ మొదటి లోకాయుక్తగా ఎవరు నియమితులైయ్యారు?
 1) లక్ష్మణ్‌ రెడ్డి
 2) సి.వి. రాములు
 3) రేవా ఖేత్రపాల్‌ 
 4) నవాల్‌ కిషోర్‌ అగర్వాల్‌
View Answer
సమాధానం: 2
14. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా ఎవరు నియమితులైనారు?
 1) జి. చంద్రయ్య
 2) సందీప్‌ కృష్ణ
 3) హరీష్‌ సాల్వే
 4) వి. సంతోష్‌ నాయుడు
View Answer
సమాధానం: 1
15. మహాత్మా గాంధీ ఆదర్శాలను శాశ్వతంగా  నిలిపి ఉంచేందుకు ‘గాంధీ పౌరసత్వ విద్యా బహుమతి’ తొలి ఎడిషన్‌ను జంతు సంక్షేమానికి ప్రకటించిన దేశం ఏది?
 1) ఇటలీ
 2) ఫ్రాన్స్‌
 3) స్పెయిన్‌
 4) పోర్చుగల్‌
View Answer
సమాధానం: 4
16.ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అసోసియేటెడ్‌ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఆఫ్‌ ఇండియా (అసోచామ్‌) వార్షిక సమావేశం నేపథ్యం ఏమిటి?
 1) కమ్యూనికేషన్స్‌ యాస్‌ ఏ డెసిసీవ్‌ కెటలిస్ట్‌
 2) స్టేక్‌హోల్డర్స్‌ ఫర్‌ ఏ సస్టైనబుల్‌ వరల్డ్‌
 3) ఎకనమిక్‌ గ్రోత్‌ ఫర్‌ ఇండియాస్‌ ఎకానమీ
 4) న్యూ ఇండియా అస్పైరింగ్‌ ఫర్‌  5 ట్రిలియన్‌ యూఎస్‌డీ

View Answer
సమాధానం: 4
17. పాఠశాలల్లో ఫిట్‌ ఇండియా వీక్‌ నిర్వహించిన జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
 1) ఆంధ్రప్రదేశ్
‌ 2) ఉత్తర ప్రదేశ్‌
 3) కేరళ 
 4) కర్ణాటక
View Answer
సమాధానం: 1
18. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఐటీఎఫ్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ ఛాంపియన్‌–2019ను కైవసం చేసుకున్న ఆస్ట్రేలియన్‌ ఎవరు ?
 1) ఆస్ట్రా శర్మ
 2) సమంతా స్టోసూర్‌
 3) ఆష్టీ బార్టీ
 4) మార్గరేట్‌ కోర్ట్‌
View Answer
సమాధానం: 3
19. యూఎస్‌ఏకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన భారతీయ అమెరికన్‌ కంప్యూటర్‌ శాస్త్రవేత్త ఎవరు?
 1) రాజ్‌ రెడ్డి
 2) మధుసూదన్‌
 3) శంకర్‌ కుమార్‌ పాల్‌
 4) సేతురామన్‌ పంచనాథన్‌
View Answer
సమాధానం: 4
20. చైనీస్‌ లాంగ్‌ మార్చ్‌ 4బి క్యారియర్‌ రాకెట్‌ ద్వారా తొలి ఉపగ్రహం∙‘ఈటీఆర్‌ఎస్‌ఎస్‌–1’ను  ప్రయోగించిన దేశం  ఏది?
 1) ఈక్వెటోరియల్‌ గినియా
 2) ఈక్వెడార్‌
 3) ఇథియోపియా
 4) ఈజిప్ట్‌
View Answer
సమాధానం: 3
21. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు, 1023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ఏ నిధి కింద రూ. 7వేల కోట్లను మంజూరు చేసింది?
 1) స్వధార్‌ గ్రహ్‌ ఫండ్‌
 2) మహిళా ఈ హాత్‌ ఫండ్‌
 3) నిర్భయ ఫండ్‌
 4) దిశా ఫండ్‌
View Answer
సమాధానం: 3
22. సాయుధ∙పోలీసు దళ స్కూళ్లలో బాలికలకు వసతి సదుపాయల నిర్మాణానికి రూ.2.2 కోట్లను  భారత్‌ ఏ దేశానికి మంజూరు చేసింది?
 1) నేపాల్‌
 2) బంగ్లాదేశ్‌
 3) శ్రీలంక
 4) మయన్మార్‌
View Answer
సమాధానం: 1
23.ఎనిమిది పశ్చిమాఫ్రికా దేశాలు (బెనిన్, బుర్కినా ఫాసో, గినియా – బిస్సా, ఐవరీ కోస్ట్, మాలీ, నైజర్, సెనెగల్, టోగో) ఇటీవల ‘సీఎఫ్‌ఏ ఫ్రాంక్‌ ’గా పేరు మార్చిన కరెన్సీ సాధారణ పేరు ఏమిటి?
 1) ఎసో
 2) యూరో
 3) ఎరి
  4) ఎకో
View Answer
సమాధానం: 4
24. భవిష్యత్తులో సంభవించే అంతరిక్ష యుద్ధాలపై దృష్టి సారించే ‘స్పేస్‌ ఫోర్స్‌’ను ఇటీవల ఏ దేశం ప్రారంభించింది?
 1) రష్యా
 2) యూఎస్‌ఏ
 3) భారత్‌
 4) చైనా
View Answer
సమాధానం: 2
25. అమెరికా అత్యంత శక్తిమంతమైన ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా మొదటిసారి నియమితులైన మహిళ ఎవరు ?
 1) ఏంజెలా అహ్రెండ్ట్స్‌
 2) డా. మోనిషా ఘోష్‌
 3) షెరిల్‌ శాండ్‌బర్గ్‌
 4) ఉర్సుల బర్న్స్‌
View Answer
సమాధానం: 2
26. మొదటిసారి ఫీఫా అండర్‌ –17 ప్రపంచ మహిళా కప్‌ –2020కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది?
 1) మాంటెవీడియో, ఉరుగ్వే
 2) అహ్మదాబాద్, గుజరాత్‌
 3) జర్కా, జోర్డాన్‌
 4) సాన్‌జోస్, కోస్టారికా

View Answer
సమాధానం: 2
27. 2019లో అత్యధికంగా అంతర్జాతీయ పరుగులు,  సిక్స్‌లు కొట్టి తన ప్రపంచ రికార్డును తానే బద్దలు కొట్టిన భారతీయ క్రికెటర్‌ ఎవరు?
 1) విరాట్‌ కొహ్లీ
 2) శిఖర్‌ ధావన్‌
 3) ఎం.ఎస్‌. ధోనీ
 4) రోహిత్‌ శర్మ
View Answer
సమాధానం: 4
28. ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏటా జాతీయ గణిత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
 1) డిసెంబర్‌ 20
 2) డిసెంబర్‌ 21
 3) డిసెంబర్‌ 23
 4) డిసెంబర్‌ 22
View Answer
సమాధానం: 4
29. ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ. 24 వేలు అందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ప్రారంభించిన పథకం ఏది?
 1) వైఎస్సార్‌ యువ కిరణాలు
 2) వైఎస్సార్‌ నేతన్న నేస్తం
 3) వైఎస్సార్‌ భరోసా
 4) వైఎస్సార్‌ ఆసరా

View Answer
సమాధానం: 2
30. సూక్ష్మ సేద్యం – 2019 కవరేజీలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో ఉంది?
 1) ఉత్తర ప్రదేశ్‌
 2) తమిళనాడు
 3) పశ్చిమబంగా
 4) అసోం
View Answer
సమాధానం: 2
31.పొగాకు వాడకాన్ని 30 శాతం తగ్గించడానికి భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్య సంవత్సరం ఏది?
 1) 2035
 2) 2030
 3) 2025
 4) 2022
View Answer
సమాధానం: 3
32.భారత్‌ – ఈయూ 2020 సమావేశం ఏ నగరంలో జరగనుంది?
 1) బ్రస్సెల్స్, బెల్జియం
 2) బెర్లిన్, జర్మనీ
 3) మాడ్రిడ్, స్పెయిన్‌
 4) వాషింగ్టన్‌ డీసీ, యూఎస్‌
View Answer
సమాధానం: 1
33. నీటి పారిశుధ్యం పరిశుభ్రత విభాగంలో స్వచ్ఛభారత్‌ మిషన్‌ను సమర్థవంతంగా అమలు చేసినందుకు యూనిసెఫ్‌ ఏ జిల్లాకు బహుమతిని ప్రదానం చేసింది?
 1) కామారెడ్డి జిల్లా, తెలంగాణ
 2) నాగపట్నం జిల్లా, తమిళనాడు
 3) గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌
 4) వయనాడ్, కేరళ

View Answer
సమాధానం: 1
34. 50వ దాదాసాహెబ్‌ ఫాల్కే  అవార్డును ఏ ప్రఖ్యాత నటుడు గెలుచుకున్నారు?
 1) మోహన్‌లాల్‌
 2) అమితాబ్‌ బచ్చన్‌
 3) రజనికాంత్‌
 4) కె. చిరంజీవి
View Answer
సమాధానం: 2
35. అసోచాంకు కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు?
 1) బాలకృష్ణ గోయాంక
 2) వినీత్‌ అగర్వాల్‌
 3) నిరంజన్‌ హిరనందనీ
 4) చంద్రు రహేజా

View Answer
సమాధానం: 3
36. భారత 33వ విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులైనారు?
 1) నిరుపమా రావ్‌
 2) రివా గంగూలీ దాస్‌
 3) నవ్‌తేజ్‌ సర్నా
 4) హర్షవర్థన్‌ శృంగ్లా
View Answer
సమాధానం: 4
37. 2019 డిసెంబర్‌ 24న పాటించిన∙వినియోగదారుల హక్కుల దినోత్సవం నేపథ్యం ఏమిటి?
 1) ‘అల్టర్‌నేట్‌ కన్జూమర్‌ గ్రీవెన్స్‌/ డిస్ప్యూట్‌ రిడ్రెసల్‌’
 2) ‘టై మ్లీ్ల డిస్సోసల్‌ ఆఫ్‌ కన్జూమర్‌ కంప్లైంట్స్‌’
 3) ‘బిల్డింగ్‌ ఎ డిజిటల్‌ వరల్డ్‌ కన్స్యూమర్ కెన్‌ ట్రస్ట్‌’
 4) ‘యాంటిబయోటిక్స్‌ ఆఫ్‌ ద మెనూ’

View Answer
సమాధానం: 1
38. పెరుగుతున్న వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా, స్వచ్చమైన గాలిని పీల్చుకున్న అనుభూ తిని కల్పించడానికి ఏ రైల్వేస్టేషన్‌ ఐరో గార్డ్‌ తో కలిసి ‘ఆక్సిజన్‌ పార్లర్‌’ను తెరిచింది?
 1) అసాంగావ్‌ రైల్వేస్టేషన్‌
 2) కసారా రైల్వేస్టేషన్‌
 3) నాసిక్‌ రైల్వేస్టేషన్‌
 4) ఇగత్‌పురి రైల్వేస్టేషన్‌

View Answer
సమాధానం: 3
39.‘బిగ్‌ స్టేట్‌ కేటగిరి’లో తొలి ఎడిషన్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సూచీలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది?
 1) ఆంధ్రప్రదేశ్‌
 2) కర్ణాటక
 3) మహారాష్ట్ర
 4) తమిళనాడు
View Answer
సమాధానం: 4
40. గు గవర్నెన్స్‌ సూచీలో ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోల్చినపుడు ఏ కేంద్రపాలిత ప్రాంతం అగ్రస్థానంలో ఉంది?
 1) డామన్, డయ్యు
 2) ఢిల్లీ
  3) పుదుచ్చేరీ
 4) ఛండీఘడ్‌
View Answer
సమాధానం: 3
41. భూగర్భ జలాల నిర్వహణను మెరుగుపరచేందుకు ప్రధాని నరేంద్రమోదీ 5 సంవత్సరాలకుగాను రూ.6వేల కోట్ల వ్యయంతో  ప్రారంభించిన పథకం ఏది?
 1) అటల్‌ భూజల్‌ యోజన
 2) అటల్‌ జల్‌ యోజన
 3) అటల్‌ విద్యుదీకరణ్‌ యోజన
 4) అటల్‌ సమృద్ధి యోజన

View Answer
సమాధానం: 1
42. జాతీయ జనాభా రిజిస్టర్‌ 2021 పరిధిలోకి రాని రాష్ట్రం ఏది?
 1) మేఘాలయా
 2) నాగాలాండ్‌
 3) పశ్చిమబంగా
 4) అసోం
View Answer
సమాధానం: 4
43. హిమాచల్‌ప్రదేశ్‌ రోహతంగ్‌ మార్గంలో నిర్మితమైన ప్రపంచంలోనే పొడవైన పర్వత సొరంగం అటల్‌ టన్నెల్‌ పొడవు ఎంత?
 1) 9.8 కిలోమీటర్లు
 2) 9.2 కిలోమీటర్లు
 3) 8.8 కిలోమీటర్లు
 4) 10.2 కిలోమీటర్లు
View Answer
సమాధానం: 3
44. హైపర్‌సోనిక్‌ ఆయుధాలు కలిగి ఉన్న ఏకైక దేశం ఏది?
 1) ఫ్రాన్స్‌
 2) యు.ఎస్‌.ఎ
 3) చైనా
 4) రష్యా
View Answer
సమాధానం: 4
45. 2019 మార్చినాటికి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకుల్లో స్థూలంగా ఉన్న మొండి బకాయిల శాతం ఎంత?
 1) 10.1 %
 2) 9.1 %
 3) 9.5%
 4) 10.3 %
View Answer
సమాధానం: 2
46. ఇటీవల టైఫూన్‌ ఫన్‌ఫోన్‌ (టైఫూన్‌ ఉర్సులా) కు ప్రభావితమైన దేశం ఏది?
 1) ఫిలీఫ్పీన్స్‌
 2) థాయ్‌లాండ్‌
 3) వియత్నాం
 4) లావోస్‌
View Answer
సమాధానం: 1
47. దోహాలో జరిగిన 6వ ఖతర్‌ అంతర్జాతీయ కప్‌లో మహిళల 49 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది ఎవరు?
 1) కవిత దేవి
 2) సైకోం మీరాబాయి చాను
 3) పూనం యాదవ్‌ 
 4) కరణం మల్లేశ్వరి

View Answer
సమాధానం: 2
48. ఏటా డిసెంబర్‌ 25న జరుపుకునే జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని ఎవరి పుట్టిన రోజు గుర్తుగా జరుపుకొంటారు?
 1) మొరార్జి దేశాయ్‌
 2) రాజీవ్‌ గాంధీ
 3) అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌
 4) చంద్ర శేఖర్‌
View Answer
సమాధానం: 3
49. ప్రధాని నరేంద్ర మోదీ అటల్‌ బిహారి వాజ్‌పేయి వైద్య విశ్వవిద్యాలయానికి పునాది రాయి వేసి, 2019 డిసెంబర్‌ 25న వాజ్‌పేయి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
 1) న్యూఢిల్లీ, ఢిల్లీ
 2) గాంధీ నగర్, గుజరాత్‌
 3) కోల్‌కతా, పశ్చిమ బంగా
 4) లక్నో, ఉత్తరప్రదేశ్‌

View Answer
సమాధానం: 4
50. రాష్ట్రంలో రిజిస్టరైన 25 శాతం వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చాలని ఢిల్లీ ప్రభుత్వం ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది?
 1) 2035
 2) 2024
 3) 2025
 4) 2030
View Answer
సమాధానం: 2
[13/03, 11:04 AM] S Vizag Express: 1. 14.6 కోట్ల గ్రామాలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన పథకం ఏది?
 1) జల్‌ శ్రమ్‌ మిషన్‌
 2) జల్‌ ఆదర్శ్‌ మిషన్‌
 3) జల్‌ సమ్మన్‌ మిషన్‌
 4) జల్‌ జీవన్‌ మిషన్‌
View Answer
సమాధానం: 4
2. జెమ్‌ సంవాద్‌ జాతీయ కార్యక్రమాన్ని ఏ నాలుగు రాష్ట్రాలు ప్రారంభించాయి?
 1) కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌
 2) కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌
 3) కర్ణాటక, అసోం, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్,
 4) అసోం, ఉత్తరప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌

View Answer
సమాధానం: 2
3. భారతీయ పురావస్తు పర్యవేక్షణ సంస్థకు చెందిన ఐదు ప్రదేశాల్లో చైనా భాషలో సైన్‌ బోర్డులను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం?
 1) ఉత్తరప్రదేశ్‌ 
 2) అసోం
 3) గుజరాత్‌
 4) పశ్చిమబంగా
View Answer
సమాధానం: `1
4. 1000 కి.మి. సీఎన్‌జీ గ్యాస్‌ సామర్థ్యం కల్గిన బస్సును భారత్‌లో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు?
 1) కోల్‌కతా, పశ్చిమబంగా
 2) న్యూఢిల్లీ, ఢిల్లీ
 3) ముంబై, మహారాష్ట్ర
 4) గువాహటి, అసోం
View Answer
సమాధానం: 2
5. కింది ఏ మార్గాల్లో ఇండియన్‌ రైల్వే తొలి విస్టాడోమ్‌ (గ్లాస్‌ రూఫ్‌) కోచ్‌లతో రూపొందించిన ‘హిమదర్శన్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలును ప్రారంభించింది?
 1) సిమ్లా–డెహ్రాడూన్‌
 2) హౌరా–డార్జిలింగ్‌
 3) కల్కా–సిమ్లా
 4) ఢిల్లీ–డెహ్రాడూన్‌
View Answer
సమాధానం: 3
6. భారత్‌ నెట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా గ్రామాలన్నింటికీ ఉచిత వైఫై సేవలను అందించేందుకు భారత ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్న సంవత్సరం ఏది?
 1) 2020 మార్చి
 2) 2022 మార్చి
 3) 2024 మార్చి
 4) 2025 మార్చి
View Answer
సమాధానం: 1
7. స్వచ్ఛ భారత్‌ మిషన్‌–అర్బన్‌ పరిధిలో బహిరంగ మలవిసర్జన రహిత పట్టణ ప్రాంతాలుగా గుర్తింపు పొందని ప్రాంతాలు ఏ రాష్ట్రానికి చెందినవి?
 1) తమిళనాడు
 2) పశ్చిమబంగా
 3) గుజరాత్‌
 4) అసోం
View Answer
సమాధానం: 2
8. సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ డిజిటల్‌ రేడియోను ఎప్పుడు ప్రారంభించనుంది?
 1) 2024
 2) 2022
 3) 2025
 4) 2030
View Answer
సమాధానం: 1
9. తొలి ట్రాన్స్‌జెండర్‌ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు?
 1) న్యూఢిల్లీ
 2) సిల్చర్, అసోం
 3) ముంబై, మహారాష్ట్ర
 4) ఖుషీనగర్, ఉత్తరప్రదేశ్‌

View Answer
సమాధానం: 4
10. 1999 కార్గిల్‌ యుద్ధంలో భారతదేశానికి సేవలందించిన ‘బహదూర్‌’ (మిగ్‌–27) యుద్ధ విమానాన్ని భారత వైమానికి దళం ఎక్కడ ఉపసంహరించుకుంది?
 1) బెంగళూరు, కర్ణాటక
 2) కొచ్చి, కేరళ
 3) జోధ్‌పూర్, రాజస్థాన్‌
 4) విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్‌

View Answer
సమాధానం: 3
11. భారత్‌లో తొలి ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ డెవలప్‌మెంట్‌ (టీఓడీ) ప్రాజెక్టుకు ఎక్కడ పునాది వేశారు?
 1) న్యూఢిల్లీ
 2) ముంబై
 3) గువాహటి
 4) పశ్చిమబంగా
View Answer
సమాధానం: 1
12. 11వ నేషనల్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ ఎక్కడ జరిగింది?
 1) గువాహటి, అసోం
 2) కోల్‌కతా
 3) ముంబై
 4) న్యూఢిల్లీ, ఢిల్లీ
View Answer
సమాధానం: 4
13. ‘ట్రైబల్‌ ఫెస్ట్‌ 2019’ అనే జాతీయ గిరిజన నృత్యోత్సవం ఇటీవల తొలిసారి ఏ నగరంలో జరిగింది?
 1) రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌
 2) న్యూఢిల్లీ
 3) కోల్‌కతా
 4) ముంబై
View Answer
సమాధానం: 1
14. రెండో భారత సుస్థి్థరాభివృద్ధి లక్ష్యాల సూచీ–2019లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది?
 1) కేరళ
 2) పశ్చిమబంగా
 3) అసోం
 4) గుజరాత్‌
View Answer
సమాధానం: 1
15. హిందూ మహాసముద్ర ప్రాంతాల విభాగంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ దేశాలను చేర్చింది?
 1) మొజాంబిక్, అంగోలా
 2) సీషెల్స్, మొజాంబిక్‌
 3) మారిషస్, సీషెల్స్‌
 4) మడగాస్కర్, కొమొరోస్‌

View Answer
సమాధానం: 4
16. సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు, కొత్త  ముసాయిదా ఒప్పందాన్ని ప్రారంభించాలనుకుంటున్న ఏ దేశ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఆమోదించింది?
 1) రష్యా
 2) చైనా
 3) యూఎస్‌
 4) భారత్‌
View Answer
సమాధానం: 1
17. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2020 బడ్జెట్‌లో మొదటిసారి కింది వాటిలో దేని కోసం నిధులు కేటాయించింది?
 1) గ్లోబల్‌ ఫండ్‌ టు ఫైట్‌ ఎయిడ్స్‌
 2) ఇన్వెస్టిగేషన్‌ ఆఫ్‌ వార్‌ క్రైమ్స్‌ ఇన్‌ సిరియా అండ్‌ మయన్మార్‌
 3) ఫర్‌ ఎన్హాన్సింగ్‌ సెక్యూరిటీ ఆఫ్‌ ఆల్‌ ఇట్స్‌ మెంబర్‌ స్టేట్స్‌
 4) యునైటింగ్‌ ఫర్‌ పీస్‌

View Answer
సమాధానం: 2
18. ఇటీవల ఏ దేశం తన మారుపేరైన ‘హోలాండ్‌’ను వదిలివేస్తున్నట్లు అధికారిక ప్రకటన జారీ చేసింది?
 1) టర్కీ
 2) బెల్జియం
 3) జర్మనీ
 4) ద నెదర్లాండ్స్‌
View Answer
సమాధానం: 4
19. కొత్తగా ఏర్పడిన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌కు లీడ్‌ బ్యాంకింగ్‌ కన్వీనర్‌గా ఆర్‌బీఐ ఏ బ్యాంకును నియమించింది?
 1) ఇండియన్‌ బ్యాంక్‌
 2) యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
 3) కెనరా బ్యాంక్‌
 4) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

View Answer
సమాధానం: 4
20. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారత జీడీపీ పెరుగుదల రేటును 2020 ఆర్థిక సంవత్సరానికి ఎంతగా అంచనా వేసింది?
 1) 6.1%
 2) 6.3%
 3) 6.5%
 4) 6.7%
View Answer
సమాధానం: 1
21.ఆస్తుల వేలంలో పారదర్శకతను పెంచడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆన్‌లైన్‌ వేదిక ఏది?
 1) ఈబెకరే (eBkray)
 2) ఈఆక్షన్‌
 3) ఈఆక్‌ట్రాన్స్‌
 4) ఈట్రాన్స్‌పరెంట్‌
View Answer
సమాధానం: 1
22. 100 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్య మార్కును దాటడానికి భారత్‌ నిర్దేశించుకున్న లక్ష్య సంవత్సరం ఏది?
 1) 2030
 2) 2024
 3) 2022
 4) 2020
View Answer
సమాధానం: 4
23. 2019లో ‘మండు ఉత్సవం’ తొలి ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?
 1) ఆంధ్రప్రదేశ్‌
 2) మధ్యప్రదేశ్‌
 3) మిజోరం
 4) మహారాష్ట్ర
View Answer
సమాధానం: 2
24. పురాతన కాలంలో ఆచరించిన సంస్కృత శాసన పూజావిధానం ‘సప్తమాత్రిక’ను ఎక్కడ కనుగొన్నారు?
 1) కేరళ
 2) ఆంధ్రప్రదేశ్‌
 3) కర్ణాటక
 4) తమిళనాడు
View Answer
సమాధానం: 2
25. ఇటీవల ప్రయోగించిన ఆధునాతన, అత్యంత భారీ సమాచార ఉపగ్రహం ‘షీజియన్‌–20’ ఏ దేశానికి చెందింది?
 1) యూఎస్‌ఏ
 2) జపాన్‌
 3) రష్యా
 4) చైనా
View Answer
సమాధానం: 4
26. ఇటీవల ‘లోసర్‌ పండుగ’ను ఏ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం జరుపుకుంది?
 1) రాజస్థాన్‌
 2) లద్ధాఖ్‌
 3) జమ్మూకశ్మీర్‌
 4) ఉత్తరప్రదేశ్‌
View Answer
సమాధానం: 2
27. భారత రాష్ట్రీయ అటవీ నివేదిక 16 ప్రకారం భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు ఉన్నాయి?
 1) 22.34%
 2) 25.45%
 3) 23.67%
 4) 24.56%
View Answer
సమాధానం: 4
28. భారత రాష్ట్ర అటవీ నివేదిక ప్రకారం ఏరియా వారీగా ఏ రాష్ట్రం అత్యధికంగా అడవుల విస్తీర్ణం కలిగి ఉంది?
 1) పశ్చిమబంగా
 2) మధ్యప్రదేశ్‌
 3) కేరళ 
 4) అరుణాచల్‌ప్రదేశ్‌
View Answer
సమాధానం: 2
29. 11 రోజుల సుదీర్ఘ బహిరంగ థియేటర్‌ ఫెస్టివల్‌ ‘ధను జాత్రా’ను జరుపుకున్న రాష్ట్రం ఏది?
 1) మహారాష్ట్ర
 2) ఒడిశా
 3) పశ్చిమబంగా
 4) అసోం
View Answer
సమాధానం: 2
30. గృహాల్లో  ఉపయోగించిన నీటి నుంచి శక్తిని ఉత్పత్తి చేసే పదార్థం ‘ఎలక్ట్రోకైనెటిక్‌ స్ట్రీమింగ్‌ పొటెన్షియల్‌’ను కనుగొన్న పరిశోధకులు ఏ సంస్థకు చెందినవారు?
 1) ఐఐటీ గువాహటి 
 2) ఐఐటీ ఢిల్లీ 
 3) ఐఐటీ మద్రాస్‌
 4) ఐఐటీ ఖరగ్‌పూర్‌
View Answer
సమాధానం: 1
31. భారతదేశ తొలి రక్షణ బలగాల అధిపతి (చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌)గా ఎవరు నియమితులయ్యారు?
 1) విజయ్‌ సింగ్‌
 2) హరీష్‌ ముకుంద్‌ నారవనే
 3) బిపిన్‌ రావత్‌
 4) సంతోష్‌ షా
View Answer
సమాధానం: 3
32. జార్ఖండ్‌ 11వ ముఖ్యమంత్రి ఎవరు?
 1) మధుకోడ
 2) శిబు సోరెన్‌
 3) అర్జున్‌ ముండా
 4) హేమంత్‌ సోరెన్‌
View Answer
సమాధానం: 4
33. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు?
 1) ఛాగన్‌ భూజ్‌బాల్‌
 2) బాలసాహెబ్‌ తోరత్‌
 3) అజిత్‌ అనంత్‌రావ్‌ పవార్‌
 4) ఆదిత్య థాక్రే

View Answer
సమాధానం: 3
34.షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా 13వ చైర్‌పర్సన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులైన తొలి మహిళ ఎవరు?
 1) కిరణ్‌ మజుందర్‌ షా
 2) వందన లూత్ర
 3) హర్జీత్‌ కౌర్‌ జోషి
 4) ప్రియాపాల్‌
View Answer
సమాధానం: 3
35.2019 డిసెంబర్‌ 24న విడుదలైన ఐసీసీ క్రికెట్‌ టెస్ట్‌ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం పొందింది ఎవరు?
 1) జాసన్‌ హోల్డర్‌
 2) కేన్‌ విలియంసన్‌
 3) స్టీవ్‌ స్మిత్‌
 4) విరాట్‌ కొహ్లీ
View Answer
సమాధానం: 4
36. విస్డెన్‌ క్రికెటర్స్‌ అల్మానాక్‌ 2019 ‘దశాబ్దంలో ఐదుగురు క్రికెటర్లు’లో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయుడు ఎవరు?
 1) విరాట్‌ కొహ్లీ
 2) రోహిత్‌ శర్మ
 3) ఎం.ఎస్‌. ధోని
 4) మహమ్మద్‌ షమీ
View Answer
సమాధానం: 1
37. మాస్కోలో జరిగిన 2019 ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ డెస్‌ ఏచెక్స్‌ ఉమెన్స్‌ వరల్డ్‌ రాపిడ్‌ చాంపియన్‌షిప్‌ను ఎవరు గెలుచుకున్నారు?
 1) కోనేరు హంపి
 2) తానియా సచ్‌దేవ్‌
 3) సుబ్బరామన్‌ విజయలక్ష్మి
 4) హారిక ద్రోణవల్లి
View Answer
సమాధానం: 1
38. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన పీటర్‌ సిడిల్‌ ఏ దేశానికి చెందినవాడు?
 1) శ్రీలంక
 2) న్యూజిలాండ్‌
 3) బంగ్లాదేశ్‌
 4) ఆస్ట్రేలియా
View Answer
సమాధానం: 4
39. 2020 సంవత్సరాన్ని ‘సుశాసన్‌ సంకల్ప్‌ వర్ష్‌’గా ఏ రాష్ట్రం పాటిస్తుంది?
 1) హరియాణా
 2) అసోం
 3) పశ్చిమబంగా
 4) గుజరాత్‌
View Answer
సమాధానం: 1
40. ఐక్యరాజ్యసమితి ‘ప్రపంచ ప్రఖ్యాత టీనేజ్‌ యువతి’గా తన డికేడ్‌ ఇన్‌ రివ్యూ నివేదికలో ఎవరిని ప్రకటించింది?
 1) మలాలా యూసఫ్‌జాయ్‌
 2) బనా అలబేద్‌
 3) సోనితా అలీజాదే
 4) మారి కోపెనీ
View Answer
సమాధానం: 1
41. ‘సర్వత్రా కవాచ్‌’ అనే బుల్లేట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను దేశీయంగా అభివృద్ధి చేసినందుకు  ‘ఆర్మీ డిజైన్‌ బ్యూరో ఎక్సలెన్స్‌ అవార్డు’ను అందుకుంది ఎవరు?
 1) మేజర్‌ అశోక్‌ అంబ్రే
 2) మేజర్‌ కున్హిరామన్‌ పాలట్‌ కాండెత్‌
 3) మేజర్‌ ఎస్‌. కె. ఉపాధ్యాయ
 4) మేజర్‌ అనూప్‌ మిశ్రా

View Answer
సమాధానం: 4
42.భారతదేశం కోల్పోయిన 12 వజ్రాల గురించి వివరించే ‘డైమండ్‌ ఇన్‌ మై పామ్‌’ పుస్తక రచయిత ఎవరు?
 1) సంజయ్‌ ధర్వాఢ్‌కర్‌
 2) సల్మన్‌ రష్దీ
 3) రస్కిన్‌ బాండ్‌
 4) విక్రమ్‌ సేథ్‌
View Answer
సమాధానం: 1
43. అమెరికా  అత్యున్నత పురస్కారం ‘అకాడమీ ఆఫ్‌ ఆప్తాల్మాలజీ లైఫ్‌ అచీవ్‌మెంట్‌ హానర్‌ అవార్డు 2019’ని అందుకున్న తొలి భారతీయ కంటి వైద్యుడు ఎవరు?
 1) డాక్టర్‌ సతీష్‌ మెహతా
 2) డాక్టర్‌ నవీన్‌ సఖుజ
 3) డాక్టర్‌ సంతోష్‌ జి హోనవార్‌
 4) డాక్టర్‌ లలిత్‌ వర్మ

View Answer
సమాధానం: 3
44. 2019 ‘హరివరాసనం’ అవార్డుకు ఎంపికైన భారతీయ సంగీత విద్వాంసుడు, స్వరకర్త ఎవరు?
 1) ఎస్‌.పి. బాలసుబ్రహ్మణ్యం
 2) ఇళయరాజా
 3) ఎ.ఆర్‌. రెహమాన్‌
 4) కె.జె. ఏసుదాస్‌

View Answer
సమాధానం: 2
45. సినీ పరిశ్రమలో విశేష కృషి చేసినందుకు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా 50వ దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు 2018 అందుకున్న నటుడు ఎవరు?
 1) సంజయ్‌ దత్‌
 2) లతా మంగేష్కర్‌
 3) అమితాబ్‌ బచ్చన్‌
 4) ధర్మేంద్ర
View Answer
సమాధానం: 3
46. జర్నలిజం రంగంలో విశేష కృషికి ‘లోకమాన్య తిలక్‌ నేషనల్‌ జర్నలిజం అవార్డు’తో ఎవరిని సత్కరించారు?
 1) రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌
 2) అర్నబ్‌ గోస్వామి
 3) సంజయ్‌ గుప్తా
 4) రావిష్‌ కుమార్‌

View Answer
సమాధానం: 3
47. స్వచ్ఛమైన, పచ్చని, ఆరోగ్యకరమైన దేశం కోసం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ అనే అంశంపై 27వ జాతీయ బాలల సైన్స్‌ సమావేశం 2019కి ఏ నగరం ఆతిథ్యమివ్వనుంది?
 1) చెన్నై, తమిళనాడు
 2) తిరువనంతపురం, కేరళ
 3) ముంబై, మహారాష్ట్ర
 4) న్యూఢిల్లీ, ఢిల్లీ

View Answer
సమాధానం: 2
48.ప్రాథమిక రంగాలకు 40 శాతం రుణాలనందిస్తున్న ప్రైమరీ (అర్బన్‌) కోఆపరేటివ్‌ బ్యాంక్‌లకు ఆర్‌బీఐ నిర్దేశించిన కొత్త రుణ లక్ష్య శాతం ఎంత?
 1) 65%
 2) 50%
 3) 80%
 4) 75%
View Answer
సమాధానం: 4
49.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ నిర్వహణ 2020కి కేటాయించిన  బడ్జెట్‌ ఎంత?
 1) 5.07 బిలియన్‌ డాలర్లు
 2) 4.07 బిలియన్‌ డాలర్లు
 3) 3.07 బిలియన్‌ డాలర్లు
 4) 2.07 బిలియన్‌ డాలర్లు

View Answer
సమాధానం: 3
50. ప్రయాణికులకు మెరుగైన సూచనలు,  సులభమైన  మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఇటీవల ఏ రైల్వేస్టేషన్‌ తన కొత్త ప్రయాణికుల సమాచార వ్యవస్థను పొందింది?
 1) అహ్మద్‌పూర్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్, పశ్చిమబంగా
 2) అహ్మద్‌పూర్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్, బిహార్‌
 3) నిజామాబాద్‌ జంక్షన్‌ రైల్వేస్టేషన్, తెలంగాణ
 4) అనకాపల్లి రైల్వేస్టేషన్, ఆంధ్రప్రదేశ్‌

View Answer
సమాధానం: 4

vijay pilla
9490122229

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు