జనసేన


జనసేన ప్రస్థానం 

             "చేగువేరా మా ఆదర్శం.  పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం మేమున్నాం" అంటూ సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఏర్పరచిన ఖాళీని భర్తీ చేస్తూ   2014లో  మార్చి 10న  జనసేన పార్టీ ని  హైదరాబాద్ లో    స్థాపించారు.  అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రా లలో ఉంది. జన సేన అంటే ప్రజా సైన్యమని అర్ధం. పార్టీ లోగో, రంగులు  పెద్ద పెద్ద ఆశయాలను తలపిస్తాయి. జనసేనాని మాటలు కూడా పెద్ద పటాటోపంతో ఉంటాయి. కానీ ఆచరణలో ఆ పార్టీ అందుకు భిన్నంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది.. 

      పార్టీ  ని ప్రారంభిస్తున్న సమయంలో  బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత లను జనసేన మౌలిక లక్ష్యాలుగా  పేర్కొన్నారు పవన్.
    
       పార్టీ చిహ్నాన్ని మన దేశ చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక ఐక్య సంఘటన గా చెప్పుకున్నారు. చిహ్నం లోని  తెలుపు రంగు  భారత నాగరికత,  సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్న శాంతిని, స్థిరత్వాన్ని   సూచిస్తుందన్నారు.. ఎరుపు రంగు  సామాజిక మార్పును సూచిస్తుంది. నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.నక్షత్రం సహజంగా  స్వయంప్రకాశక గుణం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ నక్షత్రం, ఆ పార్టీ స్వయంగా ఇతరుల మద్దతు లేకుండా ఎదిగే గుణాన్ని కలిగి ఉంటుందన్నారు.  మధ్యలో ఉన్న కేంద్ర బిందువు ప్రతి మనిషి ని  సూచిస్తుంది.   నల్లని చారలు విప్లవానికి గుర్తు.అందువల్ల దాన్ని వ్యతిరేకించే శక్తులతో పోరాడుతుంది. పక్షపాతం లేకుండా ప్రజాపక్షం వహిస్తుంది. ఇన్ని విప్లవాత్మక భావాలతో ఏర్పడిన పార్టీ భావసారూప్యత ఏమాత్రం లేని బిజెపితో జుట్టు కట్టడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. "ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికనీ?" అని సినారె చెప్పింది ఈ పార్టీ కి బాగా వర్తిస్తుంది. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన అభిమతం. కానీ ఆచరణలో  హిందూత్వ  రాజకీయాలపై ఆధారపడిన బిజెపితో జట్టు కట్టడం ఏం తెలియజేస్తుంది?.కులాలను కలిపేఆలోచనా విధానం ఆ పార్టీ సిద్ధాంతం. కులాలను కలపాలా? కులనిర్మూలన చేయాలా? కులాలను అలాగే ఉంచితే సామాజిక మార్పు ఎలా వస్తుందో ఆ పార్టీనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలనేది జనసేన ప్రధాన సిద్ధాంతం.కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంగా ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేస్తున్నా కనీసం ప్రశ్నించలేదు పోయింది జనసేన. తన సిద్ధాంతాల్ని కేవలం పుస్తకాలకు, మానిఫెస్టో కు మాత్రమే పరిమితం చేసిందనుకోవాలా?
భాషలను గౌరవించేసంప్రదాయం, సంస్కృతులనుకాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించనిజాతీయవాదం జనసేన సిద్ధాంతాలుగా పేర్కొనింది.అవినీతి నేడు విశృంఖలంగా ఉంది.దాన్ని నిర్మూలించాల్సిన  అవసరం నేడుంది.కానీ అవినీతి పై పోరాటానికి కలిసి వచ్చే శక్తులతో జట్టు కట్టాలి. ప్రజలను చైతన్య వంతుల్ని చేయాలి. నేడు పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకమైన ది. ఈ అజెండా ను చాలా పార్టీ లు విస్మరించాయి. జనసేన ఈ కర్తవ్యానికి పూనుకోవడం చాలా అభినందనీయం. కాకపోతే దీనికి సంబంధించిన కార్యాచరణ ఏమాత్రం లేకపోవడం  శోచనీయమే కదా.
      2019 ఎన్నికల గోదాలోకి దిగటం ద్వారా ఆ  పార్టీ తన నిజమైన రాజకీయ ప్రయాణం ప్రారంభించింది.కానీ ఎన్నికల్లో దిగినప్పుడు 
సిద్ధాంతాల్ని పక్కన పెట్టి ఆయా పరిస్థితులను బట్టి ప్రవర్తించే పార్టీగా మారిందేమోన నిపిస్తుంది.గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలని సంకల్పించిన పార్టీ ఇది. చాలా మంచి నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టి ఇప్పుడు దాని ధరలు పెంచుకుంటూ పోతోంది.పైగా సబ్సిడీ ఎత్తేసింది.సిలిండరు ప్రజలకు భారంగా మారింది.ఈ సమస్యపై తెలుగు దేశం, వైఎస్సార్ పార్టీ లో లాగా ఎలాంటి కార్యాచరణ చేయని రాజకీయపార్టీగా మారింది.ప్రజా సమస్యను గుర్తించి దానిపై ప్రజలను సమీకరించి పోరాటమే రాజకీయం. మరి రాజకీయ పార్టీ గా ఉండి తాను సంకల్పించిన పథకానికి పాలకులు విఘాతం కలిగిస్తున్నప్పుడు స్పందించక పోతే ఎలా? రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 ఇవ్వాలని రాసుకుంది జనసేన. గతంలో కేంద్రం  గ్యాస్ సబ్సిడీ విషయంలో ఇలాగే చెప్పింది. నెమ్మదిగా ఆ సబ్సిడీ ని అకౌంట్లలో వేయడం మానేసింది. ఇలాగే జనసేన చేయాలనే గ్యారంటీ లేదు కదా. అందువల్ల ఇలాంటి పథకం పక్కన పెట్టేయడం ఉత్తమం.ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతోంది జనసేన. మరి లక్షలాదిమంది ఈ విషయంపై పోరాటం చేస్తున్నప్పుడు అధ్యక్షుడు కనీసం వారికి సంఘీభావం ప్రకటించడానికి రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుంది?ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేయాలని జనసేన సరైన డిమాండ్ చేపట్టింది. కేంద్రం లోని బిజెపి ఇప్పటికే వారిపట్ల సవతి ప్రేమ చూపుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ బిజెపితో చెలిమి చేస్తూ ముస్లింలకు న్యాయం ఎలా చేయగలుగుతుంది జనసేన. 

          తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ర్యాలీలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో ఎన్నికలలో పోటీచేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు.  ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలలో మొదటిదిది. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం. అటువంటిది జనసేన పార్టీ స్థాపించి పదేళ్ళైనా పార్టీ  అధినేత కూడా పోటీలో గెలవక పోవడం పార్టీకి పెద్ద మైనస్. ఇప్పటికీ ప్రత్యర్ధులు ఇదే అంశం పై పవన్ కళ్యాణ్ ను పత్రికా ముఖంగా ఏకిపారేస్తుంటారు. ఇక పార్టీ నిర్మాణం విషయం లో కూడా జనసేన పార్టీ బలహీనంగానే ఉందని చెప్పాలి.6.5లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నా ఇప్పటికీ పార్టీ లో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం పార్టీకి అతిపెద్ద లోటు.మరోవైపు, పార్టీ పొత్తుల వ్యవహారం గజిబిజి గందరగోళం గా ఉండటం జనసైనికులను కలవరపాటుకు గురిచేస్తుంది.అటు బీజేపీతో పొత్తు వీడలేక ఇటు టీడీపీతో కలిసి నడవలేక పవన్ సతమతమౌతున్నాడనేది కాదనలేని సత్యం. క్షేత్రస్థాయిలో జనసైనికులు టీడీపీతో పొత్తుకు మానసికంగా సిధ్ధం అయిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తుండగా కేంద్రంలోని కమలం పెద్దలు మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేరని రాజకీయ వర్గాల్లో  ప్రచారం ఉంది. ఇప్పటికైతే బీజేపీ -జనసేన పొత్తు కొనసాగుతున్నా 0.5% ఓట్లుకూడా లేని బీజేపీ వల్ల జనసేన అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఏళ్ళపాటు అధికారం లేకుండా ఓ ప్రాంతీయ రాజకీయపార్టీ మనుగడ సాధించడం చాలా కష్టం. కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానమే ఇప్పటికీ పార్టీ ని నడిపిస్తుందనేది వాస్తవం. మరోవైపు పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో చెప్పుకోతగ్గ నాయకులు లేరు.ఇటీవలి కాలంలో కాపునేతలు సైతం జనసేన ను వీడుతుండటం,ఇతర పార్టీలలోని కాపునేతలు సైతం జనసేన వైపు కన్నెత్తి చూడకపోవడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.
          జనసేన పదవ ఆవిర్భావ సభను మార్చి నెలలో 10 వ తారీఖున మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు.  ఈ వేదిక  పార్టీ నిర్మాణం,పొత్తులు వంటి అంశాలపై జనసైనికులలో ఉన్న గందరగోళానికి తెరదించలేక పోయింది. జనసేన ప్లీనరీ  రాష్ట్రంలో రాజకీయ పరమైన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయింది.
        మత ప్రస్థావన లేని రాజ్యం కావాలని తాను జాషువా చెప్పినట్లు విశ్వనరుడ నని చెప్పుకున్నారు పవన్. దేశ మూలాలు గొప్పవి. వసుధైక కుటుంబం అనేది ఎప్పటినుంచో ఉంది. ముస్లిం ల పై దాడులు జరిగితే జనసేన బిజెపి పొత్తు నుంచి బయటకు వస్తుందన్నారు. మతాలను కించ పరచరాదన్నాడు.ఒకవైపు ఆ పార్టీ 

             చేగువేరా మా ఆదర్శం.  పవర్ కోసం కాదు ప్రశ్నించడం కోసం మేమున్నాం అంటూ సినిమాలలో నటిస్తున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన అన్న చిరంజీవి రాజకీయాల్లో ఏర్పరచిన ఖాళీని భర్తీ చేస్తూ   2014లో  మార్చి 10న  జనసేన పార్టీ ని  హైదరాబాద్ లో    స్థాపించారు.  అదిప్పుడు రెండు తెలుగు రాష్ట్రా లలో ఉంది. జన సేన అంటే ప్రజా సైన్యమని అర్ధం. పార్టీ లోగో, రంగులు  పెద్ద పెద్ద ఆశయాలను తలపిస్తాయి. జనసేనాని మాటలు కూడా పెద్ద పటాటోపంతో ఉంటాయి. కానీ ఆచరణలో ఆ పార్టీ అందుకు భిన్నంగా ఉండటం అందరినీ కలవరపెడుతోంది.. 

      పార్టీ  ని ప్రారంభిస్తున్న సమయంలో  బ్లాక్ మార్కెట్ వ్యవహారాల నిర్మూలన, విద్య, వైద్యం మెరుగుపరచడం, చట్టాల అమలులో అందరికీ సమన్యాయం, ప్రజాధనం వ్యయానికి కాపలా, జాతీయ సమైక్యత లను జనసేన మౌలిక లక్ష్యాలుగా  పేర్కొన్నారు పవన్.


    
       పార్టీ చిహ్నాన్ని మన దేశ చరిత్రను, పోరాటాలను నిర్వచించే ఒక ఐక్య సంఘటన గా చెప్పుకున్నారు. చిహ్నం లోని  తెలుపు రంగు  భారత నాగరికత,  సంస్కృతిని, అనేక వేల సంవత్సరాల నుంచి ఉన్న శాంతిని, స్థిరత్వాన్ని   సూచిస్తుందన్నారు.. ఎరుపు రంగు  సామాజిక మార్పును సూచిస్తుంది. నక్షత్రం పార్టీ ఆదర్శాలకు ప్రతిరూపం.నక్షత్రం సహజంగా  స్వయంప్రకాశక గుణం కలిగి ఉంటుంది. అందువల్ల ఆ నక్షత్రం, ఆ పార్టీ స్వయంగా ఇతరుల మద్దతు లేకుండా ఎదిగే గుణాన్ని కలిగి ఉంటుందన్నారు.  మధ్యలో ఉన్న కేంద్ర బిందువు ప్రతి మనిషి ని  సూచిస్తుంది.   నల్లని చారలు విప్లవానికి గుర్తు.అందువల్ల దాన్ని వ్యతిరేకించే శక్తులతో పోరాడుతుంది. పక్షపాతం లేకుండా ప్రజాపక్షం వహిస్తుంది. ఇన్ని విప్లవాత్మక భావాలతో ఏర్పడిన పార్టీ భావసారూప్యత ఏమాత్రం లేని బిజెపితో జుట్టు కట్టడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. "ఆదర్శాలకు నోళ్లు చాలవు ఆశయాలకు ఫైళ్లు చాలవు, పదపదమంటూ పలుకులే గాని కదలని అడుగు దేనికనీ?" అని సినారె చెప్పింది ఈ పార్టీ కి బాగా వర్తిస్తుంది..               మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన అభిమతం. కానీ ఆచరణలో  హిందూత్వ  రాజకీయాలపై ఆధారపడిన బిజెపితో జట్టు కట్టడం ఏం తెలియజేస్తుంది?.కులాలను కలిపేఆలోచనా విధానం ఆ పార్టీ సిద్ధాంతం. కులాలను కలపాలా? కులనిర్మూలన చేయాలా? కులాలను అలాగే ఉంచితే సామాజిక మార్పు ఎలా వస్తుందో ఆ పార్టీనే చెప్పాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు బాగుపడాలంటే రాజకీయ జవాబుదారీతనం కావాలనేది జనసేన ప్రధాన సిద్ధాంతం.కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏక మొత్తంగా ప్రభుత్వ రంగసంస్థలను అమ్మేస్తున్నా కనీసం ప్రశ్నించలేదు పోయింది జనసేన. తన సిద్ధాంతాల్ని కేవలం పుస్తకాలకు, మానిఫెస్టో కు మాత్రమే పరిమితం చేసిందనుకోవాలా?
భాషలను గౌరవించేసంప్రదాయం, సంస్కృతులనుకాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించనిజాతీయవాదం జనసేన సిద్ధాంతాలుగా పేర్కొనింది.అవినీతి నేడు విశృంఖలంగా ఉంది.దాన్ని నిర్మూలించాల్సిన  అవసరం నేడుంది.కానీ అవినీతి పై పోరాటానికి కలిసి వచ్చే శక్తులతో జట్టు కట్టాలి. ప్రజలను చైతన్య వంతుల్ని చేయాలి. నేడు పర్యావరణ పరిరక్షణ అత్యంత ఆవశ్యకమైనది. ఈ అజెండా ను చాలా పార్టీ లు విస్మరించాయి. జనసేన ఈ 
      2019 ఎన్నికల గోదాలోకి దిగటం ద్వారా ఆ  పార్టీ తన నిజమైన రాజకీయ ప్రయాణం ప్రారంభించింది.కానీ ఎన్నికల్లో దిగినప్పుడు 
         సిద్ధాంతాల్ని పక్కన పెట్టి ఆయా పరిస్థితులను బట్టి ప్రవర్తించే పార్టీ గా మారిందేమోన నిపిస్తుంది  జనసేనానిని చూస్తే. మహిళలకు 33శాతం రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలన్న పార్టీ ఇటీవల బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు కవిత డిల్లీలో మహిళలకు ఇదే సమస్య పై ధర్నా చేస్తే ఎందుకు మద్దతు ఇవ్వలేదో జనసేనానికే తెలియాలి.గృహిణులకు ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వాలని సంకల్పించిన పార్టీ ఇది. చాలా మంచి నిర్ణయం ఇది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం ప్రవేశ పెట్టి ఇప్పుడు దాని ధరలు పెంచుకుంటూ పోతోంది.పైగా సబ్సిడీ ఎత్తేసింది.సిలిండరు ప్రజలకు భారంగా మారింది.ఈ సమస్యపై తెలుగు దేశం, వైఎస్సార్ పార్టీ లో లాగా ఎలాంటి కార్యాచరణ చేయని రాజకీయపార్టీగా మారింది.ప్రజా సమస్యను గుర్తించి దానిపై ప్రజలను సమీకరించి పోరాటమే రాజకీయం. మరి రాజకీయ పార్టీ గా ఉండి తాను సంకల్పించిన పథకానికి పాలకులు విఘాతం కలిగిస్తున్నప్పుడు స్పందించక పోతే ఎలా? రేషన్‌కు బదులు మహిళల ఖాతాల్లో రూ.2500-3500 ఇవ్వాలని రాసుకుంది జనసేన. గతంలో కేంద్రం  గ్యాస్ సబ్సిడీ విషయంలో ఇలాగే చెప్పింది. నెమ్మదిగా ఆ సబ్సిడీ ని అకౌంట్లలో వేయడం మానేసింది. ఇలాగే జనసేన చేయాలనే గ్యారంటీ లేదు కదా. అందువల్ల ఇలాంటి పథకం పక్కన పెట్టేయడం ఉత్తమం.ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని కోరుతోంది జనసేన. మరి లక్షలాదిమంది ఈ విషయంపై పోరాటం చేస్తున్నప్పుడు అధ్యక్షుడు కనీసం వారికి సంఘీభావం ప్రకటించడానికి రాజకీయ లబ్ధి ఎలా చేకూరుతుంది?ముస్లింల అభివృద్ధికి సచార్‌ కమిటీ విధానాలు అమలు చేయాలని జనసేన సరైన డిమాండ్ చేపట్టింది. కేంద్రం లోని బిజెపి ఇప్పటికే వారిపట్ల సవతి ప్రేమ చూపుతున్న పరిస్థితి ఉంది. మరి ఆ బిజెపితో చెలిమి చేస్తూ ముస్లింలకు న్యాయం ఎలా చేయగలుగుతుంది జనసేన. 

          తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ర్యాలీలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, 2023లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. పార్టీ స్థాపించిన తొలినాళ్ళలో ఎన్నికలలో పోటీచేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి దోహదం చేశారు.  ఆ పార్టీ చేసిన చారిత్రక తప్పిదాలలో మొదటిదిది. ఏ రాజకీయ పార్టీకైనా అధికారమే అంతిమ లక్ష్యం. అటువంటిది జనసేన పార్టీ స్థాపించి పదేళ్ళైనా పార్టీ  అధినేత కూడా పోటీలో గెలవక పోవడం పార్టీకి పెద్ద మైనస్. ఇప్పటికీ ప్రత్యర్ధులు ఇదే అంశం పై పవన్ కళ్యాణ్ ను పత్రికా ముఖంగా ఏకిపారేస్తుంటారు. ఇక పార్టీ నిర్మాణం విషయం లో కూడా జనసేన పార్టీ బలహీనంగానే ఉందని చెప్పాలి.6.5లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నా ఇప్పటికీ పార్టీ లో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం పార్టీకి అతిపెద్ద లోటు.మరోవైపు, పార్టీ పొత్తుల వ్యవహారం గజిబిజి గందరగోళం గా ఉండటం జనసైనికులను కలవరపాటుకు గురిచేస్తుంది.అటు బీజేపీతో పొత్తు వీడలేక ఇటు టీడీపీతో కలిసి నడవలేక పవన్ సతమతమౌతున్నాడనేది కాదనలేని సత్యం. క్షేత్రస్థాయిలో జనసైనికులు టీడీపీతో పొత్తుకు మానసికంగా సిధ్ధం అయిన పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తుండగా కేంద్రంలోని కమలం పెద్దలు మాత్రం టీడీపీతో పొత్తుకు సుముఖంగా లేరని రాజకీయ వర్గాల్లో  ప్రచారం ఉంది. ఇప్పటికైతే బీజేపీ -జనసేన పొత్తు కొనసాగుతున్నా 0.5% ఓట్లుకూడా లేని బీజేపీ వల్ల జనసేన అధికారం చేజిక్కించుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఏళ్ళపాటు అధికారం లేకుండా ఓ ప్రాంతీయ రాజకీయపార్టీ మనుగడ సాధించడం చాలా కష్టం. కేవలం పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానమే ఇప్పటికీ పార్టీ ని నడిపిస్తుందనేది వాస్తవం. మరోవైపు పవన్ కళ్యాణ్ తర్వాత పార్టీలో చెప్పుకోతగ్గ నాయకులు లేరు.ఇటీవలి కాలంలో కాపునేతలు సైతం జనసేన ను వీడుతుండటం,ఇతర పార్టీలలోని కాపునేతలు సైతం జనసేన వైపు కన్నెత్తి చూడకపోవడం పార్టీ శ్రేణులను కలవరపాటుకు గురిచేస్తోంది.
          

 జనసేన పదవ ఆవిర్భావ సభను 2023 మార్చి నెలలో 10 వ తారీఖున మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించారు.  ఈ వేదిక  పార్టీ నిర్మాణం,పొత్తులు వంటి అంశాలపై జనసైనికులలో ఉన్న గందరగోళానికి తెరదించలేక పోయింది. జనసేన ప్లీనరీ  రాష్ట్రంలో రాజకీయ పరమైన ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక పోయింది.

        మత ప్రస్థావన లేని రాజ్యం కావాలని తాను జాషువా చెప్పినట్లు విశ్వనరుడ నని చెప్పుకున్నారు పవన్. దేశ మూలాలు గొప్పవి. వసుధైక కుటుంబం అనేది ఎప్పటినుంచో ఉంది. ముస్లిం ల పై దాడులు జరిగితే జనసేన బిజెపి పొత్తు నుంచి బయటకు వస్తుందన్నారు. మతాలను కించ పరచరాదన్నాడు. ఒకవైపు ఆ పార్టీ బహిరంగంగా నే ముస్లిం లను ఓట్లకోసం మేం బుజ్జగించమని చెపుతోంది. వారి పట్ల ద్వేషాన్ని పెంచే వారిపట్ల ఉదాసీనంగా ఉంటోందని పలువురు భావిస్తున్నారు.  మత సామరస్యాన్ని కాపాడతామని చెప్పే పార్టీ దానికనుగుణంగా కార్యాచరణ ఉండాలి గదా. అప్పుడే అది ప్రజల్లో విశ్వసనీయత పెంచుకుంటుంది.
             అవినీతి పైన రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పింది.దానికి తగ్గ కార్యాచరణ శూన్యం.ఇసుక విధానం సరిగా లేక భవననిర్మాణ కార్మికులకు పని దొరక్క ఇబ్బంది పడ్డారని సరిగానే గుర్తించినా ఆ కార్మికులతో కలిసి పోరాటం చేసింది లేదు.జగన్ ప్రభుత్వం మద్యం  నిషేధం చేయలేదు.వాస్తవానికి సంపూర్ణ నిషేధం అసాధ్యం. కానీ దీనిపైవిమర్శ ఒక్కటే చాలదు. మహిళా సంఘాల తో కలిపి కార్యాచరణ చేపట్టాలి. విలువలు మాట్లాడేవారు ఓడిపోతున్నారని వాపోయాడు పవన్. కానీ ఆ విలువలను కాపాడేందుకు మనం చేసే కృషి ఏమిటన్నది చాలా ముఖ్యం. న్యాయ రాజధాని కర్నూలులో ఉండకూడదని జనసేన భావించడం తొందరపాటు నిర్ణయం అవుతుంది. కులాల ప్రస్తావన వద్దంటూనే కులాల గురించి మాట్లాడటం సమంజసం కాదు. అన్ని కులాలను గౌరవించాలి. కులం ఒకే వాస్తవం. కులాన్ని బట్టి వ్యక్తి నా గుర్తించరాదు.
             ఏ పార్టీ అయినా  విధానాలు మాట్లాడాలి. వ్యక్తి గత విమర్శలు చేయరాదు. 45 కోట్లు సినిమా ద్వారా సంపాదించగలిగినా దాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెపుతాడు కళ్యాణ్. 6.5 లక్షలు కార్యకర్తలున్నారన్నాడు. కాపులు అండగా నిలవాలన్నాడు.నమో అవసరమన్నారు. ప్రత్యేక హోదా కావాలన్నాడు.TDP తో పొత్తు కు సిద్దమని ప్రకటించారు. జగన్ ఓటమే తన పార్టీ ధ్యేయమని ప్రకటించారు.అదే సమయంలో బిజెపి తో కలిసి ఉంటానన్నారు.
               ఒక రకంగా బిజెపికి ఊపిరి పోస్తోంది జనసేన. తన పార్టీ అభివృద్ది నా పక్కన పెట్టి కేవలం పొత్తు లపై ఆధారపడటం ఆ పార్టీ అభివృద్ది కి ఏ మాత్రం ప్రయోజనం ఉండదు.

___ కుమారస్వామి,9490122229


Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు