ఏ కాలంలో ఏది?



● క్రీ.పూ 2613 లో ఈజిప్టులోని ఖియోప్స్ పిరమిడ్ నిర్మాణం జరిగింది.
● మొహెంజోదారో, హరప్పా నాగరికత క్రీ.పూ 2300 నుంచి బలపడి, క్రీ.పూ 1500 నాటికల్లా క్షీణ దశకు చేరుకుంది.
● క్రీ.పూ 1300 - 1200 లలో ఆర్యులు భారత దేశానికి ఆగమనం మొదలైంది.
● క్రీ.పూ 1200 ఋగ్వేదపు తొలి సూక్తులు ఆవిర్భవించాయి.
● క్రీ.పూ 1209 - 900 మధ్యలో యజుర్వేదం , సామవేదం, అదర్వణవేదం కూర్పు జరిగింది.
● క్రీ.పూ 1193 లో గ్రీకులు ట్రోయ్ నగరాన్ని ముట్టడించారు.
● క్రీ.పూ 1000 లో భారత దేశంలో ఇనుము వాడకం మొదలైంది.
● క్రీ.పూ 900 - 600 మధ్యలో బ్రహ్మణాల కూర్పు జరిగింది. ఇవన్నీ వేద సాంప్రదాయాలు తంతుల వివరణల వంటివి.
● క్రీ.పూ 600 - 100 మధ్యలో వర్ణాశ్రమ సూత్రాల నిర్వచనాలు, చివరి ఉపనిషత్తులు రూపొందాయి.
● క్రీ.పూ 599 - 527 మధ్య కాలంలో మహావీరుడు జీవించాడు.
● క్రీ.పూ 563 - 483 మధ్య కాలంలో గౌతమ బుద్దుడు జీవించాడు.
● క్రీ.పూ 550 లో జైన,బౌద్ధ మతాలు బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఎదిరించి వేరు పడ్డాయి.
● క్రీ.పూ 500 లో వేదాలు,అరణ్యకాలు,ఉపనిషత్తులు లిఖితం చేయబడ్డాయి.
● క్రీ.పూ 325 లో చంద్రగుప్త మౌర్యుడి కాలంలో అలెగ్జాండర్ భారత దేశంపై దండ యాత్ర సాగించాడు.
● క్రీ.పూ 261లో అశోకుడు కళింగ యుద్ధం చేశాడు.
● క్రీ.పూ 200 ..., క్రీ.శ 200 మధ్య కాలంలో మనుధర్మశాస్త్రం, రామాయణం,మహాభారతం రచించబడ్డాయి. 
● క్రీ.పూ 100 లో భగవద్గీత రచన జరిగింది.
● క్రీ.పూ 30 లో అంటోనీ, క్లియోపాత్ర ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే రోమ్ లో జూలియస్ సీజర్ హత్య చేయబడ్డాడు ఆక్టేవియస్ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు.
ఏసు క్రీస్తు యింకా పుట్ట లేదు.
● క్రీ.శ 78 - 144 లో కాశ్మీరుకు ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్ వున్న ప్రదేశాన్ని ఏలిన, కుషాణ రాజు కనిష్కుడు బౌద్ద మతాన్ని ఆదరించాడు.
● క్రీ.శ 200 లో భారత దేశంలో హిందూ వేదాంతతత్వం మొదలైంది.
● క్రీ.శ 300 - 800 మధ్యలో శివ, బ్రహ్మ, విష్ణు, మార్కండేయ,మత్స్య పురాణాలు లిఖించబడ్డాయి.
● క్రీ.శ 320 - 540 లో గుప్త సామ్రాజ్యం వర్ధిల్లింది. అదే కాలంలో శైవ మతం పుట్టుకొచ్చింది.
● క్రీ.శ 500 లో హిందువులు బౌద్దులను పీడించడం మొదలైంది. లక్షాలాది బౌద్దులు హత్య గావించబడ్డారు.
● క్రీ.శ 700 లో కుల వ్యవస్థ బాగా విస్తరించి , సమాజంలో బలంగా నాటుకు పోయింది.
● క్రీ.శ 788 - 820 మధ్య కాలంలో శంకరాచార్యుడు జీవించాడు.
● క్రీ.శ 1137 లో రామానుజాచార్యుడు మరణించాడు.
 



Comments

Popular posts from this blog

మాల కులం - సాంప్రదాయాలు

RBI

భూమి కొలతలు మరియు రెవిన్యూ భాషలో రికార్డుల పేర్లు