మాల కులం - సాంప్రదాయాలు



 

🔹 మాల కులం పేరు - దాని అర్ధం🔹

      జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert గారి అధ్యాయనం ప్రకారం,, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు.. 

      పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని  రాశారు..

      ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్(పరయా-పరయా అంటే సందేశాన్ని చేరవేసేవాడు) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని,, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని,, మేరు పర్వతం పేరుతో పడమరలో, మార్లు అని, మహార్లు అని,, భార్ లు అని పిలిచినట్టు,, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు.. 

      తమిళ సంగం సాహిత్యంలో కూడా వీరు శివుడి కుమారుడు మాల చెన్నప్ప వారసులు అని, వీరు కైలాస పర్వత నివాసులు కాబట్టి వీరికి పర్వతానికి తమిళ పదం "మలై" అనే పేరుతో "మాల" అనే పేరు వచ్చిందని చెప్పబడింది.. "నాగ" అనే జాతి పదానికి సంబంధించిన మూలాల శివంలో ఎక్కువగా కనిపిస్తాయి.. 

🔹 మాల కులం - గోత్రాలు 🔹
   
      మాలలు వృత్తి (profession) మరియు ప్రాంతం (Geography) ఆధారంగా ఒక కట్టుదిట్టమైన గోత్ర వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు.. ఆ రోజుల్లోనే జన్యుపరమైన జబ్బులు ప్రభలకుండా,, వివాహ సంబంధాల కోసం, కట్టుదిట్టమైన గోత్ర వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం.. 

     ప్రతీ గోత్రం వెనుక ఒక చరిత్ర ఉంది.,, కానీ మాలల సాంప్రదాయపు గోత్రాలలో ఎన్నో గోత్రాలు ఎప్పుడు అంతరించిపోయాయి.. కొన్ని గోత్రాలు తర్వాత ప్రాతీయ నామాలతో ఏర్పాటు చేయబడిన గోత్రాలలో కలపబడ్డాయి..

👉 మాలల్లో గోత్రాలు :- .. కొన్ని ఇంటిపేర్లు 

▪️ A. సార్ధక గోత్ర నామం (మొదట్లో ఏర్పాటై అయిన గోత్రాలు) - ఇది పూర్తిగా వృత్తి విభజన ఆధారితంగా చేసుకున్న విభజన.. ఒకే రకమైన వృత్తులను ఒకచోట చేర్చినట్టు, ఆయాగోత్రాల సభ్యుల ఇంటిపేర్లను చూస్తే తెలుస్తుంది.. 

1. కంఠ గోత్రం- శరీరానికి కంఠం ఎలాగో వీరు మాల కులానికి అలాంటివారు,, ఈ గ్రోత్రం ఇప్పుడు అంతరించిపోయింది అని చెప్పవచ్చు.. ఇందులో వారి ఇంటిపేర్లు పూర్తిగా అంతరించిపోయాయి..

2. సరిండ్ల గోత్రం-  బూరి, బల్లెం, బత్తుల, బొమ్మిడి, చల్లా, చింతల, డబ్బు, గాలి, కర్ణ, కాకి, కాండ్రు, ముడి, మద్దిలి, మల్లెల, పుట్టా, పాముల, పగిడి, సమ్మెట, ఉయ్యాల.

3. సావు గోత్రం- యుధాల్లో పాల్గొనే మాలలకు కేటాయించారు.. ఈ గోత్రం కూడా పూర్తిగా అంతరించిపోయింది.. అక్కడక్కడ కనిపిస్తున్న ఒకే ఇంటిపేర్లు 'జంగం', 'మల్లు'

4. సైండ్ల -గోత్రం నేతకాని వ్యవస్థకు ఏర్పాటు చేయబడిన గోత్రం.

5. దైండ్ల గోత్రం- దాసరి, గంజి, దొడ్డి, కొమ్ముల, మర్రి, పాల, పోవాకు, పరిసే, తుమ్మల, తుమ్మ

▪️ B.  ప్రాంతీయ గోత్ర నామం (తర్వాత క్రమంలో ఏర్పాటైన గోత్రాలు) - ఇవి తర్వాతి క్రమంలో, నివాస ప్రాంతాల విభజన బట్టి కేటాయించిన గోత్రాలు.. ఈ గోత్రాలు గలవారు తమ ఇంటిపేరు ఏ ఊరితో కలుస్తుందో.. ఆ ఊరు ఉన్న ప్రాంతాన్ని బట్టి,, వారి గోత్రం తెలుసుకోవచ్చు.. 

6. రెడ్డి భూములు గోత్రం - అవుక, బండి, బొమ్మల, బొల్లెద్దు, బెజ్జం, తోట, దక్కు, దిండ్ల, దోమా, గేరా, కైలా, కటిక, నత్తల, పైడి, పిల్లి, రాయి, సముద్రాల, శీలం, తండా..

7. రేచర్ల (పల్నాడు) గోత్రం - ఇది ప్రత్యేకమైన గోత్రం.. పల్నాడు మాలలు వైష్ణవ స్వీకారం తర్వాత.. వీర వైష్ణవం అనే ఉద్యమాన్ని నిర్మించి,, వారిని వారు మాలల నుండి వేరు చేసుకుని, ప్రత్యేక జీవన విధానం, ఆచార వ్యవహారాలు , నియమాలు పెట్టుకున్నట్టు చరిత్ర చెబుతుంది.. వెలమాలలు (వెలమలు), కాకతీయులు ఈ గోత్రస్తులే.. (దీని వెనుక చరిత్ర ప్రత్యేక శీర్షికలో) (కాకతీయుల రాజ్యంలో పల్నాడు మాలల వీరత్వాన్ని కాకతీయ పాలకులు ప్రచారం చేసినట్టు చారిత్రక ఆధారాలు కోకొల్లలు)

8. పాకనాటి గోత్రం (పాకనాడు) - అల్లం, దారా, గడి, గుర్రం, మగ్గం, మైలారి, పర్వత, పిండి, పస్సల...

9. మురికినాటి / ఆరవ గోత్రం (మురికినాడు) - ఆరవ అంటే విదేశీ లేదా బయట వారు అనినార్థం.. ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా ప్రాంతాల మాల సంబంధ కులాలకు ఇచ్చిన గోత్రం.. 

       ఈ గోత్రాలలోని ఇంటిపేర్లు కాకుండా, మాలలకు తాము వలస వెళ్లిన ప్రాంతాలను బట్టి కూడా ఇంటిపేర్లు వచ్చాయి,, అలాంటి ప్రాంతీయమైన ఇంటిపేర్లు అన్ని కులాల్లో కనిపిస్తాయి.. ఉదాహరణలు పత్తిపాటి (పత్తిపాడు ప్రాంతం), కూరపాటి (కూరపాడు ప్రాంతం)

🔷 గోత్రాలు వెనుక గమ్మత్తైన కథ - సరదాగా చదవండి 🔷

        మరో రకమైన విభజనలో మాలల్లో గోత్రాలు ఇంకో రకంగా విభజించారు.. అది "కుడి పైట" వారు, "ఎడమ పైట" వారు అని.. మాలల్లో కొన్ని గోత్రాల మహిళలు తమ పైటను కుడివైపుకు వేసుకోవడం, మరి కొందరు, పైటను ఎడమ వైపుకి వేసుకోవడం అనే ఆచారం కూడా అమల్లో ఉంది.. మలా మహిళ చీరకట్టు చూసి, గోత్రం చెప్పడం అనే ఆనవాయితీ ఉండేది..  దీని వెనుక కథకు మూలం, "హరిశ్చంద్ర చరిత్ర".. 

      మాలల్లో బహుభార్యత్వం అనేది ఒక ఆచారంగా కొనసాగేది.. మాల కులంలో మగవాడు కనీసం ఒక్కో గోత్రం నుండి ఒక్కో పెళ్లి చేసుకోవడం అనేది  ఒక గౌరవ సూచకంగా ఉండేది.. 

         ఆ ఆచారం ప్రకారం, కాశీ నగరంలో వల్లకాడు అధిపతి అయిన వీరబాహుడు.. మూడు గోత్రాలు నుండి ముగ్గురు భార్యలను చేసుకున్నాడు.. వీరబాహుడు హరిశ్చంద్రుడిని కొనుక్కుని తన కాటిలో పనిలో పెట్టుకున్నాడు అనే సంగతి తెలిసిందే.. 

        హరిశ్చంద్రుడి బాధలు చూసి మనసు కరిగిపోయిన వీరబాహుడు,, హరిశ్చంద్రుడు ఈ బాధల నుండి విముక్తుడు అయితే, తన భార్యలను బలి ఇస్తాను అని కాళీ మాతకు పూజ చేయడం మొదలెట్టాడట.. ఆ మాట విన్న హరిశ్చంద్రుడి ముగ్గురు భార్యల్లో.. ఒక భార్య పాకనాడు ప్రాంతానికి పారిపోయింది,, ఇంకో భార్య రెడ్డి భూమి ప్రాంతానికి పారిపోయింది.. మురికినాడు (కాశీ) ప్రాంతానికి చెందిన భార్య మాత్రం వీరబహుడి ఆన(వాగ్దానం) ప్రకారం కాళీ మాతకు బలి అవ్వడానికి సిద్ధపడింది.. 

       అలా పారిపోయిన ఇద్దరి భార్యల నుండి తనను తాను భిన్నంగా చెప్పుకోవడానికి, మురికినాడు భార్య తన పైటను ఎడమ వైపు వేసుకోవడం మొదలెట్టింది... హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యం చేపట్టాక, వీరబహుడి కోరిక మేరకు, దాన్నే సాంప్రదాయంగా కొనసాగించాలని చట్టం చేసినట్టు ఒక కథ ప్రచారంలో ఉండేది.. 

👉  అంతరించిపోతున్న మాలల సాంప్రదయాల ఉనికి 👈

    ఇప్పుడు మాలల్లో చాలా మందికి తమ గోత్రం ఏమిటో కూడా తెలియదు.. హైందవ సంస్కృతికి ఒక పూర్తి ప్రత్యామ్నాయ సంస్కృతిని కట్టుదిట్టంగా నిర్మించుకున్న మాలలు, తమ చరిత్రని పూర్తిగా మర్చిపోయారు.. 

  మాలల వెనకబాటుకి ముఖ్య కారణం,, మాలలు తమ మూలాలను మర్చిపోవడమే.. 

((( ఆ మూలాలను మళ్లీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే.. ఈ శీర్షిక.. వచ్చే శీర్షికలో మాలల సాంప్రదాయ ఆట, పాట, యుద్ధ కళ, వాటి వెనక ఉన్న చరిత్ర, పోరాణిక ఆధారాలు లాంటి మరో ముఖ్యమైన అంశాలతో.. )))

@@మూక_నాయక్@@

Comments

  1. Super anna me alochana bagundhi

    ReplyDelete
  2. చాలా గొప్పగా చెప్పారు పూర్తిగా తెలిస్తే ఇంకా బాగుంటుంది

    ReplyDelete
  3. సూపర్ అన్నా చరిత్ర చాలా మందికి తెలీదు చాలా భాగా వివరించారు

    ReplyDelete
  4. చాలా బాగా చెప్పారు

    ReplyDelete
  5. సూపర్ జై మల్ల యుద్ధం Z(జై కాటి కాపరి)( జై నీరిడి )( జై మస్కుర్) వీరు నిజంగా శివుని వారసులే వారి వృత్తి అలాంటిది

    ReplyDelete
    Replies
    1. సూపర్ జై మన్నేపు మాల కాక పోతే మాల అనే పదం పుట్టింది మాత్రం శివుడు మెడలో ఉండే మాల వారే ఈ మాల కులం ఒక్క శివుడి మెడలో కాదు ప్రతి కార్యానికి నువ్వు ముందుడలని ఆ పరమ శివుడి కోరిక అందుకే ప్రతి దేవుడి మెడలో మాల చావుకు మరియు పెళ్లికి మాల ఉండాల్సిందే మాల అనేది ఒక దేవుడే అర్దం

      Delete

Post a Comment

Popular posts from this blog

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు