తెలుగుదేశం



తెలుగుదేశం పార్టీ  లేదా తె.దే.పా  భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్తెలంగాణ రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ. తెలుగుదేశం పార్టీని తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు 1982మార్చి 29న ప్రారంభించాడు. అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షంగా పాలిస్తున్న కాంగ్రెసు పార్టీకి ప్రత్యమ్నాయంగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయంతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసం  తీసుకొని తన జీవితం     తెలుగు ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.13వ లోక్‌సభ (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.

తెలుగునాట వెండితెర వేల్పుగా అభిమానులు పిలుచుకునే నందమూరి తారక రామరావు (ఎన్టీఆర్) పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు.

29 మార్చి 1982న తెలుగు దేశం పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. చైతన్య రథం పేరుతో ఓ వాహనంలో రాష్ట్రమంతా పర్యటించారు.

తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ప్రజల్లోకి వెళ్లారు.

1983 ఎన్నికల్లో 294 స్థానాల్లో అభ్యర్థులను నిలిబెట్టి 199 సీట్లు గెలుపొంది అధికారంలోకి వచ్చారు.టీడీపీ తొలిసారి పోటీ చేసిన 1983 ఎన్నికల్లో మేనకా గాంధీ నాయకత్వంలోని సంజయ్ విచార్ మంచ్‌తో జత కట్టింది. ఆ ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచ్‌కి ఎన్టీఆర్ ఐదు స్థానాలను కేటాయించారు. తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో 201 స్థానాలను గెలుచుకుంది.

ఎన్టీఆర్ కూడా గుడివాడ, తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలుగు నాట కాంగ్రెసేతర తొలి ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ రికార్డు సృష్టించారు.


నందమూరి తారక రామారావు తన చైతన్య రధంపై సుడిగాలి పర్యటన జరిపి ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అప్పటికే సినిమా రంగంలో సాధించిన అనితరసాధ్యమైన ఆదరణతో ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. తెలుగువారి "ఆత్మగౌరవ" నినాదంతొ, పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. సినిమావాళ్ళకు రాజకీయాలేమి తెలుసన్న అప్పటి ప్రధాని "ఇందిరా గాంధీ" హేళనకు గట్టి జవాబు చెప్పారు. అంతే కాదు అప్పట్లో ఉన్న 42 లోక్‌సభ స్థానాలకుగాను 35 స్థానాలను గెలుచుకుని ప్రత్యర్థులను మట్టికరిపించింది. ఆ సంవత్సరం దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్  హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మట్టుకు  తెలుగుదేశం విజయం వలన, అప్పటి లోక్‌సభలో కూడా ప్రధాన ప్రతిపక్షమయింది. తెలుగుదేశం పదవిలోకి వచ్చిన తొలివిడత, ప్రజా బాహుళ్యమైన కిలోబియ్యం రెండు రూపాయల పధకాన్ని అమలు పరిచింది.

వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు రామారావు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది.నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు.ఇది చూసిన ఇందిరాగాంధీ చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు.

ఇందిరాగాంధీ హత్య తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కలిసి ఎన్నికల బరిలో దిగాయి. ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ పట్ల సానుభూతి వ్యక్తమైంది. కానీ ఏపీలో మాత్రం టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. బీజేపీకి దేశం మొత్తం మీద రెండు సీట్లు దక్కితే.. అందులో హన్మకొండ ఒకటి కావడం గమనార్హం. లోక్‌సభలో టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.


యన్.జి.ఓ ల వయో పరిమిత తగ్గిించి వారి ఆగ్రహానికి గురయ్యారు.దాంతో 1989  ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వామపక్షాలు పొత్తు పెట్టుకున్నా టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచింది. 

 

19891994ల మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి, రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన  లక్ష్మీ పార్వతిని  వివాహం చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు.


1994లో టీడీపీ వామపక్షాలతో మాత్రమే కలిసి పోటీ చేసింది. 216 స్థానాల్లో గెలిచిన టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ సీఎం అయ్యారు.

1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో, అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. దాంతో1995లో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అసెెంబ్లీలోోరామారావు బలనిరూపణ  కోరకుండా రోడ్డు మీద వైస్రాయ్ హోటల్ ముుందుు ఛాలెంజ్    విసిరాడు.అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది.అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు చంద్రబాబు ఉ ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" చరిత్ర సృష్టించాడు.1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బాబు నాయకత్వంలోని టీడీపీ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసింది. కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం ఏర్పాటైంది.

1996లో రామారావు మరణించిన పిదప ఆయన భార్య లక్ష్మీ పార్వతి అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్థులు వారసత్వానికి పోటిపడిన తరుణంలో మరల చీల్చింది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలంచెందింది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.


1999లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యారు. 2004లో మరోసారి టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ నాయకత్వంలోని కాంగ్రెస్ గెలుపొందింది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల తర్వాత బీజేపీకి టీడీపీ దూరమైంది. 2009లో టీఆర్‌ఎస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మహాకూటమిగా టీడీపీ పోటీ చేసింది. కానీ కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

చంద్రబాబు నాయుడు హైదరాబాదును  సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిిికతో  హైటెక్ సిిటీ ప్రారంభించాడు.ఈయన ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా పేరుతెెెెెచ్చు కొన్నాడు. 

2014 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విభజించారు.

విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో2014 ఎన్నికల్లో టీడీపీ మళ్లీ బీజేపీతో కలిసి పోటీ చేసింది. జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీకి దిగకున్నా.. టీడీపీ-బీజేపీ కూటమికి సపోర్ట్ చేసింది.67 సీట్లు శాసన సభ,8 లోక్సభ సీట్లతో  వైఎస్ ఆర్ పార్టీకి వస్తే, తెలుగు దేశం 162 శాసనసభ,21లోక్ సభ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది.చంద్రబాబు సీఎం అయ్యారు.తెలంగాణ ప్రాంతంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.

     మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. 2019లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలిసారిగా కాంగ్రెస్ పార్టీతో జతకట్టింది. కానీ టీడీపీ కేవలం రెండు సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్‌తో పొత్తు ప్రతికూల ప్రభావం చూపడంతో..  టీడీపీ ఒంటరైంది.  తెలంగాణలో తొలిసారి పోటీకి దూరమైన ఆ పార్టీ.. ఏపీలో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి  37 ఏళ్ల చరిత్రలో ఒంటరిగా బరిలోకి దిగింది. 2019 ఎన్నికలలో     ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి151 స్థానాలు,  లోక్ సభలో 22 స్థానాల వచ్చాయి. టిడిపి కేవలం 25 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అవతరించింది.లోక్ సభలో కేవలం 3సీట్లకే పరిమితమైంది.అందులో ఇద్దరు బి.జె.పిలోకి ఫిరాయించారు.

Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు