సంక్రాంతి



శూద్రుల పండుగే సంక్రాంతి ::--
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹.

సంక్రాంతి మూడు రోజుల పండుగ. మెుదటి రోజు భోగి, రెండోరోజు సంక్రాంతి, మూడోరోజు కనుమ.మెుదటిరోజు పండుకకు స్వాగతం, రెం డో రోజు ఆసలైన పండుగ. మూడో రోజు పని వారి పండుగ.ఏంతో కోళాహళంగా, ఉత్సాహం తో జరిగే పండుగ.సూర్యుని ఉత్తరాయణ ప్రవే శం, సూర్యుని మకరరాశిలోకి ప్రవేశం ఈ రోజు ప్రత్యేకత. దీనినే పతాకాల పండుగ అంటారు. ప్రతి ఏడాది రైతులకు వచ్చే పంటల ఆవేజా పండుగ.రైతులు సంతోషంగా,ఉత్సాహ పూరి తంగా జరుపునేది.ఇదే శూద్రుల పండుగ. ఆం టే కేవలం శూద్రులే దీనిని జరుపుతారు.ఏండ్ల బళ్ళూ, ప్రక్కనే పటేళ్ళతో సాగుతుంది సరదా గా. కొన్ని చోట్ల వాటితో పాటు గుర్రాలు ఉంటా యి.ప్రతి ఏడాది15 వ తేదీ వచ్చే పండుగ కాని ఈ సంవత్సరం 14 నే వచ్చింది.

సాంస్కృతిక పరాకాష్ట ఈ పండుగ.మన పల్లెల ఆచారాలు,సంప్రదాయాలను చూస్తాం. పల్లెల నుంచి ఏ పట్టణంలో ఉన్నా, ఏదేశంలో ఉన్నా వారందరూ కుటుంబ సమేతంగా తరలి పల్లెల కు రావాల్సిదే.యువకులు,యువతులు కొత్త బట్టలు ధరించి పల్లెలకు సంక్రాంతి శోభను తె స్తారు. యువతులు సంప్రదాయ బట్టలైన లం గా వోణీలతో,చీరెలతో కనువిందుచేసే పండు గ.

తొలిరోజు భోగి మంటలతో పండుగకు స్వాగ తం. పెద్ద మంటలతో పళ్ళెలన్నీ కోలాహలం.త రువాత తలస్నానం,నూతన వస్త్రాల ఆలంక రణ.రెండోరోజు పండుగ.పండుగ రోజు పొంగ లి, నైవేధ్యం, పులిహారలతో దేవునికి పూజలు చేసి కడుపు నిండా తినే పండుగ. పండుగకు ఆరిసెలు, చెక్కలు,కారప్పూస, పూసమిఠాయి, గారెలు, బూరెలు వంటి వంటకాలతో మన సాంస్కృతిక శోభకు పరాకాష్ట.

సాయంత్రం ఏండ్ల బండిలో ఊరేగించే దేవుడు, చాకలి పట్టుకునే దివిటీల వెలుగులో, ఓకరిపై ఓకరు గులాం చల్లుకుంటూ పోతూసాగే ఊ రేగింపు.డప్పులవారు,జంగాలు,గంగిరెద్దులు, పగటి వేషగాళ్ళు, పనులచేసే వారు ఇంటింటికీ తిరిగి పిండివంటల సేకరణ తో చాలా కన్నుల పండుగలా సాగుతోంది.

మూడోరోజు రైతుల పనికివచ్చే పనివారి పం డుగ ఆయిన కనుమ. కనుమరోజు తెప్పతిరు నాళ్ళ, చెక్క భజనలు,వివిధ రూపాల భజనల తో యువకులు ఉత్సాహంగా పాల్గొనటం,యు వతులు వారిమీదకు పండ్లతో దాడి,యువకు ల విన్యాసాలతో కోలాహలంగా సాగుతుంది పండుగ.దేవుని విగ్రహాలను తెప్పపై ఉంచి బా ణాసంచా మెూతలతో, తప్పెట్లు,ఫిరంగులు, కో డి పందేలు,పతాక పోటీలు,పటేళ్ళ పందేలు, ఆవుల పోటీలు, దున్నల పోటీలు, పాల పోటీ లు, ఏడ్ల పందేలుతో హోరెత్తుతాయి పల్లెలు. పతాకాలతో కనువిందు చేస్తారు గ్రామీణులు. పతాకాల  పోటీలు కూడా జరుపుతారు. నేడు సరదా పందేలు పోయి వ్యాపార పందేలు ప్రారంభమయ్యాయి.

K. Hanumantharao

పంచాంగ కర్తలు అపరమేధావులని, గ్రహణాల రాక గురించి ముందే చెప్పగలరని భావించే వారి సంఖ్యకు మనదేశంలో లోటు లేదు. 
గత 19 సం.లలో వచ్చిన గ్రహణాల వివరాలు దగ్గర వుంటే, ఎవరైనా రాబోయే గ్రహణాల గురించి ముందుగా చెప్పవచ్చు. ఎందుకంటే, 18 సం.ల 11రోజుల  8 గంటల కాలంలో 70 సూర్య - చంద్ర గ్రహణాలు పునరావృతం అవుతుంటాయి.
సంక్రాంతిని పురస్కరించుకొని పంచాంగ కర్తలు చెప్పే ఖగోళ అజ్ఞానం గురించి ఇప్పుడు చూద్దాం.

సంక్రాంతి రోజున సూర్యుడు మకర (పన్నెండు రాశులలో ఒకటి) రాశిలో ప్రవేశిస్తాడు గనుక దాన్ని మకర సంక్రాంతి అంటారని, అదే ఉత్తరాయణ పుణ్యకాలం అనీ హైందవ పండితులు ఉపన్యాసాలు దంచుతుంటారు.

నిజానికి సూర్యుడు డిసెంబరు 22న మకర రేఖ మీద వుంటాడని, ఆమర్నాడు ఉత్తరదిశగా భూమధ్య రేఖ, కర్కాటక రేఖల వైపు ప్రయాణిస్తాడని నేటి మన పాఠ్యపుస్తకాలు చెబుతున్నాయి. (సూర్యుడు నిజంగా అలా ప్రయాణించక పోయినా, మనకు అలా కనిపించడం జరుగుతుంది) సాధారణ శకానికి ముందు (BCE) 2050-100 సం.ల మధ్యకాలంలో దక్షణాయణ అంతం మకర రాశిలో జరిగేది. దాన్ని అప్పట్లో ఉత్తరాయణ పుణ్యకాలం అనేవారు. ఆ కాలంలో మకర సంక్రమణానికి విలువ వుండేది.
కాని, విషువచ్చలన ఫలితంగా ప్రస్తుతం దక్షణాయణ అంతం జరిగి ఉత్తరాయణం డిసెంబరు 22న జరుగుతోంది. అంటే, నేడు ఉత్తరాయణం జరిగిన 23 రోజులకు దాంతో ఏ సంబంధమూ లేని జనవరి 14న మనం మకర సంక్రాంతి జరుపుకుంటున్నామన్న మాట!

విషువచ్చలనం స్వల్పమే అయినా, వేల సం.లు గడిచే సరికి దాని నిడివి పెరిగిపోతూ వుంటుంది. ఉత్తరాయణాంతనికి - దక్షిణాయణాంతనికి వుండే మధ్య సమయాలను విషువత్తులు అంటారు. ఖగోళ శాస్త్ర అధ్యయనం చేసిన తొలి నాగరిక జాతులు ఉత్తరార్థ గోళంలో వున్నందున; వీరికి సూర్యుడు ఉత్తర దిశకు మళ్లినప్పుడు పగలు నిడివి పెరిగి, రాత్రి నిడివి తగ్గడమే గాక, చలి తగ్గి ఆహారం బాగా దొరికేది. దాన్ని శుభకరంగా భావించి, అప్పట్లో వారు  'ఉత్తరాయణ పుణ్యకాలం' అన్నారు. అలాకాకుండా, దక్షిణార్థ గోళంలో వున్న జాతులు తొలుత ఖగోళ శాస్త్ర అధ్యయనం చేసి వుంటే, 'దక్షిణాయన పుణ్యకాలం' వాడుకలోకి వచ్చి వుండేది!

ఏతావాతా తేలిందేమంటే, 1700 సం.ల క్రితం మన పూర్వికులు జరుపుకొన్న మకర సంక్రాంతిని నేడు డిసెంబర్ 22న జరుపుకోవాల్సి వుండగా, ఆ మరుసటి నెలలో జరుపుకొంటున్నాం. 
మన పంచాంగ కర్తలు 2వేల ఏళ్ల నాటి కథనే నేటికీ వినిపిస్తూ, మనతో యింకా పాత చింతకాయ పచ్చడినే  తినిపిస్తున్నారు.
Subbaraju penmasta
-PSR(13.01.2021)


//బహుజనుల పండగలలో బ్రహ్మణిజ పెత్తనాన్ని ప్రశ్నించండి//

@సంక్రాంతి కాదు ఇది పొంగల్ ఉత్సవం@

భారత దేశ ప్రజలు ముఖ్యoగా శ్రమ జీవులయినటువంటి బహుజనుల పండగలు పూర్తిగా బ్రహ్మణీకరించబడ్డాయి.హరప్ప నాగరికత తో విలసిల్లిన భారత ఉపఖండం ను బ్రహ్మణీయ వ్యవస్థ వేదకాలం నుండి పూర్తిగా వారి అదీనoలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించారు.వేదకాలం తరువాత బుద్ధుని కాలం లో బ్రహ్మనిజం పూర్తిగా తప్పుడు సిద్ధాంతం అని తథాగతుని బోధనల వలన ఈ దేశ ఉపఖండ ప్రజలు తెలుసుకున్నారు.బుద్ధుని బోధనలు బుద్ధుని కాలం  క్రీస్తు పూర్వం 5 వ శతాబ్దం నుండి బౌద్ధం మొదలయ్యింది ,దీనిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయింది సామ్రాట్ అశోకుడు .సుమారు 5 శతాబ్దం నుండి క్రీస్తు శకం 15 శతాబ్దం వరకు బౌద్ధం ఈ దేశం లో విలసిల్లింది.

భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధానికి బ్రహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబెడ్కర్ విషదీకరించారు.సుమారు రెండువేల ఏళ్ల బౌద్ధకాలం లో అనునిత్యం బౌద్ధం బ్రహ్మనిజంతో సంఘరిస్తూనే ఉంది.భారత దేశం లో అనాదిగా కష్టజీవులు ,ఇష్టం గా శ్రమ జేసే శ్రామికులు.శ్రమ చేస్తున్న శ్రామిక ప్రజానీకం ఉత్సాహాలను వేడుకలను బ్రహ్మనిజం కుట్రతో బ్రాహ్మణీకరించింది. బ్రాహ్మణ పూజారి వర్గం శ్రామికుల శ్రమను ధనం రూపం లో కొల్లగొట్టడానికి ఈ ఉత్సవాలను బ్రహ్మణీకరించారు.ఈ కోవలోనిది దక్షిణ భారతదేశ ప్రజలు చేసుకునే "పొంగల్ "పండగ.

తమిళ నాడు ద్రావిడ సంస్కృతి ,కష్టజీవుల సంస్కృతి,తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతిగా  పిలువ
బడుతున్న పండగ తమిళ నాడులో పొంగల్ గా పిలువబడుతుంది.పొంగల్ అంటే పొంగడం ,నిండిపోవడం అని అర్థం .భారత దేశ మెజారిటీ శ్రామికులు వ్యవసాయ దారులు ,వ్యవసాయం లో వరి ,గోదమ ఎక్కువగా పండించడం ఈ దేశం లో వ్యవసాయ దారుల వృత్తి.అందులో వరి పంటలో ఈ దేశం రెండవ స్థానం లో ఉంది .వ్యవసాయం ఖరీఫ్ కాలమైన జనవరి నెలలో వ్యవసాయ పనులు పూర్తిగా ముగిసి పంట చేతికి వస్తుంది.అనగా ఇంట్లో పంట నిండుతుంది.ప్రతీ ఇల్లు వరి పంటతో నిండిపోతుంది.ఈ ఉత్సవాన్ని ఈ దేశ ప్రజలు వేడుక చేసుకోవడాన్ని బ్రాహ్మణుల కంటపడింది.

దేవుడు అంటే ప్రకృతిలో కనబడేవే అని నమ్మే ఈ దేశ బహుజనులు ,సూర్యుణ్ణి  మొక్కే వారు.ఇలా పంటను చేయికివచ్చిన సందర్భముగా పొంగల్ చేసుకోవడం ఆనవాయితీ.ఈ దేశ ప్రజలు గట్టు మీద ఒక రాయి పెట్టి గట్టమ్మ గా ,పొలిమేర రాయి పెట్టి పోలేరమ్మ గా,పోషణ కు గుర్తుగా ఊరిలో ఒక రాయి పెట్టి పోషమ్మగా ,దారిలో ఒక రాయి పెట్టి మైసమ్మ గా మాతృస్వామ్య పూజలు చేసుకునేవారు.ఈ పూజలు చాలా సాధారణం గా ఉండేవి పూజ సామాగ్రికి అంత ఖర్చుకూడా అయ్యేవి కావు .కానీ బ్రహ్మనిజం ఎప్పుడైతే ఈ బహుజనులా పండుగలో తలదూర్చిందో అప్పటి నుండి బహుజనులు దేవుడు పేరుతో దోపిడీకి గురి కావడం మొదళ్ళయింది.

జంతుబలులు ,మూఢత్వం కి వ్యతిరేకంగా మొదలయిన బౌద్ధం ను చూసిన బ్రహ్మనిజం ,బౌద్ద సంస్కృతి శ్రామికులైన బహుజనులలోకి  వెళ్లడాన్ని 
జీర్ణించుకోలేక కట్టుకథలు అల్లడం మొదలు పెట్టారు.సూర్యుణ్ణి రెండు చేతులతో మొక్కే బహుజన భారత దేశ వ్యక్తి అంతవరకే ఆలోచిస్తాడు.ఆ వ్యక్తి బౌద్ధం లోకి వెళ్తే తార్కిక ఆలోచనలో పడతాడు.అదే వ్యక్తి బ్రహ్మనిజం లో ఆలోచిస్తే సూర్యుని మీద బ్రాహ్మణుల కట్టు కథలను నమ్ముతాడు.ఈ విదంగా అనాదిగా బహుజనులలో ఉన్న తార్కిక వాదాన్ని తమ ఆధిపత్యం కోసం  బ్రహ్మనిజం తమలోంచి పోగొట్టే కుట్రచేసింది.

ప్రకృతిని ఆరాధించిన ఈ దేశ ప్రజలను కుట్రతో అజ్ఞానం  లోకి నెట్టింది బ్రహ్మనిజం ,ప్రకృతిలో లో జరిగే సృష్టి రహస్యాలను తెలుసుకోకుండా వాటికి కట్టు కథలు అల్లింది. ప్రకృతి ఆరాధన నుండి ,గతి తార్కిక సిద్ధాంతం వైపు విగ్రహారాధన నుండి సైన్స్ వైపు మళ్ళాల్సిన ఈ దేశ ప్రజలను మూఢత్వం వైపు ప్రయనించేలా కుట్రలు చేసింది.వీటికి ప్రజలు సంతోషాలతో జరుపుకునే ఉత్సవాలను,ప్రజలు భయంతో చల్లంగా కాపాడాలని మొక్కే మొక్కల వరకు బ్రహ్మనిజం అక్రమించుకుంది.రాళ్ళ ను మొక్కే స్థితి నుండి రాళ్ళ మీద పరిశోధన చేసే స్థితికి రావాల్సిన ప్రజలను రాళ్లను రోగాల మాన్పి ,సుఖ సంతోషాలు ,స్వర్గ నరకాల చేర్చే వాటిగా తీర్చిదిద్దుకుని పూజలు చేసే స్థితికి బ్రహ్మనిజం నెట్టివేసింది.

పండగలు బ్రాహ్మణ ,క్షత్రియ ,వైశ్యుల ధనార్జన కోసం బహుజనుల పై చేసిన కుట్రలు.భారత దేశం లో బౌద్ధం ను ద్వంసం చేయడం వెనుక బహుజనులను దోపిడీ చేయాలనే కుట్ర దాగి ఉన్నది.చాలా తక్కువ ధనం తో అయిపోయే బహుజనుల పూజలను ,అప్పులు చేసుకుంటే కానీ పూజలు కానీ స్థితికి బ్రహ్మనిజం కుట్ర చేసింది.బౌద్ద జైన ఆలయాలను ఆక్రమించుకొని వాటిని హిందూ దేవాలయాలు గా మార్చుకుంది.బుద్ధుని రూపాన్ని 
బ్రహ్మణిజ దేవుళ్ళ ప్రతిరూపాలను చేసింది.బుద్ధుని  భంగిమలు ఈ దేశ దేవుళ్ళ భంగిమలు చేసింది.అసలు దేవుడు అంటే ప్రకృతి అని ఆరాధించే ఈ దేశ ప్రజలకు దేవుని రూపం బుద్ధుడే అయ్యారూ.బుద్ధుని ముందు హిందు మతానికి దేవుడు అనే రూపం లేక పోవడం సత్యం అన్నది చరిత్ర సాక్ష్యంగా కనబడుతుంది.

వ్యవసాయం తో దేదీప్యమానంగావెలుగుతున్న ఈ దేశం లో కుల వ్యవస్థ ను రూపొందించి ,వ్యవసాయాన్ని కొందరికే పరిమితం చేసింది,భూమిని కొందరి చేతుల్లో ఉండేలా కుట్రలు చేసింది.బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకు భూమి ఉండేలా చేసింది,శూద్ర కులాలను వ్యవసాయానికి దూరం చేసి వారిని సేవకులుగా చేసింది.శూద్ర కులాలలో తిరుగుబాటును  గమనించిన బ్రహ్మనిజం శూద్రులలో హెచ్చుతగ్గులు పుట్టించి నయా క్షత్రియ వర్గాన్ని పుట్టించింది.శూద్రులలో నయా క్షత్రియ వర్గమైన  ఓసి కులాలకే అసంఖ్యాక భూములు ఉండటానికి కారణం బ్రహ్మణిజమే ,వృత్తి కులాలకు ,అంటరాని కులాలకు వ్యవసాయ భూములు లేకపోవడం ,శ్రామికులుగా ,కూలీలుగా బ్రతకడానికి కారణం కూడా బ్రహ్మణిజమే. 

ఇదంతా ఒక కుట్రతో బ్రహ్మనిజం చేసింది ఈ దేశ మెజారిటీ బహుజనులను మైనారిటీలు చేయడం దీని వెనుక రహస్యం ,విభజించు పాలించు బ్రహ్మనుల సొత్తు.కులం పేరుతో రెండు వర్గాలను సృష్టించి ధనిక వర్గం దగ్గర డబ్బును పేద వర్గాల దగ్గర భక్తిని పొందాలన్నది బ్రాహ్మణుల పన్నాగం.
పేదవారు అయిన ప్రజలను గుళ్ళు గోపురాలు తిప్పుకోవడం లో నూరు శాతం సఫలీకృతం అయ్యారు.ధనికుల డబ్బులతో గుడులు కట్టించుకొని పూజారులుగా ఈ సమాజం లో గౌరవ మర్యాదలు పొందుతున్నారు .అదే ఆరుగాలం కష్టం చేసిన శ్రమికులు అప్పులపాలు అయ్యారు.

సరిగ్గా పండగలు ముఖ్యoగా ప్రజలు సుఖంగా ఉన్నప్పుడు చేసుకుంటారు ఆ కోవలోని సంక్రాంతి పండుగకు ,సూర్యుని సంక్రమణం జరుగుతుంది ,మకర రాశిలోకి సూర్యుడు వెళ్లిన రోజున సూర్యుని ఉత్తరాయణం ప్రయాణం మొదలవుతుంది ,ఇప్పుడు గుడిలో దేవుళ్లను దర్శించుకోవాలి ,బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయాలని కట్టు కథలు చెప్పారు.ఈ కట్టు కథలు నమ్మిన మెజారిటీ పేద వారు అయిన బహుజనులు ప్రతీ ఏడాది జనవరి నెలలో తమ దగ్గర ఉన్న ధనాన్ని గుడులు గోపురాలు తిరగడానికి ఖర్చుబెడుతున్నారు.ఇదంతా ఆలోచించని వ్యవస్థ ను ,తార్కిక వాదం లేకుండా ఉన్న హిందు వ్యవస్థ వల్లనే బ్రహ్మనిజానికి సాధ్యపడింది.

సీజన్ లో వచ్చే వ్యాధులకు మూఢనమ్మకాలను సృష్టించి దోచుకుంటున్న బ్రహ్మనిజం మన సంతోషాలను కూడా కబళించి దోచుకుంటుంది.
దేవుడు లేడని,ఏది మూఢంగా నమ్మద్దు అని చెప్పిన బౌద్ధం ను కూడా తమదే అంటూ బౌద్ధం ధమ్మాన్ని తమ తమ ధర్మ మే అంటూ ప్రచారం చేస్తున్న బ్రహ్మణిజ కుట్ర బౌద్ధాన్ని ఆచరించిన బహుజనుల మీద కక్ష సాధించడమే....

తమసోమ జ్యోతిర్మయా : అంటూ వెలుగులోకి ప్రయాణం కావాల్సిన ఈ దేశ ప్రజలను చీకట్లోకి త్రోసింది.సూర్యుణ్ణి మొక్కిన ఈ దేశ ప్రజలను  ఖగోళ శాస్త్రoలో పరిశోధనలు చేయాల్సిన స్థితిలో నెలబెట్టాల్సిన సమయం లో కూడా రాశులను నమ్ముతూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు అని నమ్మేలా చేసి మూఢత్వం లోకి ,తద్వారా చీకటిలోకి ప్రవేశించేలా చేసింది....

💐ఈ దేశ బహుజనులరా ! తార్కికంగా ఆలోచించండి💐

జై భీమ్

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు